ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న జయలలిత | jayalalithaa moves to chennai | Sakshi
Sakshi News home page

ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న జయలలిత

Oct 18 2014 5:17 PM | Updated on Sep 2 2018 5:20 PM

ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న జయలలిత - Sakshi

ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న జయలలిత

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు.

చెన్నై:తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు.  శనివారం మధ్యాహ్నం కర్ణాటకలోని పరప్పణ అగ్రహార జైలు నుంచి విడుదలయిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమె చెన్నైకు బయల్దేరి వెళ్లారు. ఆమె చెన్నై చేరుతున్న క్రమంలో కిలోమీటర్ మేర ఆంక్షలు విధించారు. శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో  జయలలిత విడుదలకు మార్గం సుగమం అయ్యింది.  బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు అధికారులు ... జయలలితను విడుదల చేశారు. అంతకు ముందు జయ తరపు న్యాయవాది రూ.2 కోట్ల ష్యూరిటీ సమర్పించారు.
 

కాగా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా.. శుక్రవారం రాత్రి  జయలలిత జైల్లోనే ఉన్నారు. విడుదల కోసం లాంఛనాలు పూర్తి కాకపోవడంతో ఆమె శనివారం మధ్యాహ్నం వరకు విడుదల కాలేకపోయారు. 22 రోజుల తర్వాత జయలలిత బయట వాతావరణాన్ని చూశారు. అమ్మ విడుదలతో అన్నాడీఎంకే కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement