munugodu
-
మునుగోడులో కాంగ్రెస్ 13 వేల ఓట్లు ఆధిక్యం..
-
రెండు రోజుల్లో మునుగోడు అభ్యర్థి ఖరారు
చౌటుప్పల్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని రెండు రోజుల్లో ఖరారు చేస్తామని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తెలిపారు. అందరికీ అమోదయోగ్యమైన అభ్యర్థిని బరిలోకి దింపుతామని చెప్పారు. మునుగోడు అభ్యర్థిని త్వరగా ఖరారు చేయాలని కోరుతూ నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. రాష్ట్ర ఇన్చార్జి సునీల్‌బన్సల్, ఈటలను వారు కలిశారు. ఇప్పటి వరకు అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఈటల ప్రత్యేకంగా సమావేశమయ్యా రు. ఆలస్యం జరగకుండా అభ్యర్థి ప్రకటన ఉంటుందన్నారు. కార్యకర్తలంతా పార్టీ గెలుపుకోసం కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్, అసెంబ్లీ నియోజకవర్గ కన్వినర్ దూడల భిక్షంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మునుగోడులో పెద్దదిక్కుగా ఉండే ఆస్పత్రిపై పాలకుల నిర్లక్ష్యం
-
మునుగోడు ఉపఎన్నిక ఫలితంపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ రావు విశ్లేషణ ...
-
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం
-
13వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం
-
11వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం
-
9వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం
-
మునుగోడు రిజల్ట్ పై ఐపీఎల్ తరహాలో బెట్టింగ్
-
మునుగోడు ఎవరిది ..?
-
మునుగోడులో ఓటమి భయంతో తనపై బీజేపీ తప్పుడు ప్రచారం : కర్నె ప్రభాకర్
-
పోలింగ్ కేంద్రం నుంచి కేఏ పాల్ పరుగులు ..
-
మునుగోడులో 50వేల మెజార్టీతో గెలవబోతున్నా: కేఎ పాల్
నల్గొండ: 50వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవబోతున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ తెలిపారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో మంగళవారం ఆయన రోడ్‌షో నిర్వహించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలివైన మునుగోడు ప్రజలు తనకే అండగా ఉన్నారని తెలిపారు. ఢిల్లీ, పంజాబ్‌లో మాదిరిగా ఇక్కడ కూడా ప్రజలు ప్రధాన పార్టీలను ఓడిస్తారని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక ఆరు నెలల్లో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానన్నారు. హైదరాబాద్‌కు తాను ప్రపంచ స్థాయి కంపెనీలు తీసుకురావడంతో అభివృద్ధి చెందిందని.. అదే మాదిరిగా మునుగోడుకు సైతం తీసుకొస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 100–112 అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్లెక్సీలకు పెట్టిన ఖర్చు మునుగోడుకు ఇస్తే ఎంతో అభివృద్ధి చెందేదన్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా తాను విజయం సాధిస్తున్నానని తెలిసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన బహిరంగ సభను రద్దు చేసుకున్నాడని తెలిపారు. రెడ్డి సామాజిక వర్గానికి సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదని, ఆ సామాజిక వర్గం టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దన్నారు. వారంతా తనకే మద్దతుగా ఉన్నారని తెలిపారు. -
మునుగోడు కౌంట్ డౌన్ స్టార్ట్
-
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఊరట..
-
రెచ్చగొట్టే చర్యలతో దాడులకు దిగారు : ఈటెల రాజేందర్
-
ఓటమి భయంతోనే టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోంది : ఈటెల రాజేందర్
-
మునుగోడు లో రణరంగం
-
మునుగోడు ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి : హరీష్ రావు
-
బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాన్వాయ్ పై దాడి
-
కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే : బండి సంజయ్
-
ఆలోచించండి.. ఆగం కాకండి : కేటీఆర్
-
20, 30 మంది ఎమ్మెల్యేలను కొని కేసీఆర్‌ను పడగొట్టాలని చూశారు : సీఎం కేసీఆర్
-
ఎన్నికలు వస్తే చాలు గాయ్.. గాయ్.. గత్తర్.. గత్తర్ లొల్లి నడుస్తోంది : కేసీఆర్
-
బీజేపీ పై కేసీఆర్ ఫైర్
-
సీఎం కాన్వాయ్ లో డబ్బులు తీసుకురాబోతున్నారు : బండి సంజయ్
-
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఓ కట్టుకథ : తరుణ్ చుగ్
-
టీఆర్ఎస్ ధన బలంతో మునుగోడులో గెలువాలని చూస్తోంది : రాజగోపాల్ రెడ్డి
-
మునుగోడు అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం : పాల్వాయి స్రవంతి
-
మునుగోడులో కేఏ పాల్ వినూత్న ప్రచారం
-
పొలిటికల్ కారిడార్ : మూడు పార్టీల నేతల్లో మునుగోడు టెన్షన్
-
అవన్నీ ఫేక్ వీడియోలే : బండి సంజయ్
-
యాదాద్రి ఆలయంలో బండి సంజయ్ ప్రమాణం
-
మునుగోడులో బెట్టింగ్ జోరు.. కోట్లలో లావాదేవీలు
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్ నడుస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ తరహాలో ఉప ఎన్నికపై బెట్టింగ్ సాగుతున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోని మూడు ప్రధానపార్టీలు మునుగోడు ఎన్నికలను కీలకంగా తీసుకున్న నేపథ్యంలో గెలుపోటములపై బెట్టింగ్ మాఫియా రంగంలోకి దిగింది. అభ్యర్థులను అంచనా వేస్తూ ఏకంగా కోట్లలో లావాదేవీలు జరుగుతున్నట్లు, నగదు చేతులు మారుతున్నట్లు సమాచారం. మునుగోడుతో పాటు చౌటుప్పల్, నాంపల్లి, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, హైదరాబాద్‌లోని పలు ప్రాంతల్లో ఏజెంట్లను నియమించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒక్కో అభ్యర్థిపై ఒక్కో విధంగా బెట్టింగ్‌లు వేస్తూ, ఆన్లైన్ ట్రాన్సక్షన్ ద్వారా ఈ దందా నిర్వహిస్తున్నారని వినికిడి. అయితే మునుగోడులో బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందకున్న పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. బెట్టింగ్ రాయుళ్లపై కన్నేసి ఉంచింది. కాగా ఇప్పటికే మునుగోడు ఓటర్లను ప్రలోభా పెట్టడానికి పార్టీ నేతలు భారీ నగదు పంపిణీ, మద్యం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. మంత్రుల వాహనాలతో సహా అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి అక్రమంగా తరలిస్తున్న డబ్బు, మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. చదవండి: నాగోల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్.. -
ఓటర్ల కాళ్లు మొక్కుతూ.. మునుగోడులో ఓయూ విద్యార్థుల ప్రచారం
సాక్షి, మునుగోడు: టీఆర్ఎస్ను ఓడించాలని కోరుతూ మునుగోడులో ఓయూ జేఏసీ విద్యార్థులు వినూత్న ప్రచారం నిర్వహించారు. ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసగిస్తున్న టీఆర్ఎస్కు ఓటు వేయొద్దంటూ మెడకు ఉరితాళ్లు బిగించుకుని, ఓటర్ల కాళ్లు మొక్కారు. చండూరులో ఆదివారం ఈ వినూత్న ప్రచారం కనిపించింది. ‘సాలు దొర ఇక సెలవు..’, ‘కేసీఆర్‌ను ఓడిద్దాం.. నిరుద్యోగుల జీవితాలను కాపాడుకుందాం’ అనే నినాదాలతో నియోజకవర్గంలో 9 రోజుల పాటు ప్రచారం నిర్వహించినట్లు విద్యార్థి జేఏసీ నాయకులు తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పడంతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు అనేక హామీలు ఇస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ఓటర్లు మేల్కొనాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే ఉరే శరణ్యమని వాపోయారు. రొట్టె చేస్తా.. ఓట్లు అడుగుతా.. మంత్రి సత్యవతి రాథోడ్ మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం సంస్థాన్ నారాయణపురం మండలం గరకతండాలోని ఓ గిరిజన ఇంట్లో రొట్టె చేశారు. వారితో కలిసి రొట్టెతిన్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలని వారిని కోరారు. -
Munugode Bypoll: జరిగే మేలు ఎవరికి?.. చీలే ఓట్లెవరివి..
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక బరిలో ఎక్కువ మంది బరిలో ఉండటం.. అందులోనూ చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఉండటంతో.. ఎవరిపై ప్రభావం పడుతుందనే చర్చ జరుగుతోంది. వారు ఎవరి ఓట్లను చీల్చే అవకాశం ఉంది, అందువల్ల ఎవరికి లాభం జరుగుతుందనే దానిపై అంచనాల మీద అంచనాలు వేసుకుంటున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికివారు తామే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోపల అందరిలో ఆందోళన కనిపిస్తోంది. క్రాస్ ఓటింగ్ భయం పార్టీలను వేధిస్తోంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఓట్లు చీలిపోకుండా కట్టడి చేసే పనిలో పడ్డాయి. గతంలో చిన్న పార్టీలు, స్వతంత్రులకు ఎన్ని ఓట్లు పడ్డాయి. ఏ మేరకు, ఎవరి ఓట్లను చీల్చగలిగారన్న అంచనాల్లో మునిగిపోయాయి. త్రిముఖపోరే.. అయినా తప్పని ఆందోళన ఈ ఉప ఎన్నికలో మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇందులో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు జాతీయ పార్టీ అయిన బీఎస్పీ నుంచి ఒకరు కలిపి నలుగురు ఉండగా.. రిజిస్టర్డ్ పారీ్టల అభ్యర్థులు 10 మంది ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ముందు 83 మంది బరిలో ఉన్నా.. ప్రధాన పార్టీలు 36 మంది స్వతంత్రులను ఒప్పించి బరిలో నుంచి తప్పించగలిగాయి. అయినా పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్లు పోటీలో నిలిచారు. మొత్తంగా ప్రధాన పారీ్టలు మినహా మిగతా 44 మంది అభ్యర్థులు ఎవరి ఓట్లను చీల్చుతారన్నది కీలకంగా మారింది. మారిన పరిస్థితుల్లో అంచనాలెలా? గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ హవా కనిపించినా మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడంతో ప్రస్తుత ఉప ఎన్నికల్లో పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్‌కు చెందిన గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులను, ప్రజాప్రతినిధులను వీలైనంత మందిని టీఆర్ఎస్, బీజేపీ తమవైపు తిప్పుకొన్నాయి. అయినా పరిస్థితి ఎలా ఉండబోతుందోనన్న స్పష్టత లేదు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఏ గుర్తుపై ఎన్ని ఓట్లు పడ్డాయి? క్రాస్ ఓటింగ్ ఎక్కడ జరిగిందన్న లెక్కలు తీసుకున్నాయి. ఇక టీఆర్ఎస్కు ఈసారి సీపీఐ, సీపీఎం మద్దతు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో ఆ పారీ్టల ఓటర్లు ఎటువైపు మొగ్గుతారన్నది అంతుచిక్కడం లేదని అంటున్నారు. ఆ పార్టీ తమ ఓటు బ్యాంకుతోపాటు కాంగ్రెస్ నుంచి వచి్చన నేతలపై ఆశలు పెట్టుకుంది. ఇక బీజేపీ గతంలో రాజగోపాల్‌రెడ్డికి పడిన కాంగ్రెస్ ఓట్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. కానీ నాయకులు పోయినా కేడర్ ఉందని, ఓట్లు తమకే పడతాయని కాంగ్రెస్ చెబుతోంది. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఇలా.. 2018 సాధారణ ఎన్నికల్లో 16 మంది బరిలో ఉన్నారు. పోలైన మొత్తం 1,98,843 ఓట్లలో.. కాంగ్రెస్ నుంచి పోటీచేసిన రాజగోపాల్‌రెడ్డికి 97,239 (48.90 శాతం) ఓట్లు లభించాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి 74,687 ఓట్లు (37.56 శాతం), బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డికి 12,725 ఓట్లు (6.40 శాతం) వచ్చాయి. అదే ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తుపై పోటీ చేసిన ఇండిపెండెంట్ మంగ వెంకటేశ్ కురుమకు 3,569 ఓట్లు (1.79 శాతం), ట్రక్కు గుర్తుపై ఎస్ఎంఎఫ్బీ పార్టీ నుంచి బరిలో ఉన్న చిలువేరు నాగరాజుకు 2,279 ఓట్లు (1.15 శాతం) లభించాయి. బీఎల్ఎఫ్ అభ్యర్థి గోశిక కరుణాకర్‌కు 2,080 ఓట్లు (1.05 శాతం), నోటాకు 3,086 ఓట్లు (1.55 శాతం) పడ్డాయి. మిగతా అభ్యర్థులందరికీ కలిపి మూడువేలకు పైగా ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ ఈ లెక్కలను, ప్రస్తుత పరిణామాలను బేరీజు వేసుకుంటున్నాయి. -
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హైకమాండ్ షోకాజ్ నోటీసులు
-
మునుగోడులో పోస్టర్ వార్
చౌటుప్పల్ మండలంలో ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటుకు 2016లోనే హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదంటూ.. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫ్లెక్సీ పెట్టి, దాని ముందు సమాధిలా ఏర్పాటు చేశారు. అంతకుముందు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రూ.18 వేల కోట్లకు అమ్ముడు పోయారంటూ పోస్టర్లు వేశారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు, బ్యానర్ల వార్ ఉధృతమైంది. మొన్నటివరకు ప్రజా సమస్యలను పరిష్కరించాలని, రోడ్డు వేస్తేనే మా ఊళ్లో ఓట్లు అడగాలని గ్రామాల్లో ప్రజలు ఫ్లెక్సీలు పెట్టారు. ఇప్పుడు రాజకీయ పార్టీల కార్యకర్తలు, నేతలు పరస్పర విమర్శలు, ఆరోపణలతో పోస్టర్లు వేసుకుంటున్నారు. మొన్నటివరకు బీజేపీ నేతలు, ఆ పార్టీ అభ్యర్థిని ఉద్దేశిస్తూ పోస్టర్లు వెలియగా.. తాజాగా టీఆర్ఎస్ నేతలను ఉద్దేశిస్తూ పోస్టర్లు పడ్డాయి. ఆగస్టు నుంచే పోస్టర్ల గోల షురూ.. మునుగోడు నియోజకవర్గంలో ఆగస్టు నెల నుంచే పోస్టర్ల గోల మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే కొన్ని గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని బ్యానర్లు పెట్టగా.. మరికొన్ని గ్రామాల్లో మాకు డబ్బులు వద్దు రోడ్డే కావాలి అంటూ ఫ్లెక్సీలు కట్టారు. మరోచోట రోడ్డు వేస్తేనే మా గ్రామంలోకి రావాలంటూ ఊరి బయట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తర్వాత రాజగోపాల్‌రెడ్డిని విమర్శిస్తూ పోస్టర్లు వెలిశాయి. ‘మునుగోడు ప్రజలారా మేం మోసపోయాం.. మీరూ మోసపోకండి.. ఇట్లు దుబ్బాక, హుజూరాబాద్ ప్రజలు’అంటూ సెప్టెంబర్ 15న పోస్టర్లు కనిపించాయి. తర్వాత ‘రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు పే’అంటూ రాజగోపాల్‌రెడ్డిపై పోస్టర్లు వేశారు. ఆ తర్వాత ఫ్లెక్సీలు, బొమ్మలతో సమాధులు, కాష్టాల వంటివీ జరిగాయి. తాజాగా శనివారం నాంపల్లి మండల కేంద్రం శివారులో కల్వకుంట్ల కుటుంబం పేరుతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత బొమ్మలతో ఫ్లెక్సీ పెట్టి.. కాష్టాన్ని పేర్చి తగలబెట్టారు. ఇదీ చదవండి: ఇదేందయ్యా ఇది.. మద్యం మత్తులో రెచ్చిపోయిన మునుగోడు యూత్.. వీడియో వైరల్ -
మోదీ సర్కార్‌పై మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
సాక్షి,హైదరాబాద్: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం విధించిన సెస్సు తీసేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం దోచుకున్నది చాలని.. వీటి ధరలు పెంచి ఇప్పటికే 30 లక్షల కోట్లను మోదీ సర్కార్ దోచుకుందని ధ్వజమెత్తారు. లీటరు పెట్రోల్ రూ.70 డీజిల్ రూ.65కే ఇవ్వాలనేది తమ డిమాండ్‌గా పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో లారీ యాజమానుల, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మోదీ సర్కార్‌కు సరుకు లేదు, ప్రజల సమస్యలపై సోయి లేదని మండిపడ్డారు. కేంద్రాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే దేశద్రోహీ అనే ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ పెద్దలకు కేంద్రం రూ.11.5 లక్షల కోట్లు మాఫీ చేసిందని గుర్తు చేశారు. సామాన్యులకు ఉచితాలు ఇవ్వకూడదని కేంద్రం చెబుతోందని అన్నారు. పెద్దలకు మాఫీ చేయొచ్చు కానీ పేదలకు చేయకూడదా అని ప్రశ్నించారు. ‘దేశంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపిన ఘనత కేసీఆర్‌ది. ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుంది. మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసుకున్నాం. నేడు మూడున్నర కోట్ల టున్నల ధాన్యం ఉత్పత్తి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగింది. 8 ఏళ్లుగా ఒకే మాట మీద అందరం నడుస్తున్నాం. కుల, మత తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధిని చూసి కేంద్రం ఓర్వలేకపోతుంది. నూకలు తినండని తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానించింది. తెలంగాణను అవమానించిన బీజేపీ నేతల తోకలు కత్తిరించాలి’ అని కేంద్రంపై మండిపడ్డారు. చదవండి: కళ్ల జోడు లేకుండా చదవలేకపోతున్నా: కేటీఆర్ -
మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది : ఉత్తమ్ కుమార్ రెడ్డి
-
బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ప్రచారాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు
-
రాజగోపాల్ రెడ్డి స్వార్థం వల్లే మునుగోడు ఉపఎన్నిక : మంత్రి జగదీష్ రెడ్డి
-
మునుగోడు ఓటర్లకు పెద్ద ఎత్తున దావత్ లు
-
మునుగోడు ఉపఎన్నిక పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
కెఎస్ఆర్ లైవ్ షో : వలసలపై కేసీఆర్ రివర్స్ అటాక్
-
మునుగోడు బరిలో కామారెడ్డి మహిళ
-
Munugode Bypoll: ప్రచారానికి జనాన్ని పిలిస్తే ఒక బాధ, పిలవకపోతే మరో బాధ
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ప్రతి కార్యక్రమాన్ని గొప్పగా చేస్తున్నాయి. పోటీలో వివిధ పార్టీల అభ్యర్థులు, చాలా మంది స్వతంత్రులు ఉన్నప్పటకీ ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నడుమనే తీవ్రమైన పోటీ నెలకొంది. ఉప ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఈ మూడు పార్టీలు నిత్యం సభలు, సమావేశాలు నిర్వహిస్తూ జనం మధ్యలో ఉంటున్నాయి. ఆయా పార్టీలు తమ కార్యకర్తలో సమావేశాలు నిర్వహిస్తే హంగామా కనిపించకపోవడంతో.. సామాన్య ప్రజానీకాన్ని సమీకరిస్తున్నాయి. ఆ క్రమంలో గ్రామాలు, కాలనీలకు చెందిన జనం పార్టీల సమావేశాలకు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. జన సమీకరణతో మొదలవుతున్న నేతల కష్టాలు సమావేశాలు నిర్వహణ వరకు బాగానే ఉన్నా అసలు సమస్య మాత్రం జనసమీకరణతోనే. సమావేశాలు, రోడ్‌షోలకు ఒకొక్కరికి రూ.500 నుంచి రూ.1000 వరకు చెల్లిస్తున్నారు. ఒక్కో పార్టీ ఆయా కార్యక్రమాల పరిస్థితి మేరకు జనాన్ని సమీకరిస్తున్నాయి. ఇంతే మంది కావాలని కూడా చెబుతున్నాయి. అయితే పిలిచినదాని కంటే ఎక్కవగా జనాలు తరలివెళ్తున్నారు. వద్దన్నా వినకుండా వస్తుండడంతో అందరికీ డబ్బులు చెల్లించలేక స్థానిక నేతులు తలలు పట్టుకుంటున్నారు. వద్దని చెబితే ‘రేపు మా ఓటు వద్దా’ అని ప్రశ్నిస్తున్నారు. దీంతో జనాన్ని వద్దనలేక, అధిష్టానం వద్ద సరిపడా డబ్బులను తెప్పించుకోలేక నానా పాట్లు పడుతున్నారు. ఒక్కోసారి స్థానిక నేతలే సొంతంగా డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో బాధ్యతలు తీసుకునేందుకు కొందరు వెనుకడుగు వేస్తున్నారు. కొందరికి కాసులు.. మరి కొందరికి కష్టాలు.. సాధారణంగా ఎన్నికలు అంటేనే రాజకీయ పార్టీల నాయకులకు పండుగ అని చెప్పవచ్చు. కానీ ప్రస్తుత ఉప ఎన్నికలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అన్ని పార్టీలకు స్థానికంగా బాధ్యతలు చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఇన్‌చార్‌్జలు వచ్చారు. వారంతా సభలు, సమావేశాలు, ప్రచార వ్యవహారాలు, జన సమీకరణ వంటి అన్ని అంశాలు చూసుకుంటున్నారు. దీంతో స్థానిక నేతలకు ఎలాంటి పని లేకుండా పోయింది. కేవలం అసిస్టెంట్లుగానే మారారు. ఇదిలా ఉంటే జన సమీకరణ, ఇతర విషయాల్లో ఆయా పార్టీల్లోని కొంత మంది స్థానిక నేతలకు కాసుల వర్షం కురిపిస్తే మరి కొందరికి మాత్రం కష్టాలు ఎదురవుతున్నాయి. కొందరు ఇన్‌చార్జ్‌లు స్థానిక నేతల ద్వారానే కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మరి కొందరు మాత్రం స్వయంగానే చూసుకుంటున్నారు. ఏదేమైనా ఇన్‌చార్‌్జల రాకతో అన్ని పార్టీల్లో లోకల్ లీడర్లకు మాత్రం నాలుగు పైసలు వెనుకేసుకోలేని పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. -
పొలిటికల్ కారిడార్ : మునుగోడు స్థాయే వేరు..
-
మునుగోడు లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం
-
టీఆర్ఎస్ లో చేరిన భిక్షమయ్య గౌడ్
-
నడ్డా అనే అడ్డమైన వాడు ఆరేళ్ల కిందట హామీ ఇచ్చాడు.. ఏమైంది?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య పద్దతుల్లో గెలవలేక రాజ్యంగ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని బీజేపీ శిఖండి రాజకీయాలు చేస్తోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఎన్నిక అని పేర్కొన్నారు. మునుగోడు ప్రజలు ఉప ఎన్నికలో బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ గురువారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో బూడిద బిక్షమయ్య గౌడ్‌కు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ ధనమదంతో మునుగోడులో గెలవాలని కుటిల ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీకి దమ్ము, ధైర్యం ఉంటే తెలంగాణకు ఏం తెచ్చారో ప్రజలకు చెప్పి మునుగోడులో ఓటు అడగాలని సవాల్ విసిరారు. నడ్డా అనే అడ్డమైన వాడు 300 పడకల ఆస్పత్రి కట్టిస్తామని ఆరేళ్ల కిందట హామీ ఇచ్చాడని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. మోదీ, ఇంకో బోడీ ఇక్కడికి వచ్చి పీకేదేమీ లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు మూతిమీద తన్నినట్టు సమాధానం చెబుతారన్నారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలన్నీ మోదీ చేతిలో కీలుబొమ్మల్లా మారాయని మండిపడ్డారు. ‘భారతీయ జనతా పార్టీ ఒక నీతి జాతి లేని పార్టీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించే అర్హత ఏమాత్రం లేదు. ఆయన ఒక నిస్సహాయ మంత్రి. రాజగోపాల్‌రెడ్డి చిన్న కంపెనీకి అంత పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు.. దాని వెనకున్న పెద్దలెవరు. ఇందులో దాగిన ఆ గుజరాత్ రహస్యమేంటి. 3 ఏళ్లు కాంగ్రెస్‌లో ఉండి, కోవర్ట్ రాజకీయం చేసి, బేరం కుదిరాకే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారు. బీజేపీ ఉన్మాద ప్రవర్తనను ధీటుగా ఎదుర్కోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. బీజేపీ విష సంస్కృతికి తెరతీసింది. బీజేపీ వ్యవస్థల్ని ఎలా దుర్వినియోగం చేస్తోందో స్పష్టంగా కనిపిస్తోందని’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. చదవండి: బీజేపీపై భిక్షమయ్య ఘాటు విమర్శలు.. అందుకే రాజీనామా చేశారా? -
పొలిటికల్ కారిడార్ : ఖమ్మం టీఆర్ఎస్ లో కొత్త టెన్షన్
-
బీజేపీపై భిక్షమయ్య ఘాటు విమర్శలు.. అందుకే రాజీనామా చేశారా?
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక వేళ ఆలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అధిష్ఠానానికి లేఖ పంపారు. ఈ సందర్భంగా బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు భిక్షమయ్య గౌడ్. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న తీవ్ర అన్యాయాన్ని, వివక్షను చూశాక బీజేపీలో కొనసాగడంలో ఏమాత్రం అర్థం లేదని భావిస్తూ రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. ‘తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంటామంటూ భారతీయ జనతా పార్టీ చేసిన వాగ్దానాలను నమ్మి ఆ పార్టీలో చేరాను. అయితే మాజీ ఎమ్మెల్యేగా, సీనియర్ నాయకునిగా రాజకీయాల్లో దాదాపు రెండున్నర దశాబ్దాల అనుభవం ఉన్న నాకు ఆ పార్టీలో చేరిన నాటి నుంచి అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. పార్టీలో నాలాంటి బీసీ నాయకులను పట్టించుకునే వారే లేరు. పైగా ఈమద్య కాలంలో పదే పదే తెలంగాణ రాష్ట్రానికి, బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న పలు నిర్ణయాలు ఆ పార్టీలో కొనసాగకుండా చేశాయి. కేంద్రం నుంచి వచ్చిన ప్రధాని నుంచి మొదలుకొని కేంద్ర మంత్రుల దాకా ప్రతి ఒక్కరు డబుల్ ఇంజన్ సర్కార్ పేరిట మాటలు చెప్పడమే కానీ ఇప్పటిదాకా ఒక్క పైసా అదనపు సహాయాన్ని తెలంగాణకు చేయలేదు. ఇక్కడ సర్కారు ఉంటేనే నిధులిస్తాము, అప్పటిదాకా తెలంగాణ ఇబ్బందులను పట్టించుకోమన్నట్లు వ్యవహరిస్తున్న తీరు బీజేపీ చెబుతున్న డబుల్ ఇంజన్ సర్కారు మోడల్లోని డొల్లతనానికి అద్దం పడుతోంది. గత రెండున్నర దశాబ్దాల నా రాజకీయ ప్రస్థానంలో బడుగు బలహీన వర్గాల ప్రయోజనాల కోసం కృషి చేశాను. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత అనేక పర్యాయాలు కేంద్రంలో బలహీన వర్గాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వచ్చిన ప్రతిసారి ఎంతో ఆశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశించాను. కానీ ప్రతిసారి నిరాశనే ఎదురైంది. దీంతోపాటు నాతోటి బిసి సోదరులైన నేతన్నల సమాజం భవిష్యత్తును సంక్షోభంలోకి నెట్టేలా, వారికున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు. దేశ చరిత్రలో చేనేతపైన తొలిసారి పన్ను వేసిన కేంద్ర నిర్ణయం వెనక్కి తీసుకోవాలని నా పద్మశాలి సొదరులు చేసిన విజ్ఞప్తిని కేంద్రం పెడచెవిన పెట్టి జీఎస్టీని భారీగా పెంచే కుట్రలు చేయడం బాధ కలిగిస్తోంది. ఈ నిర్ణయాలతో పూర్వ నల్లగొండలోని వేలాది నేతన్నల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్థానిక నాయకత్వంపైన ఢిల్లీలోని బీజేపీ హైకమాండ్‌కి ఏ మాత్రం పట్టులేదనే విషయం నాకు పార్టీలో చేరిన కొద్ది కాలానికే అర్థమైంది. గత దశాబ్ద కాలంగా తెలంగాణలో ఎలాంటి మత సంఘర్షణలు, ఆందోళనలు లేకుండా కొనసాగుతున్న ప్రశాంతమైన శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేలా స్థానిక బీజేపీ నాయకులు ఉద్రేకాలు పెంచేలా మాట్లాడినా, బీజేపీ హైకమాండ్ స్పందించకపోవడం నన్ను ఎంతో కలతకు గురిచేసింది. హిందు సమాజం భావోద్వేగాలను రెచ్చగొట్టి, వాటిని రాజకీయాల కోసం ఉపయోగించుకోవడమే పనిగా పెట్టుకున్న బీజేపీ, ఇప్పటిదాకా ఆధునిక భారత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అద్భుతంగా నిర్మించిన యాదాద్రి దేవాలయానికి ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు. దశాబ్దాల ప్లోరైడ్ రక్కసిని తరిమికొట్టిన తెలంగాణ ప్రభుత్వానికి, మిషన్ భగీరథ కార్యక్రమానికి ఒక్క రూపాయి ఇవ్వకపోగా ఈ 2016లో ప్రస్తుత బీజేపీ అధ్యక్షులు, అప్పటి కేంద్ర ఆరోగ్య మంత్రి జేపి నడ్డా గారు మునుగొడులోని మర్రిగూడలో ప్లోరైడ్ బాధితుల కోసం కట్టిస్తామన్న 300 పడకల ఆసుపత్రికి అతీగతి లేదు. చౌటుప్పల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్లోరైడ్ రిసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ కోసం తెలంగాణ ప్రభుత్వం దండుమల్కాపూర్ లో 8.2 ఏకరాల స్ధలం కేటాయించినప్పటికీ కేంద్రం నుంచి ఇప్పటికీ నయాపైసా రాలేదు. దీంతోపాటు ప్లొరైడ్ భాధితులకు అర్దిక సహాయం చేస్తామన్న హమీలపై బీజేపీ స్పందించకపోవడం నల్లగొండ జిల్లా నాయకునిగా తీవ్ర మనస్థాపానికి గురిచేసింది.’ అని బీజేపీపే తీవ్ర విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్. ఇదీ చదవండి: ఎన్నికల వేళ ఊహించని ట్విస్ట్.. బీజేపీకి భిక్షమయ్య గుడ్‌బై -
పొలిటికల్ కారిడార్ : గ్రేటర్ లో మునుగోడు ప్రచారం
-
మునుగోడులో గుర్తుల గోల...
-
మునుగోడులో పట్టుబడుతున్న నోట్ల కట్టలు...
-
బూర నర్సయ్యగౌడ్ ను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు : మల్లారెడ్డి
-
అంకుల్.. ఎన్నికల ఖర్చుకిది ఉంచండి!
సాక్షి, నల్గొండ: మునుగోడు ఎన్నికల ప్రచారం సాగిస్తున్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒక విచిత్ర అనుభవం ఎదురైంది. రాజగోపాల్‌రెడ్డి సంస్థాన్ నారా యణపురం మండలం చిమిర్యాలకు వెళ్లారు. గ్రామానికి చెందిన దండుగుల నాగేష్ కుమారుడు రామ్‌తేజ్ (12) తాను దాచుకున్న రూ. 2,450 ఎన్నికల ఖర్చుల కోసం రాజగోపాల్‌కు అందజేశాడు. దీంతో ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ డబ్బు తీసుకున్నారు. అవినీతి పాలన అంతానికి ముందుకు రావాలి: రాజగోపాల్ రాష్ట్రంలో అవినీతి పాలనను అంతం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధానంగా యువత నడుం బిగించాలని కోరారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లక్కారం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారి గుండెబోయిన రవికుమార్‌యాదవ్‌తో పాటు మరికొందరు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్నారు. తన రాజీనామా తర్వాత ప్రభుత్వం దిగివచ్చి అభివృద్ధి చేస్తోందని, పలు సంక్షేమ పథకాలు ప్రకటించిందని గుర్తుచేశారు. బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తెలంగాణ ఆత్మగౌరవానికి అండగా నిలవాలని కోరారు. టీఆర్ఎస్ ప్రలోభాలకు గురికావొద్దని సూచించారు. నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తే గ్రామాల్లోకి టీఆర్ఎస్ మిడతల దండు ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. చేసిన అభివృద్ది చూపించే పరిస్థితి లేకనే టీఆర్ఎస్ పార్టీ డబ్బు, మద్యం, బెదిరింపులను నమ్ముకుందన్నారు. -
మునుగోడు సమస్యే కాదు.. అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చా’
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ పార్టీలో గౌరవం లేదని, పార్టీ తనను వద్దనుకుంటుందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం దొరకలేదని, అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చేసినట్లు పేర్కొన్నారు. మునుగోడు తనకు సమస్యే కాదని స్పష్టం చేశారు. హంపిలాంటి కుట్రదారుడిని తాను కాదని తెలిపారు. కేసీఆర్‌పై అభిమానంతో ఇప్పటి వరకు పార్టీలో ఉన్నానని.. అభిమానానికి, బానిసత్వానికి తేడా ఉంటుందని అన్నారు. కేటీఆర్ , హరీష్ రావు చేతుల్లో ఏమీ లేదని, వాళ్ల మనసులో కూడా అనేక బాధలు ఉన్నాయన్నారు. భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని వెల్లడించారు. టీఆర్ఎస్కు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. అనంతరం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. ఎంతో బాధతో టీఆర్ఎస్పార్టీకి రాజీనామా చేశానని... ఏ రోజు కూడా పదవి అడగలేదని తెలిపారు. ఎంపీగా ఉన్న సమయంలో అనేక పనులు చేశానని, పార్టీ పదవులు ఎలాంటివి తనకు అక్కర్లేదని, ప్రజల సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి పట్టించుకోలేదని విమర్శించారు. బూర నర్సయ్య గౌడ్ అవమానాన్ని భరిస్తాడు కానీ... ప్రజల సమస్యలను ఎత్తడంలో ఎప్పుడు కూడా వెనక్కి పోలేదని స్పష్టం చేశారు. చదవండి: అదే జరిగితే మరణ శాసనం రాసుకున్నట్లే: మంత్రి కేటీఆర్ -
భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తా : బూర నర్సయ్య
-
కాంగ్రెస్‌కు షాక్.. గులాబీ గూటికి పల్లె రవికుమార్ దంపతులు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్, ఆయన సతీమణి శనివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ దంపతులు భేటీ అయ్యారు. రవికుమార్ గౌడ్ భార్య కల్యాణి ప్రస్తుతం చండూరు ఎంపీపీగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా పల్లె రవికుమార్ దంపతులకు మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తోపాటు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మర్రి రాజశేఖరరెడ్డి, కర్నె ప్రభాకర్, బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. కాగా మునుగోడు ఉప ఎన్నికలో పల్లె రవి కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. కానీ పార్టీ అధిష్టానం పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటించడంతో పల్లె రవికుమార్ తీవ్ర నిరాశ చెందారు. ఈ నేపథ్యంలోనే పల్లె రవికుమార్ గులాబీ గూటికి చేరినట్లు తెలుస్తోంది. ఉద్యమ కాలం నుంచి తమతో కలిసి పని చేసిన పల్లె రవికుమార్ మళ్లీ టీఆర్ఎస్ పార్టీ కుటుంబంలోకి రావడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం కీలకమైన మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ గెలుపు కోసం టీఆర్ఎస్లో చేరేందుకు ముందుకు వచ్చిన పల్లె రవికుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. పాత మిత్రుడు పల్లె రవికుమార్‌కు కచ్చితంగా భవిష్యత్తులో మంచి రాజకీయ అవకాశాలను పార్టీ కల్పిస్తుందని భరోసానిచ్చారు. చదవండి: కేసీఆర్ టార్గెట్‌పై టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్.. కంటి మీద కునుకులేదు? Big Jolt to #Congress Chundur MPP Jyothi and her husband Palle Ravi joins #TRS ahead of #Munugode pic.twitter.com/k7dwPPmHI7 — Sarita Avula (@SaritaTNews) October 15, 2022 చండూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలన్న ప్రధానమైన ప్రజల కోరికను కేటీఆర్‌కు తెలియజేయగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు పల్లె రవికుమార్ తెలిపారు. మునుగోడు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తమ వంతు కృషిని చేస్తామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన మునుగోడు కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ దంపతులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRTRS గారి సమక్షంలో మునుగోడు కాంగ్రెస్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్, వారి సతీమణి చండూరు ఎంపీపీ కల్యాణి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.#MunugodeWithTRS #VoteForCar pic.twitter.com/Ovdsq0IhyF — TRS Party (@trspartyonline) October 15, 2022 -
మునుగోడులో టీఆర్ఎస్ పార్టీదే విజయం : కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
-
మునుగోడులో నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు
-
మునుగోడు ఉపఎన్నిక ఒక కుక్కల కొట్లాట : షర్మిల
-
రాష్ట్రంలోని సంపద కేసీఆర్ ఫ్యామిలీకే సరిపోవడం లేదు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
-
కేసీఆర్ పెన్షన్లు పెంచితే ... మోదీ పెద్దోళ్లకు దోచిపెడుతున్నారు : కేటీఆర్
-
నల్గొండ జిల్లా మునుగోడు మండలం రావిగూడెం లో దారుణం
-
మునుగోడుపై ఢిల్లీకి చేరిన నివేదికలు.. సంజయ్‌జీ హస్తినకు రండి అంటూ కాల్!
సాక్షి, హైదరాబాద్: జాతీయ నాయకత్వం పిలుపుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. గురు, శుక్రవారాల్లో ఆయన పలువురు పార్టీ నేతలను కలుసుకోనున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ ప్రచారం, తదుపరి కార్యాచరణ తదితర అంశాలపై మాట్లాడనున్నట్టు తెలిసింది. పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నిక సందర్భంగా ముఖ్యనేతల మధ్య సమన్వయ లోపాలు, ఇతర లోటుపాట్లపై అధినాయకత్వం దృష్టి సారించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై మునుగోడు ఫలితాలు ప్రభావం చూపనున్నందున, ఈ మేరకు కచ్చితమైన చర్యలు సూచించనున్నట్టు సమాచారం. నివేదికల ఆధారంగా కార్యాచరణ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ పనితీరుపై బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పటికే క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించున్నట్టు తెలుస్తోంది. పార్టీతో సంబంధం లేని స్వతంత్ర సంస్థలు, బృందాల ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా ఈ నివేదికలు తెప్పించుకున్నట్టు సమాచారం. ఈ నివేదికల ఆధారంగా తెలంగాణలో చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణను అధినాయకత్వం రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వివిధ స్థాయిల నాయకుల పనితీరు, కార్యకలాపాలు, పార్టీ కార్యక్రమాలు ఏ మేరకు అమలౌతున్నాయి, పార్టీ ప్రచారం ప్రజలపై ప్రభావం చూపించేలా జరుగుతోందా అన్న అంశాలపై నాయకత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సంజయ్‌ను ఢిల్లీకి రమ్మనమంటూ వర్తమానం పంపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
బండి సంజయ్ పై కేటీఆర్ ఫైర్
-
చండూరులో పోస్టర్ల కలకలం
-
మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డితో " స్ట్రెయిట్ టాక్ "
-
టీఆర్ఎస్ సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి : కూసుకుంట్ల
-
మునుగోడు లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం
-
మునుగోడు లో బీజేపీదే విజయం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
-
మునుగోడు లో టీఆర్ఎస్ విజయం ఖాయం : మల్లారెడ్డి
-
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ఈసీకి పిర్యాదు
-
మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి దూరంగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి
-
అప్పుడు కాంగ్రెస్... ఇప్పుడు బీజేపీ నుంచి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని అధిష్టానం ఖరారు చేసింది. అభివృద్ధి నినాదంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డినే బీజేపీ మునుగోడులో బరిలోకి దింపుతోంది. ఆయన రెండోసారి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయబోతున్నారు. అంతకుముందు ఆయన రాజకీయ ప్రస్థానం కూడా మునుగోడు నియోజకవర్గంలోనే ప్రారంభమైంది. మొదట సేవా కార్యక్రమాలు చేపట్టి తరువాత రాజకీయాల్లోకి దిగారు. 2008 సెప్టెంబరులో మొట్టమొదటగా నియోజకవర్గంలోని గట్టుప్పల్ గ్రామంలో ఓ చేనేత కార్మికుడు అప్పుల బాధ తట్టుకొలేక ఆత్మహత్య చేసుకోగా ఆ కుటుంబాన్ని పరామర్శించి రూ.50 వేల ఆర్ధిక సహాయం అందించారు. ఆ తరువాత అక్టోబర్ నెలలో మునుగోడు మండలంలోని చల్మెడ గ్రామంలో దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి అదే గ్రామంలో దాదాపు 10వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అప్పటి నుంచి మునుగోడు ప్రజలకు కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. మొదటి దశ కరోనా సమయంలో రాజగోపాల్‌రెడ్డి తన తల్లి పేరుతో ఉన్న కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా సుమారు రూ.5 కోట్లు ఖర్చుచేసి దాదాపు 50 వేల కుటుంబాలకు చేయూత అందించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2009లో భువనగిరి ఎంపీగా గెలిచి తొలిసారి చట్టసభలో అడుగుపెట్టారు. ఆ తరువాత 2016లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందారు. 2018లో సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మునుగోడు నుంచే ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ అభ్యర్థిపై భారీ మెజారిటీతో గెలుపొందారు. తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినందునే టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడం లేదని, ఉప ఎన్నికలు వచ్చిన చోటే టీఆర్ఎస్ అభివృద్ధిపనులు చేస్తోందని పేర్కొన్నారు. అందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ తరువాత బీజేపీలో చేరిన ఆయన ఆ పార్టీ అభ్యర్థిగా ఉప ఎన్నిక బరిలో దిగుతున్నారు. అభ్యర్థులు ఖరారు.. ఇక ప్రచారం జోరు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరనేది తేలిపోయింది. పోటీలో నిలిపే వారిని ఆయా పార్టీలు ఖరారు చేశాయి. ముందుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించగా, శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. తాజాగా శనివారం బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. దీంతో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్వాయి స్రవంతి బరిలో నిలిచారు. ఇక అభ్యర్థులు ప్రచారంపై దృష్టిపెట్టనున్నారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు వరకు ప్రచారం హోరా హోరీగా సాగనుంది. మొన్నటివరకు అభ్యర్థులను ప్రకటించకపోయినా అందరూ కార్యక్రమాలు కొనసాగించారు. ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించడంతో మునుగోడులో సమరం జోరందుకోనుంది. ఇప్పటికే మొదలైన నామినేషన్ల పర్వం ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. నామినేషన్లకు అంతా సిద్దమవుతున్నారు. ఆ ప్రక్రియ పూర్తయిందంటే ఇక పూర్తి స్థాయి ప్రచారంలోకి దూకనున్నారు. ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ నియోజకవర్గంలో 100 మంది ఓటర్లకు ఓ ఇన్ఛార్జీని నియమించి ఆయా పార్టీలు రంగంలోకి దిగాయి. కాంగ్రెస్‌పార్టీ మండలాల వారీగా నియమితులైన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు మండలాలకు చేరుకుంటున్నారు. టీఆర్ఎస్ మండలాల వారీగా నియమించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయా మండలాలకు చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ చౌటుప్పల్‌లో పాల్గొననున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి తరపున ప్రచారం చేసేందుకు మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు రానున్నారు. రాష్ట్ర మంత్రులు, సీఎం, కేంద్ర మంత్రుల సభలు సమావేశాలు, రోడ్ షోలతో నియోజకవర్గం హోరత్తనుంది. -
కోట్లు పెట్టి ప్రజలను కొనాలని బీజేపీ చూస్తోంది : మంత్రి హరీష్ రావు
-
TRS ను BRS గా మార్చడంతో ఒరిగేదేమి లేదు : తరుణ్ చుగ్
-
కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాడు : మంత్రి జగదీష్ రెడ్డి
-
మునుగోడులో బీజేపీ విజయం ఖాయం : బండి సంజయ్
-
పొలిటికల్ కారిడార్ : ఉపఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ ప్లాన్
-
‘దుబ్బాకలో రూ.10వేలు, హుజురాబాద్‌లో 20వేలు, మునుగోడులో 40వేలు’
సాక్షి, వరంగల్: మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తుతో ముడిపడి ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపించారు. ఇటీవల హనుమకొండలో మృతి చెందిన ఏబీవీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు గుజ్జుల నర్సయ్య సంస్మరణ సభకు హాజరైన సందర్భంగా మాట్లాడారు బండి సంజయ్. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు బీఆర్ఎస్ అనేక అక్రమాలకు పాలుపడుతుందని ఆరోపించారు. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ కుట్రలకు కాంగ్రెస్ సహకరిస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీల అక్రమాలను అడ్డుకుంటాం. దుబ్బాకలో ఓటుకు రూ. 10వేలు, హుజురాబాద్ రూ. 20 వేలు పంచిన బీఆర్ఎస్ ఇప్పుడు మునుగోడులో ఓటుకు రూ. 40వేలు పంచేందుకు సిద్ధమైంది. అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. అనుకూలమైన అధికారులను బదిలీ చేయించుకున్నారు. పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలను, మద్యం మునుగోడుకు పంపించడం చూస్తే సీఎం కేసీఆర్ ఎంత డిప్రెషన్లో ఉన్నారో అర్థమవుతుంది.’ అని దుయ్యబట్టారు బండి సంజయ్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మా కోసం రాజీనామా చేశాడని మునుగోడు ప్రజలు ఆలోచిస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు పన్నినా మునుగోడులో బీజెపీ భారీ మెజార్టీతో గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్ కుమార్. ఫోన్ల ట్యాపింగ్ కోసం ఇజ్రాయిల్ టెక్నాలజీతో ఒప్పందం చేసుకుంది కేసీఆరేనని ఆరోపించారు. రాష్ట్ర మంత్రులు ఆ పార్టీ నేతలు బాహాటంగా చెబుతున్నారని తెలిపారు. నీచమైన, దుర్మార్గమైన ఆలోచన కేసీఆర్‌దేనని, బీజేపీపై విమర్శలు చేయడానికి సిగ్గుండాలన్నారు బండి సంజయ్. ఇదీ చదవండి: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్ -
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి బీఫామ్ అందజేసిన సీఎం కేసీఆర్
-
మునుగోడు లో ముగ్గురు...
-
మునుగోడు వార్...
-
పొలిటికల్ కారిడార్ : మునుగోడు హస్తాన్ని రక్షిస్తుందా ..?
-
పొలిటికల్ కారిడార్ : టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులంతా మునుగోడుకే
-
మునుగోడు గడ్డపై బీజేపీ జెండా ఎగరవేస్తాం : ఈటెల రాజేందర్
-
పొలిటికల్ కారిడార్ : మునుగోడు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్
-
మునగోడు ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారు : మంత్రి జగదీష్ రెడ్డి
-
Munugode Bypoll: అభివృద్ధి చేస్తానంటే రూ.లక్ష కోట్లు ఇస్తా
సాక్షి, నల్గొండ: అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న మునుగోడు నియోజకవర్గాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇస్తే తాను లక్ష కోట్ల రూపాయలు ఇస్తానని ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.ఏ పాల్ అన్నారు. ఆదివారం కేఏపీల్ తన 59వ జన్మదిన వేడుకలను మునుగోడులో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసినా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా నేటికీ సామాజిక న్యాయం ఎక్కడా కన్పించడం లేదన్నారు. మునుగోడులో బడుగు, బలహీన వర్గాల ప్రజలను అభివృద్ధి చేసేందుకే ఉప ఎన్నికల బరిలో నిలుస్తున్నానన్నారు. ప్రజా యుద్ధ నౌక, గాయకుడు గద్దర్ మాట్లాడుతూ ఓటు అనేది ఓ వజ్రాయుధం, దానిని అమ్ముకుంటే ఎప్పటికీ బానిసలుగా బతకాల్సిందే అని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు తన ఓటు హక్కుని సమర్థుడైన నాయకుడికి వేయాలి తప్పా, డబ్బు, మద్యం ఇచ్చేవాడికి వేయవద్దన్నారు. ఈ సందర్భంగా పాడిన పాటలు, చేసిన నృత్యాలు సమావేశానికి వచ్చిన ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. -
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లో ఉంటారా ...?
-
బీఆర్ .అంబెడ్కర్ కు గౌరవం ఇచ్చిన పార్టీ బీజేపీ : బండి సంజయ్
-
మునుగోడు ఉప ఎన్నిక.. వ్యూహం మార్చిన కాంగ్రెస్
సాక్షి, నల్లగొండ: మునుగోడులో కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని మార్చుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించిన తరువాత పార్టీ శ్రేణులు రంగంలోకి దిగాయి. రాష్ట్ర స్థాయి నాయకులు, ముఖ్య నేతలంతా మండలాల్లో పర్యటిస్తుండడంతో కాంగ్రెస్ క్యాడర్లో కదలిక మొదలైంది. ఈ దూకుడును పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ వ్యూహరచన, ప్రచార కమిటీ కన్వీనర్‌గా టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని నియమించింది. ఆ బాధ్యతల నుంచి మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్‌ను తప్పించింది. అన్నింటికంటే ముందుగానే.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వెంటనే అన్ని పార్టీల కంటే ముందే చండూరులో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. అందులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ముఖ్య నాయకులంతా పాల్గొన్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. తరువాత కొద్దిరోజులకు గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టినా తరువాత మిన్నకుండిపోయింది. టికెట్ విషయంలో ఆశావహుల నుంచి పోటీ పెరగడంతో వారితో చర్చించింది. ఎవరికి టికెట్ ఇచ్చినా అంతా కలిసి పని చేసేలా, అభ్యర్థి గెలుపునకు కృషి చేసేలా ఒప్పించింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి పేరును ఖరారు చేసింది. ఆ తరువాతే పార్టీ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అన్ని మండలాలకు రాష్ట్ర స్థాయి నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇప్పటికే రెండుసార్లు నియోజకవర్గంలో పర్యటించారు. ఆయన నారాయణపూర్ మండలం ఇన్ఛార్జిగా ఉండగా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు వంటి నేతలు మండలాల ఇన్‌చార్జీలుగానే కాకుండా, ఇతర మండలాల్లోనూ పర్యటిస్తున్నారు. ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఎత్తుగడలను ముఖ నేతలకు చెబుతూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో కేడర్‌లో కదలిక వచ్చింది. చదవండి: గిరిజన రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన పూర్తి స్థాయిలో ఉండేందుకే దామోదర్‌రెడ్డికి బాధ్యతలు నవంబరు లేదా డిసెంబరులో ఉప ఎన్నికలు ఉండనున్న నేపథ్యంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ వ్యూహరచన, ప్రచార కమిటీ కన్వీనర్‌ను అధిష్టానం మార్చింది. ఈ మార్పును రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ ప్రకటించారు. ఇప్పటివరకు కమిటీకి కన్వీనర్‌గా ఉన్న మధుయాస్కీ గౌడ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని నియమించింది. దీంతో ఆయన స్థానికంగా ఉండి పూర్తి స్థాయిలో దృష్టి సారించి పని చేసేలా ఈ మార్పు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర అక్టోబరు 24వ తేదీన రాష్ట్రంలో ప్రారంభం కానుంది. అప్పటికి మునుగోడులో ఎన్నికల జోరు పెరగనుంది. ఆ సమయంలో మధుయాస్కీగౌడ్ రాహుల్ యాత్రకు సంబంధించిన వ్యవహారాల్లో ఉంటే మునుగోడులో కార్యక్రమాలకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉండటంతో ఆయన్ని తప్పించినట్లు తెలిసింది. -
పల్లెల్లో భేటీలతో ఏకతాటిపైకి.. ‘మునుగోడు’పై ప్రత్యేక వ్యూహం!
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. గ్రామాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీల బలాబలా లను అంచనా వేస్తోంది. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితు ల్లోనూ విజయం సాధించేలా ఒక వైపు పార్టీ యంత్రాంగాన్ని ఏకతాటిపై నడిపేందుకు కసరత్తు చేస్తూనే, మరోవైపు ఇతర పార్టీల నుంచి చేరికలను ముమ్మరం చేసింది. ఇప్పటికే నియోజకవర్గంలోని మండలాల వారీగా ఇన్చార్జీలను నియమించిన అధికార పార్టీ, త్వరలో రెండు గ్రామాలకు ఒకరు చొప్పున ముఖ్య నేతలకు బాధ్యతలు అప్ప గించనుంది. ఉప ఎన్నిక షెడ్యూలు వెలువ డిన తర్వాత చండూరు కేంద్రంగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. రాజగోపాల్ రాజీనామా వార్తలతోనే అప్రమత్తం వాస్తవానికి మునుగోడు అసెంబ్లీ స్థానానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేస్తా రనే సంకేతాలు వెలువడిన సమయంలోనే అధికార పార్టీ అప్రమత్తమై చేరికలపై దృష్టి పెట్టింది. రాజ్‌గోపాల్ రాజీనామా మొదలు కుని ఇప్పటివరకు, కాంగ్రెస్ సహా వివిధ పా ర్టీల నుంచి 30మందికి పైగా ఎంపీటీసీ స భ్యులు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు టీఆర్ ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థిగా స్రవంతి పేరు ఖరారు కావడంతో ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు పార్టీలో చేరే అవకా శముందని టీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. ఇప్పటికే రంగంలో మండల ఇన్చార్జీలు ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి ఇద్దరేసి చొప్పున ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు ఇన్‌చార్జీలుగా బాధ్య తలు అప్పగించారు. ఎమ్మెల్సీ, ఉమ్మడి నల్ల గొండ జిల్లా టీఆర్ఎస్ ఇన్చార్జి తక్కళ్లపల్లి రవీందర్రావు పార్టీ యంత్రాంగాన్ని సమ న్వయం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తు న్నారు. ఇన్చార్జీలు గ్రామాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల బలాబలాలు, సామాజికవర్గాల వారీ గా ఓటర్ల వివరాలు, గ్రామ రాజకీయాలను ప్రభావితం చేసే వ్యక్తులు తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి క్రోడీకరిస్తున్నారు. క్షేత్ర స్థాయి నుంచి అందుతున్న నివేదికల ఆధారంగా పార్టీ నేతల నడుమ విభేదాలు సరిదిద్దడం, ఇతర పార్టీల నుంచి చేరికలకు ప్రయత్నించడం వంటి వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. త్వరలో 90 యూనిట్లు.. ముఖ్య నేతలందరికీ బాధ్యతలు తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలు ముగిసిన తర్వాత మునుగోడును 90 యూని ట్లుగా విభజించి రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కీలక నేతలను ఇన్‌చార్జీలుగా రంగంలోకి దించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్ప టికే ఏ యూనిట్‌కు ఎవరు ఇన్చార్జిగా వ్యవ హరిస్తారో పేర్కొంటూ జాబితాను రూపొందించారు. 70 మంది ఎమ్మెల్యేలు, మరో 20 మంది ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు యూనిట్ ఇన్‌చార్జీలుగా వ్యవహ రిస్తారు. ఇలావుండగా గత నెల 20న మును గోడు నియోజకవర్గ కేంద్రంలో కేసీఆర్ బహి రంగ సభ నిర్వహించిన టీఆర్ఎస్.. ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడిన తర్వాత చండూ రులో సభ నిర్వహించాలని నిర్ణయించింది. అభ్యర్థిగా కూసుకుంట్ల ఖాయం? బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు కాగా, టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని పలువురు నేతలు వ్యతిరేకిస్తుండటంతో.. అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించడంలో ఆలస్యం జరుగుతోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వంటి నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయగా, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో పాటు స్థానికంగా మరికొందరు నేతలు కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే కూసుకుంట్ల అభ్యర్థిత్వం ఖాయమైనట్టేనని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదీ చదవండి: ‘గులాబీ’ బాస్‌కు తలనొప్పిగా మారిన ‘డాక్టర్’! -
తెలంగాణలో భారీ మార్పులొస్తాయి: సునీల్‌బన్సల్
మునుగోడు: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో భారీ మార్పులు జరగనున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ బన్సల్ అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న కుటుంబ పాలనను అంతమొందించి బీజేపీ పాలన తీసుకొస్తామన్నారు. త్వరలో జరిగే మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అనుచిత నిర్ణయాల వల్ల అప్పులపాలైన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీని ఉపఎన్నికల ప్రచారంలో ప్రజలకు వివరిస్తామన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలు ధర్మయుద్ధం వైపు ఎలా నడిచారో మునుగోడులో కూడా అదే తరహాలో నడుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో బీజేపీ జాతీయ నాయకుడు వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు. -
అటు బుజ్జగింపులు.. ఇటు బాధ్యతలు!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్.. అదే దూకుడుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో.. టికెట్ ఆశించిన ముగ్గురు నాయకులను బుజ్జగించే పనిలో పడింది. వారికి ప్రచార బాధ్యతలనూ అప్పగించింది. మునుగోడు టికెట్ ఆశించిన చల్లమల్ల కృష్ణారెడ్డి, స్రవంతిలతో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి శనివారం తన నివాసంలో భేటీ అయి చర్చించారు. మరో ఇద్దరు నేతలు పల్లె రవికుమార్, పున్నా కైలాశ్ నేతలతో ఫోన్లో మాట్లాడారు. పార్టీ అభ్యర్థి స్రవంతి గెలుపు కోసం అంతా పనిచేయాలని.. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఇస్తామని బుజ్జగించారు. రేవంత్ విజ్ఞప్తి పట్ల ముగ్గురు నేతలు సానుకూలంగా స్పందించారని, స్రవంతి అభ్యర్థిత్వానికి మద్దతిస్తూ, కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. గాంధీ భవన్‌లోనూ కీలక భేటీ శుక్రవారం స్రవంతి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ.. శనివారం సాయంత్రం గాంధీభవన్‌లో కీలక భేటీ నిర్వహించింది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో పాటు ముఖ్య నేతలు బోసురాజు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, చెరుకు సుధాకర్, అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్, మహేశ్‌కుమార్‌గౌడ్, దామోదర రాజనర్సింహ, సంపత్ కుమార్, బలరాం నాయక్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ఎన్నిక ప్రచార కార్యాచరణపై చర్చించిన టీపీసీసీ నేతలు.. మండలాల వారీగా ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ఇప్పటికే మండలానికి ఇద్దరు రాష్ట్ర నేతలను ఇన్చార్జులుగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. మండలానికో ముఖ్య ఇన్చార్జిని నియమించింది. ఇప్పటికే ఉన్న నేతలు వీరికి సహాయకులుగా ఉంటారని పేర్కొంది. ఈ ఇన్చార్జుల జాబితాలో రేవంత్‌తోపాటు ఉత్తమ్, భట్టి, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, వి.హనుమంతరావు, దామోదర రాజనర్సింహ, షబ్బీర్‌అలీ ఉన్నారు. ఇక నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ప్రచార బాధ్యతలను టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులకు అప్పగించారు. నియోజకవర్గంలోని 300 పోలింగ్ బూత్‌లకు గాను 150 మందిని (ప్రతి రెండు బూత్‌లకు ఒకరిని), ప్రతి పది బూత్‌లకు ఒకరిని ఇన్చార్జులుగా నియమించాలని నిర్ణయించారు. ఈ నెల 18 నుంచి పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాలని.. మునుగోడులో క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చారు. ఇదీ చదవండి: అచేతనావస్థలో ఆ రెండు పార్టీలు -
అచేతనావస్థలో ఆ రెండు పార్టీలు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించుకోలేని అచేతనావస్థలో టీఆర్ఎస్, బీజేపీలున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వ్యా ఖ్యానించారు. ఆయా పార్టీల నేతలపై నమ్మకం లేని కార ణంగానే అభ్యర్థులపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతిని గెలిపించేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వమంతా సమష్టిగా పనిచేస్తుందన్నారు. శనివారం గాంధీభవన్‌లో ముఖ్య నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బోసురాజు, అంజన్‌కు మార్, బలరాంనాయక్, మల్లు రవి, దామోదర్‌రెడ్డి, చెరుకు సుధాకర్‌తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మునుగోడుకు టీఆర్ఎస్, బీజేపీ చేసిన మోసాన్ని అక్కడి ప్రజలకు వివరిస్తామని చెప్పారు. 10వేల ఎకరాల పోడు భూములకు ధరణిలో పట్టాలు రద్దు చేసిన టీఆర్ఎస్ అరాచకాలు మునుగోడులో అన్నీ ఇన్నీ కావని, ఆ పార్టీని ఉరేసినా తప్పులేదని అన్నారు. ఇప్పుడు ఒక్కదెబ్బకు రెండు పిట్టల్ని కొట్టే అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చిందని, ఇక్కడ కాంగ్రెస్‌ను గెలిపించే అవకాశం వచ్చిందన్నా రు. కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు ఆత్మ ప్రబోధానుసారం ఓట్లు వేసి స్రవంతిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాగేవాళ్ల దగ్గరికే వెళ్లను.. తాగుడు వ్యాపారం చేస్తానా? లిక్కర్ స్కాంలో తనకూ సంబంధం ఉందని బీజేపీ చేస్తున్నది చిల్లర ప్రచారమని రేవంత్ అన్నారు. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు రాజగోపాల్‌రెడ్డి వ్యవహరిస్తు న్నారని చెప్పారు. తాగేవాళ్ల దగ్గరికే తాను వెళ్లనని, అలాంటిది తాగుడు వ్యాపారం చేస్తానా అని ప్రశ్నించారు. తాను డైరెక్టర్‌గా ఎప్పుడో రాజీనామా చేసిన ఆ కంపెనీని మూసే సిన 13 ఏళ్ల తర్వాత పనికి మాలిన మాటలు మాట్లాడు తున్నారని అన్నారు. సూదిని సృజన్‌రెడ్డి తనకు బంధువని, అంతమాత్రాన వారు చేసే వ్యాపారాల్లో భాగస్వామ్యం ఉంటుందా అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ సొంత అన్న దమ్ములని, వారే రెండు పార్టీల్లో ఉండి, ఎవరి వ్యాపారాలు వారు చేసుకుంటున్నప్పుడు తనకు, తన చినమామ కొడు కు సృజన్‌రెడ్డికి ఏం సంబంధముంటుందన్నారు. ఒకవేళ తనకు ఏ కుంభకోణంలోనైనా ఈసుమంత భాగమున్నా ఏ సంస్థతోనైనా దర్యాప్తు జరిపించుకోవచ్చని రేవంత్ సవాల్ చేశారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్ మాట్లాడుతూ.. స్రవంతి గెలుపు కోసం కాంగ్రెస్ నేతలంతా పనిచేయాలని, తామంతా కలిసికట్టుగా ముందుకెళతామని చెప్పారు. ఇక్కడ ఏడవలేకపోతున్నారు.. రాష్ట్రంలో ఏడవలేకపోతున్న కేసీఆర్ దేశంలో రాజకీయం చేస్తానని చెప్పడం ఏదో సామెత చెప్పి నట్లుగా ఉందని రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కలు స్తున్న జాతీయ నేతలంతా యూపీఏతో ఉన్నవారేనని, వారిని కలవడం ద్వారా కాంగ్రెస్‌ను బలహీనపరిచి బీజేపీని బలోపేతం చేయాలన్నదే కేసీఆర్ ఎజెండా అని చెప్పారు. ఎన్డీయేలో ఉన్న ఏ మిత్రపక్ష పార్టీతో కేసీఆర్ చర్చలు జరిపి వారిని బీజేపీ నుంచి దూరం చేశారో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిద్దాం: బీజేపీ -
‘మునుగోడు’ ఉప ఎన్నిక సమన్వయానికి కమిటీ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక సమన్వయానికి ప్రత్యేకంగా కమిటీ వేయాలని బీజేపీ నిర్ణయించింది. పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో చర్చించిన తర్వాత కమిటీని నియమించనున్నారు. ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని మంగళవారం జరిగిన పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో తీర్మానించారు. అలాగే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. అందులో భాగంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో 15న చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయం నుంచి అసెంబ్లీ ఎదుటనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. 17న విమోచన దినోత్సవంతో పాటు, ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ రోజు నుంచి వచ్చేనెల 2న మహాత్మాగాంధీ జయంతి దాకా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. కాగా 16 లోక్‌సభ నియోజకవర్గాలకు నియమించిన కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు, జిల్లా పార్టీ ఇన్చార్జిలతో బుధవారం సంజయ్ ఇతర ముఖ్యనేతలు భేటీ కావాలని నిర్ణయించారు. ఇదీ చదవండి: దేశ రాజకీయాల పేరిట కేసీఆర్ కొత్త డ్రామాలు: బండి సంజయ్ -
మునుగోడు ఉప ఎన్నిక.. మరో జిల్లాపై ప్రభావం చూపనుందా?
ఒక జిల్లాలో ఉప ఎన్నిక జరుగుతుంటే.. మరో జిల్లాలో ప్రభావం ఉంటుందా? ఇప్పుడలాంటి పరిస్థితే ఉందంటున్నారు టీఆర్ఎస్ వర్గాలు. బీజేపీని ఓడించే లక్ష్యంతో మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చింది సీపీఐ. ఆ మేరకు మునుగోడు సభకు సీపీఐ నేతలు హాజరయ్యారు. దీంతో ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, వైరా శాసనసభ్యులకు, వచ్చే ఎన్నికల్లో అక్కడ సీట్లు ఆశిస్తున్న నేతలకు బెంగ మొదలైంది. ఇవే సమీకరణాలు వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడ ఉంటే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో వామపక్షాలకు పట్టుంది. ఇక్కడ గెలుపోటములు నిర్ణయించగల స్థాయిలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు బలం ఉంది. వారికి సొంతంగా గెలిచే శక్తి లేకపోయినా...ఎవరినో ఒకరిని ఓడించడానికి సహాయపడగలరు. మునుగోడులో పొత్తు విజయవంతమైతే...వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సీపీఐ, టిఆర్ఎస్ మధ్య పొత్తు పొడిస్తే ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, వైరా సీట్లను సీపీఐ అడిగే అవకాశం ఉంది. ఇప్పటికే కొత్తగూడెం సీటు పొత్తుల్లో భాగంగా సీపీఐకి వెళ్లుతుందన్న ప్రచారం కొంతకాలంగా జిల్లాలో సాగుతోంది. దీంతో కొత్తగూడెం, వైరా టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లోనే కాకుండా ఆశావహుల్లో సైతం గుబులు మొదలైంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు వచ్చే ఎన్నికల్లో కూడా టికెట్ తనకే వస్తుందన్న దీమాతో ఉంటున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు సైతం వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం టికెట్ తనకే వస్తుందని తన అనుచరులతో చెప్పుకుంటున్నారు. దీంతో ఇద్దరిలో టికెట్ ఎవరికి వస్తుందా అన్న చర్చ టీఆర్ఎస్ శ్రేణుల్లో నడుస్తోంది. అటు వైరా నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ టికెట్ పై ఆశలు పెట్టుకోగా..మాజీ ఎమ్మెల్యేలు మదన్ లాల్, బానోత్ చంద్రావతి కూడ టికెట్ కోసం ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు... రెండు నియోజకవర్గాల్లో సిటింగులు, ఆశావహులు మునుగోడు దెబ్బకు కుదేలవుతున్నారు. సీపీఐ కారణంగా తమకు నష్టం జరిగే అవకాశం కనిపిస్తోందని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో గనుక నిజంగా సీపీఐతో పొత్తు కుదిరితే తమ పరిస్థితేంగాను అంటూ కంగారు పడుతున్నారు. ఇప్పటికైతే సీపీఐ మాత్రమే గులాబీ పార్టీతో టచ్‌లో ఉంది. సీపీఎం కూడా ఇదే దారిలోకి వస్తే మరికొన్ని సీట్లకు కూడా ప్రమాదం ముంచుకొస్తుందనే ఆందోళన టీఆర్ఎస్ శ్రేణుల్లో, నాయకుల్లో కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలనాటికి టీఆర్ఎస్తో వామపక్షాల పొత్తుల అంశం ఎటువంటి ప్రభావం చూపిస్తుందన్న టెన్షన్ మాత్రం ఆ రెండు నియోజకవర్గాల గులాబీ నేతల్లో కనిపిస్తోంది. చివరి నిమిషంలో పొత్తుల అంశం టిఆర్ఎస్లో ఎటువంటి అసంతృప్తి రాజేస్తుందో చూడాలి. -
మునుగోడు ఉప ఎన్నిక జనవరిలో అయితే బెటర్!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ఇప్పటికిప్పుడు కాకుండా జనవరిలో జరిగితే పార్టీకి మరింత ప్రయోజనమని బీజేపీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ముఖ్య నేతలు ఈ అభిప్రాయంతో ఉన్నట్టు పార్టీవర్గాల సమాచారం. హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు ముగిసిన తర్వాత మునుగోడు ఉప ఎన్నిక నిర్వహిస్తే ఫలితం ఉంటుందని, అక్కడి గెలుపు ఇక్కడ విజయావకాశాలను మెరుగుపరుస్తుందని వీరు భావిస్తున్నట్లు పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు. అదే సమయంలో జాతీయ నాయకత్వంలోని కొందరు నేతలు ఈ ఎన్నిక ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తేనే మంచిదనే ఆలోచనతో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, పార్టీపరంగా చక్కదిద్దాల్సిన అంశాలు, ఈ ఎన్నిక ఆలస్యంగా జరగడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి అధినాయకత్వానికి తెలియజేస్తే మంచిదనే ఆలోచనలో రాష్ట్ర నేతలు ఉన్నారు. ఉప ఎన్నిక నిర్వహణకు వచ్చే ఫిబ్రవరి వరకు సమయముండటాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోరాలని భావిస్తున్నారు. పరిస్థితులన్నీ చక్కదిద్దుకునేలా.. మునుగోడు ఉప ఎన్నిక పురస్కరించుకుని పార్టీపరంగా బీజేపీకున్న సమన్వయ లోపాలు, లోటుపాట్లు, ఇతర సమస్యలను అధిగమించేందుకు ప్రాధాన్యతనివ్వాలని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అవసరమైన కార్యాచరణను వెంటనే చేపట్టాలనే ఆలోచనతో ఉన్నారు. అదే సమయంలో పార్టీకి అనుకూల వాతావరణం తీసుకొచ్చేందుకు, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి వివిధ వర్గాల మద్దతు కూడగట్టి కచ్చితంగా గెలిచేలా చేసేందుకు కూడా మరికొంత సమయం అవసరమని అంచనా వేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా మారనున్న ఈ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు అత్యంత ఆవశ్యకం కావడంతో అన్ని విధాలుగా సిద్ధమైన తర్వాతే ఎన్నిక జరిగితే బావుంటుందనేది నేతల ఆలోచనగా ఉంది. ఇదీ చదవండి: కేడర్‌ను కదిలించేలా ‘భారత్ జోడో యాత్ర’.. టీపీసీసీ ముమ్మర కసరత్తు -
మునుగోడు ఎన్నిక: వాళ్లంతా బిజీబిజీ.. రూ.25 లక్షల వరకు ప్యాకేజీ!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు వస్తున్నాయంటే సర్వేలు నిర్వహించడం ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా సర్వేలు నిర్వహించి పార్టీల బలాబలాలు అంచనా వేసి చెబుతుంటాయి. మరికొన్ని సందర్భాల్లో పార్టీలు, వ్యక్తులు కూడా సర్వేలు జరిపిస్తుంటారు. తమతో పాటు ప్రత్యర్థుల బలాబలాలు తెలుసుకునేందుకు, ఓటర్ల నాడిని పసిగట్టేందుకు ఈ విధమైన సర్వేలు నిర్వహిస్తుంటారు. ప్రత్యేకంగా నియమించుకున్న సిబ్బందితో ఈ విధమైన సర్వేలు జరిపిస్తుంటారు. సర్వేల ఫలితాలను బట్టి, వ్యూహాలను మార్చడం, అవసరమైన కార్యాచరణ చేపట్టడం వంటి చర్యలు పార్టీలు చేపడ తాయి. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక తెరపైకి రావడంతో.. పదుల సంఖ్యలో సంస్థలు, యూట్యూబ్ చానళ్లు సర్వేలు, ఒపీనియన్ పోల్స్‌లో నిమగ్నమయ్యాయి. సంస్థను బట్టి ప్యాకేజీ... ప్రస్తుతం మార్కెట్లో పదుల సంఖ్యలో సర్వే సంస్థలున్నా యి. వీటిల్లో కొన్ని మునుగోడులో రంగంలోకి దిగాయి. పార్టీలు, అభ్యర్థుల బలాలను అంచనా వేసే పనిలో ఉన్నా యి. ఈ సర్వేలు పూర్తయిన తర్వాత ఆయా సంస్థలు సదరు పార్టీకి లేదా అభ్య ర్థికి సర్వేల్లో వ్యక్తమైన అభిప్రాయాలను క్రోడీకరించి వివరాలను నివేదిక రూపంలో సమర్పిస్తాయి. ఇందుకు గాను ఒక్కో సర్వే సంస్థ తమకున్న విశ్వసనీయత ను బట్టి సంబంధిత పార్టీ, అభ్యర్థుల నుంచి ప్యాకేజీ తీసు కుంటున్నాయి. మూడు, నాలుగు ఎన్నికల్లో పనిచేయడంతో పాటు ఆయా ఎన్నికల్లో సర్వే సంస్థ అంచనాలు నిజమైన పక్షంలో సదరు సర్వే సంస్థకు విశ్వసనీయత పెరుగుతుంది. రూ.5 లక్షల నుంచి మొదలు... రాష్ట్రంలో ఉన్న ఓ ఎనిమిది సర్వే సంస్థలు మునుగోడు ఎన్నికల్లో పనిచేస్తున్నాయి. వీటిలో నాలుగు సంస్థలు బీజేపీకి పనిచేస్తుండగా, ఒకటి కాంగ్రెస్‌కు, మరో మూడు టీఆర్ఎస్కు పనిచేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సంస్థలు మునుగోడులోని అన్ని వర్గాలు, అన్ని వయస్సుల వారి నుంచి కులాలు, మతాల వారీగా అభిప్రాయాలను తీసుకుంటున్నాయి. మునుగోడులో 2.18 లక్షల మంది ఓటర్లున్నారు. సర్వే సంస్థలు ఇందులో 1 శాతం లేదా 2 శాతం జనాభాను శాంపిల్ కింద తీసుకొని అభిప్రాయాలను సేకరిస్తాయి. ప్రజలను గుచ్చిగుచ్చి లోతుగా ప్రశ్నించడం ద్వారా వారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసేట్టుగా చేస్తారు. వారు వెల్లడించిన అంశాల మేరకు నివేదికలు తయారు చేసి క్లయింట్లకు అందజేస్తారు. ఇందుకు ఒక్కో సంస్థ రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ప్యాకేజీ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. పని మొదలెట్టిన 6 చానళ్లు.. మునుగోడులో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏయే సమస్యలున్నాయి, ఏయే అభ్యర్థి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఏ పార్టీకి అనుకూల వాతావరణం ఉందన్న అంశాలను పలు యూట్యూబ్ చానెళ్లు అభిప్రాయ సేకరణ పేరుతో సర్వేలు చేస్తున్నాయి. ఇలా ప్రధానంగా 6 చానళ్లు మునుగోడులో పనిచేస్తున్నాయని తెలిసింది. ఆయా చానళ్ల వారు వివిధ సమస్యలపై స్థానికులతో మాట్లాడింపజేస్తున్నారు. వారి అభిప్రాయాలను రికార్డు చేస్తున్నారు. ప్రతి మండలం నుంచి కనీసం 50 మందితో మాట్లాడి మొత్తంగా 350 మంది ఒపీనియన్ పోల్‌ను తమ తమ క్లయింట్లకు అందజేస్తున్నాయి ఒక్కో యూట్యూబ్ చానల్ వారికున్న విశ్వసనీయతతో పాటు వారికున్న సబ్స్క్రైబర్ల సంఖ్యను బట్టి ప్యాకేజీ తీసుకుంటున్నాయి. చానెళ్లు తక్కువలో తక్కువ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ప్యాకేజీగా స్వీకరిస్తున్నట్టు తెలిసింది. రేటింగ్.. విశ్వసనీయతకోసం.. చానళ్లు, సర్వే సంస్థలు కాకుండా కొన్ని సంస్థలు కేవలం తమ విశ్వసనీయతను పెంపొందించుకునేందుకు, రేటింగ్ కోసం మునుగోడులో పనిచేస్తున్నాయి. ఏ పార్టీకి సంబంధం లేకుండా, అభ్యర్థికి వత్తాసు పలకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనిద్వారా సబ్స్క్రిప్షన్ పెంచుకోవడంతో పాటు భవిష్యత్‌లో పార్టీలు తమను సంప్రదించే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఈ విధంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. -
Munugodu: కసరత్తు పెంచిన టీఆర్ఎస్.. 88 మంది ఎమ్మెల్యేలు ఇక్కడే
సాక్షి, నల్లగొండ : మునుగోడులో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ భారీ వ్యూహం అనుసరించబోతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 88 ఎమ్మెల్యేలకు మునుగోడులో బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లో శనివారం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో మునుగోడు నియోజకవర్గంలోని 176 గ్రామాల్లో రెండు ఊర్లకు ఒకరు చొప్పున 88 మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దించాలని నిర్ణయించింది. గ్రామాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించి ఆ జాబితాను జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డికి త్వరలోనే అందజేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గానికి వెళ్లే ప్రతి ఎమ్మెల్యే తన వెంట 15 మంది కరడుకట్టిన పార్టీ కార్యకర్తలను వెంటబెట్టుకొని గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ నేతలతో మమేకమై పనిచేసేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబరు 17న జాతీయ సమైక్యతా దినం నిర్వహణతోపాటు వజ్రోత్సవ కార్యక్రమాల తర్వాత వారంతా పూర్తిస్థాయిలో మకాం వేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు నిర్వహించిన అన్ని సర్వేల్లోనూ తమకే పరిస్థితి అనుకూలంగా ఉందని పేర్కొన్న సీఎం.. ఎట్టి పరిస్థితుల్లోనూ మునుగోడులో గెలిచి తీరాలని స్పష్టం చేసినట్లు సమాచారం. ఉప ఎన్నిక నేపథ్యంలో... రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల మందికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటంతో నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి కొంత మేలు జరుగుతుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మునుగోడు నియోజకవర్గంలోనూ 3 వేల మందికి ప్రయోజనం కలుగనుంది. మరోవైపు ప్రతి నియోజకవర్గంలో దళితబందు 100 కుటుంబాలకు ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం మరో 500 కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో మునుగోడులో 600 దళిత కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. పోడు భూములపైనా కదలిక వచ్చింది. ప్రతి జిల్లాలో మంత్రుల నేతృత్వంలో సమన్వయ సమావేశాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపూర్ మండలంలో పోడు భూముల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
4 రోజుల పాటు హైదరాబాద్‌లో తరుణ్ ఛుగ్ మకాం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ శనివారం నుంచి 4 రోజుల పాటు హైదరాబాద్‌లో మకాం వేయనున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక ఖరారుతో పాటు పార్టీపరంగా చేపడుతున్న కార్యక్ర మాలు, సాధిస్తున్న ఫలితాలపై శనివారం నుంచి వరుసగా ఆయన ఉమ్మడి జిల్లాల సమీక్షా సమావేశాలను నిర్వహించనున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన ‘ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ’ని ప్రకటిస్తారు. ఈ కమిటీ కింద పనిచేసే సమన్వయ కమిటీకి జాతీయ కార్యవర్గసభ్యుడు జి.వివేక్‌ను చైర్మన్‌గా, గంగిడి మనో హర్‌రెడ్డిని కన్వీనర్‌గా నియమించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనితో పాటు మొత్తం 22 కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఇంతవరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు విడతల పాదయాత్ర, ఒక విడత బైక్‌ర్యాలీ, ఇతర కార్యక్రమాలను తరుణ్ ఛుగ్ సమీక్షిస్తారు. -
లోక్‌సభ స్థానాల్లో రాజకీయ వేడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరుస పర్యటనలతో కేంద్ర మంత్రులు రాజకీయ దుమారం రేపుతున్నారు. ‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జహీరాబాద్ లోక్‌సభ పరిధిలో పర్యటన చేపట్టారు. గురువారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆమె ఘాటైన విమర్శలు చేయడం తెలిసిందే. ఇక శుక్రవారం బీర్కూర్‌లో జిల్లా కలెక్టర్‌ను రేషన్ బియ్యంపై నిలదీయడం చర్చనీయాంశమ య్యింది. ఈ పథకం కింద కిలో బియ్యానికి రూ.35 వరకు ఖర్చవుతుంటే, కేంద్రం 28 చెల్లిస్తున్న విషయాన్ని వెల్లడించడంతో పాటు రేషన్ షాపుల్లో మోదీ చిత్రపటాలు పెట్టాలంటూ ఆదేశించడం టీఆర్ఎస్ ఆగ్రహానికి కారణమైంది. గతంలో పర్యటించిన కేంద్ర మంత్రులు కూడా రాష్ట్ర సర్కార్, గులాబీ పార్టీపై విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రాష్ట్ర మంత్రులు స్పందించడం తెలిసిందే. 14 ఎంపీ స్థానాల్లో..పక్కా వ్యూహంతో వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలోని 14 ఎంపీ స్థానాల్లో (బీజేపీ సిట్టింగ్ స్థానాలు సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ మినహాయించి) పర్యటించి కేంద్రం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను గురించి ప్రజలకు ప్రత్యక్షంగా తెలియజేయా లని బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశించింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహించాలని సూచించింది. విభిన్న పథకాల ద్వారా వివిధ వర్గాల పేదలకు కేంద్రం నుంచి అందుతున్న సహాయం, ఆయా సంక్షేమ, అభివృద్ధి పథకాలకు కేంద్ర వాటాగా అందజేస్తున్న నిధులు కేంద్రమంత్రుల ద్వారా వివరిస్తే దాని ప్రభావం ప్రజల్లో ఎక్కువగా ఉంటుందనే భావనతో బీజేపీ ఈ వ్యూహాన్ని ఎంచుకుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రులు జిల్లాల్లో మకాం వేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసేదాకా.. లోక్‌సభ ఎన్నికలు ముగిసేదాకా ఈ పర్యట నలు కొనసాగనున్నాయి. ఇప్పటికే హైదరా బాద్ లోక్‌సభ పరిధిలో జ్యోతిరాధిత్య సింధియా, ఆదిలాబాద్ (ఎస్టీ) స్థానంలో పురు షోత్తం రూపాలా, మల్కాజిగిరిలో ప్రహ్లాద్ జోషి, నల్లగొండలో కైలాష్‌చౌదరి, భువనగి రిలో దేవీసింగ్, ఖమ్మంలో బీఎల్ వర్మ పర్యటించారు. తాజాగా నిర్మలా సీతారామన్ జహీరాబాద్ పర్యటన చేపట్టారు. ఇక మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే శుక్రవారం నుంచి పర్యటన ప్రారంభించారు. ఈ నెల 4,5 తేదీల్లో మహబూబా బాద్ ఎంపీ స్థానంలో కేంద్రమంత్రి బీఎల్ వర్మ పర్యటించనున్నారు. ఇప్పటికే పర్యటించినా మళ్లీ నెలా, రెండునెలల వ్యవధిలో మరోసారి తమకు కేటాయించిన లోక్‌సభ సీట్ల పరిధిలో పర్యటిస్తారు. -
మునుగోడు వరకే టీఆర్ఎస్కు మద్దతు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల వరకే టీఆర్ఎస్కు తమ మద్దతు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టంచేశారు. బీజేపీని ఓడించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కాషాయ పార్టీ గెలిస్తే కమ్యూనిస్టులు సహా ఇతర రాజకీయ పార్టీల మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు. తమ్మినేని గురువారం విలేకరులతో మాట్లాడారు. మునుగోడు సభ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసలు విషయాన్ని ప్రకటించారనీ, రాజ గోపాల్‌రెడ్డి గెలిచిన నెలరోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొడతామన్నా రని గుర్తు చేశారు. పూర్తి మెజార్టీతో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐలను ప్రయోగించి ఎమ్మెల్యేలను లొంగదీసుకుంటారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని తమ్మినేని చెప్పారు. అయితే మునుగోడులో ప్రస్తుతం రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయే అవకాశముందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి వచ్చాక ఆ పార్టీ శ్రేణుల్లో కొంత కదలిక వచ్చిందని అభిప్రాయపడ్డారు. మునుగోడులో మద్దతివ్వాలంటూ కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు తమను సంప్రదించారని, బీజేపీని ఓడించే పార్టీకే మద్దతిస్తామని చెప్పామన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ కేసీఆర్ ఏకం చేస్తున్నారని అన్నారు. అదే తమకు సీపీఐకి తేడా...: ‘మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించే వ్యూహంపై సీపీఐని సంప్రదించాం. పోటీచేసి ఓట్లు చీల్చి బీజేపీ గెలిచేందుకు మేలు చేయడం కంటే ఓడించాలన్న నిర్ణయానికి వచ్చాం. అయితే ఈ ఎన్నికలతోపాటు సాధారణ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామంటూ సీపీఐ ప్రకటించింది. మేము మునుగోడు ఉప ఎన్నికల వరకే టీఆర్ ఎస్‌కు మద్దతు ఇస్తాం. సాధారణ ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు, బీజేపీ ప్రమాదం వంటి అంశాలను బట్టి అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. అదే సీపీఐకి, మాకు తేడా’ అని తమ్మినేని చెప్పారు. -
‘మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రభుత్వం పడిపోతుంది’
సాక్షి,సంస్థాన్ నారాయణపురం: ‘మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం నెలరోజుల్లో పడిపోతుంది.. సీఎం కేసీఆర్ కుటుంబం దాచుకున్న డబ్బులు బయటకు వస్తాయి’.. అని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో ఆదివారం నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూసుకుంట్ల, గీసుకుంట్ల కాకుండా దమ్ముంటే సీఎం కేసీఆర్ మునుగోడులో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ఉపఎన్నిక తనది కాదని, మునుగోడు ప్రజల ఎన్నిక.. అని ఆయన వ్యాఖ్యానించారు. ఇంటికి తులం బంగారం ఇచ్చినా టీఆర్ఎస్ గెలవదని ఆయన స్పష్టం చేశారు. -
Munugodu: అన్నీ పార్టీల నేతలంతా ఇక్కడే.. దూసుకుపోతున్న రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, నల్లగొండ: ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీలు మునుగోడులో మకాం వేశాయి. ఆయా పార్టీల నాయకులు స్థానికంగా ఉన్న నివాస గృహాలను అద్దెకు తీసుకొని అక్కడి నుంచే నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజీపీ బహిరంగ సభకు ముందే స్థా«నికంగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచే కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ ఇటీవల ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పార్టీ కార్యాలయం ప్రత్యేకంగా ఉన్నా.. దీనిని అదనంగా తీసుకున్నారు. మంత్రి జగదీష్‌రెడ్డి నియోజకవర్గంలో నిత్యం పర్యటిస్తూ చేరికలను వేగంగా కొనసాగిస్తున్నారు. పెరుగుతున్న ఉప ఎన్నికల వేడి మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు సవాలుగా మారింది. అమిత్‌షా సభ జరిగిన మరుసటి రోజు నుంచే రాజగోపాల్‌రెడ్డి రోజుకో మండలంలో తిరుగుతూ బీజేపీలోకి చేరికల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మండలాల వారీగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డే కావడంతో ఆయనే స్వయంగా పర్యవేక్షణ చేస్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో మంత్రి జగదీష్‌రెడ్డి అన్నీ తానై నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని వెంట పెట్టుకొని సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేటాయించిన మండలాల్లోని గ్రామాల్లో రెండు రోజులకు ఒకసారి సమావేశాలు జరిగేలా చూస్తున్నారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని దిశా నిర్దేశం చేస్తున్నారు. పోటాపోటీగా సమావేశాలు.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మంత్రి జగదీష్‌రెడ్డి పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో సమావేశం నిర్వహించారు. దీనికి స్థానిక నేతలు భారీ ఎత్తున హాజరయ్యారు. ఆయన నేతృత్వంలో పెద్ద ఎత్తున చేరికలు కొనసాగాయి. దీంతో అధికార పార్టీ అప్రమత్తమైంది. ఆగమేఘాల మీద మునుగోడులోనే శనివారం సాయంత్రం స్థానిక నేతలు, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో మంత్రి జగదీష్‌రెడ్డి గ్రామాల వారీగా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఏ గ్రామంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు.. మహిళలు, పురుషులు ఎంత మంది? అందులో కులాల వారీ ఓట్లు ఎన్ని.. ఎక్కువ ఓట్లు ఏ గ్రామంలో ఏ కులం వారికి ఉన్నాయి.. వాటిల్లో టీఆర్ఎస్కు ఎన్ని ఓట్లు వస్తాయి.. మిగతా ఓట్లు టీఆర్ఎస్కు రావాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్న అంశాలపై సమీక్షించారు. -
‘మునుగోడు’పై కసరత్తు ముమ్మరం చేసిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమని ముందుగానే అంచనాకు వచ్చిన టీఆర్ఎస్.. ఇతర పార్టీల కంటే ముందే క్షేత్రస్థాయి కార్యాచరణ మొదలుపెట్టింది. ఇందుకోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు ఇతర జిల్లాల ఎమ్మెల్యేలనూ రంగంలోకి దింపుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు కార్యాచరణ రూపొందించారు. ఒక్కో మండలానికి ఒక్కో ఎమ్మెల్యేను ఇన్చార్జిగా నియమించాలని.. గ్రామాలను కీలక నేతలకు అప్పగించాలని నిర్ణయించారు. ఇన్చార్జులుగా నియమితులయ్యే వారు.. తమకు అప్పగించిన చోటే ఉండి ప్రచారాన్ని, పనులను పర్యవేక్షించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఎవరెవరికి ఏయే మండలం, గ్రామం బాధ్యతలు అప్పగించేదీ త్వరలో ఖరారు చేయనున్నారు. తర్వాత వారం పది రోజుల్లో సదరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఆయా మండలాలు, గ్రామాలకు వెళ్లి పార్టీ కేడర్‌తో మమేకమై పనిచేయనున్నారు. సభ నాటి నుంచే.. ఈనెల 20న మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభతోనే పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నం చేశారు. హైదరాబాద్ నుంచి వేల వాహనాలతో మునుగోడు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు సభ బాధ్యతలు అప్పగించారు. తర్వాత మునుగోడులో టీఆర్ఎస్ కార్యకలాపాల్లో కొంత స్తబ్ధత నెలకొన్నా.. మంత్రి జగదీశ్‌రెడ్డి మునుగోడులో పర్యటిస్తూ ఇతర పార్టీల నుంచి నేతల చేరికలపై దృష్టిపెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన కొందరు సర్పంచులు, ఎంపీటీసీలు, క్రియాశీల నేతలు మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ముఖ్యంగా ప్రజాదరణ ఉన్నవారిని చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చదవండి: Congress Party: కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ అసంతృప్త నేతలు దారికి.. మునుగోడులో టీఆర్ఎస్ అసంతృప్త కార్యకర్తలు, స్థానిక నేతలు మెల్లగా పార్టీలైన్లోకి వస్తున్నారు. చౌటుప్పల్ ఎంపీపీ వెంకట్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బుచ్చిరెడ్డి బీజేపీలో చేరగా.. ఇతర మండలాల నేతలు మాత్రం టీఆర్ఎస్లోనే కొనసాగుతామని ప్రకటించారు. 20న జరిగిన కేసీఆర్ సభ జన సమీకరణలోనూ వారు క్రియాశీలకంగా పనిచేశారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిగా పలువురి పేర్లు తెరపైకి వస్తున్నా.. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి అనుకూల పరిస్థితులు ఉన్నట్టు ఆ పార్టీవర్గాలు చెప్తున్నాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాకే పార్టీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. దసరాలోగా ఎన్నికల షెడ్యూల్ రావొచ్చని స్థానిక నేతలకు పార్టీ పెద్దల నుంచి సంకేతాలు అందినట్టు తెలిసింది. షెడ్యూల్ విడుదల కాగానే చండూరులో టీఆర్ఎస్ బహిరంగ సభ ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అందరికీ బాధ్యతలు పార్టీపరంగా మునుగోడు ఉప ఎన్నిక సన్నద్ధతను స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం కేసీఆర్.. పెద్ద సంఖ్యలో మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలను నియోజకవర్గంలో మోహరించడంపై దృష్టి సారించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకూ మండలాలు, గ్రామాల వారీగా బాధ్యతలు అప్పగించనున్నారు. ఆయా మండలాలు, గ్రామాల్లో సామాజికవర్గాల వారీగా ఓట్ల లెక్కలను, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. అందుకు తగినవారిని ఇన్చార్జులుగా నియమించనున్నారు. చదవండి: Telangana Politics: బీజేపీ ప్రచారానికి నితిన్, మిథాలి -
కేసీఆర్ పోటీ చేసినా గెలుస్తా: కోమటిరెడ్డి
సాక్షి ,మునుగోడు: మునుగోడు ఉపఎన్నికలో సీఎం కేసీఆర్ పోటీచేసినా విజయం తనదేనని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఉపఎన్నికలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. కేసీఆర్ నియంత పాలనను అంతమొందించేందుకే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరానన్నారు. శనివారం మునుగోడులో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కుటుంబసభ్యులు జైలుకు వెళ్లే రోజులు దగ్గరపడ్డాయని, ఇప్పటికే ఆయన కుమార్తె కవిత లిక్కర్ కేసులో దొరికిపోయారన్నారు. రూ.లక్ష కోట్లకు పైగా దోచుకున్న కేసీఆర్‌తో పాటు ఆయన కుమారుడు, అల్లుడిని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా త్వరలో జైలుకు పంపి తీరుతారని హెచ్చరించారు -
కాంగ్రెస్‌లో సీనియర్లు, పెద్దలు అంతా అక్కడే.. భీకర పోరు తప్పదా?
జిల్లాల విభజన తర్వాత నల్గొండలోకి ఆరు సెగ్మెంట్లు చేరాయి. కాంగ్రెస్‌లో సీనియర్లు, పెద్దలు అంతా ఈ జిల్లాలోనే ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ గెలుచుకున్న మూడింట్లో రెండు ఇందులోనే ఉన్నాయి. నకిరేకల్ ఎమ్మెల్యే కారెక్కగా, మునుగోడులో రాజగోపాలరెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు. ఇక ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య పోరు భీకరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో పెద్ద తలకాయలుగా భావించే కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాకు చెందినవారే. జిల్లా కేంద్ర నియోజకవర్గం నల్లగొండ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. మాజీ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాలుగుసార్లు గెలిచారు. కానీ గత ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. నల్లగొండ నుంచి మరోసారి అసెంబ్లీకి పోటీ చేస్తానని కొమటిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మరోసారి గెలిచేందుకు కంచర్ల ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా గెలిస్తే తన రాజకీయ భవిష్యత్తుకు తిరుగుండదని కంచర్ల భావిస్తున్నారు. గులాబీ పార్టీలో చాలా మంది నల్గొండ సీటు ఆశిస్తున్నా కంచర్లకు మాత్రమే మంత్రి జగదీష్‌రెడ్డి అండ దండలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగో స్థానంలో నిలిచిన పార్టీ ఈసారి గట్టి పోటీ ఇవ్వాలని తహతహలాడుతోంది. ఆ పార్టీ నుంచి కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డితో పాటు మాదగోని శ్రీనివాస్ గౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఈ ఇద్దరిని కాదని బలమైన ఆర్థిక పునాదులు ఉన్న ఓ వలస నేతను కూడా పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆ వలస నేతతో రాష్ట్ర నేతలు చర్చలు జరిపారని తెలుస్తోంది. మునుగోడు అసెంబ్లీ స్థానం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్‌సీట్‌గా మారింది. కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఉప ఎన్నికకు తెర తీసారు. ఇప్పటికే కాషాయ కండువా కప్పుకుని కయ్యానికి సిద్ధమయ్యారు రాజగోపాల్‌రెడ్డి. ఇప్పటికి రెండు ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీకి చుక్కలు చూపించింది కాషాయ సేన. ఇప్పుడు మునుగోడులో కూడా కాషాయ జెండా ఎగరేస్తామంటున్నారు ఆ పార్టీ నాయకులు. సిట్టింగ్‌సీటును కాపాడుకోవడానికి కాంగ్రెస్, హుజురాబాద్అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీఆర్ఎస్అప్పుడే వ్యూహాలు పన్నుతున్నాయి. తన సీటు తాను గెలుచుకుని బీజేపీకి బహుమతిగా ఇవ్వాలని రాజగోపాల్‌రెడ్డి పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ల నుంచి ఎవరి బరిలోకి దిగుతారన్నదే ప్రశ్నార్థకంగా మారింది. టీఆర్ఎస్లో మునుగోడు టిక్కెట్ ఆశిస్తున్న వారి సంఖ్య అరడజను దాటింది. ఇప్పుడు ఇదే ఆ పార్టీని కలవరపెడుతోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నారబోయిన రవి, కంచర్ల కృష్ణారెడ్డి, కర్నె ప్రభాకర్, కర్నాటి విద్యాసాగర్ కొత్తగా తెరపైకి వచ్చారు. వీరిలో కూసుకుంట్ల, గుత్తా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇద్దరిలో ఒకరికి టికెట్ వచ్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. మంత్రి జగదీష్‌రెడ్డి మాత్రం కూసుకుంట్ల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఆయనకు టిక్కెట్‌ఇస్తే తాము సహకరించబోమని 12 మంది నేతలు మంత్రి కేటీఆర్‌కి రాసిన లేఖ ఇప్పుడు గులాబీ పార్టీ నాయకత్వాన్ని కలవర పెడుతోంది. జిల్లాలో మిగిలిన ఏకైక స్థానంలో కాంగ్రెస్దాదాపు ఖాళీ అయింది. అందుకే ఇక్కడ పరువు నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. కాని రాష్ట్ర ముఖ్యనేతలు అనుసరిస్తున్న తీరుతో కాంగ్రెస్పరువు మిగిలేలా కనిపించడంలేదు. అనుచర వర్గం ఉన్న పాల్వాయి స్రవంతిని కాదని, చల్లమల్ల కృష్ణారెడ్డి అనే వ్యాపారిని రేవంత్‌రెడ్డి తెరపైకి తీసుకొచ్చారు. తాజాగా చెరుకు సుధాకర్పేరు కూడా వినిపిస్తోంది. ఇప్పుడు అదే కాంగ్రెస్‌లో గందరగోళానికి తెరలేపింది. టికెట్ తనకే అన్న ధీమాతో స్రవంతి వారం క్రితం జరిగిన సభకు కూడా భారీగా జనసమీకరణ చేశారు. టిక్కెట్రాకపోతే పాల్వాయి స్రవంతి ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేద్దామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నకిరేకల్ టీఆర్ఎస్లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన చిరుమర్తి టీఆర్ఎస్లో చేరడంతో, ఓటమి బాధతో ఉన్న వీరేశం వర్గానికి ఈ వ్యవహారం మింగుడు పడటంలేదు. దీంతో రెండువర్గాల వైరం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకుంది. ఈసారి తమకే టిక్కెట్వస్తుందని రెండు వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇద్దరిలో ఒక్కరికే టిక్కెట్వస్తుంది గనుక..భంగపడ్డ నేత కచ్చితంగా పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. చిరుమర్తి లింగయ్య కారు పార్టీలో చేరడంతో కాంగ్రెస్క్యాడర్ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడటంతో... అన్న వెంకటరెడ్డి పరిస్తితి కూడా డైలమాలో పడినట్లయింది. ఎన్నికల నాటికి కాంగ్రెస్‌లో ఎవరుంటారో, ఎవరు ఫిరాయిస్తారో అన్న విషయం గందరగోళంగా మారింది. ఇక బీజేపీకి కొంతవరకు క్యాడర్ ఉన్నా సరైన లీడర్లేకపోవడంతో అయోమయంగా తయారైంది. దీంతో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిని ఇక్కడ నుంచి బరిలో దింపాలని కమలం పార్టీ ప్లాన్చేస్తున్నట్లు తెలుస్తోంది. మిర్యాలగూడలో సీపీఎం, కాంగ్రెస్ దెబ్బతిని ప్రస్తుతం గులాబీ పార్టీ జెండా ఎగురుతోంది. అయితే కాంగ్రెస్కేడర్మాత్రం బలంగానే ఉంది. సిటింగ్‌ఎమ్మెల్యే ఉన్న అధికార పార్టీలో బయటపడిన వర్గపోరు ప్రకంపనలు సృష్టిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావు, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ మధ్య వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. తన కుమారుడిని రంగంలోకి దించాలనుకుంటున్న భాస్కరరావుకు భార్గవ్ తీరు ఆందోళన కలిగిస్తోందట. టిక్కెట్రేస్లో ఇద్దరూ తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు. ఇక కాంగ్రెస్‌నేతలు పార్టీని గాలికొదిలేసి గ్రూప్కలహాల్లో మునిగి తేలుతున్నారు. సీనియర్‌నేత జానారెడ్డి తన కుమారుడిని రంగంలోకి దించాలని భావస్తున్నారు. బత్తుల లక్ష్మారెడ్డి జానారెడ్డి తనయుడిని వ్యతిరేకిస్తూ...తనకే టిక్కెట్ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి ఇక్కడ సరైన నాయకుడే లేరు. నాగార్జున సాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటలా ఉండేది. కానీ గత ఎన్నికల్లో జానారెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో సైతం భంగపాటు తప్పలేదు. వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనేదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. మరోసారి జానారెడ్డి పోటీ చేస్తారా లేక ఆయన వారసుడు జైవీర్‌ను రంగంలోకి దించుతారా అనేది సస్పెన్స్‌గా ఉంది. మరోవైపు టీఆర్ఎస్లో గ్రూపుల గోల ఎక్కువైంది. ఎమ్మెల్యే నోముల భగత్‌కు ఎమ్మెల్సీ కోటిరెడ్డి మధ్య సఖ్యత లేదు. ఎమ్మెల్సీగా అవకాశం రాని తేరా చిన్నపరెడ్డి కూడా కాచుకుని ఉన్నారు. బీజేపీ వరుసగా పోటీ చేస్తున్నప్పటికీ కనీసం పోటీ ఇవ్వలేకపోతోంది. జిల్లాలో ఉన్న ఏకైక ఎస్టీ నియోజకవర్గం దేవరకొండ. ఒకప్పుడు కాంగ్రెస్, సీపీఐలకు కంచుకోటగా ఉండేది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్గెలిచినా..అధికార పార్టీలోను, కాంగ్రెస్‌లోను వర్గపోరు తీవ్రస్థాయిలో సాగుతోంది. బీజేపీ పరిస్థితి మాత్రం కేడర్లేదు నాయకులు లేరన్నట్లుగా తయారైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒకసారి కాంగ్రెస్ నుంచి మరోసారి టీఆర్ఎస్ నుంచి గెలిచిన రవీంద్రకుమార్ హ్యాట్రిక్సాధించాలనుకుంటున్నారు. కాని దేవేందర్నాయక్టీఆర్ఎస్ టిక్కెట్కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌లో పోటీ చేయడానికి చాంతాడంత లిస్ట్తయారైంది. పార్టీ టిక్కెట్రాకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగడానికి ఇద్దరు ముగ్గురు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. ఇక బీజేపీలో కూడా రెండు వర్గాలు టిక్కెట్కోసం పరస్పరం పోటీ పడుతున్నాయి. -
మునుగోడు ఉప ఎన్నిక: టికెట్ రెడ్డికా.. బీసీకా?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక అభ్యర్థిని ఖరారు చేసే అంశంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. బీసీ లేదా రెడ్డి సామాజికవర్గానికి చెందినవారిలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యుల్లో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. బీసీ వర్గాలకు టికెట్ కేటాయించే యోచనలో ఉన్న రాష్ట్ర పార్టీ పెద్దల వైఖరిలో కొంత మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. మునుగోడు అభ్యర్థి ఎంపిక కోసం గురువారం గాంధీభవన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న పాల్వాయి స్రవంతి, పల్లె రవి, పున్నా కైలాశ్‌నేత, చల్లమల్ల కృష్ణారెడ్డిలతో పీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నాయకుడు ఆర్.దామోదర్‌రెడ్డి ఆ నలుగురు ఆశావహులతో విడివిడిగా భేటీ అయ్యారు. మీరు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా? మళ్లీ ఎన్నికలకు చాలా తక్కువ సమయముంది, అయినా బరిలో ఉంటారా? బలం ఏంటి? బలహీనత ఏంటి? డబ్బులే ప్రాతిపదికగా ఎన్నికలు నడిస్తే ఏం చేస్తారు? రెండు ప్రభుత్వాలను ఎలా ఢీ కొడతారు? మీ ప్రణాళిక ఏంటి? అనే ప్రశ్నలను అడిగి వారి అభిప్రాయాలు తీసుకున్నట్టు తెలిసింది. ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తాం భేటీ అనంతరం ఆశావహులు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తమ అభిప్రాయాలను పార్టీ నాయకత్వానికి చెప్పామని, తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌తో ఫోన్లో మాట్లాడిన రేవంత్‌రెడ్డి గాంధీభవన్ నుంచి నేరుగా పుణే వెళ్లిపోయారు. భట్టి, దామోదర్‌రెడ్డి ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లి మాణిక్యంతో భేటీ అయ్యారు. ఆ తర్వాత సాయంత్రం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. మునుగోడు అభ్యర్థి విషయంలో ఆయన అభిప్రాయం తెలుసుకోవడంతోపాటు ఈ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. వెంకట్‌రెడ్డి నివాసం నుంచి నేరుగా ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లిన భట్టి అక్కడ మాణిక్యం ఠాగూర్‌తో సమావేశమయ్యారు. అక్కడి నుంచి రేవంత్, మధుయాష్కీ, కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో మాట్లాడి మూడు పేర్లతో కూడిన జాబితాను ఏఐసీసీకి పంపినట్టు సమాచారం. ఈ జాబితాలో ఒక పేరును పార్టీ అధిష్టానం ఆమోదించి అధికారికంగా ప్రకటించనుంది. -
మునుగుడా? తేలుడా?
