నాపై కేసులు పెట్టే ధైర్యం ఎవరికి ఉంది? | Chandrababu comments in vishaka | Sakshi
Sakshi News home page

నాపై కేసులు పెట్టే ధైర్యం ఎవరికి ఉంది?

Sep 24 2016 1:18 AM | Updated on Oct 9 2018 6:34 PM

నాపై కేసులు పెట్టే ధైర్యం ఎవరికి ఉంది? - Sakshi

నాపై కేసులు పెట్టే ధైర్యం ఎవరికి ఉంది?

‘నేనేదో కేసులకు భయపడుతున్నానని ప్రచారం చేస్తున్నారు. నా మీద ఎలాంటి కేసులు లేవు. నాపై కేసులు పెట్టే ధైర్యం ఎవరికి ఉంది.

విశాఖలో చంద్రబాబు

 సాక్షి, విశాఖపట్నం: ‘నేనేదో కేసులకు భయపడుతున్నానని ప్రచారం చేస్తున్నారు. నా మీద ఎలాంటి కేసులు లేవు. నాపై కేసులు పెట్టే ధైర్యం ఎవరికి ఉంది. 25 కేసులు పెట్టారు. కోర్టుకు పోతే కొట్టేశారు. ఎవరు ఎన్నిసార్లు కోర్టుకు పోయినా ఏ కోర్టు నన్ను తప్పుపట్టలేకపోయిందంటే అది నా క్రమశిక్షణ నా నిబద్ధత’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పుకొచ్చారు.

దివంగత వైఎస్సార్ హయాంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద పరవాడ మండలం గొర్లివానిపాలెంలో రూ.36 కోట్లతో శ్రీకారం చుట్టిన నివాస సముదాయం (జీ ప్లస్ టూ కింద 1,839 ఫ్లాట్లు)తో పాటు మరో రూ.14 కోట్లతో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను శుక్రవారం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. కాగా విలేకరుల సమావేశంలో ప్రశ్నలడిగిన మీడియా ప్రతినిధులపై చంద్రబాబు మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement