
కరుణించవమ్మా...
శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. దసరా సందర్భంగా ఉత్సవాలు శనివారంతో ఆరో రోజుకు చేరాయి. జిల్లాలోని వివిధ దేవస్థానాలలో ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కరుణించవమ్మా.. అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి గ్రామంలో అమ్మవారిని రూ.1.41 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించి, పూజలు నిర్వహించారు. చెరుకుపల్లి మండలంలోని గుళ్లపల్లి ఆనందీశ్వర స్వామి దేవస్థానంలో శ్రీమహంకాళి అమ్మవారు, చెరుకుపల్లిలోని ఆర్యవైశ్య సత్రంలో, బాలకోటేశ్వర స్వామి ఆలయంలో కనగాల పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో కరెన్సీ నోట్లతో అమ్మవారు శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని కనులారా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి, భక్తి గీతాలు ఆలపించారు. ఏర్పాట్లను పర్యవేక్షించిన నిర్వాహకులు.. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. – మార్టూరు/చెరుకుపల్లి
కనగాల పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరణ
జొన్నతాళి గ్రామంలో
కరెన్సీ నోట్ల అలంకరణలో అమ్మవారు
గుళ్లపల్లి ఆనందీశ్వర స్వామి దేవస్థానంలో లలితాత్రిపుర సుందరీదేవిగా అమ్మవారు

కరుణించవమ్మా...

కరుణించవమ్మా...