మునుగోడులో కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పెద్ద సభను నిర్వహిస్తే, ఆ మరుసటి రోజు బీజేపీ కూడా పెద్ద సభ జరిపింది. మునుగోడులో కాంగ్రెస్ పక్షాన ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సందర్భంగా స్వయంగా అమిత్ షా హాజరు కావడం... ఈ ఉప ఎన్నికకు ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం అవుతోంది. ఎన్నిక ప్రకటన రాకముందే కేసీఆర్ సభ పెట్టడం కూడా దీనికి మరో ఉదాహరణ. ఇక కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలు, లక్ష మంది కాళ్లకు మొక్కడం వంటి కార్యక్రమాల ద్వారా తన పట్టు నిలబెట్టుకోవాలని విశ్వయత్నం చేస్తోంది. దీనిని పక్కనబెడితే కేసీఆర్, అమిత్ షా పోటీపోటీ ప్రసంగాలు ప్రజలకు ఏ సందేశాలు ఇచ్చాయో తెలుసుకోవడం ఆసక్తికరం. కేసీఆర్ ఎక్కువగా జాతీయ రాజకీయాలు, దేశంలో ప్రగతిశీల శక్తులు ఐక్యం కావాల్సిన అవసరం, వ్యవసాయ మోటార్లకు మీటర్లు వంటి అంశా లపై దృష్టి పెట్టారు. అమిత్ షా పూర్తిగా తెలంగాణ అంశాలకు, కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను ప్రస్తావించడానికి పరిమితం అయ్యారు. బీజేపీని గెలిపిస్తే తెలంగాణ ఆగమవుతుందని కేసీఆర్ హెచ్చరించారు. అమిత్ షా తన ప్రసంగంలో రాజగోపాలరెడ్డి గెలిస్తే కేసీఆర్ ప్రభుత్వం మాయం అవుతుందన్నారు. అంటే వచ్చే ఎన్నిక లలో ఓడిస్తామనా, ఇంకేదైనా చేస్తామనా? కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అయిందని షా ఆరోపించారు కానీ అదెలా జరిగిందో చెప్పలేదు. పైగా పార్లమెంటులో ఈ ప్రాజెక్టుపై ఆరోప ణలు లేవని చెప్పినా, మునుగోడు ఉప ఎన్నికలో మాత్రం అవినీతి అంటూ విమర్శలు కురిపించారు. బీజేపీకి ఓటు వేస్తే మోటార్లకు మీటర్లే అని కేసీఆర్ చెప్పడం ఒక విధంగా బలహీనత. రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ భరిస్తున్నప్పుడు మీటర్లు పెడితే వచ్చే నష్టం ఏమిటి? కాకపోతే కేంద్రంపై ఆయన ఆరోపణ చేశారు. నిజానికి దీనిని ప్రతిపాదించిన కేంద్రం ఇప్పటికే వెనక్కి తగ్గింది. మోదీ సర్కారు ఈ అంశంలో ఓట్ల రాజకీయానికి భయపడి మీటర్లు పెట్టాలని తాము చెప్పడం లేదని పేర్కొంది. అమిత్ షా ఈ మీటర్ల వివాదంపై బహిరంగ సభలో చెప్పలేదు గానీ, రైతు నేతల భేటీలో వివరణ ఇచ్చారు. రైతుల పొలాల వద్ద కాకుండా విద్యుత్ సబ్ స్టేషన్ల దగ్గర వీటిని అమర్చాలని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇతర బీజేపీ నేతలు మాత్రం దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో కూడా ఇదే మాట టీఆర్ఎస్ చెప్పిందనీ, అయినా ప్రజలు బీజేపీకి పట్టం కట్టారనీ అంటున్నారు. ఏడాదిలోనే ఎన్నికలు ఉండగా ఈ ఉప ఎన్నిక ఎందుకని ఆయన ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పలు ఉప ఎన్నికలకు కారణమైన టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు? ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మారదలిస్తే పదవికి రాజీనామా చేయడం మంచి సంప్రదాయమే. దానిని రాజగోపాలరెడ్డి కూడా పాటించారు. ఈ ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తే భవిష్యత్తు తెలంగాణ రాజకీయం మారిపోతుందనీ, బీజేపీ ముఖ్యమంత్రి వస్తారనీ అమిత్ షా అన్నారు. కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ అధికారాన్ని ఎలా సాధి స్తుందన్నది ప్రశ్న. రాజగోపాలరెడ్డి గెలిస్తే ఏకనాథ్ షిండేలను బీజేపీ తయారు చేస్తుందా అని కేసీఆర్ ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులను బీజేపీ ప్రోత్సహిస్తుందనీ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందనీ కేసీఆర్ హెచ్చరించారు. ఈ విషయంలో రెండు పార్టీలకూ పెద్ద తేడా ఉందని చెప్పజాలం. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో ఎలా విలీనం చేసుకున్నారన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించి, వారితో రాజీనామాలు చేయించి బీజేపీ అధి కారాన్ని కైవసం చేసుకుంది. రాజ్యసభలో నలుగురు టీడీపీ ఎంపీలను విలీనం చేసుకుంది. అందువల్ల టీఆర్ఎస్, బీజేపీ రెండింటికీ ఈ అంశం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పక తప్పదు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్లలో బీజేపీ ఒక్క మంచి పని అయినా చేసిందా అని కేసీఆర్ ప్రశ్నించడం కూడా రాజ కీయంలో భాగమే. మరి అలాంటి ప్రభుత్వానికి ఆయా సందర్భాలలో టీఆర్ఎస్ మద్దతు ఎలా ఇచ్చిందని అడిగితే సమాధానం దొరకదు. బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలను కేసీఆర్ మూడు తోకలతో పోల్చారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటివాటితో తనకు పడని పార్టీలను బీజేపీ భయ పెట్టాలని చూస్తోందనీ, కానీ తాను నిజాయితీగా ఉన్నందున తనను ఎవరూ ఏమీ చేయలేరనీ ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మాటలు ఆయన గట్టిగానే చెబుతున్నా, ఏదో ఒక మూల కేంద్రంపై ఉన్న అను మానాలే ఆయనతో ఈ మాటలు అనిపిస్తున్నట్లుగా ఉంది. దానికి తగినట్లుగానే కేసీఆర్ కుమార్తె కవితపై బీజేపీ ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్‌ను ఆరోపించింది. కవిత ఖండించినా, తర్వాత రోజుల్లో ఏమి అవు తుందో చెప్పలేం. నల్గొండ ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించామనీ, ఎవరు అడ్డుపడ్డా రైతు బంధు ఆగదనీ చెప్పడం ద్వారా కేసీఆర్ ప్రజలను ఆకట్టుకునే యత్నం చేశారు. హుజూరాబాద్ అనుభవం రీత్యా ముందస్తు జాగ్రత్త పడుతున్నట్లుగా ఉంది. దానికి తోడు రాజ గోపాలరెడ్డి బలమైన అభ్యర్థి అవుతారు కనుక కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా ఉంది. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారన్న హామీ ఏమైందని అమిత్ షా అడిగారు. భవిష్యత్తులో కేటీఆర్‌ను చేస్తారు తప్ప, దళితుడిని చేయరని చెప్పారు. దేశంలో పెట్రోల్ ధర లను కేంద్రం తగ్గిస్తే తెలంగాణలో ఎందుకు తగ్గించలేదని అడిగారు. బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న విమోచన దినం నిర్వహిస్తామనీ, మజ్లిస్‌కు టీఆర్ఎస్ భయపడుతోందనీ చెప్పడం ద్వారా అటు తెలంగాణ సెంటి మెంట్‌నూ, ఇటు హిందూ సెంటి మెంట్‌నూ షా ఒకేసారి ప్రయోగించారని అనుకోవచ్చు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే– కేసీఆర్, అమిత్ షా ఇద్దరూ కూడా కాంగ్రెస్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే వృథా అవుతుందని కేసీఆర్ అంటే, అమిత్ షా కాంగ్రెస్ ఊసే తేలేదు. మరో వైపు ఈ పరిణామాలను గమనిస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే లక్షమందికి పాదాభివందనం కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. మరి కాళ్లు మొక్కడం ద్వారా విజయం సాధించగలుగుతారా అన్నది చెప్పలేం. వామపక్షా లైన సీపీఐ, సీపీఎంలను కేసీఆర్ కలుపుకొని వెళ్లడం కొత్త పరిణామం. జాతీయ రాజకీయాలతో పాటు తెలంగాణలో ఆ పార్టీలకు అక్కడ క్కడ ఉన్న బలాన్ని ఆయన వినియోగించదలిచారు. బీజేపీకి వ్యతి రేకంగా ఉండాలని భావించే వామపక్షాలు ఇందుకు సిద్ధం కావడంలో ఆశ్చర్యం లేదు. కాకపోతే ఈ ఎనిమిదేళ్లలో ఎన్నడైనా సీపీఐ, సీపీఎం నేతలు ప్రగతి భవన్‌కు వెళ్లి ఆయా సమస్యలపై మాట్లాడగలిగారా? అంటూ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పలు ప్రశ్నలు సంధించారు. అవి వామపక్షాలకు ఇబ్బంది కలిగించేవే అయినా, దేశ రాజకీయాలు, తెలంగాణలో పరిస్థితుల రీత్యా, వారికి ఇంతకన్నా గత్యంతరం ఉండకపోవచ్చు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలోనే టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని సీపీఐ తలపెట్టినప్పటికీ, ఆ సమయంలో ఆర్టీసీ సమ్మె అడ్డం వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ భవిష్యత్తులో కూడా ఈ పార్టీలతో స్నేహం కొనసాగుతుందని ప్రకటించి తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణలకు తెరదీశారు. పత్రికాధిపతి రామోజీరావు, ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ అయ్యారు. తెలంగాణ ఎన్నికలలో సహకరించాలని ఆయన వీరిని కోరి ఉండవచ్చు. మొత్తం మీద ఈ కబాడి ఆటలో ఎవరు లైన్ టచ్ చేసి విజేతలు అవుతారో, ఎవరు కాళ్లు గుంజివేస్తారో అన్న ఉత్కంఠభరిత సన్నివేశాలకు మునుగోడు వేదిక కాబోతోంది. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు తెలంగాణలో మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక తేదీ ప్రకటన వెలువడడానికి ముందుగానే రాజకీయ వేడి పెరిగిపోయింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ యథాశక్తి ఈ వేడి పెంచడంలో పోటీ పడుతున్నాయి. అందులోనూ టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరో వైపు రంగంలోకి దిగడంతో ఎవరు విజేత అవుతారన్న ఉత్కంఠ ఏర్పడింది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే – కేసీఆర్, అమిత్ షా ఇద్దరూ కూడా కాంగ్రెస్‌ను పట్టించుకోలేదు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే వృథా అవుతుందని కేసీఆర్ అంటే, కాంగ్రెస్ ఊసే అమిత్ షా తేలేదు. ఈ పరిణామాలను గమనిస్తున్న కాంగ్రెస్ లక్షమందికి పాదాభివందనం కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించింది. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
మునుగోడుకు దూరం
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఝలక్ ఇచ్చారు. ఎన్ని పరిణామాలు చోటు చేసుకున్నా ఎప్పుడూ పార్టీ అధిష్టానానికి సంపూర్ణ విధేయత ప్రకటించే ఆయన ఓరకంగా ధిక్కార స్వరాన్నే వినిపించారు. మునుగోడు ఉప ఎన్నికపై సోమవారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో జరిగిన కీలక భేటీకి ఆయన గైర్హాజరు అయ్యారు. ఆ తర్వాత ఎందుకు హాజరు కాలేదో వివరిస్తూ సోనియాగాంధీకి లేఖ పంపారు. తాను మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లలేనని అందులో స్పష్టం చేశారు. పార్టీ లోని కొందరు తనను అవమానపరుస్తున్నారని, పార్టీ కోసం మూడు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్న తనలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వైఖరి తనకు మనస్తాపాన్ని కలిగించిదని పేర్కొన్నారు. కాగా సోనియాగాంధీకి కోమటిరెడ్డి రెండు లేఖలు పంపారని, ఒక లేఖ బహిర్గతం కాగా మరో లేఖను గోప్యంగా ఉంచారని తెలుస్తోంది. బహిర్గతమైన లేఖలో రేవంత్ వైఖరి కారణంగా పార్టీకి జరుగుతున్న నష్టాన్ని వెంకట్‌రెడ్డి కూలంకషంగా వివరించారని సమాచారం. పార్టీలో పరిణామాలన్నీ అర్థమయ్యే విధంగా రాసిన ఈ లేఖలో.. తెలంగాణ పార్టీలో జరగాల్సిన అంతర్గత మార్పుల గురించి కూడా ఆయన డిమాండ్ చేసినట్టు తెలిసింది. బహిర్గతమైన లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. పార్టీకి విధేయుడిగానే కొనసాగుతాను కానీ.. ‘ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించడం గౌరవంగా భావిస్తాను. అయితే కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ఈ మధ్య కాలంలో పార్టీలోని కొన్ని వర్గాలు కావాలని నన్ను అవమానించడంతో పాటు పనికట్టుకుని దాడులు చేస్తున్నాయి. గత మూడు దశాబ్దాలకు పైగా నిబద్ధత, నిజాయితీతో పనిచేస్తున్న నన్ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడడం మనస్తాపాన్ని కలిగిస్తోంది. పార్టీలో కొత్తగా చేరినప్పటికీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించారు. నేను పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఆయనకు పూర్తి సహకారం అందించడంతో పాటు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాను. కానీ రేవంత్‌రెడ్డితో పాటు ఆయన ముఖ్య అనుచరులు నాపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. రోజురోజుకూ నాపై పెరుగుతున్న ఈ దాడులు.. పార్టీపై తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి. గతంలో ఆయన నాకు చెప్పిన క్షమాపణలను కూడా నేను అంగీకరించాను. కానీ మళ్లీ నాతో పాటు ఇతర సీనియర్లను అవమానించడం వారికి పరిపాటిగా మారింది. నన్ను హోంగార్డులుతో పోల్చిన ఆయన తనకు తాను డైరెక్ట్ రిక్రూటీ ఐపీఎస్‌గా చెప్పుకున్నారు. నేను పార్టీ విధేయుడిగానే కొనసాగుతాను. కానీ నా పట్ల అవలంబిస్తున్న అవమానపూరిత వైఖరి కారణంగా నేను మునుగోడు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని భావిస్తున్నాను. ఈ సమావేశానికి రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను.’ అని వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. వాళ్లతోనే ప్రచారం చేయించుకోండి: కోమటిరెడ్డి ఢిల్లీలో భేటీకి గైర్హాజరై హైదరాబాద్ వచ్చిన కోమటిరెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. మూడు దశాబ్దాలకు పైగా పార్టీ కోసం పనిచేస్తున్న తనలాంటి వాళ్లను గుర్తించకుండా నాలుగు పార్టీలు మారిన వాళ్లకు పదవులు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, తెలంగాణ కోసం కొట్లాడిన తనలాంటి వారిని పట్టించుకోకుండా హడావుడి చేసే వాళ్లను గుర్తిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ పార్టీ విషయంలో మాణిక్యం ఠాగూర్ దొంగనాటకాలాడుతున్నారని, పార్టీ కార్యకర్తలకు అవమానం జరుగుతోందని చెప్పారు. ఇలాంటి వైఖరి కారణంగానే తెలంగాణలో పార్టీ సర్వనాశనం అయిందని, దానికి ప్రతిఫలంగానే ఇదంతా జరుగుతోందని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌లో ప్రచారం చేసిన వాళ్లతోనే మునుగోడులోనూ ప్రచారం చేయించుకోవాలని అన్నారు. మాణిక్యం ఠాగూర్‌ను మార్చాలన్నారు. ఆయన స్థానంలో కమల్‌నాథ్ లాంటి నేతలను రాష్ట్ర పార్టీ ఇన్చార్జులుగా పంపాలనే అభిప్రాయాన్ని కోమటిరెడ్డి వ్యక్తం చేశారు. మరోసారి పార్టీ నేతలందరి అభిప్రాయాలను తీసుకుని కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమిస్తేనే తెలంగాణలో పార్టీ బతుకుతుందని స్పష్టం చేశారు. -
మునుగోడు ప్రచారానికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బైబై! సోనియాకు లేఖ
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకుల మధ్య వివాదం, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం పార్టీ మారతారనే ఊహాగానాల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఐసీసీ నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరుకాకపోవటంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ‘రేవంత్ వల్లే తెలంగాణలో కాంగ్రెస్ నాశనమయ్యింది. ఆయనతో వేదిక పంచుకోలేకనే.. సమావేశానికి హాజరుకాలేదు. అనుచరులతో రేవంత్ అవమానకరంగా మాట్లాడిస్తున్నారు. మాకు ప్రాధాన్యత లేదు.. అందుకే మునుగోడు ప్రచారానికి వెళ్లను. మాణిక్కం ఠాగూర్‌ను తెలంగాణ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించాలి. ఆయన స్థానంలో కమల్‌నాథ్ లాంటి వాళ్లకు ఇన్‌ఛార్జ్‌గా ఇవ్వాలి. నేను పార్టీ మారే ప్రసక్తే లేదు.’ అని లేఖలో సోనియాకు ఫిర్యాదు చేశారు కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి. ఇదీ చదవండి: పొలిటికల్ హీట్..హాట్ సీట్‌గా ఖమ్మం.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్? -
అమిత్ షాపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆదివారం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీ రామారావు ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ప్రముఖ క్రికెటర్ తండ్రి’అంటూ అమిత్ షాతో పాటు బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘కేవలం తన ప్రతిభ ఆధారంగా అంచెలంచెలుగా ఎదిగి భారతీయ క్రికెట్ బోర్డ్ బీసీసీఐ కార్యదర్శి పదవిలో ఉన్న ఓ ‘ప్రముఖ క్రికెటర్ తండ్రి’ఈరోజు తెలంగాణకు వస్తున్నారు. ఓ సోదరుడు ఎంపీ, భార్య ఎమ్మెల్సీగా గతంలో పోటీ చేసిన నేపథ్యాన్ని కలిగిన ఓ పెద్దమనిషి తరపున ప్రచారం చేస్తారు. టీఆర్ఎస్ది కుటుంబ పాలన అంటూ ఉపన్యాసం దంచుతారు’అని అమిత్ షా, రాజగోపాల్‌రెడ్డి కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘బిల్కిస్ బానోపై అత్యాచార కేసు దోషులుగా ఉన్న సంస్కారి రేపిస్టులను మీ ప్రభుత్వం ఎందుకు విడుదల చేసిందో తెలంగాణ ప్రజలు మీ నుంచి వినేందుకు అత్యంత ఆసక్తితో ఉన్నారు. ఎర్రకోట బురుజుల నుంచి మీ ప్రధాని చేసిన బోధనలకు వ్యతిరేకంగా బలాత్కార్ సమర్థన జరుగుతోంది. పీఎం గారిని గుజరాత్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదా?’అని ప్రశ్నించారు. ‘ఆవిష్కరణలు, మౌలిక వసతులు, సుస్థిరాభివృద్ధిపై సమష్టిగా దృష్టి పెడితేనే దేశాభివృద్ధి సాధ్యం. కానీ దేశ నాయకత్వం విభజన ఎగతాళి స్వప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టడం వంటి చర్యలకు పూనుకుంటోంది. 1987లో భారత్ చైనా జీడీపీ ఒకే రకంగా ఉన్నా, ఇప్పుడు గణాంకాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి’అని కేటీఆర్ మరో ట్వీట్లో బీజేపీ పాలనపై మండిపడ్డారు. The father of an “Ace cricketer” who rose through the ranks & became BCCI Secretary (purely on merit) is visiting Telangana today He will campaign for a gentleman whose brother is an MP & whose wife was an MLC contestant And he will lecture & enlighten us on Parivarvad 👏🤦♂️ — KTR (@KTRTRS) August 21, 2022 -
ఈడీ, బోడీలను పెట్టుకో.. ఏం పీక్కుంటావో పీక్కో: సీఎం కేసీఆర్
సాక్షి, నల్గొండ: మునుగోడు ప్రజా దీవెన సభ వేదికగా సీఎం కేసీఆర్.. కేంద్రంలోని మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ఇది ప్రజాస్వామ్య దేశమని.. రాచరిక వ్యవస్థ కాదని అన్నారు. బీజేపీ వాళ్లకు ఎందుకింత అహంకారమని మండిపడ్డారు. బెంగాల్లో మమత సర్కార్‌ను పడగొడతానని ప్రధాని అంటున్నారని.. నిన్ను(మోదీ) నీ అహంకారమే పడగొడుతుందని విమర్శించారు. దేశం నుంచి బీజేపీని తరిమి కొడితేనే మనకు విముక్తి కలుగుతుందన్నారు. ‘ఈడీకి దొంగలు భయపడతారు.. నేను ఎందుకు భయపడతా.. ఈడీ వాళ్లు వస్తే వాళ్లే నాకు చాయ్ తాగించి పోతారు. ఈడీ, బోడీలను పెట్టుకో.. ఏం పీక్కుంటావో పీక్కో. ఎవరు యుద్ధం చేస్తారో వాళ్ల చేతిలోనే కత్తి పెట్టాలి. మీరు గోకినా గోకకపోయినా.. నేను గోకుతా. ఢిల్లీలో కరెంట్ లేదు, హైదరాబాద్‌లో ఉంటోంది. మీరు ఉద్ధరించింది ఏమిటి. అన్నింటిపై జీఎస్టీ వసూలు చేస్తూ.. బ్యాంకులు ముంచే వాళ్లకు పంచుతున్నారు. చదవండి: ‘ఏడాదిలో ఎన్నికలు.. ఎవరి కోసం రాజీనామా చేసినవ్ రాజగోపాల్ రెడ్డి’: సీఎం కేసీఆర్ మీకు చేత కాదు.. మేము చేస్తుంటే అడ్డుపడతారా. గ్యాస్ సిలిండర్ ధర ఎక్కడికి పోయింది చూసి ఓటేయండి. మాటలు విని మోసపోతే.. గోసపడతాం. అందరం కలిసి బీజేపీకి మీటర్ పెడదాం. దయచేసి ప్రలోభాలకు పోవద్దు.. ఇది పార్టీల ఎన్నిక కాదు. చండూరులో మరోసభ పెట్టుకుందాం. కేసీఆర్ బతికున్నంత వరకు రైతుబంధు ఆగదు. మీటర్లు పెట్టనివ్వను. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. అది వేస్ట్ అయిపోతుంది. పాటుపడే వారికి ఓటు వేయాలి తప్ప పోటువేసేవాడికి కాదు’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాగా, మునుగోడు సభలో కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ కేసీఆర్ అభ్యర్థి ప్రస్తావనే తీసుకురాకుండా సభను ముగించారు. -
రైతులు తస్మాత్ జాగ్రత్త.. బీజేపీకి ఓటు పడితే బావి దగ్గర మీటర్ వస్తుంది: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడులో టీఆర్ఎస్ ప్రజాదీవెన సభకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. సభా వేదికపై పార్టీ జెండా ఆవిష్కరించారు. వేదికపై అమరవీరుల స్థుపానికి నివాళులు అర్పించారు. ప్రజాదీవెన సభకు సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్.. పార్టీ శ్రేణులతో కలిసి బస్సులో మునుగోడు వెళ్లారు. సీఎం వెళ్లే మార్గమంతా టీఆర్ఎస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో సందడిగా నెలకొంది. సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అమిత్‌షాను టార్గెట్ చేశారు. రేపు(ఆదివారం) జరిగే సభలో కృష్ణా జలాలపై అమిత్‌షా తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. ఎందుకు కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చడం లేదో అమిత్‌షా చెప్పాలని అన్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండగా.. రాజగోపాల్ రెడ్డి ఎవరి కోసం రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోతున్నాడని ప్రశ్నించారు. ఢిల్లీలో మా నీళ్ల సంగతేంటని రాజగోపాల్‌రెడ్డి ఎందుకు అడగరని నిలదీశారు. చదవండి: మునావర్ కామెడీ షో: ప్రోగ్రామ్ 5 గంటలకే ప్రారంభం.. నో సెల్ ఫోన్స్ కొట్లాట తెలంగాణకు, టీఆర్ఎస్కు కొత్తకాదని, మునుగోడుతోనే తమ పోరాటం ఆగిపోదని అన్నారు. మునుగోడు నుంచి ఢిల్లీదాకా తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. మునుగోడులో గోల్మాల్ ఉప ఎన్నిక వచ్చిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘ఎవరికోసం ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ బైపోల్ రావాల్సిన అవసరం ఏముంది. 8 ఏళ్ల పాలనలో ఏ వర్గానికి మేలు జరిగింది. బ్యాంకులు, రైళ్లు, రోడ్లు అన్నింటినీ కేంద్రం అమ్మేస్తోంది. ఇక రైతులు, భూములను కూడా మోదీ సర్కార్ అమ్మేస్తుందేమో. మాకు మద్దతు ఇచ్చిన సీపీఐకు ధన్యవాదాలు. మునుగోడు నుంచి ఢిల్లీ దాకా కామ్రేడ్లతో ఐక్యత కొనసాగించాలి. రైతులు తస్మాత్ జాగ్రత్త. మోదీ దోస్తులు సూట్ కేసులు పట్టుకొని రెడీగా ఉన్నారు. లక్షమందికి పైగా రైతులకు రైతుబంధు. రైతు బంధు ఎట్టిపరిస్థితిలోనూ ఆగదు. మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదు.. మన బతుకు ఎన్నిక. రైతులు కరెంట్ మీటర్లు పెట్టమంటే నేనుపెట్టలేదు. మీటర్లు పెట్టే మోదీ కావాలా.. మీటర్లు వద్దనే కేసీఆర్ కావాలా.. మునుగోడు చరిత్రలో ఎన్నడూ బీజేపీకి డిపాజిట్ రాలేదు. బీజేపీకి ఓటు పడిందంటే బావి దగ్గర మీటర్ వస్తుంది’ అని మునుగోడు సభలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. చదవండి: మల్లారెడ్డా మజాకా.. మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిండు -
కుటుంబపాలనకు చరమగీతం పాడాలి
సాక్షి, యాదాద్రి: మునుగోడు ఉపఎన్నిక ద్వారా రాష్ట్రంలో కుటుంబపాలనకు చరమగీతం పాడాలని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రజలను కోరారు. శుక్రవారం వరంగల్ వెళ్తూ మార్గమధ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరులోని బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాలను మార్చబోతోందన్నారు. తెలంగాణ ప్రజలకు భరోసా కల్పించడానికే ఈ నెల 21 మునుగోడులో అమిత్‌షా బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఒక్క సంవత్సరం ఓపిక పడితే రాష్ట్రంలో ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని పారదోలి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ముంచి సీఎం కేసీఆర్ చేసిన పాపాలను గోదావరి మాతా వెలుగులోకి తెచ్చిందన్నారు. కాగా, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా నియమితులైన డాక్టర్ కె.లక్ష్మణ్‌ను ఆ పార్టీ సీనియర్ నేత గూడూరు నారాయణరెడ్డి సన్మానించారు. -
బల ప్రదర్శనకు ‘ప్రజాదీవెన’!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన టీఆర్ఎస్ శనివారం అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభను విజయవంతం చేయడం ద్వారా టీఆర్ఎస్ బలాన్ని చూపించాలని భావిస్తోంది. హైదరాబాద్ నుంచి రెండు వేల కార్లు, ఇతర వాహనాలతో అతి భారీ ర్యాలీగా మును గోడు బహిరంగ సభకు వెళ్లేందుకు టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ హాజరవుతున్న ఈ సభను అత్యంత సవాల్‌గా తీసుకుని భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఇందుకోసం ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పదిరోజులుగా క్షేత్రస్థాయిలోనే ఉండి శ్రమిస్తున్నారు. అమిత్ షా సభకు ముందే.. మునుగోడులో ఆదివారం జరగనున్న బీజేపీ బహి రంగ సభకు అమిత్‌షా హాజరవుతుండటంతో ఒక రోజు ముందే భారీ బల ప్రదర్శనకు టీఆర్ఎస్ సిద్ధమైంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి మునుగోడుకు రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. ఆయన ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్ నుంచి బయలుదేరి మధ్యా హ్నం 2 గంటల సమయంలో మునుగోడుకు చేరు కుంటారు. ఈ కాన్వాయ్‌ను టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రెండు వేలకుపైగా కార్లతో అనుసరించనున్నారు. ఇందులో వెయ్యి వాహనాలు గ్రేటర్ హైదరాబాద్‌లోని నుంచి బయలుదేరుతాయి. మిగ తావి మార్గం వెంట ర్యాలీలో కలవనున్నాయి. ఈ మేరకు శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో ఏర్పాట్లను సమీక్షించారు. హైదరాబాద్ నలుమూలల నుంచి వచ్చే కార్లు, వాహనాలు మధ్యాహ్నం 12 గంటలకల్లా పెద్ద అంబర్‌పేటకు చేరుకుని, అక్కడి నుంచి ర్యాలీగా మునుగోడుకు వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. పలువురు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ర్యాలీలో మునుగోడు సభకు వెళ్లనున్నారు. ‘ప్రజా దీవెన’ సభగా పేరు మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం సమీపంలో జరగనున్న టీఆర్ఎస్ బహిరంగ సభకు ‘మునుగోడు ప్రజాదీవెన’ సభగా పేరుపెట్టారు. ‘చలో మునుగోడు’ పేరిట ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల స్టిక్కర్లతో ఉన్న వాహనాల్లో పార్టీ శ్రేణులు సభకు తరలనున్నాయి. మరోవైపు మార్గం వెంట, ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో జన సమీకరణకు ఏర్పాట్లు చేశారు. శనివారం సీఎం కేసీఆర్ సమక్షంలో పలువురు కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అభివృద్ధి.. సెంటిమెంట్.. మునుగోడు సభలో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతోపాటు.. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ వివక్ష, ఆర్థిక దిగ్బంధం ద్వారా ఇబ్బందిపెడుతున్న తీరును ఎండగట్టనున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఉద్యమ సమయంలో తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్ రాజీనామాలు చేస్తే.. ప్రస్తుతం బీజేపీ తెలంగాణను కబళించడం కోసం రాజీనామాలను అడ్డు పెట్టుకుంటోందంటూ విమర్శలు గుప్పించే అవకాశం ఉందని అంటున్నాయి. సభ వివరాలివీ.. ►మునుగోడు మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్ఎస్ ‘మునుగోడు ప్రజాదీవెన’ సభ ప్రారంభమవుతుంది. ►సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ నుంచి పెద్ద అంబర్పేట్, పోచంపల్లి ఎక్స్ రోడ్, చౌటుప్పల్, నారాయణపూర్, చల్మెడ మీదుగా మునుగోడుకు చేరుకుంటారు. మధ్యలో పార్టీ శ్రేణులు కలుస్తాయి. ►సుమారు లక్షన్నర మంది కూర్చునేలా 25 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ►వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ఆరు చోట్ల పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. -
ప్రతిష్టాత్మకంగా జన సమీకరణ
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక దిశగా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్న టీఆర్ఎస్... నియోజకవర్గ కేంద్రంలో శనివారం భారీ బహిరంగ సభ నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు హాజరవుతుండటంతో జనసమీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభ నిర్వహణ కోసం నియోజకవర్గంలోని మండలాలు, మున్సిపాలిటీలవారీగా ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత ఇప్పటికే బాధ్యతలు అప్పగించారు. టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు మునుగోడులో మకాం వేసి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ నల్లగొండ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు భారీ జనసమీకరణ కోసం కసరత్తు చేస్తున్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, క్రియాశీల నాయకులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించి గ్రామాలు, వార్డులవారీగా జనసమీకరణపై దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ సభ మర్నాడే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం మునుగోడులో బీజేపీ బహిరంగ సభకు హాజరవుతున్నారు. కాంగ్రెస్‌కు ఇటీవల రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితోపాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు ఈ సభ ద్వారానే బీజేపీలో చేరనున్న నేపథ్యంలో బీజేపీ సభను దృష్టిలో పెట్టుకొని జనసమీరణను టీఆర్ఎస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. టీఆర్ఎస్లోకి కొనసాగుతున్న చేరికలు మునుగోడు సభకు జనసమీకరణపై దృష్టి పెడుతూనే మరోవైపు కాంగ్రెస్ నుంచి చేరికలను టీఆర్ఎస్ ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతుదారులైన 20 మంది సర్పంచ్‌లు, ఆరుగురు ఎంపీటీసీలు టీఆర్ఎస్లో చేరారు. శనివారం మనుగోడు సభలో సీఎం సమక్షంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన కొందరు ముఖ్య నేతలు కూడా టీఆర్ఎస్లో చేరతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మునుగోడు సభ తర్వాత కేసీఆర్ టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు, కీలక నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశముంది. -
మునుగోడు ఎన్నిక జరిగే వరకూ వారిని ఇక్కడే ఫోకస్ చేయమందాం!
మునుగోడు ఎన్నిక జరిగే వరకూ సోనియాజీని, రాహుల్జీని, ప్రియాంకాజీని ఇక్కడే ఫోకస్ చేయమని అడుగుదాం! -
వేడెక్కిన మునుగోడు రాజకీయం.. అర్థరాత్రి హైడ్రామా
యాదాద్రి భువనగిరి: మునుగోడు రాజకీయం మరింత వేడెక్కింది. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు సిద్ధం కాగా, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్కు చెందిన ముఖ్య నేతలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. చౌటుప్పల్ టీఆర్ఎస్ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి సహా పలువురు నేతలు బీజేపీ అధిష్టానంతో ఇప్పటికే టచ్‌లో ఉన్నారు. త్వరలో బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు వెంకటరెడ్డి తెలిపారు. తనతో సహా పలువురు స్థానిక నేతలు బీజేపీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకోబోతున్నట్లు పేర్కొన్నారు. అర్థరాత్రి హైడ్రామా ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో తాడూరి నివాసం వద్ద సోమవారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. తాడూరి ఉండే నివాసానికి ఎస్వోటీ, సీసీఎస్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేందుకు యత్నించారు. భూవివాదానికి సంబంధించిన గతంలో నమోదైన కేసులను మరోసారి తెరపైకి తెచ్చి తాడూరిని అరెస్ట్ చేసే యత్నం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులతో తాడూరి వాగ్వాదానికి దిగారు. విచారణ నిమిత్తం అరెస్ట్ చేసేందుకు వచ్చామని అక్కడకు వచ్చిన పోలీసులు తెలపగా, అసలు ఎందుకు అరెస్ట్ చేసి విచారిస్తారని తాడూరి నిలదీశారు. అర్థరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీస్ లు ఎంపీపీ వెంకట్‌రెడ్డి ఇంటిని చుట్టూ ముట్టిన విషయం తెలిసి.. ఎంపీపీ ఇంటికి బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి , బీజేపీ నేతలు చేరుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావారణం ఏర్పడింది. తాడూరి అరెస్ట్‌ను అక్కడకు వచ్చిన బీజేపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. కాగా, తాడూరికి నోటీసులు ఇచ్చారు చౌటుప్పల్ పోలీసులు. వారు చౌటుప్పల్ పోలీసులు కాదు ఈ అంశానికి సంబంధించి తాడూరి స్పందించారు. ‘హైదరాబాదులో ఉంటున్న తన అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌కి అర్థరాత్రి చౌటుప్పల్ పోలీసులమని చెప్పి అరెస్ట్ చేసేందుకు కొందరు వచ్చారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. చౌటుప్పల్ పోలీసులు కాదు. నేను అందర్నీ గుర్తు పడతాను. నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నేను టీఆర్ఎస్ పార్టీ ఎంపీపీని నాతో పాటు కొద్ది మంది జెడ్పీటీసీలు ఎంపీపీలు మరికొంత మంది కార్యకర్తలు మేమందరం కలిసి మాట్లాడుకునే బీజేపీలోకి పోదామనే అనుకున్నాం. ఈ సమయంలోనే మా ఇంటికి ఎవరో వచ్చి బెదిరింపులకు గురి చేస్తున్నారు’ అని అన్నారు. -
సత్తా చాటేలా సభలు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక వాతావరణం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్న సమయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచుతోంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించడం ద్వారా సత్తా చాటాలని భావిస్తోంది. ఉద్యమ పార్టీకి భారీ సభల నిర్వహణ కొత్త కాకపోయినా మంగళవారం వికారాబాద్‌లో, 20న మునుగోడులో నిర్వహించే సభలను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పాదయాత్రల పేరిట ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఎస్పీ, వైఎస్సార్టీపీ వంటి పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ దాడిని దీటుగా తిప్పికొట్టేందుకు వికారాబాద్, మునుగోడు సభలను వేదిక చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. మీడియా సమావేశాల్లో తరచూ ప్రధాని మోదీ పాలన వైఫల్యాలు, బీజేపీ ఎజెండాను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడి చేస్తున్నా.. విపక్ష పార్టీలు క్షేత్ర స్థాయిలో కార్యకలాపాలను పెంచుతుండటంతో బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణను మొదలు పెట్టారు. జన సమీకరణపైనే దృష్టి.. వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభకు జన సమీకరణ బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభ ఏర్పాట్లను సమన్వయం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్ (వికారాబాద్), పైలట్ రోహిత్‌రెడ్డి (తాండూరు), పట్నం నరేందర్‌రెడ్డి (కొడంగల్), కాలే యాదయ్య (చేవెళ్ల), మహేశ్‌రెడ్డి (పరిగి) పూర్తిగా జన సమీకరణపై దృష్టి పెట్టారు. తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నడుమ విభేదాలు ఉన్నా రెండు వర్గాలు వేర్వేరుగా జనసమీకరణపై దృష్టి పెట్టాయి. వికారాబాద్ కలెక్టరేట్ సముదాయం, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం ప్రారంభించడంతో పాటు కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీకి సీఎం కేసీఆర్ మంగళవారం శంకుస్థాపన చేస్తారు. మునుగోడులో మరింత దూసుకుపోయేలా.. ఇతర పార్టీలతో పోలిస్తే మునుగోడు ఉప ఎన్నిక సన్నద్ధతలో ఒక అడుగు ముందున్న టీఆర్ఎస్ ఈనెల 20న భారీ బహిరంగ సభ ద్వారా మరింత దూసుకుపోయేందుకు సన్నాహలు చేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలకు మండలాలు, మున్సిపాలిటీల వారీగా జన సమీకరణ బాధ్యతలు అప్పగించింది. మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు బహిరంగ సభ ఏర్పాట్లను సమన్వయం చేస్తున్నారు. ఓ వైపు జనసమీకరణకు ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక ప్రజా ప్రతినిధులను పార్టీలో చేర్చుకోవడంపై మండల, మున్సిపల్ ఇన్చార్జిలు దృష్టి సారించారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మందికి పైగా సర్పంచ్‌లు, పలువురు ముఖ్య కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి మరిన్ని చేరికలు ఉంటాయని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. 21న మునుగోడులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బహిరంగ సభ నేపథ్యంలో, 20న జరిగే బహిరంగ సభ వేదికపై బీజేపీని ఇరకాటంలోకి నెట్టే రీతిలో కేసీఆర్ ప్రసంగం ఉంటుందని పార్టీ కీలక నేత ఒకరు వెల్లడించారు. సభ తర్వాతే అభ్యర్థి ప్రకటన! ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడక ముందే మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే వివిధ సర్వేల సంస్థల ద్వారా ఆశావహులు, వారి బలాబలాలపై ఆయన ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. టికెట్ ఆశిస్తున్న కంచర్ల కృష్ణారెడ్డికి అది సాధ్యం కాదనే విషయాన్ని స్పష్టం చేయడంతో పాటు, పార్టీ పరంగా గుర్తింపునిస్తామని రెండురోజుల క్రితం స్వయంగా హామీ ఇచ్చారు. గతంలో పార్టీలో చురుగ్గా పనిచేసిన వేనేపల్లి వెంకటేశ్వర్రావుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయడం ద్వారా అధినేత కేసీఆర్ రాజకీయ సమీకరణపై లోతుగా దృష్టి సారించారు. ఇక్కడ సభ ముగిసిన తర్వాత అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
‘మునుగోడు’కు మండలాల వారీ ఇన్చార్జులు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జులను నియమించింది. ఒక్కో మండలానికి ఇద్దరు కీలక నేతలను కేటాయించింది. ఆయా మండలాలను పర్యవేక్షించే బాధ్యతలను వారికి అప్పగించనుంది. ఇటీవల గాంధీభవన్‌లో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు గాను మొత్తం 14 మందికి బాధ్యతలను అప్పగించనుంది. మునుగోడు ప్రచార కమిటీ కన్వీనర్ మధుయాష్కీగౌడ్ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఇంచార్జులుగా బాధ్యతలు తీసుకున్న నాయకులు పూర్తి స్థాయిలో ఆయా మండలాల్లోనే మకాం వేస్తారని, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి పూర్తయ్యేంతవరకు పర్యవేక్షిస్తారని తెలిపాయి. -
టీఆర్ఎస్, బీజేపీలకు ఓట్లడిగే హక్కు లేదు: రేవంత్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీలకు ఓట్లు అడిగే హక్కులేదని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఉపఎన్నిక వేదికగా ఆ రెండు పార్టీలు ప్రజలను మోసం చేసేందుకు మరోమారు కుటిల యత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న రేవంత్‌రెడ్డి ఆదివారం ఒక వీడియో విడుదల చేశారు. ఉప ఎన్నికలో ప్రజాసమస్యలపై మాట్లాడకుండా వ్యక్తిగత దూషణలు, వివాదాలు రాజేస్తూ రాజకీయలబ్ధి పొందేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. సాధారణ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా బీజేపీ నెరవేర్చలేదని, ప్రతి పౌరుడి అకౌంట్లో రూ.15 లక్షలు, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రజలను వంచించిందని విమర్శించారు. నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నియంత్రించి పేదలను ఆదుకోవాలన్న ఆలోచనే బీజేపీకి రాలేదని, అలాంటి పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. డబుల్‌బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం వంటి హామీలను హామీలుగానే మిగిల్చిన టీఆర్ఎస్కు కూడా ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఆ రెండు పార్టీలను ప్రశ్నించే హక్కు ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని పేర్కొన్నారు. కమ్యూనిస్టులు, కోదండరాంతో కలసి పోరాడుదామని, సమన్వయంతో ముందుకెళదామని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మునుగోడు ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి బీజేపీ, టీఆర్ఎస్లకు బుద్ధి చెపుదామని రేవంత్‌రెడ్డి ఆ వీడియోలో పిలుపునిచ్చారు. నిఖార్సైన కాంగ్రెసోడా... డిసైడ్ చేద్దాం రా! ట్విట్టర్ వేదికగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు మరో పిలుపునిచ్చారు. ‘మునుగోడు ఎజెండా ఏంటి? చర్చనా.. రచ్చనా? బీజేపీ, టీఆర్ఎస్ వైఫల్యాలా.. వ్యక్తిగత పంచాయితీలా? నిఖార్సైన కాంగ్రెసోడా... డిసైడ్ చేద్దాం రా... మన మునుగోడు... మన కాంగ్రెస్’అంటూ ఆయన తన ట్విట్టర్లో ఆదివారం పోస్ట్ చేశారు. రేవంత్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎనమల రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితం.. వీరుల త్యాగం.. నేటి మన స్వాతంత్య్రమని పేర్కొన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, సాంకేతిక, సేవ రంగాల్లో దేశాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత కాంగ్రెస్ పాలకులదని తెలిపారు. బీజేపీ పాలకులు దేశాన్ని కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్నారని విమర్శించారు. -
అలా అయితే నేను రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా: ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఫామ్ హౌస్, ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి వరాలు కురిపిస్తారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. తనకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పడంపై వెంకటరెడ్డి స్పందించారు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పడం శుభపరిణామం అని వెంకటరెడ్డి పేర్కొన్నారు. అదే సమయంలో అద్దంకి దయాకర్ చిన్నపిల్లవాడని సెటైర్ వేశారు. అద్దంకి దయాకర్ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందంటే తాను కూడా రాజీనామా చేస్తానని కోమటరెడ్డి వెంకటరెడ్డి చమత్కరించారు. తనను సంప్రదించకుండా కాంగ్రెస్ పెద్దలు కమిటీ వేశారని, మునుగోడు వ్యవహారం వాళ్లే చూసుకుంటారని కాస్త అసహనం వ్యక్తం చేశారు. తాను అసలు మునుగోడు వైపు పోనే పోనని, మునుగోడులో ఎవరు గెలుస్తారో తనకు ఎట్లా తెలుస్తాది అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు వెంకటరెడ్డి. మీడియా వెళ్లి సర్వే చేసి మునుగోడులో ఎవరు గెలుస్తారో తనకు చెప్పాలన్నారు. మునుగోడు ఎన్నికలను సెమీఫైనల్‌గా అభివర్ణించారు. -
అభ్యర్థి ఎవరైనా కలిసి పని చేయండి: కృష్ణారెడ్డితో కేసీఆర్
హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు శరవేగంగా పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లో భారీ ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి పాలవడం, కాంగ్రెస్, బీజేపీలు ఉప ఎన్నికలో గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతుండటంతో కేసీఆర్ అప్రమత్తమయ్యారు. అయితే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ నియోజకవర్గానికి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులు బాహాటంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. దీంతో దిద్దుబాటు చర్యల కోసం మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు ఈ నెల 20న మునుగోడులో సీఎం కేసీఆర్ బహిరంగసభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. సభ జరిగే నాటికి పార్టీలోని అసంతృప్తిని తొలగించేందుకు కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. శుక్రవారం చౌటుప్పల్ మండలం ఆందోలు మైసమ్మగుడిలో జరిగిన టీఆర్ఎస్ అసమ్మతి నేతల భేటీ వెనుక ఆ నియోజకవర్గ నేత కంచర్ల కృష్ణారెడ్డి హస్తం ఉందనే ప్రచారం ఉన్న నేపథ్యంలో ఆయన శనివారం సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అభ్యర్థి ఎవరైనా గెలిపించండి! మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా గెలిపించుకుని రావాల్సిందేనని కేసీఆర్ పార్టీ టికెట్‌ను ఆశిస్తున్న కృష్ణారెడ్డికి స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రభాకర్‌రెడ్డి తీరుపై పార్టీ ముఖ్యనేతల్లో నెలకొన్న అభిప్రాయాలను, వారిని ఇబ్బంది పెట్టిన తీరును కృష్ణారెడ్డి కేసీఆర్‌కు వివరించినట్లు సమాచారం. కాగా, కృష్ణారెడ్డికి మునుగోడు టికెట్ ఖాయమనే ప్రచారానికి తెరవేస్తూ టికెట్ ఇవ్వడం సాధ్యంకాదనే విషయాన్ని సీఎం సున్నితంగా తెలియచేసినట్లు సమాచారం. అభ్యర్థి ఎవరైనా కలిసికట్టుగా పనిచేయాలని, పార్టీపరంగా గుర్తింపు ఉంటుందని హామీనిచ్చినట్లు తెలిసింది. కార్యకర్తల అభిప్రాయాలను పార్టీ గౌరవిస్తుందని, అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే కోణంలో పలు సర్వేలు జరుగుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించినట్లు సమాచారం. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అభ్యర్థి ప్రకటన ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలిసింది. మండలాలవారీగా పార్టీ ఇన్చార్జీల భేటీలు ఈ నెల 20న మునుగోడులో టీఆర్ఎస్ బహిరంగసభ నేపథ్యంలో కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. మండలాలు, మున్సిపాలిటీలవారీగా శనివారం టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో భేటీలకు శ్రీకారం చుట్టారు. ఉపఎన్నిక దిశగా పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంతోపాటు అభ్యర్థిపై వారి మనోగతం తెలుసుకోవడం, బహిరంగసభకు జనసమీకరణ తదితరాలు ఎజెండాగా ఈ భేటీలు జరుగుతున్నాయి. -
Munugode Bypoll: పోటీయా? మద్దతా?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్ని కలో బీజేపీ ఓటమే ప్రధాన లక్ష్యంగా సీపీఐ, సీపీఎం పార్టీలు ముందుకు సాగనున్నాయి. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచించాలని నిర్ణయించాయి. ఇప్పటికే వేర్వేరుగా పార్టీ కార్యకర్తలతో స్థానికంగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అయితే గతంలో అనేకసార్లు సీపీఐ అభ్యర్థులు మునుగోడు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అక్కడ ఆ పార్టీకి క్యాడర్, ఓటు బ్యాంకు ఉంది. సీపీఎం కూడా కొంతమేరకు ఓటు బ్యాంకు కలిగి ఉంది. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థిని పోటీకి దింపే విషయం కూడా సీపీఐ సమాలోచనలు చేస్తోంది. పోటీ చేస్తే గెలవగలమా? ఒకవేళ గెలవ లేని పరిస్థితి ఉంటే ఓట్ల చీలిక వల్ల బీజేపీకి ప్రయోజనం కలుగుతుందా? అనే కోణంలో మల్లగుల్లాలు పడుతోంది. పార్టీ క్యాడర్‌తో జరుగుతున్న సమావేశాల్లో మాత్రం చాలామంది పోటీ చేయాలనే సూచిస్తున్నట్లు తెలిసింది. అయితే గతంలో అనేకసార్లు గెలిచినా అది పొత్తుల వల్లే సాధ్యమైందని, పూర్తిగా సొంత బలమే కారణం కాదని సీపీఐ నాయకులు కొందరు చెబుతున్నారు. అంతేకాదు నియోజకవర్గ పునర్విభజన వల్ల గతంలో ఉన్న ఓటు బ్యాంకు కొంత మేరకు తగ్గింది. ఈ పరిస్థితుల్లో పోటీ చేయడం వల్ల పరోక్షంగా బీజేపీకి లాభం కలిగే అవకాశం ఉంటుందని, అదే ఖాయమైతే బరిలో ఉండకూడదని సీపీఐ భావిస్తున్నట్టు తెలిసింది. అన్ని కోణాల్లో విశ్లేషించుకున్న తర్వాతే ముందుకు సాగాలనే ఆలోచనలో ఉంది. ఒకవేళ సీపీఐ తన అభ్యర్థిని బరిలోకి దింపితే మద్దతు ఇచ్చేందుకు సీపీఎం సిద్ధంగా ఉంది. రెండు పార్టీలు ఈ నెల 15 తర్వాత సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకోనున్నాయి. (క్లిక్: మునుగోడులో పెరిగిపోతున్న పొలిటికల్ హీట్) టీఆర్ఎస్కా? కాంగ్రెస్‌కా? సీపీఐ పోటీ చేయని పక్షంలో బీజేపీకి అడ్డుకట్ట వేసే పార్టీకి మద్దతు ఇవ్వాలని వామపక్షాలు భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీని ఓడించగలిగేది టీఆర్ఎస్సా? కాంగ్రెస్సా? అన్నది ఇప్పుడు కీలకమని సీపీఐ, సీపీఎం నేతలంటున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీకి వలసలు ఉంటాయా? అలా వెళ్లడం వల్ల కాంగ్రెస్ బలహీన పడుతుందా? లేక కాంగ్రెస్ తన బలాన్ని చాటుకుంటుందా? టీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి? ఈ రెండు పార్టీల్లో ఎన్నికల నాటికి బీజేపీని ఓడించే సత్తా ఎవరికి ఉంటుందన్న దానిపై ఆధారపడి మద్దతు విషయంలో నిర్ణయం తీసుకుంటామని పార్టీ కీలక నేత ఒకరు చెప్పారు. (క్లిక్: మంచి బట్టలు తొడిగినా ఓర్వలేడు!.. ఆయనకు టికెట్ ఇస్తే..) -
Munugode Politics: ఒక్క ఉప ఎన్నిక.. రెండు పార్టీలకు దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించి, నల్లగొండ జిల్లాలో కాషాయ జెండా ఎగరవేయడం ద్వారా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ధీమా పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈక్రమంలోనే ఎక్కడా చిన్న అవకాశం కూడా వదులుకోకుండా.. ఉప ఎన్నికపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరికను ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని.. చేరికలు, ఇతర మార్గాల ద్వారా టీఆర్ఎస్ను ఎదుర్కోవాలని భావిస్తోంది. ఈ నెల 21న అమిత్‌షా సభ నిర్వహించడం, ఆ సభలోనే రాజగోపాల్‌రెడ్డి సహా పలువురు కీలక నేతలు బీజేపీలో చేరనుండటం ఈ వ్యూహంలో భాగమేనని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. శుక్రవారం బండి సంజయ్ పాదయాత్ర మధ్యలో నిర్వహించిన సమావేశం సందర్భంగా.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ప్రదీప్‌రావు, బొమ్మ శ్రీరాం తదితరులు తరుణ్ చుగ్‌తో భేటీఅయ్యారు. 21న అమిత్ షా సభ సందర్భంగా బీజేపీలో చేరనున్నారని, ఈ మేరకు చర్చలు జరిపారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్కు చెక్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి.. ఆ పార్టీపై ఎలాంటి విమర్శలూ చేయలేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తమ పట్ల వ్యతిరేకతతో వ్యవహరించాడని.. ఆయన కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ నాశనమవుతోందనే ఆరోపణలు చేశారు. తద్వారా కాంగ్రెస్ శ్రేణుల నుంచి వ్యతిరేకతను తగ్గించుకోగలిగారు. అంతేగాకుండా రాజగోపాల్‌రెడ్డితోపాటు నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు కొందరు బీజేపీలో చేరుతున్నారు. తద్వారా ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు చెక్ పెట్టవచ్చని బీజేపీ నేతలు అంటున్నారు. ఇక బీజేపీ టీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకుంది. బండి పాదయాత్ర, బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకుల పర్యటనలన్నీ టీఆర్ఎస్, కేసీఆర్, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ జనంలోకి వెళుతున్నవే. 21న మునుగోడు నియోజకవర్గంలో జరిగే అమిత్‌షా సభలోనూ టీఆర్ఎస్ లక్ష్యంగా చేసుకోనున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అట్టహాసంగా అమిత్ షా సభ మునుగోడుతోపాటు తెలంగాణ ప్రజలను ఆకర్షించేందుకు అమిత్ షా సభను అట్టహాసంగా నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. గణనీయ సంఖ్యలో జనాన్ని తరలించి అమిత్‌షా సభను విజయవంతం చేయడం, పార్టీలో చేరికల విషయంలో పకడ్బందీగా వ్యవహరించడం, ఉప ఎన్నిక ఊపుతో పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. -
మునుగోడు కాంగ్రెస్ కంచుకోట
వైరా: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటగా అని, అక్కడ ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తంచేశారు. మునుగోడు ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే దానిపై పార్టీ ఎన్నికల కమిటీ పూర్తిస్థాయిలో పని చేస్తోందన్నారు. స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల సందర్భంగా ‘ఆజాదీ కా గౌరవ్’ పేరుతో ఖమ్మం జిల్లాలో 75 కి.మీ. మేర భట్టి చేపట్టిన పాద యాత్ర శుక్రవారం కొణిజర్ల, వైరాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన పలుచోట్ల ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పార్లమెంట్ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. వ్యవస్థలన్నింటినీ కబళించి దేశ ద్రోహు లను చేరదీసి ఈడీ తదితర దర్యాప్తు వ్యవస్థలను గిట్టని రాజకీయ పార్టీ నాయకులపై ప్రయోగిస్తున్నారని ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాలపై ప్రశ్నించిన వారిని జైల్లో పెట్టాలనే కుట్ర జరుగుతోందన్నారు. దేశ చరి త్రను తప్పుగా చిత్రీకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు బాధ కలిగి స్తున్నాయని చెప్పారు. దేశానికి లౌకికవాదం, ప్రజాస్వామ్యమే శ్రీరామ రక్ష అని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని భట్టి పిలుపునిచ్చారు. ఈ యాత్రలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు పాల్గొన్నారు. పాదయాత్రలో భట్టికి పలుచోట్ల మహిళలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ నుంచి వైరా మీదుగా వెళ్తున్న ఏపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పినపాక వద్ద భట్టి పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. -
మునుగోడు మనదే!
సాక్షి, హైదరాబాద్/యాదాద్రి: తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్దేశించే ఉప ఎన్నిక మునుగోడులో జరగబోతోందని.. ఇక్కడ గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధి కారంలోకి రావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ఒక్కో మోదీగా మారి బీజేపీ గెలుపు కోసం పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో సంజయ్ పాదయాత్ర సాగింది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, మరికొందరు సీనియర్ నేతలు ఈ పాదయాత్రలో పాల్గొని కొంత దూరం నడిచారు. మధ్యాహ్నం ఎన్నారంలో ఏర్పాటు చేసిన పాదయాత్ర భోజన శిబిరం వద్ద బీజేపీ శక్తి కేంద్రాల ఇన్చార్జులతో సంజయ్, తరుణ్ చుగ్, ఇతర నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఉప ఎన్నికలో ఓటుకు రూ.30 వేలు, మద్యం పంచేందుకు టీఆర్ఎస్ సర్వం సిద్ధం చేసుకుంటోందని బండి సంజయ్ ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఓటుకు రూ.10 వేలు ఇచ్చినా బోల్తాపడ్డారని గుర్తుచేశారు. గెలుపు ఖాయమైనట్టే.. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ విజయం ఇప్పటికే ఖాయమైందని సంజయ్ పేర్కొ న్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఆటలు సాగబోవన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయని టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తప్పదన్నారు. టీఆర్ఎస్ ఇచ్చే పైసలకు ఆశ పడి సీపీఐ నేతలు ఇప్పటికే పొత్తుకు సిద్ధమ య్యారని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ కేడరే ఆ పార్టీ నాయకత్వంపై కోపంతో ఉందని, ఆ పార్టీ నేతలు కొట్లాడుకోవడమే తప్ప తమకు పోటీ కాదని పేర్కొన్నారు. ఉప ఎన్నిక సమ యంలో తాను మునుగోడులోనే మకాం వేస్తానని చెప్పారు. మునుగోడు నియోజక వర్గంలో కేంద్ర మంత్రి అమిత్‌షా సభ వాయిదా పడిందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని.. ఈ నెల 21న సభ జరుగుతుందని సంజయ్ స్పష్టం చేశారు. ఆ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజగోపాల్‌రెడ్డితోపాటు వచ్చే కాంగ్రెస్ శ్రేణులను కలుపుకొని పోవాల్సిన బాధ్యత బీజేపీ నాయకులదేనని చెప్పారు. మహిళా సాధికారతకు తోడ్పాటు మహిళా సాధికారతకు ప్రధాని మోదీ పెద్దపీట వేస్తున్నారని, రాష్ట్రపతి పీఠంపై ఎస్టీ మహిళను కూర్చోబెట్టడంతోపాటు ఆరుగురు మహిళ లకు గవర్నర్లుగా, నలుగురికి సీఎంలుగా, 12 మందిని కేంద్ర మంత్రులుగా చేశారని సంజయ్ చెప్పారు. అదే తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు తొలి ఐదేళ్లు ఒక్క మహిళకూ మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తు చేశారు. జనం కసితో ఉన్నారు: తరుణ్ చుగ్ మునుగోడులో బీజేపీ విజయానికి అవసర మైన వ్యూహాలు రూపొందించుకొని ముందుకు సాగాలని పార్టీ నేతలకు తరుణ్ చుగ్ సూచించారు. మునుగోడులో బీజేపీ గెలిచి తీరాలన్నారు. రాజగోపాల్‌రెడ్డితోపాటు వచ్చే కాంగ్రెస్ శ్రేణులను కలుపుకొని పోవాల్సిన బాధ్యత బీజేపీ నాయకులదేనని చెప్పారు. సీఎం కేసీఆర్‌పై జనం కసితో ఉన్నారని, బీజేపీ కార్యకర్తలు హనుమంతుడి వారసులుగా మారి కేసీఆర్ కోటను కూల్చేయాలని పిలుపునిచ్చారు. 15 కిలోమీటర్లు యాత్ర శుక్రవారం సంజయ్ పాదయాత్ర పల్లివాడ స్టేజీ నుంచి ఎన్నారం, పెద్దబావిగూడెం, కుంకుడుపాముల, పల్లెపహాడ్ క్రాస్‌రోడ్డు, పెరు మాండ్లబావి మీదుగా నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు వరకు 15 కిలోమీటర్ల మేర సాగింది. రాఖీ పండుగ కావడంతో దారిపొడవునా మహిళలు సంజయ్‌కు రాఖీలు కట్టారు. -
బీజేపీ ఉరకలు.. కాంగ్రెస్‌కు అగ్ని పరీక్ష.. టీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకం!
తెలంగాణ రాజకీయం వేగంగా కదులుతోందా? మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు మునుగోడు నియోజకవర్గం అత్యంత కీలకం కాబోతోందా? ఈ ప్రశ్నలకు కచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది. కొద్ది నెలల క్రితం హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితం ఒక సంచలనం అయితే, అధికార టీఆర్ఎస్ కు పెద్ద శరాఘాతమే అయింది. తెలంగాణలో అతి తక్కువ శాతం ఓట్లు ఉంటాయనుకునే భారతీయ జనతా పార్టీ ఒక్కసారిగా రాజకీయ తెరపైకి ఒక కీలకమైన ప్లేయర్ గా అవతరించింది. అంతకుముందు దుబ్బాక నియోజకవర్గం ఫలితం కూడా బీజేపీకి ఉపయోగపడినా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, హుజూరాబాద్ ఉప ఎన్నిక బాగా కలిసి వచ్చాయి. దాంతో ఎక్కడలేని ఉత్సాహంతో బీజేపీ ఉరకలు వేస్తోంది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్దం అవుతుండడంతో రాజకీయం వేడెక్కినట్లయింది. ఒక వైపు బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర, మరో వైపు ఉప ఎన్నికకు సన్నాహాలతో ఆ పార్టీ హడావుడిగా కనిపిస్తోంది. అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా తన సత్తా చాటి వచ్చే శాసనసభ ఎన్నికలలో తనకు తిరుగు లేదని రుజువు చేసుకోవడానికి తహతహ లాడుతోంది. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నిక అని చెప్పాలి. హుజూరాబాద్ ఉప ఎన్నిక మిగిల్చిన చేదు అనుభవం నుంచి బయటపడడానికి, కేసీఆర్ ప్రజాకర్షణ తగ్గలేదని రుజువు చేసుకోవడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. టీఆర్ఎస్ ఇక్కడ గెలవలేకపోతే మాత్రం ప్రభుత్వానికి ఇక్కట్లు వస్తాయన్న ఊహాగానాలకు ఆస్కారం కలుగుతుంది. కేసీఆర్ హవా తగ్గిందన్న భావన ఏర్పడుతుంది. వచ్చే ఎన్నికలలో తీవ్రమైన పోటీ ఎదుర్కోక తప్పదన్న భావన కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వంతో అంతంత మాత్రంగానే సంబంధాలు ఉన్న నేపద్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మరిన్ని సమస్యలకు గురి అవుతుంది. మిగిలిన రాజకీయ పార్టీలలో ముఖ్యంగా బీజేపీ గెలిస్తే వారికి ఎనలేని బలం సమకూరుతుంది. ఒకవేళ పరాజయం చెందితే, రెండో స్థానానికి వచ్చామని చెప్పుకోగలుగుతుంది. అలాకాకుండా గతంలో మాదిరి మూడో స్థానానికి పరిమితమయితే బీజేపీ నీరుకారి పోతుంది. కాని ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని ముందు పెట్టుకుని సవాల్ విసురుతోంది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తో హుజూరాబాద్ లో రాజకీయం నడిపిన బీజేపీ , మునుగోడులో కూడా అదే తరహా వ్యూహం అమలు చేయబోతోంది. నిజానికి బీజేపీకి ఇక్కడ పెద్దగా బలం లేదు. రాజగోపాలరెడ్డి బలమే బీజేపీ బలం. ఆ సంగతి అందరికి తెలిసిందే. అందువల్లే మీడియాలో పోటీ రాజగోపాలరెడ్డికి, టీఆర్ఎస్ కు మద్య జరుగుతుందని విశ్లేషిస్తోంది. ఉత్తర తెలంగాణలో మాదిరి దక్షిణ తెలంగాణలో బీజేపీ గట్టి పట్టు ఇంకా సాధించలేకపోయిందన్న అభిప్రాయం ఉన్న తరుణంలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీలో చేరబోతుండడం ప్లస్ పాయింట్ అవుతుంది. త్రిపురలో బీజేపీకి ఒకప్పుడు అసలు బలం లేదు. కాని అక్కడ కాంగ్రెస్ నేతలంతా బీజేపీలో చేరిపోవడంతో ఏకంగా అధికారంలోకి వచ్చేయగలిగింది. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ను ఢీకొట్టే పార్టీగా గుర్తింపు పొందడంతో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. కాంగ్రెస్, సిపిఎంలు తుడిచిపెట్టుకోపోయాయి. ఈ ప్రకారమే తెలంగాణలో బీజేపీ ప్లాన్ ను అమలు చేస్తూ ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు, టీఆర్ఎస్ నుంచి ద్వితీయ శ్రేణి నేతలను కూడా ఆకర్షించే పనిలో పడ్డారు. చివరికి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సోదరుడు ప్రదీప్ రావు కూడా టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పబోతుండడం విశేషమే. మరో వైపు బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, ఆయన కుటుంబ సభ్యులపైన పలు ఆరోపణలు సంధిస్తున్నారు. కుటుంబ పాలన అన్న విమర్శను ప్రధానంగా తీసుకు వస్తున్నారు. ఈయనకు మద్దతుగా కేంద్రం నుంచి మంత్రులు కూడా తరలివచ్చి కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఆ ప్రాజెక్టు నిలబడదన్నంతగా మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, కేసీఆర్ కు ఏటీఎం అయిందని ఆయన అన్నారు. ఈ విమర్శలు వింటే, గతంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ఎన్నికల ప్రచారంలో పోలవరం ప్రాజెక్టుకు సంబందించి, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన ఆరోపణలు గుర్తుకు వస్తాయి. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఎటిఎమ్ అయిందని ఆయన ఆరోపించారు. దేశ ప్రధాని ఒకరు ఇలాంటి ఆరోపణ చేయడం అంటే చాలా సీరియస్ విషయం కింద లెక్క. కాని ఎన్నికల తర్వాత కేంద్రం ఆ ఊసే పట్టించుకోలేదు. పైగా అది కేంద్ర నిదులతో నిర్మిస్తున్న జాతీయ ప్రాజెక్టు. కాని కాళేశ్వరం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు. ఇందులో అవినీతి అని కేంద్ర మంత్రులు చెబితే వారు బాధ్యతాయుతంగా ఆరోపణలు చేయాలి. అంతే తప్ప ఇలాంటి అంశాలలో రాజకీయ ఆరోపణలు చేయడం పద్దతి అనిపించుకోదు. అయితే ఈ ప్రాజెక్టు వల్ల ఒనగూరిన ప్రయోజనాలు, వ్యయం అయిన వైనంపై వచ్చే వ్యాఖ్యలకు టీఆర్ఎస్ సమాధానం చెప్పుకోవలసి వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంపై కుటుంబ పాలన, అవినీతి ఆరోపణలు, పామ్ హౌస్ లోనే కేసీఆర్ ఎక్కువగా ఉంటారన్న ఆరోపణ మొదలైనవాటి ఆధారంగా టీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలని బీజేపీ యత్నిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి తాను ముందుకు రావడమే కాకుండా, ఏకంగా అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహ రచన చేస్తుండడం తెలంగాణ లో పెద్ద పరిణామంగా చెప్పవచ్చు. బీజేపీ చిన్న రాష్ట్రాల విధానం కూడా ఇందుకు కొంత ఉపయోగపడుతుందని అనుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ సంగతి చూస్తే పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి వచ్చాక, కొన్ని వర్గాలలో ముఖ్యంగా యూత్ లో కొంత క్రేజ్ తెచ్చుకున్నారు. కాని అదే సమయంలో ఆయనకు అసమ్మతి కూడా అంతకన్నా ఎక్కువ స్థాయిలోనే ఉంది. ముఖ్యంగా ఆయనపై టిడిపి ముద్ర, చంద్రబాబు నాయుడి ముద్ర ఉండడం పెద్ద మైనస్ గా ఉంది. దానికి తోడు హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు మూడువేల ఓట్లు కూడా రాకపోవడం అప్రతిష్ట అయింది. ఈ సమయంలో కోమటిరెడ్డి రాజగోపాలరె్డ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధం కావడం కాంగ్రెస్ కు పెద్ద పరీక్ష కాబోతోంది. ముందుగా వారికి అక్కడ సరైన అభ్యర్ది దొరకవలసి ఉంది. రాజగోపాలరెడ్డి సోదరుడు ఎమ్.పి గా ఉన్న వెంకటరెడ్డిని కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేయించాలని ప్రయత్నిస్తున్నా,ఆయన ఒప్పుకోవడం కష్టమే కావచ్చు. ఒకవేళ అంగీకరించినా, సోదరుడి ఓడించగలుగుతారా అన్నది సంశయమే. మునుగోడు లో కాంగ్రెస్‌కు గట్టిపట్టు ఇంతకాలం ఉండేది. గతంలో పాల్వాయి గోవర్దనరెడ్డి కీలక నేతగా ఉండేవారు. ఆ తర్వాత సిపిఐ కూడా కొన్నిసార్లు గెలిచింది. కాని ఇప్పుడు సిపిఐ పూర్తిగా దెబ్బతినిపోయింది. కాంగ్రెస్ లో గోవర్దనరెడ్డి కుమార్తె యాక్టివ్ గానే ఉన్నా, ఆమె ఎంతవరకు పోటీ ఇవ్వగలుగుతారో చెప్పలేం. దానికి కారణం కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తనతో పాటు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతలలో పలువురిని కూడా వెంటబెట్టుకుని బీజేపీలో చేరడానికి సిద్దం అవుతున్నారు. రాజకీయంగా కోమటిరెడ్డి సోదరులకు నల్లగొండ జిల్లాలో కొంత పట్టు ఉంది. ఆయా నియోజకవర్గాలలో తమ సొంత బలగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారు ఒక దశలో పిసిసి నాయకత్వం ఆశించారు. తమకు బాధ్యత అప్పగిస్తే పార్టీని అదికారంలోకి తీసుకువస్తామని గతంలో అధిష్టానం వద్ద చెప్పినా, ఎందువల్లనో అదినాయకత్వం అంగీకరించలేదు. ఆ తర్వాత పొన్నాల లక్ష్మయ్యను,తదుపరి ఉత్తంకుమార్ రెడ్డిని పిసిసి అద్యక్షులుగా చేసి పెద్దగా సఫలం కాలేకపోవడం, ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో పలువురు టీఆర్ఎస్ లో చేరిపోవడం ఈ పార్టీకి నెగిటివ్ అవుతోంది. ఇక టిడిపి నుంచి వచ్చి పిసిసి అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్న రేవంత్ రెడ్డి అంటే పలువురు సీనియర్ లకు గిట్టడం లేదు. ఒక వైపు రాజగోపాలరెడ్డిని కాంగ్రెస్ లో కొనసాగించడానికి బుజ్జగింపులకు దిగితే, మరో వైపు ఆయన బీజేపీ వేసిన బిస్కట్లకు ఆశపడ్డారని, సోనియాగాందీకి వెన్నుపోటు పొడిచారని తీవ్రమైన ఆరోపణలను రేవంత్ గుప్పించారు. దానికి మరింత ఘాటుగా కోమటిరెడ్డి స్పందించారు. చంద్రబాబే తెలంగాణలో కాంగ్రెస్ ను, రేవంత్ ను నడిపిస్తున్నారని, అందువల్లే పార్టీ నాశనం అయిందని బదులు ఇచ్చారు. ఒకసారీ పార్టీ నుంచి బయటకు వచ్చాక ఇలాంటి విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతాయి. అయితే ఇప్పుడు ప్రధాన సమస్య మునుగోడు లో కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకోవడం. కాంగ్రెస్ గెలిస్తే మంచి ఊపే వస్తుంది. నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ కు మంచి బలమే ఉంది. కాని స్వయంకృతాపరాధాలతో దెబ్బతింటోంది. మునుగోడులో మూడో స్థానానికి పరిమితం అయితే మాత్రం దాని ప్రభావం రాష్ట్రం అంతటా గణనీయంగా పడుతుంది. ఒకవేళ ఓటమి చెందినా రెండో స్థానంలో ఉన్నా, బీజేపీకన్నా ముందంజలో ఉన్నామన్న సంతృప్తి మిగులుతుంది. బీజేపీకన్నా టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకోగలుగుతుంది. ఏతావాతా చెప్పాలంటే ఈ ఉప ఎన్నిక టీఆర్ఎస్ కు అత్యంత ప్రతిష్టాత్మకం కాగా, కాంగ్రెస్ కు అగ్ని పరీక్ష వంటిది కాగా, బీజేపీకి లాటరీ వంటిదని విశ్లేషించవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
కోమటిరెడ్డి రాజీనామా ఆమోదం.. మనుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోమవారం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖను స్పీకర్ ఆమోదించారు. రాజీనామా సమర్పించిన కొన్ని నిమిషాలకే స్పీకర్ ఆమోదం తెలిపారు. దీంతో మునుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. నేడు ఈసీకి స్పీకర్ కార్యాలయం సమాచారం ఇవ్వనుంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు మునుగోడు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. కాగా ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డి.. తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో అధికారంగా బీజేపీలో చేరనున్నారు. అదే రోజు కోమటిరెడ్డిని మునుగోడు అభ్యర్థిగా బీజేపీ ప్రకటించనుంది. సంబంధిత వార్త: స్పీకర్‌కు రాజీనామా సమర్పణ.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు -
స్పీకర్‌ని స్వయంగా కలిసి రాజీనామా సమర్పిస్తా: రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ: తానే స్వయంగా వెళ్లి స్పీకర్‌కి రాజీనామా లేఖ సమర్పిస్తానని తెలిపారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆగస్టు 8న స్పీకర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు చెప్పారు. స్పీకర్ తనను కలవకుండా కాలయాపన చేస్తే అసెంబ్లీ సెక్రటరీని కలిసి రాజీనామా సమర్పిస్తానని స్పష్టం చేశారు. చండూరు పర్యటనలో భాగంగా ఈ మేరకు వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి మెయిల్ ద్వారా రాజీనామా లేఖ పంపుతానన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ‘చండూర్, చౌటుప్పల్ మున్సిపాలిటీలలో డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి నిధులు ఇవ్వాలని అసెంబ్లీలో ఎన్నోసార్లు విన్నవించాను. కేసీఆర్, కేటీఆర్‌తో మాట్లాడినా పట్టించుకోలేదు. శేషిలేటి వాగు,వెల్మకన్నె పీడర్ ఛానల్ గురించి అధికారులతో చాలా సార్లు మాట్లాడినా స్పందించలేదు. మునుగోడు నియోజకవర్గంలో చిన్న చిన్న పనులకు కూడా కేసీఆర్ నిధులు ఇవ్వలేదు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ మున్సిపాలిటీలను అభివృద్ధి చేశారు. చండూర్, చౌటుప్పల్ మున్సిపాటీల అభివృద్ధిపై వివక్ష చూపుతున్నారు.’ అని ఆరోపించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇదీ చదవండి: ‘కాంగ్రెస్‌కు పోటీ టీఆర్ఎస్ మాత్రమే’ -
‘కాంగ్రెస్‌కు పోటీ టీఆర్ఎస్ మాత్రమే’
ఖమ్మం జిల్లా: మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గతంలో కంటే అత్యధిక మెజారిటీని ఈసారి మునుగోడులో సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు భట్టి విక్రమార్క. ఇక్కడ కాంగ్రెస్‌కు పోటీ టీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్న భట్టి.. పార్టీని వీక్ చేయడం కోసం సోషల్ మీడియాలో గోబెల్స్ ప్రచారం జరుగుతుందన్నారు. ఇదంతా కుట్రలో భాగమేనని భట్టి అన్నారు. ఆ కుట్రలో ఎవ్వరూ పడొద్దని పిలుపుచ్చారు. ఊహాజనితమైన ప్రశ్నలు కరెక్ట్ కాదని అన్నారు. వామపక్షాలను కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని అడుగుతున్నానని భట్టి ఈ సందర్భంగా తెలిపారు. -
మునుగోడులో సర్వేల జోరు.. ఎవరైతే బెటర్!
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక ముంచుకొస్తున్న తరుణంలో ఆశావహుల సర్వేలు జోరందుకున్నాయి. బరిలో నిలవాలనుకునే వారు ఎవరికివారే సర్వేలు చేయించుకుంటుండగా.. రాజకీయ పార్టీలు కూడా ప్రజల నాడి తెలుసుకునేందుకు సర్వే నిర్వహిస్తున్నాయి. ప్రజల్లో ఎవరి పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందన్న విషయాలతోపాటు ఎవరి టికెట్ ఇవ్వొచ్చు.. ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న వివరాలను ఆయా రాజకీయ పార్టీలు రాబడుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సర్వేల్లో మునిగిపోయాయి. ముఖ్యంగా బీజేపీ నుంచి రాజగోపాల్‌రెడ్డి అభ్యర్థిత్వంపైనా ప్రత్యేక సర్వే చేయించగా, ప్రశాంత్ కిషోర్(పీకే) బృందం ఇప్పటికే నియోజవకర్గంలో మూడుసార్లు సర్వే చేసింది. దీనికితోడు మరో ఆరేడు సంస్థలు కూడా తమ సర్వేలను కొనసాగిస్తున్నాయి. నియోజకవర్గంలోని మండలాల వారీగా ఉన్న ఓటర్ల జాబితాను ఆధారంగా సర్వే చేస్తున్నారు. ఒక్కో మండలంలో ఐదు వేల నుంచి 15 వేల మంది ఓటర్ల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా కూడా సర్వేలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో సామాజిక వర్గం ప్రధానం కాబోతుందా? పార్టీల వారీగా సంప్రదాయ ఓటింగ్‌కే మొగ్గు చూపుతారా? అన్న వివరాలను తెలుసుకుంటున్నారు. వారికి ఫాలోయింగ్ ఉందా? చండూరులోనూ పీకే టీంతోపాటు, పలు సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీల నుంచి ఫలానా వారు అభ్యర్థులు అనుకుంటే అందులో ఒక్కొక్కరి పరిస్థితిపైనా ఆరా తీస్తున్నాయి. వారికి ఫాలోయింగ్ ఉందా? టికెట్ ఇస్తే గెలుస్తారా? అసలు అభ్యర్థి ఎవరు అనుకుంటున్నారు? ఏ ప్రాతిపదికన గెలుస్తారని భావిస్తున్నారన్న వివరాలను సేకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీల నుంచి టికెట్ ఎవరికి ఇవ్వాలి.. పాల్వాయి స్రవంతికి ఇవ్వాలా? టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాష్ నేతకు ఇవ్వాలా? లేదంటే కొత్తగా తెరపైకి వస్తున్న వారికి ఇవ్వాలా? అందులో ఎవరికి టికెట్ ఇస్తే గెలిపిస్తారు? లేదంటే అధికార పార్టీ అభ్యర్థినే గెలిపిస్తారా? అన్న వివరాలను అడుగుతున్నారు. రాజగోపాల్‌రెడ్డికి ఓట్లు వేస్తారా? ఆయన్ని మళ్లీ గెలిపిస్తారా? కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో ఎవరు బెటర్ అనే వివరాలను సేకరిస్తున్నారు. చదవండి: మునుగోడు తీర్పు దేశమంతా వినిపించాలి పార్టీల పనితీరేంటి.. జరిగిన అభివృద్ధి ఎంత? ఈ సర్వేల్లో పార్టీల పనితీరును కూడా అడిగి తెలుసుకుంటున్నారు. టీఆర్ఎస్ బెస్టా.. బీజేపీని గెలిపిస్తారా? కాంగ్రెస్‌కు పట్టం కడతారా? అన్న వివరాలను సేకరిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది.. ఎన్నికలు జరిగితే పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవరైతే మెరుగ్గా ఉంటుందని అనుకుంటున్నారు.. గ్రామాల్లో ఏయే సమస్యలు ఉన్నాయి.. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి ఎంత.. ఆగిపోయిన పనులు ఏంటి? అందుకు ఎవరు కారణం.. అభివృద్ధి జరగకపోతే ఎందుకు జరగలేదనుకుంటున్నారు.. ఉప ఎన్నికలు వస్తే అభివృద్ధి పనులు కొనసాగుతాయని అనుకుంటున్నారా? అన్న సమగ్ర వివరాలను తీసుకొని క్రోడీకరిస్తున్నారు. కేంద్రం నిధులతో అభివృద్ధి జరుగుతుందనుకుంటున్నారా?. రాష్ట్రమే అభివృద్ధి చేస్తుందనకుంటున్నారా?. ఎన్నికల్లో ఏయే పార్టీల నడుమ పోటీ ఉంటుంది.. ఏ పార్టీకి అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, ఓటు వేసేందుకు రాజకీయ పార్టీలను చూస్తారా, వ్యక్తులను చూస్తారా, సాంప్రదాయ బద్ధంగా ఓటు వేస్తారా, సరి కొత్తగా మార్పు కోరుకుంటున్నారా అన్న వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆశావహుల సొంత సర్వేలు.. టికెట్‌కు ప్రయత్నిస్తున్న ఆశావహులు కూడా సొంత సర్వేలు చేయించుకుంటున్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కోసం ప్రత్యేకంగా రెండు సర్వేలు సాగుతున్నాయి. బీజేపీ కూడా ఒక సర్వే చేయిస్తోంది. చౌటుప్పల్ మండలంలో సర్వేలు కొనసాగుతున్నాయి. రాజకీయ పార్టీలు, నాయకులతోపాటు మీడియా సంస్థలు సర్వే నిర్వహిస్తున్నాయి. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కర్నాటి విద్యాసాగర్, నారబోయిన రవి తరఫున కూడా కొన్ని సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. -
‘మునుగోడు ఉప ఎన్నికపై స్పందించిన కేటీఆర్.. మారేదేమీ లేదు..!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్కు సవాలేమీ కాదని, అన్నింటిలా అది మరో ఉప ఎన్నిక మాత్రమేనని, దానితో మారేదేమీ లేదని మంత్రి కేటీ రామా రావు పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదం, మద్దతుతో తెలంగాణకు టీఆర్ఎస్ సేవ చేస్తోందన్నారు. శుక్రవారం సాయంత్రం ట్విట్టర్ వేదికగా ‘ఆస్క్ కేటీఆర్’ పేరిట రెండు గంటల పాటు నిర్వహించిన ప్రశ్న, జవాబుల కార్యక్రమంలో నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్ సమాదానాలు ఇచ్చారు. విపక్ష పార్టీ మతం, జాతీయతను కలగలిపి ఎన్నికల వ్యూహంగా వాడుతుంటే.. తాము మాత్రం అభివృద్ధితో కూడిన జాతీయవాదం (డెవలప్మెంటల్ నేషనలిజం) మీద దృష్టి పెట్టామన్నారు. ‘ఖాళీ పాత్రలే ఎక్కువ శబ్దం చేస్తాయనే సామెతను తెలంగాణ బీజేపీ నాయ కులు గుర్తు తెస్తున్నారు. మరికొన్ని నియోజ కవర్గాల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతాయని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పగటి కలలు. అసత్యాలను వ్యాప్తి చేయడమే బీజేపీ నేతల పని’ అని కేటీఆర్ మండిపడ్డారు. చదవండి: బీజేపీలోకి చేరుతున్నా.. డేట్ ఫిక్స్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. హిందీని రుద్దడాన్ని అంగీకరించబోం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దడాన్ని తాము ఒప్పుకోబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘ప్రధానిని తెలంగాణ ప్రభుత్వం అగౌరవపరుస్తోందనే విమర్శలు అర్థ రహితం. అనధికారిక, ప్రైవేట్ పర్యటనలకు వచ్చే మోదీ సీఎం స్వాగతం పలకాలని ప్రొటోకాల్ నిబంధనల్లో లేదు. భారత్ వంటి భారీ ఆర్థిక అసమానతలు ఉన్నచోట ఉచిత పథకాలను విమర్శిస్తున్న మోదీ.. కార్పొరేట్లకు సంబంధించిన రూ.12 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయడం ఏమిటి?’ అని ప్రశ్నించారు. నుపుర్‌శర్మ దేశానికి తలవంపులు తేవడంతోపాటు ప్రపంచం దృష్టిలో మన దేశం పలుచనయ్యేలా చేసిందన్నారు. జాతీయ జెండాను వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా పెడితే దేశ జీడీపీ పురోగతి సాధిస్తుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. విపక్షాలు అధికారంలో ఉన్నచోట ప్రభుత్వాలను కూల్చడంపై కాకుండా పడిపోతున్న రూపాయి విలువపై ప్రధాని మోదీ దృష్టి సారించాలన్నారు. జీఎస్టీ కౌన్సిల్లో విపక్షాల నుంచి వచ్చే సలహాలు, సూచనలు పాటించకుండా తనకున్న మందబలంతో బీజేపీ నెట్టుకుపోతోందని మండిపడ్డారు’ అని కేటీఆర్ బదులిచ్చారు. పలు అంశాల్లో ప్రశ్నల వర్షం! బాసర ట్రిపుల్ ఐటీ, మెడికల్ కాలేజీల విద్యార్థుల సమస్యలు, హైదరాబాద్‌లో మురుగు, వరద నీటి సమస్య తదితర అంశాలపై చాలా మంది నెటిజన్లు ‘ఆస్క్ కేటీఆర్’లో ప్రశ్నలు సంధించారు. -
మునుగోడు తీర్పు దేశమంతా వినిపించాలి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, ఆ తీర్పు దేశం నలుదిక్కులా పిక్కటిల్లేలా వినిపించాల్సిన అవసరం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల ఓట్లతో గెలిచి సొంత వ్యాపారాల కోసం నియోజకవర్గ ప్రజలను దగా చేసిన దుర్మార్గుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అని దుయ్యబట్టారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ కరోనాతో ఇబ్బంది పడినా వదలకుండా ఈడీ అధికారులు చుట్టుముట్టిన తరుణంలో అండగా ఉండాల్సిందిపోయి రాజగోపాల్‌రెడ్డి అమిత్ షా పక్కన చేరడం విశ్వాస ఘాతుకమేనని మండిపడ్డారు. అలాంటి దుర్మార్గుడిని మునుగోడు గడ్డపై పాతి పెట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మునుగోడు నియోజకవర్గం చండూరులో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. అధికారం లేకున్నా వారు పనులు చేయలేదా? మునుగోడులో ధర్మభిక్షం మొదలుకొని మల్లు స్వరాజ్యం, చకిలం శ్రీనివాస్‌రావు, బీఎన్ రెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ఆరు ట్ల రామచంద్రారెడ్డి, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి వంటి వారెంద రో అధికారం కోసం కాకుండా ప్రజాసమస్యల కోసం పోరాడారన్నారు. జానారెడ్డి, మాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉండి పనులు చేయలేదా? అని ప్రశ్నించారు. 2018 లో మునుగోడులో పాల్వాయి స్రవంతికి ఇవ్వాల్సిన టికెట్ రాజగోపాల్‌రెడ్డికి ఇస్తే ఇంటింటికీ తిరిగి గెలిపించారని, వారి త్యాగాలు రాజగోపాల్‌రెడ్డికి గుర్తుకురావా అని రేవంత్ ప్రశ్నించారు. పాల్వాయి గోవర్దన్‌రెడ్డి వందల ఎకరాలు తరిగిపోయినా కాంగ్రెస్ జెండానే మోశారు తప్ప పార్టీ మారలేదని గుర్తుచేశారు. తెలంగాణ తల్లికి అందరూ అండగా నిలవాలి.. రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియాగాంధీ కష్టకాలంలో ఉంటే ప్రతి తెలంగాణ బిడ్డ అండగా ఉండాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆమెను ఒంటరిని చేసి శత్రువులు అవమానిస్తున్నారని చెప్పారు. ‘మన తల్లిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకుంటామా.. బిడ్డలుగా మనకు బాధ్యత లేదా? మన సత్తా ఎమిటో చూపిస్తామా లేదా? అని కార్యకర్తలను ప్రశ్నించారు. మునుగోడు గడ్డపై తిరిగి కాంగ్రెస్ జెండా ఎగిరేలా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వేల కోట్ల కాంట్రాక్టు కోసం ప్రజల ఆత్మగౌరవం తాకట్టు.. రూ. 21 వేల కోట్ల కాంట్రాక్టు కోసం రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని అమిత్ షా వద్ద తాకట్టు పెట్టారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవి ఉంది కాబట్టే రాజగోపాల్‌రెడ్డిని అమిత్ షా పిలిచారని లేదంటే ఆయన కార్యాలయంలో బంట్రోతు కూడా రాజగోపాల్‌రెడ్డిని పట్టించుకోరన్నారు. కేసీఆర్ అవినీతిపై పోరాడుతున్నందుకే తనపై 120 కేసులు పెట్టారని రేవంత్‌రెడ్డి చెప్పారు. తాను 30 రోజులు జైల్లో ఉంటే అమిత్ షా 90 రోజులు జైల్లో ఉన్నారన్నారు. నిజంగా మునుగోడు అభివృద్ధి కోసమే రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారితే అమిత్ షా వద్ద ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లంల, ఇతర ప్రాజెకుల కోసం రూ. 5 వేల కోట్లు తేవాలని లేదంటే ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఉమ్మడి జిల్లాలో సీట్లన్నీ గెలుస్తాం: ఉత్తమ్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో పార్టీకి పట్టుందని, రానున్న రోజుల్లో ప్రతి అసెంబ్లీ స్థానం గెలుచుకుంటామని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. స్వలాభం కోసం బీజేపీలో చేరుతున్న రాజగోపాల్‌రెడ్డి వెళ్తే కాంగ్రెస్‌కు నష్టమేమీ లేదని మాజీ మంత్రి కె. జానారెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీకి అత్యధిక ఓటు బ్యాంక్గల మునుగోడులో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోనియాను కేంద్రం ఇబ్బందిపెడుతుంటే రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారడం సరికాదని ములుగు ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. -
పార్టీకి ద్రోహం చేసిన వారికి గుణపాఠం చెప్పాలి: రేవంత్‌రెడ్డి
-
మునుగోడులో కాంగ్రెస్‌కు మోసం చేసిన వారికి తగిన గుణపాఠం చెప్పాలి: జానారెడ్డి
-
డబ్బులిచ్చి రేవంత్‌రెడ్డి పీసీసీ కొనుక్కున్నాడు: రాజగోపాల్‌రెడ్డి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిక ముహూర్తం ఖరారైంది. ఈనెల 21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు స్వయంగా ప్రకటించారు రాజగోపాల్ రెడ్డి. శుక్రవారం ఢిల్లీకి వెళ్లి బీజేపీ సీనియర్ నేత, కేంద్రం హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అనంతరం మాజీ ఎంపీ వివేక్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మునుగోడు ఉప ఎన్నికతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగిస్తాం. ఈ ఉప ఎన్నికతో రాష్ట్రంలో మార్పు వస్తుంది. అమిత్ షా నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈనెల 21న తెలంగాణకు అమిత్ షా వస్తారు. అదే రోజు బీజేపీలో చేరతాను. బహిరంగ సభ పెట్టి మరీ చేరతాను. ఈ నెల 8వ తేదీన స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తాను. బీజేపీకి అమ్ముడు పోయినట్లు రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. అది నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. లేకుంటే నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావా? అని రేవంత్‌కు సవాల్ విసిరారు రాజగోపాల్‌రెడ్డి. అంతేకాదు డబ్బులు ఇచ్చి పీసీసీ కొనుకున్నారంటూ రేవంత్‌పై ఆరోపణలు గుప్పించారు. రేవంత్ భాష, వ్యవహారశైలి అందరూ అస్యహించుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారిని బయటకు వెళ్లగొడుతున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా పార్టీ మారతారనే ఊహాగానాలు వస్తున్నాయి. వెంకట్‌రెడ్డి అన్ని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు. మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నా ’ అని స్పష్టం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ఇదీ చదవండి: హోం మంత్రి అమిత్ షాను విడివిడిగా కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్ -
మునుగోడులో ఎవరు గెలుస్తారో నాకు తెలుసు
న్యూ ఢిల్లీ: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై.. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి మండిపడ్డారు. మునుగోడులో గెలవబోయేది ఎవరో తనకు తెలుసని.. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఏదో చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం.. ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ తాను అందుబాటులో ఉండనని తెలిసే చండూరులో రేవంత్ సభ పెట్టారని ఆక్షేపించారు వెంకటరెడ్డి. పీసీపీ ప్రెసిడెంట్ అందరినీ ఇబ్బందిపెడుతున్నారు. నన్ను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్‌ను పార్టీలో చేర్చుకున్నారు. నా లోక్‌సభ పరిధిలో నన్ను అడగకుండానే రేవంత్ ఎలా మీటింగ్ పెడతారు? లోకల్ ఎంపీకి చెప్పకుండా సభ పెట్టడం తప్పు. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తిని నేను. పదవుల కోసం వెంటపడే వ్యక్తి కాదు. నేను ఎవరికీ భయపడను. పాత కాంగ్రెస్ నేతలందరినీ పార్టీ నుంచి వెళ్లగొడుతున్నావు. కాంగ్రెస్ వాళ్లంతా పోతే టీడీపీ వాళ్లని చేర్చుకుంటారా?. మునుగోడులో ఎవరు గెలుస్తారో నాకు తెలుసు. నేను పార్టీ మారితే అందరికీ చెప్పే వెళ్తాను. కాంగ్రెస్‌ను రేవంత్ ఏం చేయాలనుకుంటున్నాడో.. సోనియా, రాహుల్ దగ్గర తేల్చుకుంటాం అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా.. ఈ రోజు మూడు ముఖ్యమైన సమావేశాలు జరిపినట్లు తెలిపారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి.. తెలంగాణకు రూ. వెయ్యి కోట్ల వరద సహాయం చేయమని అడిగినట్లు చెప్పారు. అంతేకాదు ప్రజా సమస్యల పరిష్కారానికే హోం మంత్రిని కలిసినట్లు స్పష్టత ఇచ్చారు. మునుగోడు సభ కంటే అభివృద్ధి ముఖ్యం కాదా అని ప్రశ్నించారు. అమిత్‌షాను తెలంగాణలో ఏరియల్ సర్వే చేయమని కోరానని, రూల్ 377 కింద ఫ్లడ్స్ విషయాన్ని లేవనెత్తానని. ఆర్థిక శాఖ సంప్రదింపుల సమావేశానికి హాజరయ్యానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఇదీ చదవండి: హోం మంత్రి అమిత్ షాను విడివిడిగా కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్ -
అమిత్ షాను కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్
సాక్షి, ఢిల్లీ: నల్లగొండ రాజకీయ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ ఢిల్లీలో ఇవాళ తెలంగాణ రాజకీయాలను వేడి పుట్టించారు. శుక్రవారం మధ్యాహ్నాం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కోమటిరెడ్డి బ్రదర్స్ భేటీ అయ్యారు. అయితే విడివిడిగానే.. ముందుగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. అమిత్ షాను కలిశారు. బీజేపీలో చేరిక, మునుగోడు బహిరంగ సభపై చర్చించినట్లు తెలుస్తోంది. అధికారికంగా మునుగోడు సభలోనే చేరతారనే సంకేతాలు అందుతున్నాయి. ఈ మేరకు భేటీ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. ఇక పార్లమెంట్‌లోనే ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. తెలంగాణ వరద సహాయం కోసమే హోం మంత్రిని కలిశానని, వరద కష్టాలపై షాతో చర్చించానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. వరదలతో రూ.1,400 కోట్ల నష్టం వాటిల్లిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తాను ఈ భేటీకి వెళ్లకపోయి ఉంటే.. రాష్ట్రానికి నష్టం జరిగేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం పదవీత్యాగం చేసిన వ్యక్తిని తానని, పదవుల కోసం వెంటపడే వ్యక్తిని కాదని, ఒకవేళ పార్టీ మారాలనుకుంటే బరాబర్ చెప్పి పోతా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. -
కాంగ్రెస్‌ను కొందరు నిర్వీర్యం చేశారు: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపారు. కాంగ్రెస్ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామిక పాలన అందించే దిశగా మరో రాజకీయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్‌కు రాజీనామా చేసేందుకు దారి తీసిన పరిణామాలను లేఖలో వివరించారు. తీవ్రంగా బాధించింది: కోమటిరెడ్డి గత ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా, ప్రజాప్రతినిధిగా సోనియా గాంధీ నాయకత్వంలో ఏ పని అప్పగించినా, ఎక్కడా రాజీపడకుండా కష్టపడ్డానని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కన్నీళ్లు దిగమింగుకుంటూ పార్టీలో పనిచేశానని ప్రస్తావించారు. కానీ పార్టీకి విధేయులైన వారిని గత కొంతకాలంగా పదేపదే అవమానిస్తున్నారని అన్నారు. పార్టీ ద్రోహులు, మీ పైనే(సోనియా గాంధీ) వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తులకు కీలక పదవులు అప్పగించడం తనను తీవ్రంగా బాధించిందన్నారు. కాంగ్రెస్‌ను కొందరు నిర్వీర్యం చేశారని ఆరోపించిన కోమటిరెడ్డి.. ఎమ్మెల్యేలను గెలిపించలేని వారు ఎమ్మెల్యేల్లో మనోధైర్యం నింపలేకపోయారని విమర్శించారు. చదవండి: కాంగ్రెస్‌లో టెన్షన్.. టెన్షన్.. తెలంగాణలో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి? ‘ఇప్పటికే అనేక పార్టీలు మారి స్వలాభం కోసం ఓ ప్రజాప్రతినిధి చేయకూడని పనులు చేశారు. జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో నేను కలిసి పనిచేయలేను. తెలంగాణ అంటేనే ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అన్న విషయం మీకు తెలియనది కాదు. అరవై ఏళ్ల కలను సాకారం చేసుకునేందుకు అనేక వందల మంది ఆత్మబలిదానాలు చేసిన విషయం మీకు తెలిసిందే. అందరి చొరవతో సాకారమైన తెలంగాణ రాష్ట ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చేతిలో బంధీ అయింది. ఈ బంధీనుండి విడిపించేందుకు తెలంగాణాలో మరో ప్రజాస్వామిక పోరాటం అవసరం ఉందని నేను నమ్ముతున్నా’నని లేఖలో పేర్కొన్నారు. 8న రాజీనామా ఈనెల 8వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే స్పీకర్ అపాయింట్మెంట్ కూడా కోరారు. ఆగస్టు 8న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి స్పీకర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో 8వ తేదీన రాజీనామా చేసిన తర్వాతే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: Hyderabad: వాహనదారుడిపై చేయిచేసుకున్న ట్రాఫిక్ సీఐ -
తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు: బండి సంజయ్
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ నాయకులే ఉప ఎన్నికలకు కారణం కాబోతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు ఉప ఎన్నికల్లో రెండు గెలిచామని, మునుగోడు ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఎన్నికలని అన్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్ బీజేపీని, మోదీ పథకాలను చాలా సందర్భాల్లో ప్రశంసించారని ప్రస్తావించారు. చికోటి వ్యవహారంలో కేసీఆర్ కుటుంబ పాత్ర ఉందని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజులో భాగంగా భువనగిరిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయిష్మాన్ భారత్‌లో జర్నలిస్టులను చేర్చే విషయంపై చర్చిస్తానని తెలిపారు. తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులకు రైల్వే పాసులు, ఇళ్లు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులను ఆదుకునే బాధ్యత తమదేనన్నారు. క్యాసినో స్కామ్‌లో చాలా మంది టీఆర్ఎస్ నాయకులున్నారని బండి సంజయ్ విమర్శించారు. డగ్ర్ కుంభకోణంలో కూడా వారే ఉన్నారన్నారు. నయీమ్ డైరీ ఏమైందని, డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. నయీమ్ వల్ల కేసీఆర్ కుటుంబానికి ఇబ్బంది రావడంతో అతన్ని ఎన్కౌంటర్ చేశారని అన్నారు. నయీమ్ బాధితులను ఆదుకొని, వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. డబ్బులు రికవరీ చేస్తామన్నారు. ఎన్నికల వరకు ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుందని, మధ్యలో ఆపేది లేదని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటినే తమ మ్యానిఫెస్టోలో పెడతామన్నారు. చదవండి: పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ -
అయోమయంలో కాంగ్రెస్.. రేవంత్ స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా?
సాక్షి, హైదరాబాద్: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చేలా కనిపించిన కాంగ్రెస్ తీరా పోలింగ్ ప్రక్రియలో చతికిల పడింది. టీడీపీతో పొత్తు కాంగ్రెస్ పార్టీ పుట్టిముంచిందంటూ... కాంగ్రెస్ పాతకాపులు ఎన్నికల తరువాత పంచనామా చేసి ప్రకటించారు. తాము ఎంత మొత్తుకున్నా వినకుండా ఢిల్లీ పెద్దలు... బలవంతంగా చంద్రబాబును అంటగట్టారని నిట్టూర్చారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లాంటి సాఫ్ట్ లీడర్ నాయకత్వం పార్టీని అధికారంలోకి తేలేదని కాంగ్రెస్ గ్రహించలేకపోయింది. అందుకే ఉత్తమ్ తరువాత పక్కపార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దలు పీసీసీ పీఠం అప్పగించారు. ఓటుకు నోటు వంటి తీవ్రమైన కేసులున్నా... రేవంత్ దూకుడు తమకు పనికి వస్తుందని కాంగ్రెస్ పెద్దలు ఆశించారు. అందుకే రేవంత్ తీసుకున్న ప్రతీ నిర్ణయానికి అండగా నిలిచారు. చదవండి: టీఆర్ఎస్లో టెన్షన్.. మునుగోడుపై ‘ఐ ప్యాక్’ కీలక నివేదిక! తొలినాళ్లలో సీనియర్లతో కాస్త ఇబ్బంది పడ్డా... చివరికి రేవంత్‌రెడ్డి పార్టీని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. టీడీపీలో కలిసి పనిచేసిన సీతక్క, వేం నరేందర్‌రెడ్డి లాంటి ఒకరిద్దరు నేతలతో ప్రారంభించి ఇప్పుడు రేవంత్ తనకంటూ బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన నాయకులను తిరిగి వెనక్కి తెచ్చెందుకు రేవంత్ తెరవెనక మంత్రాంగం ప్రారంభించారు. ప్రతీ జిల్లాలో తన వర్గానికి టికెట్లు వచ్చేలా ఇప్పటి నుంచే రేవంత్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. తన వ్యతిరేకులకు చెక్ పెట్టే విధంగా ఢిల్లీ పెద్దలు తనతోనే ఉన్నారనే సంకేతాలు వచ్చేలా రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. కాంగ్రెస్ నుంచి నాయకులు టీఅర్ఎస్లోకి వెళ్లినా క్యాడర్ మాత్రం బలంగానే ఉంది. కేసీఆర్‌పై తనదైన స్టయిల్లో విమర్శలు చేసే రేవంత్‌రెడ్డి.. టీఆర్ఎస్కు కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం అనే సంకేతాలిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాల్లోని నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ బలపడిందనే సిగ్నల్ ఇవ్వాలన్నది రేవంత్ స్ట్రాటజీ. రాహుల్ గాంధీని రెండురోజుల పాటు తెలంగాణాలో తిప్పడం ద్వారా పార్టీ క్యాడర్‌ను ఉత్సాహపరిచేందుకు టీ కాంగ్రెస్ ప్రయత్నించింది. ఇక టీఆర్ఎస్తో కాంగ్రెస్ మధ్య సంబంధాలపై ఉన్న అనుమానాలకు రాహుల్ చెక్ పెట్టారు. టీఆర్ఎస్తో పొత్తు అసంభవం అంటూ రాహుల్ ద్వారా గట్టి మెసేజ్ ఇప్పించడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. హుజురాబాద్ ఎన్నికల్లో దారుణంగా పరాజయం పాలైనప్పటికీ... రేవంత్ తన ఇమేజ్ డ్యామేజ్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఎమ్మెల్యే స్థాయి నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా టీఆర్ఎస్కు సవాల్ విసరాలనేది కాంగ్రెస్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. చేరికలపై దూకుడుగా ఉన్నా స్థానిక నేతలకు సమాచారం ఇవ్వడంలేదనే ఆరోపణలతో పార్టీలో కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. టీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న నేతలను టార్గెట్ చేయడం ద్వారా అధికారపక్షం బలహీనపడుతోందనే మెసేజ్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే అనుకున్న స్థాయిలో చేరికలు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ బలపడలేకపోతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక చాలా చేరికలకు సంబంధించి స్థానికంగా ఉన్న సీనియర్లకు అభ్యంతరాలున్నాయి. అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీలో చేరికలు పార్టీని బలోపేతం చేయడం కంటే బలహీనపరుస్తున్నాయనే మెసేజ్ వెళుతోంది. అయితే ఇప్పటికే పార్టీకోసం పనిచేస్తున్న నాయకులను కాదని బయటి నుంచి వచ్చేవారికి అవకాశాలివ్వడం ఏంటనే విమర్శలూ వస్తున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో చేరికల విషయంలో కాంగ్రెస్ అయోమయంలో ఉంది. చదవండి: ఆకర్ష ఆకర్ష! బీజేపీ బిగ్ ప్లాన్.. గులాబీ నేతల్లో గుబులు! -
రేవంత్‌రెడ్డిగారూ.. రెచ్చగొట్టకండి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సాక్షి,ఢిల్లీ: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ఎపిసోడ్‌పై తొలిసారి ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. అయితే.. రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై తాను ఏం మాట్లాడనని, తాను మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ఆయన మీడియా ద్వారా స్పష్టం చేశారు. పనిలో పనిగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన ‘కోమటిరెడ్డి బ్రాండ్’ కామెంట్లపైనా ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ఎపిసోడ్‌పై నో కామెంట్స్. ఆయన తన ఇష్టమున్న పార్టీలోకి వెళ్తారు. ఏది ఉన్నా రాజగోపాల్‌రెడ్డినే అడగండి. చాలా కుటుంబాల్లో వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో ఉన్నారనే విషయం గుర్తించాలి. రాజగోపాల్ వ్యవహారంతో కాంగ్రెస్ అధిష్టానం సైతం తనతో ఎలాంటి చర్చలు జరపలేదు అని చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పార్టీ మారతారా? అనే ప్రశ్నకు.. తాను మాత్రం కరడుగట్టిన కాంగ్రెస్ వాదినేనని.. ఉమ్మడి కుటుంబంగా పార్టీ ఆదేశాలానుసారం పని చేస్తానని చెప్పారు. రేవంత్‌పై ఫైర్ ‘‘కాంగ్రెస్ కోమటిరెడ్డి కుటుంబానికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పదవులు ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా పార్టీ పదవులు ఇచ్చింది. అవన్నీ మర్చిపోయి బ్రాండ్ బ్రాండ్ అని ఎగురుతున్నారు. కాంగ్రెస్ ఆదరించకపోతే బ్రాందీ షాపుల్లో పని చేయడానికి కూడా పనికిరారని రేవంత్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ప్రకటన అనంతరం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే.. పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్‌రెడ్డి చేసిన ఆ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు అని సంభోదించడం ఏంటి? కోమటిరెడ్డి బ్రదర్స్‌పై రేవంత్ తప్పుగా మాట్లాడారు. మేం చాలా నిజాయితీగా ఉన్నాం. మమ్మల్ని అవమానించాలని చూస్తున్నారా? అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దంటూ రేవంత్‌రెడ్డికి చురకలంటించారు. బ్రాందీషాపులు పెట్టుకునేవాళ్లమని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని రేవంత్‌రెడ్డి కామెంట్లను తప్పుబట్టారు. ‘మీరు..’ అని రేవంత్‌రెడ్డిగారు వాగడం బాధించింది. ఆయన మాపై దారుణంగా మాట్లాడారు. నేను పార్టీలో పని చేసే టైంకి ఆయనసలు పుట్టలేదు. 34 ఏళ్లు కాంగ్రెస్ కోసం నా రక్తం ధార పోశా. రేవంత్గారూ అనవసరంగా నన్ను రెచ్చగొట్టవద్దు. నాకు క్షమాపణలు చెప్పాల్సిందే అని కోమటిరెడ్డి పేర్కొన్నారు. అయితే చేసిన వ్యాఖ్యలను విత్‌డ్రా చేసుకోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తానని, అలాగని అధిష్టానానికి ఫిర్యాదు చేయబోనని చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి.. రేవంత్ కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేశారా?. ఇద్దరు ఎంపీలు ఢిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్న ధర్నాలో నేను తప్ప ఎవరూ పాల్గొనలేదు. అసలు పీసీసీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మునుగోడు ఫలితం ఎలా ఉండబోతుందన్న ప్రశ్నకు.. నో కామెంట్స్ అని సమాధానం ఇచ్చారాయ.