నిధులు ఎందుకు ఖర్చుచేయరు? | yv subba reddy fires on mp land funds | Sakshi
Sakshi News home page

నిధులు ఎందుకు ఖర్చుచేయరు?

Apr 16 2017 1:41 PM | Updated on Sep 5 2018 9:47 PM

నిధులు ఎందుకు ఖర్చుచేయరు? - Sakshi

నిధులు ఎందుకు ఖర్చుచేయరు?

ఎంపీ ల్యాడ్స్‌ కింద నియోజకవర్గ ప్రజల అవసరాల కోసం వెచ్చించిన నిధులను 75 రోజుల్లోపు గ్రౌండింగ్‌ చేయాలి.

► ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నిర్లక్ష్యంపై వైవీ ఆగ్రహం

ఒంగోలు టౌన్‌ : ‘ఎంపీ ల్యాడ్స్‌ కింద నియోజకవర్గ ప్రజల అవసరాల కోసం వెచ్చించిన నిధులను 75 రోజుల్లోపు గ్రౌండింగ్‌ చేయాలి. ఇప్పటివరకు తాను 779 పనులు మంజూరు చేస్తే, 396పనులు చేయలేదు. పనులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తా. అప్పటికీ స్పందించకుంటే నేరుగా స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తా’ అని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు.

ఎంపీ ల్యాడ్స్‌ నిధుల వినియోగంపై శనివారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్‌ హాలులో సమీక్షా సమావేశం నిర్వహించారు. 779 పనులకు 15కోట్ల 23లక్షల రూపాయలు విడుదల చేయగా, 14కోట్ల 28లక్షల రూపాయలకు వర్క్‌ ఆర్డర్లు ఇచ్చారని, అందులో ఇప్పటివరకు 9కోట్ల రూపాయల పనులు చేపట్టారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

తాగునీరు, రోడ్లకు నిధులు విడుదల చేస్తుంటే వాటిని ఖర్చు చేయకుండా జిల్లా యంత్రాంగం చాలా దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల పరిధిలో తాగునీటి కోసం నిధులు ఎందుకు ఖర్చు చేయలేదని ఆర్‌డబ్ల్యూఎఎస్‌ ఇంజనీరింగ్‌ అధికారులను నిలదీశారు.

మంచినీటి దగ్గర పక్షపాతమా?
జిల్లాలో నీటి సమస్య తీవ్రంగా ఉన్నా నిధులు ఖర్చు చేయడం లేదని ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ బోర్లు వేస్తే అక్కడ కూడా పక్షపాతంగా వ్యవహరిస్తారా? అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ కాంతారావు వ్యవçహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు విడుదలచేసి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పుడు పంచాయతీ తీర్మానాలు లేవని అంటారా అని నిలదీశారు.

ఎస్‌ఈ  ఫోన్‌ చూసుకుంటుండటంతో మందలించారు. గిద్దలూరులో ట్యాంకర్‌ కొనుగోలు చేయాలని నిధులు విడుదల చేసినా, ప్రైవేట్‌ ట్యాంకర్ల ద్వారా రవాణా చేస్తుండటంతో ఇంజనీరింగ్‌ అధికారి నుంచి రికవరీ పెట్టాలని వైవీ ఆదేశించారు. మార్కాపురం మునిసిపల్‌ కమిషనర్‌ గైర్హాజరు కావడంతో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

కలెక్టర్‌ ఆర్డర్‌ అమలుకు నాలుగు నెలలు పట్టింది: ఎమ్మెల్యే సురేష్‌
షాదీఖానా నిర్మాణానికి సంబంధించి  కలెక్టర్‌ ఇచ్చిన ఆర్డర్‌ను అమలుచేసేందుకు సంబంధిత అధికారులకు నాలుగు నెలలు పట్టిందని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ అసంతృప్తి వ్యక్తం చేవారు. ఎన్నికల కోడ్‌ పేరుతో ఆపారన్నారు.  సీపీఓ భరత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  సీపీఓ భరత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement