Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP President YS Jagan Fires On Chandrababu Govt Frauds1
కంచం లాగేశారు! : వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు రాక మునుపు ప్రతి ఇంట్లో మహిళలు, రైతన్న, చిన్న పిల్లాడికి నాలుగు వేళ్లు ఆనందంగా నోట్లోకి పోతుండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి కంచాన్ని లాగేశాడు. మన ప్రభుత్వంలో అమలైన అన్ని పథకా­లను రద్దు చేశాడు. సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల హామీలన్నీ పూర్తి మోసంగా మార్చేశాడు. ఎన్నికల ముందు మాత్రం జగన్‌ ఇచ్చినవి అన్నీ కొనసాగు­తాయి.. అంతే కాకుండా అధికంగా ఇస్తానని నమ్మ­బ­లి­కారు. చంద్రబాబు మాటలను నమ్మి ఆయన ఇచ్చిన బాండ్లను ప్రజలు ఇంట్లో పెట్టుకున్నారు. తమ ఇంటికి ఎవరైనా టీడీపీ కార్యకర్తలు వస్తే నిలదీయాలని ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఏ టీడీపీ కార్యకర్త కూడా ప్రజల ఆశీస్సులు కోరే పరిస్థితి లేదు..’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ‘మనం రాక్షస రాజ్యంలో, కలియుగంలో ఉన్నామని చెప్పేందుకు ఈ రాష్ట్రంలో పాలన చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. అంతటి దారు­ణమైన, దుర్మార్గమైన పాలన చూస్తున్నాం..’ అని చంద్ర­బాబు సర్కారుపై నిప్పులు చెరిగారు. గురు­వారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాల­యంలో కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ సమావేశ­మ­య్యారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..ఏ ఇంటికైనా కాలర్‌ ఎగరేసుకుని వెళ్లగలం.. మరి వాళ్లు వెళ్లగలరా?రాజకీయాలలో గెలుపోటములు సహజం. కానీ ఓడిపోయినా కూడా ప్రజల గుండెల్లో బతికే ఉన్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమున్న అంశం. వైఎస్సార్‌సీపీ కార్యకర్త గ్రామంలో ఏ ఇంటికైనా కాలర్‌ ఎగరేసుకుని వెళ్లగలుగుతాడు. మా పాలనలో మేం చెప్పిన ప్రతి మాట నెరవేర్చామని గర్వంగా చెప్పగలుగుతాడు. కానీ ఇవాళ చంద్ర­బాబు 12 నెలల పాలనలో ఆ పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఏ ఇంటికైనా వెళ్లి వాళ్ల దీవెనలు, ఆశీర్వచనాలు పొందగలరా? ఆ పార్టీ కార్యకర్తలు చంద్రబాబు, కూటమి నేతల ఫొటోలు తీసుకుని ఏ ఇంటికి వెళ్లినా.. చిన్న పిల్లాడి దగ్గర నుంచి అందరూ ప్రశ్నిస్తారు. ఆ చిన్న పిల్లవాడు తల్లికి వందనం కింద నా రూ.15 వేలు ఏమయ్యాయని అడుగుతాడు. ఆ తర్వాత ఆ పిల్లాడి తల్లి బయటకు వచ్చి ఆడబిడ్డ నిధి కింద నా రూ.18 వేలు ఏమైందని అడుగుతుంది. ఆ తల్లుల అమ్మలు, అత్తలు బయటకు వచ్చి మాకు 50 ఏళ్లకే పెన్షన్ల ద్వారా రూ.48 వేలు ఇస్తామన్నారు కదా..! వాటి సంగతేంటని అడుగుతారు. అదే ఇంట్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువకుడు నా రూ.36 వేల నిరు­ద్యోగ భృతి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తాడు. అదే ఇంట్లో నుంచి రైతన్న బయటకు వచ్చి అన్నదాతా సుఖీభవ కింద నా రూ.26 వేల సంగతి ఏమిటని నిలదీస్తాడు.సూపర్‌ సిక్స్‌ గాలికి.. దారుణ వంచనచంద్రబాబు పాలనలో సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ గాలికి ఎగిరిపోయాయి. చివరికి చిన్న చిన్న హామీ­లైన ఉచిత బస్సు లాంటివి కూడా గాలికి ఎగిరి­పో­యాయి. కడప నుంచి విశాఖపట్నం వెళ్లి వద్దామను­కున్నాం..! కర్నూలు నుంచి అమరావతికి పొద్దున పోయి సాయంత్రానికి చూసి వద్దామనుకున్నాం..! ఆ ఉచిత బస్సు ఏమైందని మహిళలు అడుగుతు­న్నారు. అన్నిటికన్నా దారుణమైన విషయం ఏమిటంటే.. చంద్రబాబు రాక మునుపు ప్రతి ఇంట్లో మహిళలు, రైతన్న, చిన్న పిల్లా­డికి నాలుగు వేళ్లు ఆనందంగా నోట్లోకి పోతుండేవి. చంద్రబాబు సీఎం అయిన తర్వాత వారి కంచాన్ని లాగే­శాడు. మన ప్రభుత్వంలో అమలైన అన్ని పథకా­లను రద్దు చేశాడు. ఆయన ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా మోసంగా మార్చేశాడు. ఎన్నికల ముందు చంద్రబాబు మాటలు నమ్మి ఆయన ఇచ్చిన బాండ్లను ప్రజలు ప్రతి ఇంట్లో పెట్టుకున్నారు. ఎవరైనా టీడీపీ కార్యకర్తలు వస్తే అడగాలని చూస్తున్నారు. ఏ టీడీపీ కార్యకర్త కూడా ప్రజల ఆశీస్సులు కోరే పరిస్థితి లేదు. బాబుకు సింగిల్‌ డిజిటే..ఇంత దారుణమైన పాలన, ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజులు నిలబడదు. దేవుడు, ప్రజలు అంతా చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఫుట్‌బాల్‌ను తన్నినట్లు తంతారు. ఎంతో మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉంటే.. ఎన్నో మోసాలు చేసి, అబద్ధాలు చెప్పి, దుర్మార్గంగా పరిపాలన చేసిన ఆయన పరిస్థితి ఏమిటో ఊహించవచ్చు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సింగిల్‌ డిజిట్‌కు రావడం ఖాయం. ఆ రోజు త్వరలోనే వస్తుంది. దానికోసం మనం అంతా గట్టిగా శ్రమించాలి.వ్యవస్థలన్నీ నిర్వీర్యం..⇒ గ్రామాల్లో ఇవాళ దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్కూళ్లలో నాడుృనేడు ఆగిపోయింది. గోరుముద్ద నాణ్యత లేకుండా పోయింది. ఇంగ్లిష్‌మీడియం పక్కకు పోయింది. మూడో తరగతి నుంచి అమలు చేసిన టోఫెల్‌ పీరియడ్‌ తీసేశారు. ఎనిమిదో తరగతికి వచ్చే సరికి ప్రతి పిల్లవాడికి ట్యాబులు ఇచ్చే స్కీం కూడా అటకెక్కించేశారు. మన హయాంలో ప్రభుత్వ బడులలో నో వేకెన్సీ బోర్డులు ఉన్న పరిస్థితి నుంచి.. ఇవాళ అమ్మో ప్రభుత్వ బడులకు వద్దనే దుస్థితికి తెచ్చేశారు. ప్రతి కుటుంబంలో పిల్లలు డాక్టరు, ఇంజనీర్‌ లాంటి పెద్ద చదువులు చదివితేనే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుంది. అలాంటి గొప్ప పరిస్థితులు రావాలని విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో పూర్తి ఫీజులు చెల్లిస్తూ.. లాడ్జింగ్‌ బోర్డింగ్‌ ఖర్చుల కోసం వారి చేతిలో డబ్బులు పెడుతూ ప్రతి క్వార్టర్‌ ముగిసిన వెంటనే వారికి క్రమం తప్పకుండా అందించాం. ఇవాళ ఆ పిల్లలు ఫీజులు కట్టలేక చదువులు మానేస్తున్నారు. చంద్రబాబు పుణ్యమాని విద్యాదీవెన, వసతి దీవెన గాలికెగిరిపోయాయి.⇒ ఆరోగ్యశ్రీ చూస్తే.. పేదవాడు తలెత్తుకుని ఏ కార్పొరేట్‌ ఆసుపత్రికైనా వెళ్లి రూ.25 లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందే పరిస్థితి మన హయాంలో ఉండేది. ఆ తర్వాత విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు ఆరోగ్య ఆసరా కింద వాళ్ల బ్యాంకు అకౌంట్లో వేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు 11 నెలల టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ నాశనం అయింది. నెలకి రూ.300 కోట్లు చొప్పున ఏడాదికి దాదాపు రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టారు. ఆరోగ్య ఆసరా లేదు. రూ.450 కోట్ల బకాయిలు ఇవ్వలేదు. పేదవాడు నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు వస్తే వైద్యం చేయబోమని బోర్డు తిప్పేశారు. పేదవాడికి ఆరోగ్యం బాగా లేకపోతే అప్పులు పాలైతే గానీ వైద్యం అందే పరిస్థితి లేదు.⇒ మన ప్రభుత్వంలో రైతన్నలకు పెట్టుబడి సహాయం ఇస్తూ.. దళారీ వ్యవస్థ లేకుండా రైతుల పంటలు ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేశాం. ఇవాళ చంద్రబాబు రైతుకు పెట్టుబడి సహాయంగా ఇస్తానన్న హామీ మోసంగా మిగిలిపోయింది. మన హయాంలో ఉచిత పంటల బీమా ఉంటే.. ఇవాళ రైతులు ఇన్సూరెన్స్‌ కట్టుకునే పరిస్థితి లేకుండా చేశాడు. ఆర్బేకేలు నీరుగారిపోయాయి. ఈృ క్రాప్‌ కనబడకుండా పోయింది. రైతులు ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కని దుస్థితిలో ఉన్నారు. ధాన్యం, మిర్చి, పత్తి, కందులు, పెసలు, మినుమలు, శనగ, అరటి, పామాయిల్, చీనీ.. ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు.ఎక్కడ చూసినా మాఫియాలే..ఒకవైపు దారుణమైన పాలన చేస్తున్నారు.. మరోవైపు విచ్చలవిడిగా స్కామ్‌లు జరుగు­తు­న్నాయి. మన హయాంలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి పారదర్శకంగా డబ్బులు వచ్చాయి. ఏడాదికి రూ.750 కోట్లు వచ్చేవి. ఈ ప్రభుత్వంలో విచ్చలవిడిగా అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. ప్రభు­త్వానికి ఆదాయం లేదు. ఇసుక మాఫియా, మట్టి, మద్యం మాఫియా అరాచకం నడు­స్తోంది. మన హయాంలో మద్యం అమ్మకాలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటే.. ఇవాళ ఏ గ్రామంలో చూసినా.. గుడి, బడి, వీధి చివర ఎక్కడ చూసినా బెల్టు షాపులే. ప్రతి బెల్టు షాపులో ఎమ్మార్పీ కంటే రూ.20– రూ.30 ఎక్కువకే అమ్ముతున్నారు. ఎక్కడ చూసినా మాఫియాలే. నియోజక­వర్గంలో మైన్స్, ఫ్యాక్టరీలు నడపాలంటే ఎమ్మెల్యేకు అంతో ఇంతో ఇవ్వాలి. ఆయన ముఖ్యమంత్రికి ఇవ్వాలి. ఇలా రాష్ట్రమంతా రెడ్‌బుక్‌ రాజ్యాంగం, దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) నడుస్తోంది.నీకింత.. నాకింత అని పంచుకుంటున్నారు..⇒ విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తున్నారంటే.. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు తన బినామీలకు మాత్రం రూ.మూడు వేల కోట్ల విలువైన భూములిస్తారు. ఊరూ పేరు లేని ఉర్సా, లూలూ, లిల్లీ లాంటి కంపెనీలకు రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేస్తున్నారు. లంచాలు తీసుకుని నాకింత.. నీకింత అని పంచుకుంటున్నారు. ⇒ మనం మొబిలైజేషన్‌ అడ్వాన్సులు విధానాన్ని తీసేస్తే వీళ్లు అదే పనిగా తీసుకొచ్చారు. రివర్స్‌ టెండరింగ్‌ను మనం తెస్తే.. వీళ్లు రద్దు చేశారు. మనం తీసుకొచ్చిన జ్యుడిషియల్‌ ప్రివ్యూను రద్దు చేశారు. కాంట్రాక్టర్లు రింగ్‌గా మారి ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచి టెండర్లు వేస్తున్నారు. వారికి చంద్రబాబు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ కింద 10 శాతం ఇచ్చి 8 శాతం తిరిగి వెనక్కి తీసుకుంటున్నారు. కుల గణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాంకుల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో దేశంలోనే తొలిసారిగా బీసీ కుల గణన నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘కుల ఆధారిత జనాభా గణన నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. కుల గణన చేయాలని నా నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో 2021 నవంబర్‌లో తీర్మానాన్ని ఆమోదించాం. 2024 జనవరిలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీ కులాల వారీ గణనను నిర్వహించాం. కుల గణన ద్వారా వెనుకబడిన, అణగారిన వర్గాలకు మరింత సంక్షేమాన్ని అందించవచ్చు. సమాజంలోని అన్ని వర్గాలకు నిజమైన సామాజిక న్యాయాన్ని, అభివృద్ధిని అందించటంలో ఇది కీలక అడుగు’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Oscars: PM Narendra Modi Superb Words About SS Rajamouli2
భారత్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా మారుతోంది

‘‘కంటెంట్‌ క్రియేటర్స్‌ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మనుషులను మనం రోబోలుగా మార్చకూడదు. వారిని మరింత సున్నితంగా తీర్చిదిద్దాలి. సంగీతం, నృత్యం, కళల ద్వారా మానవ సున్నితత్వాన్ని పెంపొందించవచ్చు. కంటెంట్‌ క్రియేటర్లనుప్రోత్సహిస్తాం. భారత్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా మారుతోంది. అలాగే ఆరెంజ్‌ ఎకానమీకి (సృజనాత్మకత, సాంస్కృతిక అంశాల ఆధారంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థ) దేశంలో నాంది పడింది. ఇది దేశ ఆర్థిక వృద్ధికి కీలకం. కంటెంట్, క్రియేటివిటీ, కల్చర్‌ అనేవి ఆరెంజ్‌ ఎకానమీకి మూడు స్తంభాలు’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సమ్మిట్‌ (వేవ్స్‌)– 2025’ని గురువారం ప్రారంభించారు నరేంద్ర మోదీ. క్రియే టివ్‌ ఎకానమీ, ఎంటర్‌టైన్‌మెంట్, డిజిటల్‌ మీడియా ఇండస్ట్రీలను ప్రోత్సహించేందుకు ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రియేటివ్‌ టెక్నాలజీ’ (ఐఐసీటీ)ని దాదాపు రూ. 400 కోట్లతో ముంబైలో స్థాపించనున్నట్లు ఈ సందర్భంగా కేంద్ర సమాచార–ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ‘వేవ్స్‌’లో ఆమిర్‌ ఖాన్, నాగార్జున, ఫర్హాన్‌ అక్తర్, నాగ చైతన్య– శోభిత ధూళిపాళ, రాజ్‌ కుమార్‌ రావు, కబీర్‌ బేడీ, అనుపమ్‌ ఖేర్, అనిల్‌ కపూర్, శ్రీలీల, పలువురు దక్షిణాది ఫిలిం చాంబర్‌ ప్రముఖులు పాల్గొన్నారు.‘కనెక్టింగ్‌ క్రియేటర్స్, కనెక్టింగ్‌ కంట్రీస్‌’ అనే థీమ్‌తో నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో 100కి పైగా దేశాల నుంచి 10,000 మంది డెలిగేట్స్, 1,000 మంది క్రియేటర్స్, 300 కంపెనీలు, 350 స్టార్టప్‌ కంపెనీలు పాల్గొంటున్నాయి. ‘వేవ్స్‌’ సదస్సు ప్రారంభ సూచికగా ప్రముఖ సంగీతదర్శకుడు కీరవాణి సారథ్యంలో ప్రముఖ గాయనీమణులు చిత్ర, శ్రేయా ఘోషల్, మంగ్లీ, లిప్సిక బృందం పలు భారతీయ భాషల సమాహారమైన ప్రారంభ గీతాన్ని ఆలపించడం ఆహూతులను అలరించింది.ఈ వేదికపై ప్రధాని మోదీ ఇంకా మాట్లాడుతూ– ‘‘సృజనాత్మకతనుప్రోత్సహించాలనే ఉద్దేశంతో త్వరలోనే ‘వేవ్స్‌’ అవార్డులను కూడా ప్రతిష్ఠాత్మకంగా అందించనున్నాం. ఇప్పుడు క్రియేట్‌ ఇన్‌ ఇండియా, క్రియేట్‌ ఫర్‌ ది వరల్డ్‌ సమయం. ప్రపంచం కొత్త కథల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో భారత కథలు గ్లోబల్‌ రీచ్‌ని సాధిస్తున్నాయి. భారత సినిమాలు 100కిపైగా దేశాల్లో నేరుగా విడుదలవుతున్నాయి. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడంలో మన దేశ సినిమా రంగం విజయం సాధించింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి ఆస్కార్‌ దక్కడమే అందుకు నిదర్శనం. రష్యాలో రాజ్‌ కపూర్‌ చిత్రాలు పాపులర్‌. కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అంటే సత్యజిత్‌ రే పేరు, ప్రతిష్ఠలు గుర్తొస్తాయి. ఆస్కార్‌ అనగానే ఏఆర్‌ రెహమాన్, రాజమౌళి (‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని ప్రస్తావించి) గుర్తొస్తారు. ఇటీవల 50 దేశాల గాయకులు కలిసి ‘వైష్ణవ జనతో’ అనే గీతాన్ని ఆలపించారు. సృజనాత్మకత ఉన్న యువతే దేశానికి అసలైన ఆస్తి’’ అని పేర్కొన్నారు.‘‘బాల్యంలో నేనెక్కువగా డ్యాన్సులు చేసేవాడిని. అలా నటనపై ఆసక్తి మొదలైంది. చెన్నై వెళ్లి ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాను. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబుగార్లు... ఇలా అరడజనుకు పైగా స్టార్‌ హీరోలున్నారు. వారికంటే భిన్నంగా ఏం చేయగలనో ఆలోచించి, నాదైన శైలిలో ఫైట్స్, డ్యాన్స్ చేశా. మేకప్‌ లేకుండా సహజంగా నటించడంలో ‘మృగయా’లోని మిథున్‌ చక్రవర్తిగారు, స్టంట్స్‌ విషయంలో ‘షోలే’లో అమితాబ్‌గారు, డ్యాన్స్‌లో కమల్‌హాసన్‌గారు స్ఫూర్తిగా నిలిచారు. నన్ను నేను మల్చుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నాను’’. – హీరో చిరంజీవి‘ది జర్నీ: ఫ్రమ్‌ అవుట్‌సైడర్‌ టు రూలర్‌’ అనే అంశంపై జరిగిన చర్చకు బాలీవుడ్‌ దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌ మోడరేటర్‌గా వ్యవహరించగా, నటుడు షారుక్‌ ఖాన్, నటి దీపికా పదుకోన్‌ మాట్లాడారు. ‘‘యువకుడిగా ఉన్నప్పుడు నేను ధైర్యంగా, ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉండేవాణ్ణి. అయితే కాస్త కూల్‌గా ఉండేవాడిని. యంగ్‌ షారుక్‌ అప్పుడు కూల్‌గా ఉన్నాడు కనుకనే ఇంత దూరం రాగలిగాడు’’ అన్నారు షారుక్‌. ఇంకా మాట్లాడుతూ – ‘‘సినిమా వినోదం ప్రజలకు చౌకగా లభించాలి. చిన్న చిన్న పట్టణాల్లో చిన్న థియేటర్స్‌ ఉండాలి.అప్పుడు భారతీయ సినిమా దేశ నలుమూలలకు చేరువ అవుతుంది’’ అని చెప్పుకొస్తూ, దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌ స్క్రిప్ట్‌ను తాను రిజెక్ట్‌ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు షారుక్‌. ఇంకా ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త తరం తమ ఒరిజినాలిటీని కోల్పోకుండా ఉండాలని, ఇమేజ్‌ని నమ్మవద్దని సలహా ఇచ్చారు షారుక్‌. దీపికా పదుకోన్‌ మాట్లాడుతూ– ‘‘18 ఏళ్ల అమ్మాయి (తనని ఉద్దేశించి) ధైర్యంగా ఓ పెద్ద సిటీకి వచ్చింది. నా జర్నీని ఇప్పుడు నేను తిరిగి చూసుకుంటుంటే... ఫర్లేదు. నేను బాగానే చేశాననిపిస్తోంది’’ అన్నారు.‘వేవ్స్‌’ తొలి రోజున ఐదుగురు భారతీయ సినిమా దిగ్గజాల స్మారక తపాలా బిళ్లలను మోదీ విడుదల చేశారు. వీరిలో దక్షిణాది ప్రముఖ నటి–దర్శక–నిర్మాత–గాయని భానుమతి ఉండటం విశేషం. ఇంకా దర్శక–నిర్మాత–నటుడు గురుదత్, దర్శకుడు రుత్విక్‌ ఘటక్, దర్శక–నిర్మాత రాజ్‌ ఖోస్లా, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సలీల్‌ చౌదరిల పోస్టల్‌ స్టాంపులు కూడా ఉన్నాయి. భానుమతి కుటుంబం పక్షాన ఆమె మనవరాలు పి. మీనాక్షి స్టాంప్‌ను అందుకున్నారు.⇒ ప్రమాదం జరిగితే కష్టం, నష్టమే. కానీ, అనుకోకుండా కొన్ని ప్రమాదాలు మంచి కూడా చేస్తాయి. ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ స్వయంగా ఈ మాట అంటున్నారు. ‘వేవ్స్‌’లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ– ‘‘కెరీర్‌ తొలి రోజుల్లో నా దృష్టి అంతా ఫిజికల్‌ ఫిట్‌నెస్, ఎజిలిటీ మీదే ఉండేది. కానీ, జీవితంలో ఒక ఘటన నా ఆలోచననే మార్చేసింది. నా పదో సినిమా తర్వాత నా భుజానికి దెబ్బ తగిలి, ఆస్ట్రేలియాలో సర్జరీ చేయించుకున్నా. అంతా బాగైపోయి, నాలుగో వారం నుంచి సెట్స్‌ మీదకు వెళ్ళిపోవచ్చనుకున్నా. డాక్టర్లు 6 నెలలు రెస్ట్‌ తప్పనిసరి అన్నారు. నాకు కొత్తగా పెళ్ళయింది. ఓ సినిమా సగంలో ఉంది. అప్పటి దాకా ఫిజికల్‌ ఫిట్‌నెస్‌కే ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన నాకు ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది. వయసు పెరిగే కొద్దీ ఫిట్‌నెస్, ఎజిలిటీ తగ్గుతాయి. కానీ, నటనపై దృష్టి పెడితే అది చిరకాలం మిగిలిపోతుందని గ్రహించా. అక్కడి నుంచి నా ఆలోచనే మారిపోయింది’’ అని వివరించారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘పదో సినిమా దగ్గర మొదలైన ఆ ఆలోచన ఇరవయ్యో సినిమా ‘పుష్ప–1’ దగ్గరకు వచ్చేసరి కల్లా నన్ను జాతీయ ఉత్తమ నటుడిగా, అందులోనూ తెలుగు సినీరంగం నుంచి ఆ ఘనత అందుకున్న తొట్ట తొలి నటుడిగా నిలిపింది. పదో సినిమా సమయంలో ఆ యాక్సిడెంట్‌ జరగకపోతే... నా దృక్పథం ఇలా మారేది కాదు. అందుకే, కొన్ని యాక్సిడెంట్లు అనుకోకుండా మన మంచికే జరుగుతాయి. మొత్తం నా ఆలోచనలు, కెరీర్‌నే మార్చేసిన ఆ యాక్సిడెంట్‌ నా జీవితంలో పెద్ద గిఫ్ట్‌’’ అని అల్లు అర్జున్‌ వివరించారు. ‘సాక్షి’ ఆయనను పలకరించినప్పుడు ‘‘మెడిసిన్, టెక్నాలజీ లాంటి అనేక రంగాలలో చాలా కాలంగా జరుగుతున్న సమ్మిట్‌లు చూసి, అలాంటివి మన సినీ, వినోద రంగంలో కూడా జరగాలనుకున్నాను. ప్రధాని మోదీ చొరవతో తొలిసారిగా వేవ్స్‌ సదస్సు జరగడం శుభారంభం’’ అన్నారు. ‘‘కథ, కథనం అనేవి వేలాది సంవత్సరాలుగా భారతీయ సంస్కృతిలో భాగం. మనకు కొన్ని వందల భాషలు ఉన్నాయి. ప్రతి భాషలో, ప్రతి ప్రాంతంలో తమవైన లక్షల కథలు ఉన్నాయి. అసలు కథాకథనాలు మన నరనరాల్లో భాగం. ఆ విషయంలో మరి ఏ ఇతర దేశమూ మన దగ్గరకు కూడా రాదు. అయినప్పటికీ, అమెరికా, చైనా, జపాన్, సౌత్‌ కొరియా తదితర దేశాల వినోద రంగానికి మనం దీటుగా లేము. సినిమా, టీవీ, డిజిటల్‌ మీడియా లాంటి వాటిని అనుసంధానిస్తూ మనకు ఒక లాంచ్‌ ΄్యాడ్‌ ఇన్నాళ్లు కరువైంది. ఇప్పుడు సరిగ్గా ఆ లోటును తీర్చే ఆ లాంచ్‌ ΄్యాడ్‌ వేవ్స్‌’’. – దర్శకుడు రాజమౌళి – ముంబై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి

CM Revanth Reddy on Central Govt caste census decision3
ఏడాదిలోగా చేయాలి: సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: కులగణన విధివిధానాలేమిటో కేంద్రం తొలుత స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రహస్యంగా కాకుండా పార్లమెంటరీ వ్యవస్థలో అందర్నీ ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని కోరారు. దీనిపై తక్షణమే మంత్రివర్గ ఉప సంఘాన్ని, నిపుణులతో కూడిన అధికారిక కమిటీని నియమించాలని సూచించారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. తూతూమంత్రంగా కాకుండా శాస్త్రీయంగా కులగణన చేపట్టాలని, ఏడాదిలోగా ప్రక్రియ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో..మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, హర్కర వేణుగోపాల్, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రాజ్‌ఠాకూర్, బీర్ల ఐలయ్య వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో కలిసి ఆయన మాట్లాడారు. ముఖ్యాంశాలు సీఎం మాటల్లోనే.. రాహుల్‌ ప్రతిపాదనను గౌరవించడం గొప్పతనం మా ఒత్తిడికి తలొగ్గి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నాం. ఒకవేళ పహల్గాం దాడి నుంచి పక్కదారి పట్టించడానికో, బిహార్‌ ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకున్నా సరే. దేశ వ్యాప్తంగా బలహీనవర్గాలకు ప్రయోజనం కలుగుతున్నప్పుడు.. ప్రభుత్వపరంగా, రాజకీయంగా ఇందుకు పూర్తిగా సహకరిస్తాం. మా అనుభవాలను పంచుకోవడానికి, కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. భారత్‌జోడో యాత్రలో రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే రాష్ట్రాల్లో కులగణన చేపడ్తామని, కేంద్రంలో అధికారంలోకి వస్తే జనగణనతో పాటు కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. రాహుల్‌గాంధీ ప్రతిపాదనను మోదీ గౌరవించడం గొప్పతనం. అయితే ఎప్పటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభిస్తారో తేదీలను ప్రధాని ప్రకటించాలి. కులగణన సమాజానికి ఎక్స్‌రే లాంటిది కులగణన సమాజానికి ఎక్స్‌రే లాంటిది. దీనివల్ల సంక్షేమ పథకాలు, నిధులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఆయా కులాలకు కచ్చితంగా అందించడానికి వీలవుతుంది. దాదాపు వందేళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో సమగ్ర కులగణన చేశాం. రాహుల్‌గాంధీ సూచనలు తీసుకుని ఎలాంటి వివాదాలు, తప్పులు లేకుండా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ఇతర స్టేక్‌ హోల్డర్లందరినీ భాగస్వాములను చేస్తూ.. 57 ప్రశ్నలతో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా సమగ్రంగా వివరాలు సేకరించి నివేదిక రూపొందించాం. వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉండేలా భద్రత కల్పించాం. దేశానికే ఆదర్శంగా నిలబడ్డాం. సీఎస్‌ నుంచి ఎన్యూమరేటర్‌ వరకు, మంత్రివర్గ ఉపసంఘం, నిపుణుల కమిటీ ఇలా.. 1.5 లక్షల మందితో ఈ ప్రక్రియ నిర్వహించాం. రాజకీయాలకు అతీతంగా స్వాగతిస్తున్నాం.. అసెంబ్లీలో రెండు తీర్మానాలు చేశాం. దేశంలో జనగణనతో పాటు కులగణన తక్షణమే చేపట్టాలి అనేది మొదటిది. రెండోది బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నది. ఈ తీర్మానాలను కేంద్రానికి పంపించాం. ఇదే డిమాండ్‌తో కుల సంఘాల మద్దతుతో ఢిల్లీ జంతర్‌ మంతర్‌లో ఒకరోజు ధర్నా చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చాం. అయినా కులగణన చేయబోమంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ వేసిన వారు ఇప్పుడు అంగీకరించడానికి మా ఒత్తిడే ప్రధాన కారణం. ఏది ఏమైనా కేంద్రం నిర్ణయాన్ని రాజకీయాలకు అతీతంగా స్వాగతిస్తున్నాం. అభినందిస్తున్నాం. పారదర్శకంగా ముందుకు వెళ్లాలి ఈ ప్రక్రియ అమలులో సవాళ్లు, సమస్యలను ఏ విధంగా అధిగమిస్తారో వెల్లడించాలి. కేంద్రం వివరణ ఇవ్వడం ద్వారా పారదర్శకంగా ముందుకు వెళ్లాలి. అన్ని రాష్ట్రాల్లో సమాచార సేకరణ చేయాలి. మేం అందర్నీ ఇందులో భాగస్వాములను చేశాం. కులగణన పూర్తి చేసి ఇప్పుడు దేశానికి తెలంగాణ రోల్‌ మోడల్‌గా నిలిచింది. మేము కుల గణన చేసినప్పుడు ఎదురైన సవాళ్లను కేంద్రంతో పంచుకోవడానికికి సిద్ధం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నది మా సంకల్పం. రాహల్‌గాంధీ ఆలోచనను అమలు చేసే క్రమంలో ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా నివేదికను ఇప్పటికే ఢిల్లీకి పంపించాం. ఏ సమాచారం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధమే. ఇక్కడకు వచి్చనా సరే.. మమ్మల్ని ఢిల్లీ రమ్మనా సరే.. ఒక మెట్టు దిగడానికి మేము రెడీ. పకడ్బందీగా చేసే ఆలోచన కన్పించడం లేదు మాది రాజకీయ ఉద్దేశంతో చేసిన కుల గణన అంటూ విమర్శలు చేసే నాయకులను ఒకే ప్రశ్న అడుగుతున్నా. 11 సంవత్సరాలుగా కేంద్రంలో, 16 రాష్ట్రాల్లో పాలనలో ఉన్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా కుల గణన చేసి ఆదర్శంగా నిలిచి ఉంటే.. మేము తెలంగాణ రోల్‌ మోడల్‌ అని చెప్పుకునే అవకాశం వచ్చేది కాదు. రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆతృత వారి (బీజేపీ) మాటల్లో కనిపిస్తోంది. పకడ్బందీగా కులగణన, జనగణన చేయాలన్న ఆలోచన వారిలో కనిపించడం లేదు. 2021లో జనగణన చేయకుండా వాయిదా వేశారు. మోదీ.. రేవంత్‌రెడ్డి విధానాలను అనుసరిస్తున్నారని స్థానిక బీజేపీ నాయకులకు కొంత అసూయ, అసంతృప్తి ఉంది. బీజేపీ రాష్ట్ర నాయకులు కక్కలేక మింగలేకపోతున్నారు. రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్లు.. ఒక రాష్ట్రంలో బీసీ ఉండి, మరో రాష్ట్రంలో ఓసీగా ఉన్న కులాలకు సంబంధించి కొందరు లేవనెత్తుతున్న ప్రశ్నలకు కేంద్రం అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపినప్పుడు సమాధానం లభిస్తుంది. రాష్ట్ర యూనిట్‌గా రిజర్వేషన్లు అమలవుతాయి. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా ఆయా వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు దీనితో సంబంధం లేదు. ఆ ప్రక్రియ సాగుతోంది. మాకంటే మెరుగ్గా వారు కులగణన చేస్తే మంచిదే. ఆస్తులు, అప్పులు, పొలాల విషయంలో అబద్ధం చెప్పొచ్చు. కానీ కులం విషయంలో ఎవరూ అబద్ధం చెప్పరు. కులాల లెక్క పక్కాగా తేలితే సంక్షేమ పథకాల అమలు సులభం. వీటికి కేంద్రం డేటానే ప్రామాణికం. అది లేనప్పుడు మేము చేసిన సర్వే డేటానే ప్రామాణికం. తెలంగాణ సేకరించిన సమాచారం దేశానికి రోల్‌మోడల్‌. 400 సీట్లు వచ్చి ఉంటే రిజర్వేషన్లు ఎత్తేసేవారు బీజేపీకి గత ఎన్నికల్లో 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేవారు. రిజర్వేషన్లు ఎత్తేసేవారు. ఇప్పుడు ఈ కులగణన చేపట్టేవారు కూడా కాదు. ఎన్నికల సమయంలో మేముప్రజలను అప్రమత్తం చేయడం వల్ల వారికి సంపూర్ణ మెజారిటీ ఇవ్వకుండా 240 సీట్లకు పరిమితం చేశారు. సంకీర్ణ ప్రభుత్వం కారణంగానే వారి ఎజెండాను పూర్తిగా అమలు చేయలేకపోతున్నారు. రాజకీయంగా తప్పనిసరి పరిస్థితుల్లోనే కులగణనకు నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఏం జరుగుతోందో ఈ బచ్చాలకు తెలియదు ఢిల్లీలో ఏమి జరుగుతోందో గల్లీలో తిరిగే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ బచ్చాలకు తెలియదు. నరేంద్రమోదీ ఎవరిని ఫాలో అవుతున్నారు. ఏమి ఆలోచిస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు. ఎవరి సలహా తీసుకుంటున్నారు. ఈ గల్లీల్లో తిరిగే పిల్లలకు తెలియదు. వారి విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. డేటా లేకుండా రిజర్వేషన్లు పెంచడాన్ని మాత్రమే సుప్రీంకోర్టు తప్పుపట్టింది తప్ప.. 50 శాతం సీలింగ్‌ను కాదు. ఈడబ్ల్యూఎస్‌తో రిజర్వేషన్లు 60 శాతానికి చేరాయి. నమోదు చేసుకోనివారు లెక్కల్లో లేనట్లే.. కులగణనలో తమ పేర్లు నమోదు చేసుకోని వారు లెక్కలో లేనట్లే. కేసీఆర్‌ ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఒక మాట అన్నారు. ‘ఉన్నోడే ఉన్నట్లు ..లేనోడు పోయినట్లే అని..’. వారికి ఆ స్పష్టత ఉంది. మా పార్టీ, ప్రభుత్వం హింసకు (ఆపరేషన్‌ కగార్‌పై మాట్లాడుతూ) వ్యతిరేకం. అది రాజ్యహింస అయినా, వ్యక్తులు చేసినా.. సంఘాలు చేసినా..తప్పే. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారం.

Facility to remove names of deceased voters from time to time4
రిజిస్ట్రార్‌ జనరల్‌ నుంచే నేరుగా తాజా జాబితా

న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు పాత పేర్ల తొలగింపు, సవరణలతో అత్యంత కచ్చితత్వంతో ఆధునీకరించిన ఓటర్ల జాబితాను సిద్ధంచే సేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మృతిచెందిన ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి వెనువెంటనే తొలగించాలని నిర్ణయించింది. ఎవరైనా ఓటర్‌ మృతిచెందితే అధికారికంగా తమకు సమాచారం వచ్చేదాకా వేచిచూడకుండా నేరుగా ‘రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా’నుంచి మరణాల తాజా జాబితాను తెప్పించుకుని ప్రస్తుత ఓటర్ల జాబితాతో సరిపోల్చి మృతుల పేర్లను తొలగించనుంది. దీంతో మృతుల పేరిట మరొకరు ఓటు వేసే ఆస్కారం లేకుండా చేయాలని ఎలక్షన్‌ కమిషన్‌ భావిస్తోంది. దీంతోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలను ఈసీ తీసుకుంది. అవి.. 1. నమోదిత మరణాల తాజా జాబితా రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి అందగానే బూత్‌ స్థాయి అధికారి(బీఎల్‌ఓ)కి సమాచారం ఇస్తారు. ఫామ్‌–7 అభ్యర్థన కోసం వేచిచూడకుండా నేరుగా రిజిస్ట్రార్‌ జనరల్‌ నుంచి ఈ జాబితా తెప్పించుకోవచ్చు. తర్వాత మరణాన్ని ధృవీకరించుకునేందుకు ఆ బీఎల్‌ఓ సదరు ప్రాంతానికి వెళ్లి మృతి విషయాన్ని ఖరారుచేసుకుంటారు. ఓటర్ల నమోదు నియమావళి–1960లోని 9వ నిబంధన, 2023లో సవరించిన జనన, మరణాల నమోదు చట్టం–1969లోని 3(5)(బీ) సెక్షన్‌ ప్రకారం ఆయా జనన, మరణాల వివరాలు అడిగి తీసుకునే హక్కు ఈసీకి ఉంది. 2. ఓటర్‌ ఇన్ఫర్మేషన్‌ స్లిప్‌(వీఐఎస్‌) మరింత స్పష్టంగా ఉండేందుకు ప్రస్తుతమున్న దాని డిజైన్‌ను మార్చనున్నారు. ఇకపై పెద్ద అక్షరాలతో డిజైన్‌ చేయడం వల్ల వీఐఎస్‌ సీరియల్‌ నంబర్, ఓటర్‌ పార్ట్‌నంబర్‌ మరింత స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో తమ పోలింగ్‌ స్టేషన్‌ ఎక్కడుందో ఓటర్‌ మరింత తేలిగ్గా చూసుకోగలడు. పోలింగ్‌ అధికారులు సైతం ఆయా ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితాలో ఏ పేజీలో ఉన్నాయో సులభంగా గుర్తుపట్టగలరు. 3. ప్రజా ప్రతినిధుల చట్టం,1950లోని 13బీ(2) సెక్షన్‌ ప్రకారం ఎలక్టోరల్‌ రిజి్రస్టేషన్‌ ఆఫీసర్‌ నియమించిన బీఎల్‌ఓలు అందరికీ ప్రామాణికమైన ఫొటో గుర్తింపు కార్డులను జారీచేయనున్నారు. ఓటర్‌ వెరిఫికేషన్, నమోదు కార్యక్రమాల్లో బీఎల్‌ఓలను ఓటర్లు సులభంగా గుర్తించడానికి, వారితో ఎలాంటి నిర్మొహమాటం లేకుండా సందేహాలు నివృత్తిచేసుకోవడానికి, అభ్యంతరాలు వ్యక్తంచేయడానికి వీలు చిక్కుతుంది. ముఖ్యంగా బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరిగే క్రమంలో వారిని ఓటర్లు తేలిగ్గా గుర్తుపట్టడానికి ఈ నూతన ప్రామాణిక గుర్తింపు కార్డు తప్పనిసరి అని ఈసీ భావిస్తోంది.

Sakshi Guest Column On Caste census by NDA govt5
చివరకు కులగణన వైపే మొగ్గు

కులగణన ప్రతిపాదనపై గత కొన్నేళ్లుగా కారాలూ మిరియాలూ నూరుతూ వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎట్టకేలకు తన వైఖరి మార్చుకుంది. వచ్చే జనగణనతోపాటే కులగణన కూడా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ భేటీ బుధవారం నిర్ణయించటం దేశ చరిత్రలో ఒక కీలకమైన మలుపు. అయితే ఇప్పటికే అయిదేళ్లుగా వాయిదా పడుతూవస్తున్న జనగణన ఎప్పుడు ప్రారంభిస్తారన్న అంశంలో స్పష్టత లేదు. స్వాతంత్య్రానంతరం అణగారిన కులాలు సైతం విద్యావకాశాలను అందుకోవటం, ఉన్నతోద్యోగాలు సాధించటం వంటి పరిణామాల కారణంగా ఆ వర్గాల్లో చైతన్యం పెరిగింది. జనాభా దామాషా ప్రాతిపదికన అవకాశాలు దక్కటం లేదన్న అసంతృప్తి ఎక్కువైంది. అందుకే కులగణన జరపాలన్న డిమాండ్‌ ముందుకొచ్చింది. దేశంలో దీన్ని మొట్టమొదట స్వాగతించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. 2021లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం కులగణన జరపాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానంచేసి పంపింది. 2024 జనవరిలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వేగవంతంగా, శాస్త్రీయంగా కులగణన నిర్వహించారు. బిహార్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు సైతం కులగణన చేశాయి. అయితే బీజేపీ మొదటినుంచీ ఈ డిమాండును వ్యతిరేకించింది. 2021 జులై 20 నాడు పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చిన ఆనాటి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ ‘జనగణనలో ఎప్పటిలా ఎస్సీ, ఎస్టీ వర్గాల జనాభా లెక్కల సేకరణ మినహా ఇతర కులాల లెక్కింపు జరపరాదన్నది కేంద్రప్రభుత్వ విధానపరమైన నిర్ణయం’ అని ప్రకటించారు. బయట ఎక్కడా నేరుగా కులగణనను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు ప్రకటనలు చేయకపోయినా, సమాజాన్ని విచ్ఛిన్నం చేయటానికి కాంగ్రెస్‌ కులాన్ని ఉపయోగించుకుంటున్నదని విమర్శించేవారు. మొన్నటికి మొన్న పహల్‌గామ్‌లో ఉగ్రవాదులు నావికాదళ లెఫ్టినెంట్‌ వినయ్‌ నర్వాల్‌ను మతం ఏమిటో కనుక్కుని కాల్చిచంపటాన్ని ప్రస్తావించి ‘వారడిగింది మతం... కులంకాదు’ అని ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ ట్వీట్‌ చేసింది. అయితే కులగణన చేయటమే సరైందని ఆరెస్సెస్‌ భావిస్తున్నదని రెండు నెలల క్రితం ఒక ఆంగ్లపత్రిక వెల్లడించినప్పటినుంచీ దీనిపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవచ్చన్న అంచనాలు మొదలయ్యాయి.జనాభా లెక్కలతోపాటు కులగణన కూడా జరిగితే దేశంలో దాదాపు వందేళ్ల తర్వాత ఆ ప్రక్రియ మళ్లీ అమల్లోకొచ్చినట్టవుతుంది. ఆఖరుసారి వలస పాలకుల హయాంలో 1931లో కులాలవారీ జనాభా లెక్కేశారు. అప్పట్లో 4,147 కులాలున్నట్టు తేల్చారు. 1901లో ఈ సంఖ్య 1,646. తర్వాత 1941లో కూడా కొంతవరకూ జనాభా లెక్కల్లో కులాన్ని గణించారుగానీ రెండో ప్రపంచయుద్ధ కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. స్వాతంత్య్రానంతరం ఎస్సీ, ఎస్టీల వివరాలు మాత్రమే సేకరిస్తున్నారు. పీపుల్‌ ఆఫ్‌ ఇండియా ప్రాజెక్టు 1992లో జరిపిన ఒక సర్వే ప్రకారం దేశంలో 4,635 కులాలున్నాయి. 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కులగణన నిర్వహిస్తామని వాగ్దానం చేశారు. అనంతరం సాంఘికార్థిక సర్వేకింద 2011–12 మధ్య ఆ లెక్కలు తీశారు. కానీ ఆ డేటాను బయటపెట్టలేదు. ఇటీవల జనగణనపై కాంగ్రెస్‌ పట్టుబట్టడం మొదలైంది. మతంపై ప్రధానంగా కేంద్రీకరించే బీజేపీ ఇందుకు ససేమిరా సమ్మతించబోదని, అందువల్ల ఎన్నికల్లో కులగణన తనకు ప్రధాన ఆయుధంగా మారుతుందని ఆ పార్టీ భావించింది. కానీ బీజేపీ హఠాత్తుగా మనసు మార్చుకోవటంతో కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ నినాదం లేకుండా పోయింది. అణగారిన కులాలు అడిగాయని కాదు... కులం ఒక వాస్తవం అయినప్పుడూ, సమాజంపై దాని ప్రభావం అమితంగా వున్నప్పుడూ ఎవరి సంఖ్య ఎంతో తేల్చటం ప్రభుత్వాల బాధ్యత. ఇన్నాళ్లూ దాన్ని విస్మరించారు. ఇందువల్ల రెండు రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సంక్షేమ ఫలాలు లక్షిత వర్గాలకు సరిగా చేరటం లేదు. ఇప్పటికీ విద్యాగంధం అంటని, ప్రభుత్వ పథకాల సంగతే తెలియని కులాలవారు గణనీయంగావున్నారు. ఫలితంగా బడ్జెట్‌లలో గర్వంగా ప్రకటించుకునే పథకాలు ఆచరణలో నిరుపయోగం అవుతున్నాయి. ఇక ఇంద్ర సాహ్ని కేసులో రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీంకోర్టు నిర్ణయం కోటా పెంపు ప్రయత్నాలకు అవరోధమవుతోంది. సమస్య వుందని ప్రభుత్వాలకు తెలిసినా, కొత్తగా తెరపైకొస్తున్న కులాలకు న్యాయం చేద్దామనుకున్నా అసాధ్యమవుతున్నది. అన్ని రంగాల్లోనూ ఆధిపత్య కులాల హవా కొనసాగుతోంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకోవటంలో, గాలివాలుకు అనుగుణంగా దూసుకెళ్లటంలో బీజేపీ దరిదాపుల్లోకొచ్చే రాజకీయపక్షం మరొకటి లేదు. వాస్తవానికి గత లోక్‌సభ ఎన్నికల ముందూ... మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల సందర్భాల్లో కులగణనపై కేంద్రం నిర్ణయం ప్రకటిస్తుందని అందరూ భావించారు. అలాచేస్తే కాంగ్రెస్‌ డిమాండుకు తలొగ్గినట్టయ్యేది. పహల్‌గామ్‌ మారణకాండపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నవేళ కులగణన నిర్ణయం తీసుకోవటంతో అది తన ఘనతేనని కాంగ్రెస్‌ చెప్పుకునే పరిస్థితి లేకుండాపోయింది. పైగా కేంద్రంలో ఎక్కువకాలం అధికారంలోవున్నా కులగణన జోలికి పోకపోవటం... 2011–12లో ఆ పని చేసినా దాన్ని సామాజికార్థిక సర్వేగా చెప్పటం ఆ పార్టీకి పెద్ద మైనస్‌. బిహార్‌ ఎన్నికలు సమీపిస్తున్నవేళ తీసుకున్నా తాజా నిర్ణయం నిస్సందేహంగా బీజేపీకి ఉపకరిస్తుంది. అయితే దీని వెంబడి రాగల ఇతరేతర డిమాండ్లతో ఆ పార్టీ ఎలా వ్యవహరిస్తుందన్నది చూడాలి.

Sakshi Guest Column On nation united in fight against terrorism6
ఉగ్రవాదంపై పోరులో ఏకమైన దేశం

