ఇది తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో రూ. 23 లక్షలు వెచ్చించి నిర్మించిన రైతు భరోసా కేంద్రం. రైతుల కోసం గత ప్రభుత్వం కొత్త భవనాన్ని నిర్మించింది. ఇందులో అన్ని వసతులు కల్పించింది. అన్నదాతలకు అన్ని రకాల సేవలు అందించే వెసులుబాటు కల్పించింది. | - | Sakshi
Sakshi News home page

ఇది తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో రూ. 23 లక్షలు వెచ్చించి నిర్మించిన రైతు భరోసా కేంద్రం. రైతుల కోసం గత ప్రభుత్వం కొత్త భవనాన్ని నిర్మించింది. ఇందులో అన్ని వసతులు కల్పించింది. అన్నదాతలకు అన్ని రకాల సేవలు అందించే వెసులుబాటు కల్పించింది.

Aug 17 2024 2:30 AM | Updated on Aug 17 2024 2:30 AM

ఇది త

ఇది తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో రూ. 23 లక్షలు వెచ్

ఇది తుగ్గలి మండలంలోని శభాష్‌పురం గ్రామ సచివాలయం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.20 లక్షలు వ్యయం చేసి దీనిని నిర్మించింది. ఇక్కడ గ్రామ స్థాయిలో ప్రజలకు అవసరమయ్యే ప్రభుత్వ సేవలు అందుతున్నాయి.

టీడీపీ నాయకులకు

అన్న క్యాంటీన్ల మరమ్మతులు

అంచనాలు పెంచి.. షార్ట్‌ టెండర్లతో

పనులు చేయిస్తున్న వైనం

రూ.1.05 కోట్లతో పట్టణాల్లో 12

అన్న క్యాంటీన్ల ఏర్పాటు

త్వరలో ప్రారంభించేందుకు

కసరత్తు చేస్తున్న ప్రభుత్వం

కర్నూలు (టౌన్‌): అధికారంలోకి వచ్చిన వెంటనే ‘సూపర్‌ సిక్స్‌’ అమలు చేస్తాం అంటూ హామీ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు మాటమార్చారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని.. పథకాలు ఎలా అమలు చేయాలో అర్థం కావడం లేదని ప్రజలను మభ్యపెడుతున్నారు. మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, నిరుద్యోగులకు భృతి.. ఉచిత బస్సు ప్రయాణం.. ఇలా హామీలన్నింటినీ తుంగలోకి తొక్కేందుకు యత్నిస్తున్నారు. డబ్బులు లేవంటూనే మరోవైపు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. అన్న క్యాంటీన్ల పేరుతో టీడీపీ నాయకులకు ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

షార్ట్‌ టెండర్లతో పక్కా వ్యూహం

జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. టీడీపీ నాయకులకు మేలు చేకూరేందుకు షార్ట్‌ టెండర్లను తెరపైకి తెచ్చింది. ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలోని కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు గూడూరు నగర పంచాయతీ, ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపాలిటీల్లో పనులు ప్రారంభించారు. ఈ నెల 10వ తేదీలోపు పనులు పూర్తి చేయాలని లక్ష్యాన్ని ఇచ్చారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయాల్లోనే వీటిని కొనసాగించేందుకు నిర్ణయించారు. టెండర్‌ ప్రక్రియ ద్వారా అయితే పనుల్లో జాప్యం జరుగుతుందని భావించి షార్ట్‌ టెండర్‌ను తెరపైకి తెచ్చారు. పది రోజుల వ్యవధిలో షార్ట్‌ టెండర్‌ ద్వారా టీడీపీకి చెందిన కాంట్రాక్టర్లకే పనులు అప్పగించారు. అగ్రిమెంటు, వర్క్‌ ఆర్డర్‌ పూర్తయి పనులు ప్రారంభమయ్యాయి. రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలతో చక్కగా నిర్మించిన సచివాలయ భవనాల్లోనే వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆధునీకరించేందుకు తమ్ముళ్ల కోసం ఒక్కో భవనానికి రూ. 10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వ్యయం చేస్తున్నారు. కొత్త పనులు చేపట్టే విధంగా అంచనాలు పెంచేశారు. ఆదోని మున్సిపాలిటీలో చక్కగా ఉన్న సచివాలయాల్లో పనులు చేపట్టేందుకు రూ.36 లక్షలు వ్యయం చేశారు. ఇక కర్నూలు కార్పొరేషన్‌లో ఒక్కో భవానానికి రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేసి పనులు చేస్తున్నారు. ఫ్లోరింగ్‌, ఎలివేషన్‌, తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్‌, పెయింటింగ్‌ వంటి పనులు చేపట్టేందుకు భారీగా ఖర్చు చేస్తున్నారు. టీడీపీ నేతలకు దోచిపెట్టేందుకే నామమాత్రపు పనులకు రూ. లక్షలు కేటాయించారన్న విమర్శలు ఉన్నాయి.

ఇది తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో రూ. 23 లక్షలు వెచ్1
1/1

ఇది తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో రూ. 23 లక్షలు వెచ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement