
మొబైల్ బుక్ కీపింగ్ సకాలంలో పూర్తి కాకపోతే చర్యలు
బాపట్ల టౌన్: మొబైల్ బుక్ కీపింగ్ నూరు శాతం పూర్తిచేయని వీఓఏలకు గౌరవ వేతనాలు నిలుపుదల చేస్తామని సెర్ఫ్ అడిషనల్ సీఈవో ఆర్. శ్రీరాములు తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వెలుగు సిబ్బందితో కలిసి శనివారం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఈటీసీ కార్యాలయంలో జిల్లాలోని 25 మండలాల ఏపీఎం, డీపీఎం అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 30 నాటికి మొబైల్ బుక్ కీపింగ్‌ని 100% పూర్తి చేయాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్. లవన్న మాట్లాడుతూ జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు గురించి గ్రూపు సంఘ సభ్యులకు అవగాహన కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో సెర్ఫ్ అధికారి ఎల్.వాల్మీకి, డీపీఎంలు, ఏపీఎంలు, సీ్త్ర నిధి సభ్యులు పాల్గొన్నారు.
సెర్ఫ్ అడిషనల్ సీఈవో
ఆర్. శ్రీరాములు