వదులు దుస్తులే ఒంటికి మంచిది! | It is advisable to stretch the flesh dressed! | Sakshi
Sakshi News home page

వదులు దుస్తులే ఒంటికి మంచిది!

May 19 2014 11:44 PM | Updated on Sep 2 2017 7:34 AM

వదులు దుస్తులే ఒంటికి మంచిది!

వదులు దుస్తులే ఒంటికి మంచిది!

ఆరోగ్యం మీద మన వస్త్రధారణ కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. స్కిన్‌టైట్ మోడల్ (బిగుతుగా చర్మానికి అతుక్కుని ఉండేవి) దుస్తులతో తీవ్రమైన పరిణామాలు కూడా ఉంటాయని తెలుస్తోంది.

జీవనశైలి
 
ఆరోగ్యం మీద మన వస్త్రధారణ కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. స్కిన్‌టైట్ మోడల్ (బిగుతుగా చర్మానికి అతుక్కుని ఉండేవి) దుస్తులతో తీవ్రమైన పరిణామాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. చర్మానికి బిగుతుగా ఉండే దుస్తుల వలన లింఫ్ నోడ్స్ పనితీరు మందగించడంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదాలున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇది నిర్ధారణ అయిన విషయం. మన దేహంలో అనేక చోట్ల తెల్ల రక్తకణాలు గుత్తిగా ఏర్పడి ఉంటాయి.

వీటిని శోషరస కణుతులు (లింఫ్‌నోడ్స్) అంటారు. ఇవి దేహంలోని వ్యర్థాలను బయటకు పంపించే పని కూడా చేస్తాయి. బిగుతు దుస్తుల వలన ఇవి నొక్కుకు పోయి శోషరసాలను సరిగా విడుదల చేయవు. దాంతో వ్యర్థాలు దేహంలో ఉండిపోవడంతో దీర్ఘకాలంలో క్యాన్సర్ బారిన పడుతున్నట్లు అన్నా మారియా క్లెమెంట్, బ్రియన్ ఆర్ క్లెమెంట్ అనే పరిశోధకులు ప్రకటించారు.

అలాగే ఆకర్షణీయంగా కనిపించడానికో, ఫ్యాషన్ కోసమో పాదానికి అనువుగా లేని పాదరక్షలను వాడినా ఇలాంటి అనర్థాలు ఉంటాయంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement