
భారీగా నష్టపోయా..
ప్యాలకుర్తిలో ఎకరా రూ.20 వేల ప్రకారం కౌలుకు తీసుకొని రెండెకరాల్లో రూ.లక్షన్నర పెట్టుబడి పెట్టి ఉల్లి పంట సాగు చేశా. పంట చేతికొచ్చినప్పటి నుంచి మార్కెట్లో ధర లేకుండా పోయింది. కనీసం ఉల్లి గడ్డలు కోసి మార్కెట్‌కు తరలించినా కూలీలకు కూడా గిట్టుబాటు కాని పరిస్థితి. దీంతో రెండెకరాల్లోని ఉల్లి పంటను పూర్తిగా రోటావేటర్‌తో ధ్వంసం చేశా. ఉల్లి సాగుతో భారీగా నష్టపోయా. ఏమి చేయాలో పాలుపోవడం లేదు.
– రైతు గోపాల్, ముడుమలగుర్తి గ్రామం
రెండున్నర ఎకరాల్లో బోరు కింద రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టి ఉల్లి పంట సాగు చేశా. ఉల్లి దిగుబడి బాగున్నా మార్కెట్లో కొనే నాథుడే లేడు. చేసేది లేక పంటనంతా గత రెండు రోజుల నుంచి గొర్రెలకు వదలేశా. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసం ఉల్లి రైతులకు ప్రకటించిన నష్టపరిహారంమైన త్వరగా అందిస్తే ఇతర పంటలు సాగు చేసుకుంటాం.
– రైతు విజయభాస్కర్‌రెడ్డి, ప్యాలకుర్తి గ్రామం

భారీగా నష్టపోయా..