‘నంద్యాల’ను రిఫరెండంగా స్వీకరించే దమ్ముందా? | ysrcp spokesperson vasireddy padma slams tdp | Sakshi
Sakshi News home page

‘నంద్యాల’ను రిఫరెండంగా స్వీకరించే దమ్ముందా?

Aug 13 2017 1:57 PM | Updated on Oct 19 2018 8:10 PM

‘నంద్యాల’ను రిఫరెండంగా స్వీకరించే దమ్ముందా? - Sakshi

‘నంద్యాల’ను రిఫరెండంగా స్వీకరించే దమ్ముందా?

మూడేళ్ల పాలనకు రిఫరెండంగా నంద్యాల ఉపఎన్నికను స్వీకరించే దమ్ము టీడీపీ నేతలకు ఉందా? అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సవాలు విసిరారు.

- టీడీపీకి వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సవాల్‌
హైదరాబాద్‌:
మూడేళ్ల పాలనకు రిఫరెండంగా నంద్యాల ఉపఎన్నికను స్వీకరించే దమ్ము టీడీపీ నేతలకు ఉందా? అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సవాలు విసిరారు. టీడీపీ నేతలు.. నంద్యాల ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, రోడ్ల విస్తరణ పేరుతో భవనాలను కూల్చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు.

‘మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పే శక్తి సీఎం చంద్రబాబు నాయుడికిగానీ, టీడీపీ నేతలకుగానీ లేదు. నా పాలన చూచసి ఓటేయమని చంద్రబాబు కూడా అడగలేకపోతున్నారు. మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వైఎస్‌ జగన్‌పై ఆరోపణలు చేయడం సరికాదు. టీడీపీ తాటాకుచప్పుళ్లకు భయపడే ప్రసక్తేలేదు’ అని పద్మ అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement