
వైద్యవిద్యలో పీపీపీ పద్ధతి వద్దు
ఈదరపల్లిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, మాజీ మంత్రి
సూర్యారావు, జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు, కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ నాయకులు
అమలాపురం మండలం ఈదరపల్లిలో అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందిస్తున్న ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు, మాజీ మంత్రి సూర్యారావు, కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ నాయకులు
సాక్షి, అమలాపురం/ అమలాపురం రూరల్: ‘విద్య, వైద్యం, ప్రజారోగ్యం వంటి కీలక రంగాలను ప్రభుత్వమే నిర్వహించాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య విద్యను పీపీపీ పద్ధతిలో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తోంది’ అని వైఎస్సార్ సీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ అమలాపురం మండలం ఈదరపల్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్‌రాజు ఆధ్వర్యంలో ఎస్సీ సెల్ నాయకులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విలువైన ప్రజాధనాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ వారికి అతి చౌకగా కట్టబెట్టేందుకే పీపీపీ విధానం అంటోందని ఎద్దేవా చేశారు. ఈ విధానానికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలకు రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు, మేధావులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
పేదలు డాక్టర్లు కావాలనేది జగన్ లక్ష్యం
మాజీ మంత్రి, రాజోలు పార్టీ సమన్వయకర్త గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ దేశంలో ఇప్పటి వరకు మరే ముఖ్యమంత్రి చేయని విధంగా వై.ఎస్.జగన్ 17 మెడికల్ కళాశాలల నిర్మాణాలను ప్రారంభించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం సంపదను కార్పొరేట్, పారిశ్రామికవేత్తలకు పప్పు బెల్లాల మాదిరిగా కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పేద విద్యార్థులు చదువుకుని డాక్టర్లు కావాలనే లక్ష్యంతో మెడికల్ కళాశాలలను జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసి ఇప్పటికే ఐదింటిని ప్రారంభించారన్నారు. కూటమి ప్రభుత్వానికి పేదలు చదువుకోవడం ఇష్టం లేదన్నారు. మెడికల్ సీట్లు రాష్ట్రానికి అవసరం లేదని కూటమి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని అన్నారు. జెడ్పీ చైర్మన్ విపర్తి వేణుగోపాల్‌రావు మాట్లాడుతూ ఆర్థిక స్తోమత లేని పేద విద్యార్థులకు డాక్టర్ కావాలనే ఆశయం కలగానే మిగిలిపోతుందన్నారు.
లీజు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
పి.గన్నవరం కోఆర్టినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ఉద్దేశం ప్రభుత్వ సొమ్మును పెట్టుబడిదారుల పరం చేయడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60, 40 శాతం వాటాతో నిర్మించిన ఈ భవనాలను ప్రైవేట్ వారికి 60 ఏళ్లకు లీజుకు ఇవ్వాలనే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సెల్ అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్‌రాజు మాట్లాడుతూ పేద విద్యార్థులు డాక్టర్ చదువుకునేందుకు జగన్ ప్రభుత్వం మెడికల్ కళాశాలలు నిర్మిస్తే వాటిని చంద్రబాబు పెత్తందారులకు అమ్మేస్తున్నారని అన్నారు.
రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి, జెడ్పీటీసీ సభ్యులు పందిరి శ్రీహరిరామ్‌గోపాల్, మట్టా శైలజ, ముమ్మిడివరం మున్సిపల్ చైర్ పర్సన్ కమిడి ప్రవీణ్, ఉప్పలగుప్తం మండల అధ్యక్షుడు బద్రి బాబి, వైస్ ఎంపీపీ పోలమూరి బాలకృష్ణ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ సెక్రటరీ ఉండ్రు బాబ్జి, రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శులు సరెళ్ల రామకృష్ణ, సాకా ప్రసన్నకుమార్, రాష్ట్ర బూత్ కమిటీ కార్యదర్శులు ఉండ్రు వెంకటేష్, చెట్ల రామారావు, పార్టీ అధికారి ప్రతినిధులు సూధా గణపతి, కాశి రామకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పాముల ప్రకాష్, జిల్లా ఆర్గనైజషన్ కార్యదర్శి చింతా రామకృష్ణతోపాటు పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు గెడ్డం కిరణ్, కొల్లాబత్తుల సతీష్‌బాబు, సాధనాల రమేష్, కుంచే సుభాష్, ఈతకోట శ్రావణ్, పెయ్యల సాయి, కుంచే స్వామి, కోరుకొండ కిరణ్, పినిపే బుజ్జి, పరమట శ్రీను, బళ్ళ శ్యామ్, కోటుం స్వర్ణ శేఖర్, నక్కా సంపత్ పాల్గొన్నారు.
మెడికల్ కళాశాలల
ప్రైవేటీకరణ రద్దు చేయాలి
వైఎస్సార్ సీపీ జిల్లా
ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన
ఈదరపల్లి అంబేడ్కర్
విగ్రహానికి వినతిపత్రం సమర్పణ

వైద్యవిద్యలో పీపీపీ పద్ధతి వద్దు