గాల్లోకి కార్లు | cars dived | Sakshi
Sakshi News home page

గాల్లోకి కార్లు

Aug 11 2016 1:35 AM | Updated on Apr 8 2019 8:07 PM

గాల్లోకి కార్లు - Sakshi

గాల్లోకి కార్లు

నరసాపురం : ఓ కారు వచ్చి.. నాలుగైదు కార్లపై పడడం, అవి ఎగురుకుంటూ.. వెళ్లి వేరేచోట పడి నుజునుజ్జు కావడం.. వంటి దృశ్యాలను మనం యాక్షన్‌ సినిమాల్లోనే చూస్తుంటాం. సరిగ్గా అలాంటి దృశ్యాలే.. నరసాపురం పట్టణం రైల్వేస్టేషన్‌ రోడ్డులో బుధవారం సాయంత్రం కనిపించాయి.

నరసాపురం : ఓ కారు వచ్చి.. నాలుగైదు కార్లపై పడడం, అవి ఎగురుకుంటూ.. వెళ్లి వేరేచోట పడి నుజునుజ్జు కావడం.. వంటి దృశ్యాలను  మనం యాక్షన్‌ సినిమాల్లోనే చూస్తుంటాం. సరిగ్గా అలాంటి దృశ్యాలే.. నరసాపురం పట్టణం రైల్వేస్టేషన్‌ రోడ్డులో బుధవారం సాయంత్రం కనిపించాయి. రద్దీగా ఉన్న ప్రదేశంలోకి అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఓ మారుతివెర్టిగా కారు తొలుత డివైడర్‌ను ఢీకొట్టింది. వెంటనే అక్కడే రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ ఇన్నోవా, మరో క్వాలీస్‌ వాహనాలపై పడింది. ఆ రెండు కార్లు ఎగిరెళ్లి పక్కనే ఉన్న మురుగుకాలువలో పడిపోయాయి. ప్రమాదానికి కారణమైన కారు అంతటితో ఆగకుండా మత్స్యపురి వంతెన వైపు వెళ్తున్న ఓ స్కూల్‌బస్సునూ ఢీకొట్టింది. ఈ ఘటనలన్నీ వెనువెంటనే జరిగిపోయాయి.  ఆ సమయంలో బస్సులో 40 మంది చిన్నారులున్నారు. ఘటనలో కాలువలో పడిన  రెండు కార్లూ ధ్వంసమయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు ముందుభాగం కూడా నుజ్జునుజ్జు అయ్యింది. స్కూల్‌ బస్సు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాలేదు. ప్రమాదానికి కారణమైన కారు తణుకు రిజిస్ట్రేషన్‌తో ఉందని సీఐ పి.రామచంద్రరావు చెప్పారు. ఆ కారులో మార్టేరుకు చెందిన మొత్తం ఆరుగురు ఉన్నారని సమాచారం. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవింగ్‌ చేస్తున్న వర్షాల సురేష్‌ తప్ప మిగిలిన వారంతా పరారయ్యారు.  కారులో ఉన్నవారంతా ప్రైవేట్‌ వ్యాన్‌ డ్రైవర్లుగా తెలుస్తోంది. సురేష్‌ను మొగల్తూరు పోలీసులు అదపులోకి తీసుకున్నారు. 
తూర్పుతాళ్లులో మహిళను ఢీకొట్టి.. 
పోలీసుల ప్రాథమిక విచారణ మేరకు మార్టేరుకు చెందిన ఆరుగురు ఉదయం పేరుపాలెం బీచ్‌కు వచ్చారు. ఫూటుగా మద్యం సేవించి తిరిగి కారులో బయలుదేరారు. మితిమీరిన వేగంతో వెళ్తూ.. తూర్పుతాళ్లు వద్ద రోడ్డుపై వెళ్తున్న పెన్నేటి సక్కుబాయి అనే మహిళను ఢీకొట్టారు. ఆ కంగారులో కారును మరింత వేగంగా నడుపుకుంటూవచ్చారు.  ఈ క్రమంలోనే పట్టణంలోని రైల్వే స్టేషన్‌రోడ్డులో మరిన్ని కార్లను ఢీకొట్టారు. మార్గ మధ్యలో వీరిబారి నుంచి చాలామంది తప్పించుకున్నారు. వేగంగా వెళ్తుండడంతో పలు గ్రామాల యువకులు బైక్‌లపై వీరిని వెంబడిస్తూ.. వచ్చారు. ఆ కారులో రెండు సీట్లకు బెలూన్లు ఉన్నాయి. నరసాపురంలో కార్లస్టాండ్‌లో రోడ్డు పక్క నిలిపి ఉంచిన కార్లను ఢీకొట్టడంతో ఎవరికీ ప్రమాదం జరగలేదు. కారులో బిర్యానీ, మందు  బాటిళ్లు పేకలు ఉండడంతో మద్యం మత్తులో వీరంగం సృష్టించినట్టు అర్థమవుతోంది. తూర్పుతాళ్లులో గాయపడిన మహిళను ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement