హ్యాండ్సమ్గా ఉన్నారని పడిపోయారో.. | China warns of foreign spies with 'Dangerous Love' campaign | Sakshi
Sakshi News home page

హ్యాండ్సమ్గా ఉన్నారని పడిపోయారో..

Apr 19 2016 4:23 PM | Updated on Sep 3 2017 10:16 PM

హ్యాండ్సమ్గా ఉన్నారని పడిపోయారో..

హ్యాండ్సమ్గా ఉన్నారని పడిపోయారో..

తమ దేశ మహిళా ఉద్యోగులకు చైనా గట్టి హెచ్చరికలు చేసింది. అందంగా ఉన్నారుకదా అని విదేశీయులకు పడిపోవద్దని, వారిపై ప్రేమ మోజుతో దగ్గరయితే ఆ తర్వాత దేశం ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

బీజింగ్: తమ దేశ మహిళా ఉద్యోగులకు చైనా గట్టి హెచ్చరికలు చేసింది. అందంగా ఉన్నారుకదా అని విదేశీయులకు పడిపోవద్దని, వారిపై ప్రేమ మోజుతో దగ్గరయితే ఆ తర్వాత దేశం ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎందుకంటే అలా అందంగా ఉండేవారంతా నిజంగా ప్రేమికులు కాదని, వారు విదేశాల నుంచి వచ్చిన గుఢాచారులను తెలిపింది. జాతీయ రక్షణ విద్య దినం సందర్భంగా ఈ హెచ్చరికను ప్రదానంగా చేసింది. ఒక నేపథ్యంలో ఒక పోస్టర్ విడుదల చేసింది.

ఒక కామిక్ పుస్తకంలాంటిదాన్ని అందులో ఒక స్టోరీని కూడా ఉదహరించింది. డేంజరస్ లవ్ అనే పేరుతో విడుదల చేసిన ఈ కామిక్ పుస్తకంలో ఏం చెప్పారంటే..'చైనాకు చెందిన జియావో లి లేదా లిటిల్ లీ అనే ప్రభుత్వ మహిళా ఉద్యోగి డేవిడ్ అనే అందమైన విదేశీయుడుని ఒక డిన్నర్ పార్టీలో కలిసింది. అతడితో ఏర్పడిన పరిచయం కారణంగా తొలుత డిన్నర్ పార్టీకి హాజరైంది. అనంతరం సంబంధాన్ని కొనసాగించింది. అతడు ఆమెతో తాను ఒక విజిటింగ్ స్కాలర్ అని చెప్పాడు.

కానీ వాస్తవానికి అతడు ఓ విదేశీ గుఢాచారి. అతడు వేరే అజెండాతో చైనాకు వచ్చి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళను మభ్యపెట్టి ముగ్గులోకి దించి ఆమె అందం అనితరం అంటూ పొగడ్తల్లో ముంచెత్తడంతోపాటు చక్కగా రోజూ రోజా పూలతో సర్ ప్రైజ్ డిన్నర్లు, పార్కుల్లో రోమాన్స్, సరాసరి. ఈ క్రమంలోనే మెల్లగా ఆమె పనిచేసే కార్యాలయంలో నుంచి పలు దస్త్రాలు బయటకొచ్చాయి. దీంతో ఆ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అసలు విషయం ఏమిటంటే అతడు గుఢాచారి అని ఆమెకు తెలియకపోవడం ద్వారా శిక్షపాలైంది' అని పేర్కొంది. దీంతోపాటు వీరిద్దరి ఫొటోలను దేశంలో పలు చోట్ల ప్రచార చిత్రాలుగా పెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement