షోకాజ్‌ నోటీసు అందింది: జేసీ దివాకర్‌రెడ్డి | Diwakar Reddy gets showcause notice for Sonia bashing | Sakshi
Sakshi News home page

షోకాజ్‌ నోటీసు అందింది: జేసీ దివాకర్‌రెడ్డి

Jan 1 2014 2:18 PM | Updated on Oct 22 2018 9:16 PM

షోకాజ్‌ నోటీసు అందింది: జేసీ దివాకర్‌రెడ్డి - Sakshi

షోకాజ్‌ నోటీసు అందింది: జేసీ దివాకర్‌రెడ్డి

యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీపై వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసు తనకు అందిదంటూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి బుధవారం స్పష్టం చేశారు.

హైదరాబాద్: యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీపై వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసు తనకు అందిదంటూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి బుధవారం స్పష్టం చేశారు. దీనిపై వివరణకు తనకు వారం రోజుల గడువు ఇచ్చారని జేసీ చెప్పారు.

కాగా, అంతకమందు  షోకాజ్‌ నోటీసు జారీ చేశామని దిగ్విజయ్‌ సింగ్‌ చెప్పినా... ఆ నోటీసేది తనకందలేదని జేసీ దివాకర్‌ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌లో తనందరికంటే సీనియర్‌నని...కాంగ్రెస్‌లోనే కొనసాగాలన్నది  తన అభిమతమని జేసీ అన్నారు.  కాని పార్టీ పెద్దలు మాత్రం తాను వెళ్లిపోవాలని పోరుతున్నారని తెలిపారు. సోనియాగాంధీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే సీనియర్ మంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. జేసీ సమాధానం ఆధారంగా ఆయనపై చర్యలుంటాయని దిగ్విజయ్ సింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement