
దళితులంటే అంత చులకనా
● మార్టూరు సీఐపై అట్రాసిటీ
కేసు నమోదు చేయాలి
● డిజిటల్ బుక్‌లో మొదటి
వ్యక్తి సీఐ శేషగిరే..
●వైఎస్సార్ సీపీ నేతలు కొమ్మూరి, టీజేఆర్
మార్టూరు:దళిత యువకులపై అమానుషంగా ప్రవర్తించిన మార్టూరు సీఐ ఎం.శేషగిరిరావుపై అట్రాసి టీ కేసు నమోదు చేయాలని, గ్రామంలో తొలగించి న అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని వైఎస్సార్ సీపీ నేత కొమ్మూరి కనకారావు మాదిగ, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు డిమాండ్‌చేశా రు. మార్టూరు మండలం డేగరమూడి గ్రామానికి చెందిన దళిత యువకులు జ్యోతి పోతులూరి, అల్లడి ప్రమోద్‌కుమార్‌లపై తప్పుడు కేసు బనా యించి లాఠీచార్జి చేసిన సీఐ వైఖరిని ఆదివారం పార్టీ నాయకులు ఖండించారు. పోలీసుల దెబ్బలకు గాయపడిన ఇద్దరు యువకులను గ్రామంలో పరామర్శించి ధైర్యం చెప్పారు.
● కొమ్మూరి కనకారావు మాదిగ మాట్లాడుతూ సీఐ శేషగిరి అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తూ ఇతర కులాల పట్ల వివక్షతో వ్యవహరిస్తున్నట్లు తమ విచారణలో తెలిసిందన్నారు. అతని వ్యవహారంపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. సీఐతోపాటు అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించిన పంచాయతీ కార్యదర్శి, అధికార పార్టీ గ్రామ నాయకుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
తగిన మూల్యం చెల్లించక తప్పదు
మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మాట్లాడు తూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన డిజిటల్ బుక్‌లో మొదటి వ్యక్తిగా మార్టూరు సీఐ శేషగిరి చోటు సంపాదించి.. అరుదైన ఘనత సాధించారని ఎద్దేవాచేశారు. ద్రోణాదుల సర్పంచ్ వంకాయలపాటి భాగ్యరావు, ఎంఎల్‌ఏ బాలకృష్ణపై పోస్టింగ్ పెట్టినందుకు అక్రమంగా కేసు పెట్టారన్నారు. దళితులతో చెలగాటం ఆడుతున్న కూటమి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. తొలగించిన ప్రదేశంలోనే త్వరలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ద్రోణాదుల వెళ్లి సర్పంచ్ భాగ్యరావుని పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బండ్రేవు వెంకట నారాయణరెడ్డి, రాష్ట్ర లీగల్‌సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శనరెడ్డి, గ్రీవె న్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నాగ నారాయణ మూర్తి, బొందిల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్రసింగ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలెపోగు రాంబాబు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వాసిమల్ల వాసు, మండల కన్వీనర్ వీరయ్యచౌదరి పాల్గొన్నారు.

దళితులంటే అంత చులకనా