'మా అబ్బాయి ఏ తప్పు చేయలేదు' | my son didn't any mistake, says peddireddy ramachandra reddy | Sakshi
Sakshi News home page

'మా అబ్బాయి ఏ తప్పు చేయలేదు'

Jan 17 2016 10:45 AM | Updated on Sep 3 2017 3:48 PM

'మా అబ్బాయి ఏ తప్పు చేయలేదు'

'మా అబ్బాయి ఏ తప్పు చేయలేదు'

తన కుమారుడు మిథున్ రెడ్డి ఏ తప్పు చేయలేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

చిత్తూరు: తన కుమారుడు మిథున్ రెడ్డి ఏ తప్పు చేయలేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తన కుమారుడిని అకారణంగా అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. న్యాయస్థానంలో తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మిథున్ రెడ్డి అరెస్ట్ కు నిరసనగా రేణిగుంట మండలం గాజుల మన్నెం వద్ద తిరుపతి-చెన్నై హైవేపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాల్ మనీ కేసులో టీడీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. ఇసుక, మద్యం దందా గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారతారని మండిపడ్డారు. తన కుమారుడిని క్రమశిక్షణగా పెంచానని, ఆయన మచ్చలేని జీవితం గురించి అందరికీ తెలుసునని అన్నారు. ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాస్ తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement