'టీఆర్ఎస్తో పొత్తుకు సీపీఎం సిద్దం' | CPM Ready to alliance with TRS, says Tammineni Veerabhadram | Sakshi
Sakshi News home page

'టీఆర్ఎస్తో పొత్తుకు సీపీఎం సిద్దం'

Apr 1 2014 1:53 PM | Updated on Jul 11 2019 9:08 PM

'టీఆర్ఎస్తో పొత్తుకు సీపీఎం సిద్దం' - Sakshi

'టీఆర్ఎస్తో పొత్తుకు సీపీఎం సిద్దం'

టీఆర్ఎస్తో పొత్తుకు సిద్ధమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.

హైదరాబాద్: టీఆర్ఎస్తో పొత్తుకు సిద్ధమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. శాసనసభ ఎన్నికలకు పోటీ చేసే 12 మంది అభ్యర్థుల పేర్లను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమతో పొత్తుకు టీఆర్ఎస్ ముందుకు వస్తే చర్చలకు సిద్ధమని చెప్పారు. పొత్తులు ఖరాయితే ఇప్పుడు ప్రకటించిన నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే అవకాశముందని తెలిపారు. ఈనెల 5న తుది జాబితా ప్రకటిస్తామన్నారు.

కాంగ్రెస్‌, బీజేపీ వ్యతిరేక ఇండిపెండెంట్లకు మద్దతిస్తామని అన్నారు. మల్కాజ్‌గిరి లోక్సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ నాగేశ్వర్కు మద్దతు ఇచ్చే విషయంపై పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. సీపీఐ కార్యదర్శి కె. నారాయణ ఎంపీగా పోటీ చేస్తే సంతోకరమే అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement