
విత్తన బంతులతో వెల్లివిరిసే పచ్చదనం
అనకాపల్లి: నేటి విత్తనాలే రేపటి మహా వృక్షాలని జిల్లా అటవీశాఖ అధికారి ఎం.సోమసుందర్ పేర్కొన్నారు. స్థానిక సత్యనారాయణస్వామి దేవస్ధానం కొండపై నుంచి విత్తన బంతులు విసిరే కార్యక్రమం పట్టణ గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంచడానికి విత్తన బంతులు విసిరే కార్యక్రమం ప్రభావంతమైన పద్ధతని, ముఖ్యంగా కొండ ప్రాంతాలలో చాలా ఉపయోగాలు ఉంటాయన్నారు. భావితరాలకు పర్యావరణపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణస్వామి దేవస్థానం చైర్మన్ అప్పికొండ గణేష్, క్లబ్ వ్యవస్ధాపక అధ్యక్షుడు కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ మాస్టారు, విశ్రాంత అటవీశాఖాధికారి బీరా వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.