‘పరిషత్‌’కు రెడీ | - | Sakshi
Sakshi News home page

‘పరిషత్‌’కు రెడీ

Oct 7 2025 3:47 AM | Updated on Oct 7 2025 3:47 AM

‘పరిషత్‌’కు రెడీ

‘పరిషత్‌’కు రెడీ

● జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ● ఆర్‌వోలకు పూర్తయిన శిక్షణ ● నామినేషన్ల స్వీకరణకు రంగం సిద్ధం

కై లాస్‌నగర్‌: పరిషత్‌ తొలి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 9నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. మండల ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లాస్థాయి అధికా రులనే జెడ్పీటీసీ రిటర్నింగ్‌ అధికారులుగా నియమించింది. ఎంపీటీసీ రిటర్నింగ్‌ అధికారులుగా గెజిటెడ్‌ హోదా కలిగిన జూనియర్‌ లెక్చరర్లు, పీజీ హెడ్‌మాస్టర్లను ఎంపిక చేసింది. అయితే వీరు పని చేసే మండలం, సొంత మండలం కాకుండా ఇతర మండలాల బాధ్యతలు అప్పగించింది. నామినేషన్ల స్వీకరణ మొదలు పరిశీలన, తొలగింపు, ఫిర్యాదుల స్వీకరణ, బరిలో నిలిచిన అభ్యర్థుల ప్రకటన, ఫలితాల వెల్లడి వరకు ఆర్‌వోలు కీలకపాత్ర పోషించనున్నారు. వీరికి ఇది వరకే శిక్షణ ఇవ్వగా తాజాగా స్టేజ్‌–2 ప్రిసైడింగ్‌ అధికారులకు జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం శిక్షణ అందించారు. దీంతో శిక్షణ ప్రక్రియ పూర్తయింది.

ఎంపీడీవో కార్యాలయాల్లో..

నామినేషన్ల దాఖలుకు అవసరమైన పత్రాలన్నింటి నీ ఇది వరకే ఎంపీడీవో కార్యాలయాలకు చేరవేసి సిద్ధంగా ఉంచారు. ఆయా కార్యాలయాల్లోనే నామపత్రాలు స్వీకరించనున్నారు. అయితే మండలా ల్లోని ఎంపీటీసీ స్థానాల సంఖ్య ఆధారంగా 3 నుంచి 4 ఎంపీటీసీ స్థానాలను కలిపి ఓ క్లస్టర్‌గా విభజించారు. ప్రతీ క్లస్టర్‌కు గెజిటెడ్‌ హోదా కలిగిన జూని యర్‌ లెక్చరర్‌, పీజీ హెచ్‌ఎంలను ఆర్‌వోలుగా నియమించారు. ప్రక్రియ సజావుగా సాగేలా రిజ ర్వు ఆర్‌వోలను సైతం అందుబాటులో ఉంచారు. అయితే మావల మండలంలో కేవలం ఐదు ఎంపీటీసీ స్థానాలే ఉండటంతో వాటన్నింటినీ ఒకే క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ఆర్‌వోను నియమించారు. ఎంపీటీసీ స్థానాలకు ఏఆర్‌వోలుగా స్కూల్‌ అసిస్టెంట్లను నియమించారు. నామినేషన్ల ప్రక్రియ నిర్వహణపై వీరందరికీ మాస్టర్‌ ట్రైనర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ పూర్తి చేశారు. పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. అయితే బ్యాలెట్‌ పేపర్ల ముద్రణకు అవసరమైన టెండర్ల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఈమేరకు జిల్లాకు ఉత్తర్వులు రావాల్సి ఉంది. అవి అందిన వెంటనే అవసరమైన చర్యలు చేపడుతామని అధికారులు చెబుతున్నారు.

అందరి దృష్టి హైకోర్టు నిర్ణయంపైనే..

ఓ వైపు తొలి విడత స్థానిక సమరానికి అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తుంటే మరోవైపు అందరి దృష్టి హైకోర్టు నిర్ణయంపై కేంద్రీకృతమైంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేస్తుండటంపై దా ఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్ర ధాన న్యాయస్థానంలో ఈ నెల 8న విచారణ ఉంది. అయితే కోర్టు తీర్పు ఆధారంగా ఎన్నికల ప్రక్రియ పై ముందుకెళ్లే అవకాశముంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రకటించి న రిజర్వేషన్లే ఉంటాయా.. లేక మళ్లీ ఏమైనా మారుతుందా అనే దానిపై కూడా సర్వతార చర్చ సాగు తుండడం గమనార్హం.

జిల్లాలోని పరిషత్‌ స్థానాలు, రిటర్నింగ్‌ అధికారుల వివరాలు :

జెడ్పీటీసీ స్థానాలు : 20

రిటర్నింగ్‌ అధికారులు : 22

ఎంపీటీసీ స్థానాలు : 166

(ఎంపీటీసీ క్లస్టర్లు : 52)

రిటర్నింగ్‌ అధికారులు : 59

అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు : 59

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement