వ్యభిచార గృహంపై దాడి, ముగ్గురు రిమాండ్ | Brothel house raided at LB Nagar | Sakshi
Sakshi News home page

వ్యభిచార గృహంపై దాడి, ముగ్గురు రిమాండ్

Nov 11 2013 10:00 PM | Updated on Oct 17 2018 6:06 PM

ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తుండగా ఎల్‌బీనగర్ పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

హైదరాబాద్: ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తుండగా ఎల్‌బీనగర్ పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... న్యూనాగోలు కాలనీలో ఓ ఇంట్లో సూర్యాపేటకు చెందిన నాగన్న, నిజామాబాద్‌కు చెందిన సుధారాణిలు వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడిచేయగా రాజమండ్రికి చెందిన ఓ యువతి(22), నిర్వాహకులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మరో యువకుడు పారిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement