జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్, ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. మహిళా అధికారులు, ఉద్యోగులు పాల్గొని తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడి పాడారు. ఎస్పీ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచూర్యం పొందడం గొప్ప విషయమని అన్నారు. ఇందులో అదనపు ఎస్పీలు కాజల్ సింగ్, సురేందర్‌రావు, డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. అలాగే తలమడుగు మండలం బరంపూర్‌లో సద్దుల వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు ఉయ్యాల పాటలు, చప్పట్లతో బతుకమ్మ ఆడారు. అనంతరం పూల సింగిడిలను
డప్పుచప్పుళ్ల నడుమ నిమజ్జనానికి తరలించారు. వెళ్లిరా బతుకమ్మ అంటూ గంగమ్మ ఒడికి చేర్చారు. – ఆదిలాబాద్‌టౌన్/తలమడుగు
బతుకమ్మ సంబురాలు
బతుకమ్మ సంబురాలు
బతుకమ్మ సంబురాలు