
కౌలు రైతుల సమస్యలపై అక్టోబర్ 13, 14 తేదీల్లో ఆందోళన
లక్ష్మీపురం: కౌలు రైతుల సమస్యలపై అక్టోబర్ 13, 14 తేదీల్లో మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు చెప్పారు. గుంటూరు బ్రాడీపేటలోని సంఘం జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌలు రైతులందరికీ భూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు వర్తింప చేయాలని కోరారు. ఈ క్రాప్ నమోదు చేసి ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర నష్ట పరిహారాలు వర్తింప చేయాలని విజ్ఞపి చేశారు. కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ జిల్లాలో సుమారు లక్ష మంది కౌలు రైతులున్నారని, 70 శాతం వారే సాగు చేస్తున్నారని పేర్కొ న్నారు.రైతు సేవా కేంద్రాల్లో అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, యూరి యా అందుబాటులో ఉంచాలని కోరారు. సమా వేశంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి.రామకృష్ణ, నాగమల్లేశ్వరరావు, సాంబిరెడ్డి, కృష్ణ, అమ్మిరెడ్డి, నీలాంబరం పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న కౌలు రైతు
సంఘ నేతలు