పహల్‌గామ్‌ ఊచకోత పట్ల భారత ప్రభుత్వం ఎంతో పరిపక్వత ప్రదర్శించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటన అర్ధాంతరంగా ముగించుకున్నారు. తక్షణం కశ్మీర్‌ వెళ్లి పరిస్థితి ఏమిటో స్వయంగా తెలుసుకోవాలని హోంమంత్రిని ఆదేశించారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై అప్పటికప్పుడు ఏయే చర్యలు చేపట్టాలో గుర్తించారు. వీసాలు రద్దు చేశారు. అటారీ చెక్‌ పోస్టు మూసేశారు. పాక్‌ హైకమిషన్‌ కీలక అధికారులను దేశం నుంచి బహిష్కరించారు. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్‌ చేశారు. ఉగ్రదాడి సూత్రధారులకు తగిన గుణపాఠం చెప్పేందుకు వ్యూహ రచనా జరుగుతోంది. ‘‘భారత రిపబ్లిక్‌తోనే ఆటలాడతారా, మీ అంతు చూస్తాం, ఖబడ్దార్‌!’’ అంటూ ఇండియా పంపిన హెచ్చరిక ఇప్పటికే టెర్రరిస్టులకు అందేవుంటుంది. అత్యంత శక్తిమంతమైన రష్యా, అమెరికాల నుంచి, సౌదీ అరేబియా సహా మనకు విస్పష్టమైన మద్దతు లభించింది. ఇది ఈ సందేశానికి మరింత బలం చేకూర్చింది. సాధారణ పరిస్థితుల్లో ఎన్ని భేదాభిప్రాయాలున్నా, కష్టకాలంలో అన్నీ మరచి ఒక్క తాటి మీద నిలవటం భారత ప్రజల విశిష్టత. ప్రస్తుత బాధకర సమయంలోనూ కోపంతో రగిలిపోతూ అందరం ఒక్కటయ్యాం. ఒక్కుమ్మడిగా మన ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించాం. భౌతికంగానూ బయటికొచ్చాం. మనం భాగ్యవంతులం కాకపోవచ్చు, కాని ఆపదలో అండగా నిలిచే సహజగుణ సంపన్నులం. కేంద్ర ప్రభుత్వం, జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వం ఈ తరుణంలో ఏ చర్యలు తీసుకున్నా ఇండియా యావత్తూ వాటికి వెన్నుదన్నుగా నిలిచి ఉంటుంది. ఇండియా జాతీయ భద్రతకు పౌర సమాజం ఎప్పుడూ చేయూత ఇస్తుంది. ఇది కాలపరీక్షలో నిగ్గుదేలిన వాస్తవం.యుద్ధం వస్తే సిద్ధమే!రెండు దేశాల నడుమ యుద్ధం వస్తుందా? పహల్‌గామ్‌లో పాక్‌ అంతటి దుస్సాహసానికి పాల్పడితే మనం చేతులు ముడుచుకుని కూర్చోలేం. కానీ ఇవి మాత్రమే యుద్ధానికి దారి తీసే కారణాలు కావు. పాకిస్తాన్‌ మనకు వ్యతిరేకంగా అల్లుతున్న కథనాలు కూడా ఇందుకు పురిగొల్పుతున్నాయి. పహల్‌గామ్‌లో ఉగ్రదాడి పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెల్లుబికిన తర్వాత పాకిస్తాన్‌ తన ఆత్మరక్షణ కోసం ఎంతటి దుందుడుకు విమర్శలకూ వెనుకాడటం లేదు. ఇండియా సైనికపరంగా ఎలాంటి చర్య తీసుకున్నా, యుద్ధానికి ‘మ్యాచ్‌’ అయ్యే ప్రతిచర్యలు ఎదురవుతాయి. పరిస్థితి అంతదాకా వస్తే, ‘‘అయితే సరే, అయితే సరే. మేం కూడా ఆ ‘మ్యాచ్‌’ను ఎదుర్కుంటాం. ఘోర కృత్యాలకు తెగబడుతున్న ఉగ్రవాదాన్ని మా దేశంలో ఎట్టి పరిస్థితిల్లోనూ అనుమతించం’’ అని మనం చెప్పి తీరాలి.ఈ సన్నద్ధతలో మనం గుర్తు పెట్టుకోవలసిన అంశం: యుద్ధానికి సిద్ధంగా ఉండటం వేరు, యుద్ధం కోసం ఉవ్విళ్లూరడం వేరు. యుద్ధం తాలూకు నిర్బంధాలు, ఫలితాలు ఎప్పుడూ బాధాకరంగానే ఉంటాయి. అదీ అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం అంటే, దాని పరిణామాలు ప్రళయ సమానంగా ఉండగలవు. అణ్వస్త్రాలపై ఇండియా విధానాలు వివేకంతో కూడుకుని ఉంటాయి. అణ్వస్త్ర నిగ్రహం మన విధానం. పాకిస్తాన్‌ ఇదే బాటలో పయనిస్తోందా? అది అణ్వస్త్రం సమకూర్చుకున్న చరిత్రే దాని ఉద్దేశాలను వెల్లడిస్తుంది.‘ఒక్క దేశం’గా నిలబడదాం!ఇండియా తన సైనిక వ్యూహాలను విజ్ఞతతో బేరీజు వేసుకుని ఏది సరైన మార్గమో నిర్ణయించుకోగలదు. మనం ప్రభుత్వాన్ని సంపూర్ణంగా, బేషరతుగా విశ్వాసంలోకి తీసుకోవాలి. ఇక, దేశంలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేవారు కొందరు ఉంటారు. వారికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వానికి మనం సహకరించాలి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారికి మనం ఇలా చెప్పాలి: ‘‘ద్విజాతి సిద్ధాంతం ప్రతిపాదించి మీరు వేరే దేశాన్ని సాధించుకున్నారు. మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టి మా ‘వన్‌ నేషన్‌’ను విభజించాలని చేసే ప్రయత్నాలు మేం సహించేది లేదు. హిందువులు, ముస్లిములు, సిక్కులు... వీరందరికీ మా ‘వన్‌ నేషన్‌’ మాతృభూమి. ‘ఇండియా దటీజ్‌ భారత్‌’ విలువలకు నిలయం. మీ క్రూరాతి క్రూరమైన వక్రబుద్ధికి ఇవి అర్థం కావు.’’1948 జనవరి 30న ‘తీస్‌ జనవరి మార్గ్‌’లో మంచు కప్పిన గడ్డి మీద రక్తం చిందినట్లే, ఈ ఏప్రిల్‌ 22న పహల్‌గామ్‌ అందమైన కొండ లోయల మీద చిందిన రక్తం... మానవత్వం మీద బుల్లెట్ల దౌష్ట్యానికి నిదర్శనం. అయినప్పటికీ మానవత్వం మీద మన విశ్వాసాన్ని అది చాటి చెబుతోంది. మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా తీసుకురావాలని చూస్తున్న ‘ఉగ్రవాదపు రెండో దశ’ను నిరోధించి, మన మన మధ్య ఒక్క నెత్తుటి బొట్టు చిందనీయకుండా సాయుధ బలగాలకు పౌరదళాలుగా మన సమైక్య సంఘీభావం ప్రకటించాలి. టెర్రరిస్టులకు, టెర్రరిజానికి పురిటిగడ్డ అయున పాకిస్తాన్‌లోనూ హింసాద్వేషాలను వ్యతిరేకించే విజ్ఞులు ఉన్నారు. పహల్‌గామ్‌ ఘటన పట్ల కలత చెందినవారు, మేధావులు అక్కడ కొద్దిమంది కాదు... ఎక్కువగానే ఉంటారు. వారెవరో మనకు తెలియాల్సినంతగా తెలియడం లేదు. అలాంటివారు ఈ సమయంలో మతతత్వ గుంపులను, వ్యక్తులను గట్టిగా వ్యతిరేకిస్తారని ఆశిద్దాం. గొప్ప భారతీయుడైన లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఇచ్చిన పిలుపును గుర్తు చేసుకుంటూ, భారత దేశం ఈ సవాలును విజయవంతంగా తిప్పికొట్టాలని ఆశిద్దాం. ఆయన ఇచ్చిన ‘జై జవాన్, జై కిసాన్‌’ నినాదానికి ‘జై ఇన్సాన్‌’ (ఇన్సాన్‌ అంటే మానవ్‌) కూడా చేర్చుదాం. మన మతం మానవత్వం అనీ, దుష్టత్వం కాదనీ పహల్‌గామ్‌ సాయుధ దుండగులకు చెప్పి తీరాలి. ‘‘ఖబడ్దార్, ఇండియాతో, ఇండియా మానవత్వంతో ఆటలొద్దు’’ అని మరోసారి చెబుదాం!గోపాలకృష్ణ గాంధీవ్యాసకర్త పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

Marco Rubio calls India and Pakistan in effort to defuse crisis over Kashmir attack7
ఉద్రిక్తతలు ఆగిపోవాల్సిందే

న్యూయార్క్‌/వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం పట్ల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఇరు దేశాల మధ్య సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన బుధవారం రాత్రి భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, పాకిస్తాన్‌ అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌లతో వేర్వేరుగా ఫోన్‌లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాలపై చర్చించారు. భారత్‌–పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరగడం ఎవరికీ మేలు చేయదని అన్నారు.ఘర్షణ వాతావరణం సమసిపోయేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్‌.జైశంకర్‌తో మార్కో రూబియో మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఉగ్రవాదంపై జరిగే పోరాటంలో భారత్‌కు తమ సహకారం ఉంటుందని పునరుద్ఘాటించారు. మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదం అంతం కావాలని చెప్పారు. ఉద్రిక్తతలు తగ్గించుకొనే విషయంలో భారత్, పాక్‌ కలిసి పనిచేయాలని, పూర్తిస్థాయిలో సంయమనం పాటించాలని కోరారు. దక్షిణాసియాలో శాంతిభద్రతల పరిరక్షణకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్‌.జైశంకర్‌ స్పందిస్తూ.. పహల్గాంలో దాడికి పాల్పడిన ముష్కరులను, వారి వెనుక ఉన్న అసలైన కుట్రదారులను చట్టంముందు నిలబెట్టి, శిక్షించక తప్పదని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. భారత్‌కు పాక్‌ సహకరించాలి పహల్గాం ఉగ్రదాడిపై జరుగుతున్న దర్యాప్తుకు పాకిస్తాన్‌ ప్రభుత్వం సహకరించాల్సిందేనని మార్కో రూబియో తేల్చిచెప్పారు. ఆయన పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌తో మాట్లాడుతూ ఈ సంగతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇండియాతో నేరుగా సంప్రదింపులు జరుపుతూ ఉద్రిక్తతలు సడలిపోయేలా చర్యలు చేపట్టాలని హితవు పలికారు. పహల్గాంలో 26 మందిని పొట్టనపెట్టుకున్న ముష్కరులకు సరైన శిక్ష పడేలా భారత్‌కు సహకారం అందించాలని చెప్పారు. పాకిస్తాన్‌ నుంచి నిర్మాణాత్మక చర్యలను కోరుకుంటున్నామని రూబియో వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి పట్ల తమ వైఖరిని షెహబాజ్‌ షరీఫ్‌ అమెరికా విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఉగ్రవాదంపై పోరాటానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. పాకిస్తాన్‌ సైతం ఉగ్రవాద బాధిత దేశమేనని, 90 వేల మందికిపైగా ప్రజలు ఉగ్రదాడుల్లో మరణించారని తెలిపారు. ఉగ్రవాదం వల్ల తమకు 192 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తంచేశారు. పహల్గాం దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడిపై పారదర్శకంగా దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఉద్రిక్తతలు పెంచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఇండియాను కట్టడి చేయాలని రూబియోను కోరారు. సింధూనది జలాల ఒప్పందాన్ని ఇండియా నిలిపివేయడాన్ని షెహబాజ్‌ షరీఫ్‌ తప్పుపట్టారు. ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేయడం చెల్లదని అన్నారు. భారత్‌ హక్కుకు మద్దతిస్తున్నాంతమను తాము రక్షించుకొనే హక్కు భారత్‌కు ఉందని, ఆ హక్కుకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్‌ హెగ్‌సెత్‌ స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు తమ సహకారం కచ్చితంగా ఉంటుందన్నారు. ఆయన గురువారం భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ధూర్త దేశమైన పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ సందర్భంగా మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని తాము ఎంతమాత్రం సహించడం లేదని హెగ్‌సెత్‌ బదులిచ్చారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించినవారికి సంతాపం ప్రకటించారు.

GST collections in April 2025 hit record high of Rs 2. 37 lakh crore8
జీఎస్‌టీ వసూళ్లు.. కొత్త రికార్డు

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్ల పరంగా ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో సరికొత్త రికార్డు నమోదైంది. గతేడాది ఏప్రిల్‌ నెల గణాంకాలతో పోల్చి చూస్తే 12.6 శాతం అధికంగా రూ.2.37 లక్షల కోట్లు వసూలైంది. 2017 జూలై 1 నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక నెలవారీ గరిష్ట ఆదాయం ఇదే కావడం గమనార్హం. 2024 ఏప్రిల్‌ నెలకు జీఎస్‌టీ ఆదాయం రూ.2.10 లక్షల కోట్లుగా ఉంది.ఇక ఈ ఏడాది మార్చి నెలలో ఇది రూ.1.96 లక్షల కోట్లుగా ఉంది. దేశీ లావాదేవీలపై జీఎస్‌టీ 10.7 శాతం పెరిగి రూ.1.9 లక్షల కోట్లుగా నమోదైంది. దిగుమతి చేసుకున్న వస్తువులపై జీఎస్‌టీ 20.8 శాతం వృద్ధితో రూ.46,913 కోట్లకు చేరింది. రిఫండ్‌లు 48% అధికంగా రూ.27,341 కోట్లుగా ఉన్నాయి. రిఫండ్‌లను సర్దుబాటు చేసి చూస్తే నికర జీఎస్‌టీ ఆదాయం క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 9 శాతం వృద్ధితో రూ.2.09 లక్షల కోట్లకు చేరుకుంది. దేశీ లావాదేవీలపై సెంట్రల్‌ జీఎస్‌టీ రూ.48,634 కోట్లు కాగా, స్టేట్‌ జీఎస్‌టీ రూ.59,372 కోట్లు సమకూరింది. ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ రూ.69,504 కోట్లు, సెస్స్‌ వసూళ్లు రూ.12,293 కోట్ల చొప్పున ఉన్నాయి. బలమైన ఆర్థిక పనితీరు: డెలాయిట్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల జీఎస్‌టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లు మించడం బలమైన ఆర్థిక పనితీరుకు నిదర్శమని డెలాయిట్‌ ఇండియా పార్ట్‌నర్‌ ఎంఎస్‌ మణి పేర్కొన్నారు. అన్ని ప్రధాన తయారీ, వినియోగ రాష్ట్రాల్లో జీఎస్‌టీ వసూళ్లు ఏప్రిల్‌ నెలలో 11–16 శాతం మధ్య ఉన్నాయని.. అంతకుముందు నెలల్లో పెద్ద రాష్ట్రాల్లో తక్కువ వృద్ధి నమోదైన దానికి ఇది భిన్నమని తెలిపారు. అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థలోని బలాన్ని జీఎస్‌టీ వసూళ్లు చాటుతున్నట్టు ఈవై ట్యాక్స్‌ పార్ట్‌నర్‌ సౌరభ్‌ అగర్వాల్‌ అన్నారు. సహకారాత్మక సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనం ‘‘జీఎస్‌టీ వసూళ్ల గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని, సహకారాత్మక సమాఖ్యవాదాన్ని చాటుతున్నాయి’’అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, కేంద్ర, రాష్ట్రాల జీఎస్‌టీ అధికారుల కృషిని అభినందించారు

IPL 2025: Mumbai Indians Beat Rajasthan Royals By 100 Runs9
IPL 2025: ముంబై డబుల్‌ హ్యాట్రిక్‌.. ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి రాజస్థాన్‌ ఔట్‌

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (మే 1) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్‌ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌.. ర్యాన్‌ రికెల్టన్‌ (38 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (36 బంతుల్లో 53; 9 ఫోర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (23 బంతుల్లో 48 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (22 బంతుల్లో 48 నాటౌట్‌; 6 ఫోర్లు, సిక్స్‌) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. రాయల్స్‌ బౌలరల్లో రియాన్‌ పరాగ్‌, తీక్షణ తలో వికెట్‌ తీశారు.అనంతరం 218 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాయల్స్‌ ముంబై బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 16.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్‌ (30) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. యశస్వి జైస్వాల్‌ (13), రియాన్‌ పరాగ్‌ (16), ధృవ్‌ జురెల్‌ (11), శుభమ్‌ దూబే (15) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. గత మ్యాచ్‌లో 35 బంతుల్లోనే సెంచరీ చేసిన చరిత్ర సృష్టించిన రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో డకౌటయ్యాడు. ముంబై బౌలర్లలో కర్ణ్‌ శర్మ, బౌల్ట్‌ తలో మూడు వికెట్లు తీయగా.. బుమ్రా 2, దీపక్‌ చాహర్‌, హార్దిక్‌ పాండ్యా చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో ముంబై డబుల్‌ హ్యాట్రిక్‌ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకుపోయింది. రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

Rice laden lorries from AP stopped by Telangana cops on border10
తెలంగాణ, ఆంధ్రా సరిహద్దులో ఉద్రిక్తత!

గుంటూరు, సాక్షి: తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో గురువారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ బోర్డర్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యంతో వస్తున్న లారీలను తెలంగాణ అధికారులు ఆపేశారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. తెలంగాణ అధికారుల చర్యతో.. పల్నాడు జిల్లా తంగెడ వద్ద కృష్ణానది వారధిపై భారీ స్థాయిలో ధాన్యం లారీలు ఆగిపోయాయి. తమను అనుమతించాలంటూ బ్రిడ్జిపై అడ్డంగా లారీలు పెట్టి ఆంధ్రా లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ప్రతిగా తెలంగాణ నుంచి వస్తున్న లారీలను సైతం వాళ్లు అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో నాలుగు గంటలుకు పైగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాడపల్లి బ్రిడ్జి వద్ద ఐదు లారీలను పోలీసులు అదుపులోకి తీసుకుని సీజ్‌ చేయడం, అందుకు కలెక్టర్‌ ఆదేశాలు ఉన్నాయని చెప్పడమే ఈ మొత్తం పర్యవసనానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఉద్రిక్తతలపై ఇరు రాష్ట్రాల అధికారులు స్పందించాల్సి ఉంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement