
స్వింగ్ తో సత్తా చాటుతా: స్టార్క్
ఆస్ట్రేలియా ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఒకడు.
దుబాయ్:ఆస్ట్రేలియా ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఒకడు. ఫాస్ట్ పిచ్ ల్లో చెలరేగిపోయే స్టార్క్.. స్పిన్ ఆధారిత భారత పర్యటనలో కూడా సత్తా చాటుతానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. 'ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లో నాలుగేళ్ల తరువాత భారత్లో బౌలింగ్ చేయడానికి ఆసక్తిగా ఉన్నా. ఉప ఖండం పిచ్ ల్లో ఆడటానికి వస్తున్న మాకు ఇదొక సవాల్. కొత్త బంతితో స్వింగ్ రాబట్టడానికి యత్నిస్తా. స్పిన్ వికెట్ పై ఎస్జీ బాల్ తో అదనపు స్వింగ్ రాబట్టేందుకు యత్నిస్తా. భారత పర్యటనను సవాల్ గా తీసుకుంటున్నా'అని స్టార్క్ తెలిపాడు.
ఇదిలా ఉంచితే ఈ నెల 23వ తేదీ నుంచి పుణెలో ఆరంభం కానున్న తొలి టెస్టులో స్టార్క్, హజల్ వుడ్ లను ఎలా ఉపయోగించుకోవాలి అనే దానిపై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) యోచిస్తోంది. భారత్ లో స్పిన్ పిచ్ లు కాబట్టి ప్రధానంగా స్సిన్నర్లే ఆస్ట్రేలియా తొలి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే హజల్ వుడ్-స్టార్క్ ల్లో ఎవరో ఒకరు మాత్రమే తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.