ఆత్మరక్షణకు కరాటే అవసరం | - | Sakshi
Sakshi News home page

ఆత్మరక్షణకు కరాటే అవసరం

Apr 23 2025 8:05 AM | Updated on Apr 23 2025 8:47 AM

ఆత్మరక్షణకు కరాటే అవసరం

ఆత్మరక్షణకు కరాటే అవసరం

బళ్లారిఅర్బన్‌: నేటి యువతకు ఆత్మరక్షణకు కరాటే అవసరం చాలా ఉందని కర్ణాటక చరిత్ర అకాడమి జిల్లా అధ్యక్షుడు టీహెచ్‌ఎం బసవరాజ్‌ పేర్కొన్నారు. శంకర్‌ కాలనీలోని విజయవిఠల కరాటే మీటింగ్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన ఉచిత వేసవి శిబిరాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి సన్నివేశాల్లో కరాటే నేర్చుకుంటే అలాంటి నిందితులకు భయం పుడుతుందన్నారు. ప్రస్తుతం కాలం చాలా సున్నితంగా ఉందన్నారు. ఒంటరి మహిళ తిరగాడటం చాలా కష్టమన్నారు. ప్రతి ఒక్కరు ఆత్మరక్షణ కోసం కరాటే వంటి విద్యను నేర్చుకోవాలని సూచించారు. విజయవిఠల గత 15 ఏళ్లుగా కరాటే పాఠశాలను ప్రారంభించి పిల్లలకు ఉచితంగా కరాటే విద్యను నేర్పించడం అభినందనీయం అన్నారు. ఈసందర్భంగా ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement