ప్రాజెక్టులను ఆపే కూటమి  

TRS  MP Kavitha Allegations On Kutami - Sakshi

 ప్రపంచం గుర్తించే పథకాలను  కేసీఆర్‌ అమలు చేశారు 

 రైతుబంధుకు ఐక్యరాజ్యసమితి గుర్తింపు గర్వకారణం

 ఎంపీ కల్వకుంట్ల కవిత

సాక్షి,వేల్పూర్‌/డిచ్‌పల్లి/ఇందల్‌వాయి : తెలంగాణలో ప్రాజెక్టులను ఆపేందుకే మహాకూటమి ఏర్పడిందని ఎంపీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. వేల్పూర్‌ మండల కేంద్రంలో శనివారం రాత్రి మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నివాసంలో మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేష్‌రెడ్డి, నాయకులు డాక్టర్‌ మధుశేఖర్, కోటపాటి నర్సింహానాయుడు, ఇతర నాయకులతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు.  మహాకూటమి ప్రజలను వంచించడానికే ఏర్పడిందన్నారు. ప్రజలు ఆ కూటమి మాయలో పడవద్దన్నారు. తెలంగాణలో నాలుగున్నర సంవత్సరాలలో ప్రపంచం గుర్తించే పథకాలను సీఎం కేసీఆర్‌ అమలు చేశారన్నారు. రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకానికి ఐక్యరాజ్యసమితి గుర్తింపు లభించడం గర్వకారణమన్నారు. ప్రశాంత్‌రెడ్డి, సీఎం కేసీఆర్‌ తలలో నాలుకగా ఉండి, బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి అధికంగా నిధులు మంజూరు చేయించారని అన్నా రు. నాలుగున్నర ఏళ్లలో నియోజకవర్గంలో అన్ని రంగాలకు కలిపి సుమారు ఐదు వేల కోట్లరూపాయల నిధులు తీసుకువచ్చారని చెప్పారు.

నియోజకవర్గంలో 25 వేల మందికి ఆరుకోట్ల రూపాయలు రైతుబీమా కింద ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. రూ. 25 కోట్ల తో ఐదు కొత్త ఎత్తిపోతల పథకా లు, రూ. 14 కోట్లతో 12 విద్యుత్తు సబ్‌స్టేషన్లు నిర్మాణమైనట్లు చెప్పారు. వాగుల్లో 12 చెక్‌డ్యాం లు మంజూరు కాగా, ఆరు చెక్‌డ్యాంలు పూర్తయ్యాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఎస్సారెస్పీ నీరందని మండలాల్లో 71 వేల ఎకరాలకు సాగునీరందుతుందని పేర్కొన్నారు. దీనికోసం రూ. 2,623 కోట్లు మంజూరు చేశామన్నారు. అంతేగాక రూ. 1,067 కోట్లతో చేపట్టే ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం ద్వారా బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న చెరువులన్ని నీటితో కళకళలాడుతాయన్నారు. బాల్కొండకు ఇటీవల ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ. 59 కోట్లను సీసీ రోడ్ల కోసం మంజూరైనట్లు చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తే రైతులకు లక్షరూపాయల పంట రుణమాఫీ, 58 ఏళ్లకే పింఛను వర్తింపజేస్తామన్నారు.

ఆసరా పింఛన్లు సైతం వేయి నుంచి రూ. 2 వేల కు పెంచుతామని పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల నామి నేషన్‌ సందర్భంగా ప్రజల నుంచి ఎంతో ఆదరణ లభిస్తోందన్నారు. తిరిగి గెలిపిస్తే ప్రజలు ఊహించని అభివృద్ధి చేస్తామని ఆమె పేర్కొన్నా రు. డిచ్‌పల్లి మండ లం సుద్దపల్లిలో ఎన్నికల ప్ర చారంతో పాల్గొన్న కవిత నిర్వహించారు. రూరల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ను  భారీ మెజార్టీతో గెలిపించాలని  కోరారు. ఇందల్వాయి మండల పార్టీ కార్యాలయానికి చేరుకున్న కవిత నాయకులు, కార్యకర్తలతో మా ట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం అమలు చేస్తున్న ప్రజా సం క్షేమ పథకాల ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచిం చారు. మహా కూటమి పేరుమీద టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్ర జలను మళ్లీ మోసం చేయాలని చూస్తున్నాయని ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top