
ఉద్యోగులకు ప్రభుత్వం డీఏ ప్రకటించాలి
ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్
బాపట్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దసరా కానుకగానైనా డీఏ ప్రకటించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బడుగు శ్రీనివాస్ కోరారు. పట్టణంలోని ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో సంఘ సమావేశం ఆదివారం నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ 2024 నుంచి ఇప్పటి వరకు 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పీఆర్సీ బకాయిలు, డీఏ, సరెండర్ లీవ్ బకాయిలు, పీఎఫ్ లోన్లు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్స్ బకాయిలు దాదాపు రూ.25 వేల కోట్లు ఉన్నాయని చెప్పారు. ఆ బకాయిల విడుదలకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలకు పింఛన్లు, వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని అసెంబ్లీ కమిటీ సిఫార్సు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం, వైద్య సదుపాయాలు కల్పించమంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదని కుంటి సాకులు చెప్పడం సరికాదన్నారు. డీఎస్సీ నియామకాల ద్వారా కొత్త ఉపాధ్యాయులు పాఠశాలలకు వస్తున్నందున ఎంటీఎస్ ఉపాధ్యాయులను ఏకోపాధ్యాయ పాఠశాలలకు సర్దుబాటు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుడివాడ అమర్నాథ్, ఉపాధ్యాయ వాణి కన్వీనర్ పీవీ నాగరాజు, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి నూర్ బాషా సుభాని, జిల్లా ఆర్థిక కార్యదర్శి బొంతా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిలర్ ఎ.ఉదయశంకర్, ఏవీ నరసింహారావు, గవిని శ్రీనివాస్, పి.శివాంజనేయులు, ఏవీ నారాయణ, తోట శివయ్య, కోటేశ్వరరావు, నారాయణమూర్తి, ప్రభాకర్ పాల్గొన్నారు.
ఆగిఉన్న లారీని ఢీకొన్న ఆటో.. వృద్ధుడు మృతి

ఉద్యోగులకు ప్రభుత్వం డీఏ ప్రకటించాలి

ఉద్యోగులకు ప్రభుత్వం డీఏ ప్రకటించాలి