
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రాయవరం: మండలంలోని వెంటూరు శివారు బుట్టాయిపేట వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో దుగ్గిరాల రాంబాబు(57) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయాన్ని రాయవరం ఎస్సై డి.సురేష్‌బాబు శుక్రవారం విలేకరులకు తెలిపారు. రాంబాబు కుటుంబ సభ్యులు వెంటూరు నుంచి రామచంద్రపురంలో బంధువుల ఇంటి వద్ద జరిగిన శుభ కార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఆటో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో కూర్చున్న రాంబాబుకు తీవ్రగాయాలు కాగా, రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. రాంబాబు తమ్ముడు కుమారస్వామి ఆటో నడుపుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయన్నారు. రాంబాబు కుమారుడు కనకరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్‌బాబు తెలిపారు.