ట్రాక్టర్‌ కింద నలిగిన రెండు ప్రాణాలు | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ కింద నలిగిన రెండు ప్రాణాలు

Sep 28 2025 7:18 AM | Updated on Sep 28 2025 7:18 AM

ట్రాక

ట్రాక్టర్‌ కింద నలిగిన రెండు ప్రాణాలు

ఇరువురి మృతికి కారణమైన డ్రైవర్‌ మద్యం మత్తు కూలీ కోసం వెళ్తున్న వారిని ఎక్కించుకోగా దుర్ఘటన

అద్దంకి: డ్రైవర్‌ మద్యం మత్తు కారణంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ట్రాక్టరు కింద పడి కూలీలు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఘటన మండలంలోని తిమ్మాయపాలెంలోని దర్శి–అద్దంకి రహదారిలో శనివారం చోటుచేసుకుంది. మృతుల బంధువుల కథనం మేరకు.. తిమ్మాయపాలెం గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన వేము నరసమ్మ (60), కొప్పోలు స్వరూపారాణి (47)లు ప్రకాశం జిల్లా పోలవరం గ్రామంలో కూలీ పనుల కోసం వెళ్తున్నారు. గ్రామంలోని బట్టీ వద్ద ఇటుకలు లోడు చేసుకుని ఓ ట్రాక్టర్‌ దర్శి వైపు వెళ్తోంది. ఇటుక ఎత్తిన కూలీలను గ్రామంలో దించాక దర్శి రహదారిలో ట్రాక్టర్‌ను డ్రైవర్‌ రవి నడుపుతున్నాడు. అటుగా వెళ్తున్న నలుగురు కూలీలను ట్రాక్టర్‌లో ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లిన తరువాత అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లింది. ఒక వైపు బానెట్‌పై కూర్చుని ఉన్న నర్సమ్మ, స్వరూపారాణి జారి ట్రాక్టర్‌ కింద పడి అక్కడిక్కడే మృతి చెందారు. అదే సమయంలో రోడ్డుపక్కన ఇంటి ముందు పని చేసుకుంటున్న టి. శ్రీనివాసరావు ఇంకుడు గుంతలో కూర్చోవడంతో గాయాలు మాత్రమే అయ్యాయి. ఆయన్ను వైద్యశాలకు తరలించారు.

మద్యం మత్తులో డ్రైవర్‌..

నర్సమ్మకు ముగ్గురు పిల్లలు. ఐదు సంవత్సరాల క్రితం భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. స్వరూపారాణికి భర్త రవి, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కాలనీకి చెందిన ఇరువురు మృతి చెందడంతో బంధువులు, స్థానికులు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. అదే ట్రాక్టర్‌పై ఉన్న మరో ఇరువురు కూలీలు తెలిపిన వివరాల మేరకు.. బస్సు కోసం వేచి చూస్తున్న కూలీలను ట్రాక్టర్‌ డ్రైవర్‌ పిలిచాడన్నారు. మద్యం మత్తుగా ఉన్నాడని, దాంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు. తాము రెండో వైపు ఉండడంతో బతికామని పేర్కొన్నారు. ఇరువురు కిందపడ్డారని కేకలు వేసినా డ్రైవర్‌ పట్టించుకోలేదని వాపోయారు. రోజూ తమతో కూలీ పనులు చేసుకునే ఇద్దరు తమ కళ్లముందే మృత్యువాత పడడంతో నోట మాట రాలేదని కన్నీటిపర్యంతం అయ్యారు. డ్రైవర్‌కు మృతుల బంధువులు దేహశుద్ధి చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నష్టపరిహారం చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు, దళిత సంఘాల నేతలు శనివారం రాత్రి ఆందోళన చేశారు.

ట్రాక్టర్‌ కింద నలిగిన రెండు ప్రాణాలు 1
1/2

ట్రాక్టర్‌ కింద నలిగిన రెండు ప్రాణాలు

ట్రాక్టర్‌ కింద నలిగిన రెండు ప్రాణాలు 2
2/2

ట్రాక్టర్‌ కింద నలిగిన రెండు ప్రాణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement