దసరాకు సెలవులకు వచ్చి..గోదావరి పాయలో పడి విద్యార్థి మృతి | - | Sakshi
Sakshi News home page

దసరాకు సెలవులకు వచ్చి..గోదావరి పాయలో పడి విద్యార్థి మృతి

Sep 30 2025 8:01 AM | Updated on Sep 30 2025 8:01 AM

దసరాక

దసరాకు సెలవులకు వచ్చి..గోదావరి పాయలో పడి విద్యార్థి మృత

గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్‌

కాకినాడ క్రై: గంజాయి క్రయ, విక్రయాలతో పాటు తరలింపులో ఆరితేరిన ముగ్గురు నేరస్తులను కాకినాడ జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు ఎస్పీ బిందుమాధవ్‌ సోమవారం కాకినాడలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఈ నెల 23న విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు ఒక ఇన్నోవా వాహనం అనుమానాస్పద రీతిలో పోలీసులను, టోల్‌ ప్లాజా సిబ్బందిని ఢీకొని దూసుకుని వెళ్లినట్టు ఆ వాహనం కదలికలపై నిఘా ఉంచాలని విశాఖ జిల్లా పోలీసులు కాకినాడ జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్‌ శాఖ అప్రమత్తమైంది. విశాఖ పోలీసులు తెలిపిన వాహనాన్ని జగ్గంపేట సర్కిల్‌ పరిధిలో కృష్ణవరం టోల్‌ ప్లాజా వద్ద ఈ నెల 23న మధ్యాహ్నం గుర్తించారు. కారును ఆపే క్రమంలో డ్రైవర్‌ కారులో నుంచి పోలీసులతో పోరాడాడు. ఈ క్రమంలో కారు అద్దాలు బద్దలైనా లెక్కచేయకుండా ప్రత్తిపాడు వైపు వేగంగా దూసుకుపోయాడు. అయితే ఈ పెనుగులాటలో పోలీసులకు డ్రైవర్‌ సెల్‌ఫోన్‌ లభ్యమైంది. ఆ వాహనంలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు మహిళలు ఉన్నట్టు, వెనుక సీట్లో పోలీస్‌ యూనిఫాం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వాహనంపై ఆన్‌ గవర్నమెంట్‌ డ్యూటీ అని రాసి ఉందని నిర్ధారించుకున్నారు. ప్రత్తిపాడు వైపు వెళుతున్న ఆ వాహనాన్ని వెంబడించగా, కొంత దూరంలో ఆ వాహనం మిస్సైంది. ఇదిలా ఉంటే టోల్‌ప్లాజా వద్ద ఘటన జరిగిన కొద్ది గంటల తర్వాత కిర్లంపూడిలో పైడితల్లి అమ్మవారి గుడి పక్కన ఉన్న రోడ్డుపై వెళుతున్న కారు నుంచి పడిపోయిన రెండు గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ పూటేజీల ఆధారంగా టోల్‌ప్లాజా వద్ద రచ్చ చేసిన కారు నుంచే ఈ ప్యాకెట్లు పడ్డాయని పోలీసులు నిర్ధారించుకున్నారు. సాంకేతికత, ఈగల్‌ టీమ్‌ సహకారంతో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం కారును ట్రాక్‌ చేసే పనిలో పడింది. పోలీసుల కష్టం ఫలించి కారు కిర్లంపూడి మండలం రాజుపాలెం సమీపంలో ఒక రావిచెట్టు వద్ద లభ్యమైంది. కారుతోపాటు ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరు రాజస్థాన్‌కు చెందిన వారని విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని జి.మాడుగలకు వ్యాపారం నిమిత్తం వచ్చారని గుర్తించారు. వ్యాపారం ముసుగులో విశాఖ, ఒడిశా నుంచి గంజాయిని సేకరించి రాజస్థాన్‌ తరలిస్తున్నట్టు నిర్ధారించారు. వీరిపై కేసు నమోదు చేశామని ఎస్పీ బిందుమాధవ్‌ తెలిపారు. అలాగే జొన్నాడ టోల్‌ ప్లాజా వద్ద సిబ్బంది, పోలీసులను గాయపరిచిన ఘటనలో భీమునిపట్నం పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదు అయ్యిందన్నారు. నిందితుల నుంచి సుమారు రూ.20 లక్షల విలువ చేసే 175 కిలోల గంజాయితో పాటు ఇన్నోవా కారు రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నేరంలో ఏడుగురు భాగస్వాములు అయినట్టు గుర్తించామన్నారు. ఇందులో ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్టు ఎస్పీ వివరించారు.

కొత్తపేట: దసరా సెలవులకు తమ కొడుకు ఇంటికి వచ్చాడని ఆనందించిన ఆ తల్లిదండ్రులకు అనుకోని ఘటన కడుపుకోతను మిగిల్చింది. సెలవులకు కళాశాల హాస్టల్‌ నుంచి ఇంటికి వచ్చి, స్నేహితులతో సరదాగా గోదావరిలో ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి మృత్యువాత పడిన ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నిలిపింది.. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపేట మండలం వానపల్లి శివారు నక్కావారిపేటకు చెందిన నక్కా రాంబాబు, కుమారి దంపతుల కుమారుడు అఖిల్‌ (19) పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. అక్కడ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న అఖిల్‌ దసరా పండగ సందర్భంగా కళాశాలకు సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చాడు. సోమవారం ఉదయం తన తమ్ముడు, నలుగురు స్నేహితులతో కలసి ఇంటికి సమీపంలోని గోదావరి తొగరిపాయలో స్నానానికి వెళ్లాడు. అక్కడ ఒక అరటి బొంద కనిపిస్తే దానిపై అఖిల్‌తో పాటు యడ్ల రవితేజ అనే విద్యార్థి ఎక్కి ఈతకొడుతూ జారిపోయి గల్లంతయ్యారు. అక్కడికి సమీపంలోనే మత్స్యకార కాలనీ వాసులు గమనించి వెంటనే గోదావరి పాయలో దూకి గల్లంతైన విద్యార్థులను ఒకరి తరువాత ఒకరిని పట్టుకుని ఒడ్డుకు చేర్చగా, వారిలో అఖిల్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు వెంటనే కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై స్థానిక ఎస్సై జి.సురేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తనలా కుమారుడు కాకూడదని..

నక్కావారిపేటకు చెందిన నక్కా రాంబాబుది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. అతను కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు. ఇందులో అఖిల్‌ పెద్ద కుమారుడు. తన కుమారులు కూలి పనికి వెళ్లకుండా గౌరవప్రదమైన ఉద్యోగం చేయాలనే కోరికతో డబ్బు ఖర్చయినా గాని భీమవరంలో ఓ ప్రైవేట్‌ కళాశాలలో చేర్చి చదివిస్తున్నాడు. ఉన్నత చదువులు చదివి తనకు పేరు తెస్తాడని ఆశించాడు. అఖిల్‌ దసరా సెలవులకు వచ్చి ఇలా మృత్యువాత పడటంతో ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఈ దుర్ఘటన ఆ గ్రామంలో తీవ్ర విషాదచాయలు నింపింది.

దసరాకు సెలవులకు వచ్చి..గోదావరి పాయలో పడి విద్యార్థి మృత1
1/2

దసరాకు సెలవులకు వచ్చి..గోదావరి పాయలో పడి విద్యార్థి మృత

దసరాకు సెలవులకు వచ్చి..గోదావరి పాయలో పడి విద్యార్థి మృత2
2/2

దసరాకు సెలవులకు వచ్చి..గోదావరి పాయలో పడి విద్యార్థి మృత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement