HIT 3 Movie
-
నా కొడుకుకి హిట్ 3 సినిమా చూపించను : నాని
నాని(Nani) హీరోగా నటించిన హిట్ 3(HIT 3 ) సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హిట్ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రమిది. మొదటి భాగంలో విశ్వక్ సేన్, రెండో భాగంలో అడివి శేష్ హీరోగా నటించారు. ఇక మూడో భాగంలో అర్జున్ సర్కార్‌గా నాని అలరించబోతున్నాడు. అయితే మొదటి రెండు భాగాలు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ కాగా.. హిట్ 3 మాత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఇందులో రక్తపాతం అధికంగా ఉండబోతుందట. అందుకే సెన్సార్ సభ్యులు ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేశారు. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) కొన్ని మార్పులు చేయాలని చిత్రబృందానికి సూచించింది. ఈ లెక్కన సినిమా వయోలెన్స్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. హీరో నాని కూడా వయోలెన్స్ ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నాడు. అంతేకాదు పిల్లలు ఎవరూ ఈ సినిమా చూడొద్దని విజ్ఞప్తి చేశాడు. తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. ‘హిట్ 3లో వయోలెన్స్ ఎక్కువగానే ఉంటుంది. నా పిల్లలకు ఈ చిత్రం చూపించను. టీజర్, ట్రైలర్ కూడా చూపించలేదు. వాళ్లకు హిట్ 3 అనే ఒక సినిమా వస్తుందని తప్పా..అందులో నేను ఎలా నటించాననే విషయం తెలియదు. మీరు(ప్రేక్షకులు) కూడా మీ పిల్లలకు ఈ సినిమా చూపించకండి. 18 ఏళ్లు పైబడిన వాళ్లు మాత్రమే ఈ సినిమాకి రండి. చాలా ఎంజాయ్ చేస్తారు’ అని నాని చెప్పారు. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం మే 1న రిలీజ్ కానుంది. -
ఫేమస్ అవగానే మారిపోతారు.. అలాంటి క్రేజ్ నాకొద్దని..: నాని
హీరోహీరోయిన్లు సినిమా కోసం ఎంతైతే కష్టపడుతున్నారో ప్రమోషన్ల కోసం కూడా అంతే కష్టపడుతున్నారు. నాని (Nani), శ్రీనిధి శెట్టి జంటగా నటించిన చిత్రం హిట్ 3: ది థర్డ్ కేస్. ఈ సినిమా రేపు (మే 1న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో నాని దేశంలోని ప్రధాన నగరాలను చుట్టేస్తున్నాడు. ఇటీవల ముంబైలో ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని తన భయాన్ని బయటపెట్టాడు.మారిపోతానేమోనని భయంనాని మాట్లాడుతూ.. పాపులారిటీ పెరిగితే నేనేమైనా మారిపోతానేమో, నన్ను నేను కోల్పోతానేమో అన్న భయం ఉండేది. నా ఆలోచనల్లో, నా ప్రవర్తనలో ఏమైనా మార్పు వస్తుందేమో అన్న అనుమానం కలిగేది. ఎందుకంటే నా చుట్టూ ఉన్న కొందరు నిజంగానే వారి స్థాయి పెరిగేకొద్దీ మారిపోయారు. అయితే ఏళ్లు గడిచేకొద్దీ.. ఫేమ్ వచ్చినంతమాత్రాన మనలో మార్పు రాదని తెలుసుకున్నాను. అసలు పాపులారిటీకి, మన వ్యక్తిత్వానికి సంబంధమే లేదని అర్థమైంది. రానురానూ అర్థమైందిమనం ఆ క్రేజ్‌ను ఎంతవరకు కంట్రోల్ చేస్తున్నామనేది మన చేతుల్లోనే ఉంటుంది. కొందరేమంటారంటే.. మొన్నటివరకు బాగుండేవాడు, ఇప్పుడు ఫేమస్ అవగానే మంచిగా ఉన్నట్లు నటిస్తున్నాడంతే.. అని కామెంట్లు చేస్తుంటారు. నిజానికి పాపులారిటీ మనల్ని మార్చదు. మనమే మారిపోతుంటాం. ఆ ఒక్క విషయం నేను బాగా అర్థం చేసుకున్నాను. అందుకే నన్ను నేను కోల్పోతానేమో అన్న భయం నుంచి బయటపడ్డాను అని చెప్పుకొచ్చాడు.సినిమాహిట్ 3 సినిమా విషయానికి వస్తే.. హిట్ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రమిది. మొదటి భాగంలో విశ్వక్ సేన్, రెండో భాగంలో అడివి శేష్ పోలీస్‌గా నటించగా ఇప్పుడు మూడో పార్ట్‌లో నాని.. అర్జున్ సర్కార్ అనే పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నాడు. శ్రీనిధి శెట్టి ఈ చిత్రంతో కథానాయికగా టాలీవుడ్‌కు పరిచయమవుతోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.చదవండి: విడాకుల తర్వాత కొత్తిల్లు కొన్న నటి.. 'నేను పేదదాన్ని అని చెప్పానా? -
'హిట్ 3' నిర్మాత నేనే.. కానీ బడ్జెట్ ఎంతైందో తెలీదు
నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3. మే 1న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు అంటూ నానితో పాటు హీరోయిన్ శ్రీనిధి శెట్టి తెగ తిరిగేశారు. వరస ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ అంటూ చాలా కష్టపడ్డారు. ఫలితం ఏంటనేది మరికొన్ని గంటల్లో తెలుస్తోంది.(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) హిట్ 3 సినిమాలో హీరోగా చేసిన నానినే.. నిర్మాతగానూ వ్యవహరించాడు. ఇతడికి చెందిన వాల్ పోస్టర్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. బడ్జెట్ గురించి రకరకాల నంబర్స్ వినిపించాయి. రూ.60 కోట్లు అని రూ.80 కోట్లు అని కూడా అన్నారు. దీని గురించే ఓ ఇంటర్వ్యూలో నానిని అడగ్గా.. ఈ మూవీ కోసం ఎంత ఖర్చు పెట్టాననేది తనకు తెలియదని చెప్పుకొచ్చాడు.నిర్మాణ వ్యవహారాలు చూసుకునేందుకు ఓ టీమ్ ఉందని, వాళ్లు అడిగిన దానికోసం ఖర్చు పెట్టడం తప్పితే బడ్జెట్ గురించి తనకు అస్సలు తెలియదని నాని అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 'హిట్' ఫ్రాంచైజీలో వచ్చిన గత రెండు చిత్రాలు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ కాగా.. ఈసారి విపరీతమైన యాక్షన్ జోడించారు.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) తెలుగులో హిట్ 3 తప్పితే వేరే సినిమాలేం రిలీజ్ కావట్లేదు. మరోవైపు తమిళంలో సూర్య 'రెట్రో', హిందీలో అజయ్ దేవగణ్ 'రైడ్ 2' చిత్రాలు మే 1న థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి వీటిలో ఏది హిట్ అవుతుందనేది చూడాలి?హిట్ 3 విడుదలకు సిద్ధం చేసిన నాని.. త్వరలో 'ప్యారడైజ్' షూటింగ్ లో జాయిన్ అవుతాడు. ఇది అయిన తర్వాత సుజీత్ తో సినిమా చేస్తాడు. ఇదే కాకుండా మెగాస్టార్ చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల చిత్రానికి నిర్మాత కూడా నానినే. ఇలా నాని లైనప్ స్ట్రాంగ్ గా ఉంది.(ఇదీ చదవండి: పవన్ కొడుక్కి సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్!) #Nani Said I’m the PRODUCER Of #HIT3 Film But I Don’t Know the BUDGET of the Film. pic.twitter.com/GfhSLToShQ— GetsCinema (@GetsCinema) April 30, 2025 -
సల్మాన్ ‘సౌత్’ వ్యాఖ్యలపై స్పందించిన నాని!
‘దక్షిణాది అభిమానులు మాపై(బాలీవుడ్ హీరోలు) చూపిస్తున్న ప్రేమను థియేటర్ వరకు తీసుకెళ్లరు’ అని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) చేసిన వ్యాఖ్యలు ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ హీరో నాని(Nani) స్పందిస్తూ..బాలీవుడ్ చిత్రాలను దక్షిణాది ప్రేక్షకులు తరతరాలుగా ఆదరిస్తున్నారని గుర్తు చేశారు. ఒకవేళ వారంతా నిజంగానే ఆదరించరనేదే నిజమైతే వాళ్లు(బాలీవుడ్ హీరోలు) సూపర్ స్టార్స్ ఎలా అయ్యారని ప్రశ్నించారు. ‘దక్షిణాది చిత్రాలు ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నాయి. కానీ అంతకంటే ముందు హిందీ చిత్రాలను అందరూ ఆదరించారు. ఎన్నో దశాబ్దాలుగా సౌత్ ఆడియన్స్ బాలీవుడ్ సినిమాలపై ఆదరాభిమానాలు చూపిస్తూనే ఉన్నారు. బాలీవుడ్ హీరోలకు ఇక్కడ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అమితాబ్ నటించిన ఎన్నో చిత్రాలు సౌత్‌లో సూపర్ హిట్‌గా నిలిచాయి. సల్మాన్ ఖాన్‌కు ఇక్కడ(సౌత్) చాలా మంది అభిమానులు ఉన్నారు.‘హమ్ ఆప్కే హై కౌన్’ సినిమా నాకు చాలా ఇష్టం. ‘దీదీ తేరా దీవానా’ పాట ఇక్కడి పెళ్లిళ్లలో ఎన్నోసార్లు విన్నాం. ఆయన నటించిన చిత్రాలెన్నో ఇక్కడ భారీ విజయాన్ని అందుకున్నాయి. అందరూ ఆదరించారు కాబట్టే వాళ్లు సూపర్ స్టార్స్ అయ్యారు. బహుశా సల్మాన్ వ్యాఖ్యలను మనం తప్పుగా అర్థం చేసుకున్నామేమో. బాలీవుడ్ సినిమాలకు సౌత్‌లో మంచి ఆదరణ ఉంటుంది’ అని నాని చెప్పుకొచ్చారు. కాగా, సికిందర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ మాట్లాడుతూ.. ‘సౌత్ హీరోల సినిమాలు బాలీవుడ్లో మంచి విజయం సాధిస్తున్నాయి. రజనీకాంత్, చిరంజీవి, సూర్య, రామ్ చరణ్ లాంటి హీరోల సినిమాలు అక్కడ(బాలీవుడ్) మంచి వసూళ్లను రాబడుతున్నాయి. ఎందుకంటే వారి సినిమాను మేమంతా థియేటర్స్‌కి వెళ్లి చూస్తాం. కానీ వారి అభిమానులు మాత్రం మా(హిందీ )సినిమాలు చూడడానికి అంతగా ఆసక్తి చూపించరు. నేను రోడ్లపై కనిపిస్తే..‘భాయ్..భాయ్’ అంటూ ప్రేమను చూపిస్తారు కానీ..అదే ప్రేమతో థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూడరు’ అని అన్నారు. ఇక నాని సినిమాల విషయానికొస్తే.. ఆయన హీరోగా నటించిన ‘హిట్ 3’(HIT 3) మే 1న విడుదల కాబోతుంది. ‘హిట్’ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన ఈ మూడో సినిమా ఇది. శైలేష్ కొలను దర్శకుడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. -
‘హిట్ 3’ ప్రీ రిలీజ్లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి క్యూట్ ఎక్స్ప్రెషన్ (ఫొటోలు)
-
హిట్ 3 నచ్చకపోతే SSMB29 సినిమా చూడొద్దు.. నాని ఇరికించేశాడుగా!
నేచురల్ స్టార్ నాని (Nani) యాక్షన్ అవతార్‌లో కనిపించనున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో నటించిన హిట్ 3: థర్డ్ కేస్ మూవీ (HIT: The Third Case) మే 1న విడుదల కానుంది. ఆదివారం (ఏప్రిల్ 27) ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అలాగే హిట్ 1 హీరో అడివి శేష్, హిట్ 2 హీరో విశ్వక్ సేన్ అతిథులుగా వచ్చారు.ప్రేమగా హగ్ ఇచ్చారంటే..ఈ వేదికపై నాని మాట్లాడుతూ.. నా ప్రతి సినిమా మార్నింగ్ షోకి ప్రసాద్ ఐమ్యాక్స్‌కి వెళతాను. వెళ్లే ముందే రాజమౌళిగారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారా? అని చెక్ చేసుకుని, థియేటర్లో వాళ్ల రియాక్షన్ చూస్తుండేవాడిని. సినిమా అయిపోయాక వల్లీగారు, రమగారిని టాక్ అడిగేవాడిని. ప్రేమగా హగ్ ఇచ్చి వెళ్లిపోయారంటే నచ్చలేదని అర్థం. కారు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్ చేస్తాం అన్నారంటే సినిమా బాగుందని అర్థం. అయితే ఈ మధ్య థియేటర్‌కి వెళ్లకపోవడంతో ఈ అలవాటుకు కాస్త బ్రేక్ పడింది.సొంత సినిమాలా ప్రమోషన్స్..ఈ మే 1న రాజమౌళి (SS Rajamouli) మార్నింగ్ షో చూడాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఆ రోజు ఆయనకు ఏదైనా పనులుంటే తన పాస్‌పోర్ట్ లాగేసుకుంటాను. శ్రీనిధి శెట్టి గురించి చెప్పాలి. మేమిద్దరం ఇచ్చిన ఇంటర్వ్యూలకు సినిమాలో సగం లవ్‌స్టోరీనే ఉంటుందేమో అనుకుంటున్నారు. కానీ, అలాంటిదేం ఉండదు. ప్రమోషన్స్ కూడా ఒక్కటీ మిస్ అవకుండా తన సొంత సినిమాలా చేసింది. సినిమా సక్సెస్ ఈవెంట్లో ఇంకా ఎక్కువ మాట్లాడతాను.హిట్ 3 నచ్చకపోతే..కోర్ట్ సినిమా నచ్చకపోతే హిట్ 3 చూడొద్దని చెప్పాను. ఈసారి ఎవరిని తాకట్టుపెడదాం అని చూస్తున్నాను. హిట్ 3 మీ అంచనాలను అందుకోలేకపోతే వచ్చే ఏడాది రిలీజవుతున్న SSMB29 (సూపర్‌స్టార్ మహేశ్‌బాబు- రాజమౌళి కలయికలో వస్తున్న మూవీ)ని చూడొద్దు.. సరదాగా అంటున్నాను. ఆ సినిమాను తాకట్టు పెట్టినా ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే ఆ సినిమా ప్రపంచమంతా చూసి తీరాల్సిందే! మే 1న ఆడియన్స్ కు ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తానని నేను ప్రామిస్ చేస్తున్నా అని నాని అన్నాడు. ఇక ఇదే స్టేజీపై ఫైట్ మాస్టర్ సతీశ్.. శ్రీనిధి శెట్టికి ఒక ఫైట్ సీన్ కూడా ఉందన్న విషయాన్ని లీక్ చేసేశాడు. దీంతో శ్రీనిధి షాకై నోరెళ్లబెట్టింది. వెంటనే అక్కడున్న సుమ.. కథంతా చెప్పేసేలా ఉన్నారని వారించింది. చదవండి: కోర్ట్ తర్వాత సారంగపాణి జాతకం నాకో వరం: ప్రియదర్శి -
నాని ‘హిట్ 3: థర్డ్ కేస్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మహాభారతంలో నాని.. కన్ఫార్మ్ చేసిన రాజమౌళి
‘‘నాని ఏ సినిమా చేసినా హిట్ అని తెలిసిపోతుంటుంది. కానీ తన దగ్గర్నుంచి ఇంకా కావాలని ఓ ఫంక్షన్లో అన్నాను. అయితే నా అంచనాలను మించి నాని చాలా ముందుకెళ్లిపోయాడు. కానీ నానీ... మేం ఇంకా కోరుకుంటూనే ఉంటాం. నువ్వు ఇంకా ముందుకు వెళ్లు’’ అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. నాని హీరోగా నటించిన చిత్రం ‘హిట్ 3: థర్డ్ కేస్’. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్ . శైలేష్ కొలను దర్శకత్వంలో నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దర్శకుడు రాజమౌళి, అతిథులుగా ‘హిట్ 1’లో హీరోగా నటించిన అడివి శేష్, ‘హిట్ 2’లో హీరోగా నటించిన విశ్వక్ సేన్ హాజరయ్యారు. ఈ వేదికపై దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ – ‘‘అ!, హిట్ 1, హిట్ 2, కోర్ట్’... ఆల్ సక్సెస్. వంద శాతం సక్సెస్ అయిన నిర్మాత ప్రశాంతి. ఇండస్ట్రీలో హిట్ మిషన్ అని పిలుచుకుంటుంటాం. ఇప్పుడు ‘హిట్ 3’ సక్సెస్ అవుతుందని నా గట్టి నమ్మకం. ఓ ఫ్రాంచైజీని స్టార్ట్ చేసినప్పుడు అది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. కానీ ‘హిట్ ఫస్ట్ కేస్, సెకండ్ కేస్... చాలా కేస్లు ఉండొచ్చు. శైలేష్ ఏడు సినిమాలే అనుకుని ఉండొచ్చు. కానీ ఈ ఫ్రాంచైజీ ఎప్పటికీ ఉంటుందని అనుకుంటున్నాను. ‘హిట్ 3’ ప్రమోషనల్ కంటెంట్ చూశాను. సినిమా సూపర్ డూపర్ హిట్ అనే వైబ్‌ని క్రియేట్ చేసింది. మే1 థియేటర్స్‌లో... అబ్ కీ బార్ అర్జున్ సర్కార్. హిట్ ది థర్డ్ కేస్’’ అని రాజమౌళి అన్నారు.కాగా.. ఈ వేదికపై ‘‘మీరు తీయబోతున్నటు వంటి ‘మహాభారతం’ సినిమాలో నానీగారి క్యారెక్టర్ ఫిక్స్ అయిందని విన్నాం... నిజమేనా’’ అని యాంకర్ సుమ అడిగితే ‘‘నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్’’ అని రాజమౌళి చెప్పారు. నాని మాట్లాడుతూ– ‘‘నా ప్రతి కొత్త సినిమాకు మార్నింగ్ షోకి ప్రసాద్ ఐమ్యాక్స్‌కి వెళతాను. వెళ్లే ముందే రాజమౌళిగారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారా? అని చెక్ చేసుకుని, థియేటర్లో వాళ్ల రియాక్షన్ చూస్తుండేవాడిని. సినిమా అయిపోయాక వల్లీగారు, రమగారిని టాక్ అడిగేవాడిని. ప్రేమగా హగ్ ఇచ్చి వెళ్లిపోయారంటే నచ్చలేదని అర్థం. ‘చాలా బాగుంది. కారు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్ చేస్తాం’ అంటే సినిమా బాగుందని అర్థం. అయితే ఈ మధ్య థియేటర్‌కి వెళ్లకపోవడంతో కాస్త బ్రేక్ వచ్చింది.ఈసారి ‘హిట్ 3’ సినిమా చూసి, ఆయన (రాజమౌళి) నాకు ఆ మార్నింగ్ షో ఎనర్జీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. రాజమౌళిగారు ఈ మూవీని ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. ఒక థ్రిల్లర్, ఒక మాస్ కమర్షియల్ ఫిల్మ్ కలిస్తే అది ‘హిట్ 3’. మే 1న ఆడియన్స్ కు ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను నానిప్రామిస్ చేస్తున్నాడు’’ అన్నారు. ‘హిట్ 3’ సక్సెస్ అవ్వాలనే ఆకాంక్షను అడివి శేష్, విశ్వక్ సేన్ వ్యక్తం చేశారు. శైలేష్ కొలను, శ్రీనిధీ శెట్టి, కోమలీ ప్రసాద్ తదితరులు మాట్లాడారు. -
కాలి నడకన తిరుమలకు కేజీఎఫ్ బ్యూటీ, నాని.. వీడియో వైరల్
నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన చిత్రం హిట్-3. ఈ మూవీ హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మేడే సందర్భంగా 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవ సమయంలో స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.కాగా.. అంతకుముందు కాలి నడకన శ్రీవారి మెట్లు ఎక్కి తిరుమలకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దర్శన అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా.. ఈ చిత్రంలో నాని అర్జున్ సర్కార్ పాత్రలో అభిమానులను మెప్పించనున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ చూస్తే ఫుల్ వయోలెన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Exclusive visuals of @NameisNani , @SrinidhiShetty7 reaching at Tirumala Tirupati Devasthanam on foot #HIT3 #NaturalStarNani pic.twitter.com/eqztW8zfit— Telugu Film Producers Council (@tfpcin) April 26, 2025 -
ఆ సినిమాని నేను తిరస్కరించలేదు
‘‘తెలుగులో నా తొలి సినిమా ‘హిట్ 3: ది థర్డ్ కేస్’. ఈ సినిమాలో మృదుల అనే పాత్ర చేశాను. ముందు నా క్యారెక్టర్‌కు ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో డబ్బింగ్ చెప్పించారు. కానీ నేనే డబ్బింగ్ చెబితే బాగుంటుందని భావించి, దర్శకుడు శైలేష్గారిని రిక్వెస్ట్ చేస్తే, సరే అన్నారు. అలా నా తొలి తెలుగు సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పాను’’ అని శ్రీనిధీ శెట్టి అన్నారు. నాని హీరోగా నటించిన ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీనిధీ శెట్టి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘హిట్ 3: ది థర్డ్ కేస్’లో స్వతంత్ర భావాలు ఉన్న అమ్మాయి మృదులగా నటించాను. అర్జున్ సర్కార్ (సినిమాలో నాని క్యారెక్టర్ పాత్ర)కు పూర్తి భిన్నమైన మనస్తత్వం మృదులది. సినిమాలో అర్జున్ ఎవరి మాటన్నా వింటాడంటే అది మృదల మాటే. ‘హిట్ 3’లాంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చిత్రాల్లో హీరోయిన్ పాత్రకు స్కోప్ తక్కువ ఉండొచ్చనుకుంటారు. కానీ ఈ మూవీలో మృదుల పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. ఇక నా కెరీర్లో ఇప్పటివరకు యాక్షన్ చిత్రాలే ఉన్నాయి. ‘కేజీఎఫ్’ సినిమాలో ఉన్న డైలాగ్ మాదిరి... ‘ఐ డోంట్ లైక్ వయొలెన్స్... బట్ వయొలెన్స్ లైక్స్ మీ’ (నవ్వుతూ) అన్నట్లు నాకు యాక్షన్ సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో ‘తెలుసు కదా’ మూవీ చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘హిందీ ‘రామాయణ’ సినిమాలోని సీత పాత్రకు ఆడిషన్ ఇచ్చాను. అప్పటికే ఈ పాత్ర కోసం మేకర్స్ ఆలియా భట్, సాయిపల్లవిలను కూడా సంప్రదించారు. సాయిపల్లవి ఫైనలైజ్ అయ్యారు. అంతేకానీ... నేను ఆ సినిమాను రిజెక్ట్ చేయలేదు. కానీ నేను రిజెక్ట్ చేసినట్లుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అంత పెద్ద సినిమాను నేనెందుకు తిరస్కరిస్తాను’’ అన్నారు. -
'హిట్ 3' కోసం అనిరుధ్.. వీడియో సాంగ్ రిలీజ్
నాని(Nani) హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ హిట్ 3(HIT 3 Movie). మే 1న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ముంబయి, కేరళ అంటూ నాని తెగ తిరిగేస్తున్నాడు. మరోవైపు ఇన్వెస్టిగేషన్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా నుంచి ఇప్పుడో పాట రిలీజ్ చేశారు. దీన్ని అనిరుధ్ పాడటం విశేషం.హిట్ 3 మూవీ నుంచి ఇదివరకే ప్రేమ వెల్లువ, అభీ బార్ అర్జున్ సర్కార్ అనే పాటలు రిలీజయ్యాయి. ఇప్పుడు 'తను..' అంటే సాగే గీతాన్ని రిలీజ్ చేశారు. ఇందులో పోలీస్ స్టేషన్ లో ఉన్న నాని.. హీరోయిన్ కోసం పాడే సాంగ్ ఇదని అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) దీన్ని మిక్కీ జే మేయర్ కంపోజ్ చేయగా.. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) పాడాడు. స్వతహాగా సినిమాలకు కంపోజ్ చేసే అనిరుధ్.. కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. కానీ పాడటానికి మాత్రం రూపాయి కూడా తీసుకోడు. గతంలో అతడే ఈ విషయం చెప్పాడు. ఇప్పుడు కూడా నాని కోసమే అనిరుధ్ ఈ పాట పాడినట్లు అనిపిస్తుంది. గతంలో నాని 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్' చిత్రాలకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు. నెక్స్ట్ రాబోయే 'ప్యారడైజ్' కూడా ఇతడే సంగీతమందించబోతున్నాడు. అలా వీళ్లిద్దరి మధ్య ఉన్న బాండింగ్ దృష్ట్యా హిట్ 3లో అనిరుధ్ పాట పాడినట్లున్నాడు.(ఇదీ చదవండి: పహల్గాం ఘటన.. సింగర్ చిన్మయి కాంట్రవర్సీ పోస్ట్) -
నేచురల్ స్టార్ నాని 'హిట్ 3' మూవీ స్టిల్స్
-
నాని హిట్-3.. సెన్సార్ బోర్డ్ కట్స్ ఇవే!
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'హిట్: ది థర్డ్ కేస్'. హిట్ సిరీస్‌లో వస్తోన్న మూడో చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వంలోనే తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఇందులో మోస్ట్ వయోలెన్స్‌తో నాని కనిపించారు. సినిమా రిలీజ్‌కు రెండు వారాల ముందే ట్రైలర్ విడుదల చేసిన మూవీ టీమ్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సూపర్ హిట్ అవుతుందని నాని ఫుల్ ధీమాగా ఉన్నారు.తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ట్రైలర్లోనే ఓ రేంజ్లో వయోలెన్స్ చూపించడంతో సెన్సార్ ఏ సర్టిఫికేట్ మాత్రమే జారీ చేసింది. అంతేకాకుండా కొన్ని సీన్స్ మార్పులు చేయాలని సూచించింది. అలాగే అభ్యంతరకర పదాలు మ్యూట్ చేయాలని ఆదేశించింది. రక్తం కనిపించే సన్నివేశాల్లో రెడ్ కలర్‌ను డార్క్ చేయాలని సూచించింది. కాగా.. ఈ మూవీ రన్ టైమ్ దాదాపు రెండుగంటల 37 నిమిషాలుగా ఉండనుంది. అలా మార్పులు చేయడంతోనే సెన్సార్ బోర్ట్ ఓకే టెప్పింది. కాగా.. ఈ చిత్రంలో నాని.. అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నారు. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
నాని కి గట్టి పోటీ ఇవ్వనున్న రెట్రో & రైడ్ 2
-
గట్టిగా క్లాస్ పీకాను.. అప్పటినుంచి రెచ్చిపోయాడు: నాని
హీరో నాని నుంచి కొత్త సినిమా రాబోతుంది. అదే 'హిట్ 3'. గతంలో వచ్చిన రెండు చిత్రాలకు కొనసాగింపుగా దీన్ని తీశారు. మే 1న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు గత కొన్నిరోజులుగా ప్రమోషన్స్ చేస్తున్న నాని.. తాజాగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. మిగతా వాటి సంగతేమో గానీ దర్శకుడికి ఓసారి క్లాస్ పీకిన సందర్భం గురించి బయటపెట్టాడు.'శైలేష్ ఫస్ట్ షెడ్యూల్ లో మొహమాట పడేవాడు. అన్నింటికీ నన్ను మెంటార్ లా చూసి అన్నీ నన్ను అడిగేవాడు. నన్నేం అడగకు అని ఒక్కసారి గట్టిగా క్లాస్ పీకాను. నీకు మంచి సినిమా సెన్స్ ఉందని చెప్పా. అప్పటి నుంచి రెచ్చిపోయాడు' అని నాని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన టాలీవుడ్ స్టార్ సింగర్)నాని ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. దీనికి తోడు ఈ మూవీతో హిట్ కొడతానని పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే నాని నమ్మకం నిజమయ్యేలా కనిపిస్తుంది.హిట్ ఫ్రాంచైజీలో తొలి రెండు చిత్రాలు ఇన్వెస్టిగేషన్ తరహాలో తీస్తే ఇప్పుడు రాబోతున్న హిట్ 3 మాత్రం యాక్షన్, రక్తపాతం అనేలా తీశారు. ఇప్పటికే పిల్లలు, సున్నిత మసస్కులు తన సినిమా చూసేందుకు రావొద్దని నాని క్లారిటీ ఇచ్చేశాడు కూడా.(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) -
మొదటి రోజే సినిమా రివ్యూలు.. హీరో నాని రియాక్షన్ ఏంటంటే?
టాలీవుడ్ హీరో నాని ప్రస్తుతం హిట్-3 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హిట్ సిరీస్‌లో భాగంగా వస్తోన్న మూడో చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే హిట్-3 ట్రైలర్ విడుదల కాగా.. యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. ఇంతకుముందెన్నడు కనిపించని వయోలెన్స్ పాత్రలో నాని కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు నాని. ఈ సందర్భంగా మూవీ రివ్యూల అంశంపై ఆయన స్పందించారు. విడుదల రోజే రివ్యూలు ఇవ్వడం వల్ల సినిమాలపై ప్రభావం ఉంటుందని గత కొద్ది రోజులుగా టాలీవుడ్లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాని కామెంట్స్‌పై ఈ అంశంపై హీరో నాని మాట్లాడుతూ....' రివ్యూలపై ఎందుకు ఆగాలి? ఎందుకు ఆపాలి.. ఎవర్ని ఆపాలి... ఎలా ఆపాలి... ఇప్పుడు ఎవరినీ ఆపలేరు? నాకు నచ్చలేదు అనండి ఓకే. కానీ ఈ సినిమా ఆడదు అని చెప్పకండి. ఈ మూవీ డిజాస్టర్ అని ఒక్కరోజులో ఎలా చెప్తారు. సినిమా విడుదలైనా పది రోజులైనా ఎవరూ చూడకపోతే అప్పుడు పెట్టండి డిజాస్టర్ అని. ఫస్డ్ డే మార్నింగ్ షోకే ఎలా డిసైడ్ చేస్తారు. వ్యక్తిగతంగా సినిమాపై అభిప్రాయం ఎలా వ్యక్తం చేసినా ఓకే. కానీ మీడియా ప్రొఫెషనల్స్ అలా చేయడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం' అని అన్నారు.కాగా.. ఈ చిత్రంలో నాని.. అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నారు. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
ట్రిపుల్ ట్రీట్.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే హిట్ అయిన కథలకు కొనసాగింపుగా రెండు లేదా మూడు భాగాలుగా సినిమా తీయడానికి, అదేవిధంగా ఒకే కథను రెండు మూడు భాగాలుగా చెప్పడానికి ఆసక్తి చూపిస్తున్నారు మేకర్స్. పైగా సీక్వెల్స్ చిత్రాలకు అటు ప్రేక్షకుల్లో ఇటు ట్రేడ్ వర్గాల్లో ఫుల్ క్రేజ్ ఉండటంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఫుల్‌గా ఉంటున్నాయి.దీంతో సీక్వెల్స్ తీయడానికి దర్శక–నిర్మాతలు, హీరోలు ఏమాత్రం ఆలోచించకుండా సై అంటున్నారు. ప్రస్తుతం తెలుగులో పలు సినిమాలు మూడో భాగంతో అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుండగా, మరికొన్ని చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అదే విధంగా ఇంకొన్ని సినిమాలకు మూడో భాగం ఉంటుందని ప్రకటించారు మేకర్స్. ‘ట్రిపుల్ ట్రీట్’ అంటూ ముచ్చటగా మూడో భాగంతో రానున్న ఆ సీక్వెల్స్ విశేషాలేంటో చూద్దాం. పుష్పరాజ్... తగ్గేదే లే హీరో అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ సుకుమార్‌లది హిట్ కాంబినేషన్ . వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ఆర్య’ (2004) సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఆర్య 2’ (2009) కూడా విజయం సాధించింది. దాదాపు పన్నెండేళ్ల గ్యాప్ అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. రష్మికా మందన్న హీరోయిన్గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం 2021 డిసెంబరు 17న విడుదలై పాన్ ఇండియా హిట్‌గా నిలిచింది. పుష్పరాజ్‌గా తన నటనకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ‘పుష్ప: ది రైజ్’కి సీక్వెల్‌గా ఇదే కాంబోలో వచ్చిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. తొలి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగంపై అంచనాలు తారస్థాయిలో ఉండేవి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గేదే లే అంటూ బ్లాక్‌బస్టర్ అందుకుంది ‘పుష్ప 2: ది రూల్’. 2024 డిసెంబరు 5న రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1800 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డును సృష్టించింది. ఇక ఈ సీక్వెల్లో మూడో భాగం ఉంటుందని ‘పుష్ప 2: ది రూల్’ ప్రమోషన్స్‌లో హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.మూడో భాగానికి ‘పుష్ప: ది రోర్’ అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారనే వార్తలు వినిపించాయి. అదేవిధంగా అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాలకు సీక్వెల్‌గా ‘ఆర్య 3’ మూవీ ఉంటుందట. ఈ విషయాన్ని కూడా సుకుమార్ ఓ సందర్భంలో చెప్పారు. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకులు త్రివిక్రమ్, అట్లీ సినిమాలు కమిట్ అయ్యారు. ఆ రెండు సినిమాల తర్వాతే సుకుమార్ కాంబినేషన్లో మూవీ ఉంటుందని ఊహించవచ్చు. మరి ‘పుష్ప’ మూడో భాగం, ‘ఆర్య 3’.. ఈ రెండిట్లో ఏది ముందుగా సెట్స్‌పైకి వెళుతుందనేది తెలియాలంటే చాలా సమయం పట్టవచ్చని ఫిల్మ్‌నగర్ టాక్. అర్జున్ సర్కార్ వస్తున్నాడు‘క్రిమినల్స్ ఉంటే భూమ్మీద పదడుగుల సెల్లో ఉండాలి... లేకుంటే భూమిలో ఆరడుగుల గుంతలో ఉండాలి’, ‘జనాల మధ్య ఉంటే అర్జున్... మృగాల మధ్య ఉంటే సర్కార్’ అంటున్నారు నాని (Nani). ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020), అడివి శేష్ హీరోగా నటించిన ‘హిట్: ది సెకండ్ కేస్’ (2022) వంటి హిట్ చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందిన మూడో చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. తొలి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను (Sailesh Kolanu) మూడో భాగాన్ని కూడా తెరకెక్కించారు. తొలి రెండు భాగాలను వాల్ పోస్టర్ సినిమాపై నిర్మించిన నాని ‘హిట్: ది థర్డ్ కేస్’లో హీరోగా నటించడం విశేషం. ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి కథానాయికగా నటించారు. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్‌పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ మూవీలో అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా నాని కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. దీంతో తొలి, మలి భాగాల్లానే మూడో భాగంతోనూ హ్యాట్రిక్ హిట్ అందుకుంటామనే బలమైన నమ్మకంతో ఉన్నారు మేకర్స్. కాగా ‘హిట్’ ఫ్రాంచైజీలో మొత్తం ఏడు భాగాలు ఉంటాయని డైరెక్టర్ శైలేష్ కొలను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. నాలుగురెట్ల నవ్వులు హీరో వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)లది సక్సెస్ఫుల్ కాంబినేషన్. వీరి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి కానుకగా ఈ జనవరి 14న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దాదాపు రూ.300 కోట్లకుపైగా వసూళ్లు సాధించి వెంకటేశ్ కెరీర్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే.. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’. 2019 జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్లో నవ్వులు పూయించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ‘ఎఫ్ 2’ కాంబినేషన్లోనే ఆ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘ఎఫ్ 3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’. 2022 మే 27న విడుదలైన ‘ఎఫ్ 3’ కూడా మంచి విజయం సాధించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన తొలి, ద్వితీయ భాగాలు సూపర్ హిట్ అయ్యాయి. కాగా ఈ ఫ్రాంచైజీలో ‘ఎఫ్–4’ మూవీ ఉంటుందని ‘ఎఫ్ 3’ చిత్రం ఎండింగ్లో ప్రకటించారు మేకర్స్. అయితే ఈ చిత్రం ఇంకా పట్టాలెక్కలేదు. కానీ, ఈ గ్యాప్‌లో వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సూపర్ హిట్ అందుకుంది.ప్రస్తుతం చిరంజీవి హీరోగా ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు అనిల్ రావిపూడి. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాతే ‘ఎఫ్ 4’ సెట్స్‌కి వెళ్లే అవకాశాలున్నాయని ఫిల్మ్‌నగర్ టాక్. ‘ఎఫ్–2’, ‘ఎఫ్–3’లతో పోలిస్తే ‘ఎఫ్ –4’లో నవ్వులు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటాయట. ఈ చిత్రంలో వెంకటేశ్, వరుణ్ తేజ్‌తో పాటు మరో అగ్ర హీరో కూడా నటిస్తారని సమాచారం. మరి... ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టేదెప్పుడో తెలియాలంటే వేచి చూడాలి. ఓదెల 3 హీరోయిన్ తమన్నా (Tamannaah Bhatia) లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్.సింహా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందింది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన అశోక్ తేజ ద్వితీయ భాగానికి కూడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి.మధు నిర్మించిన ఈ మూవీ గురువారం (ఏప్రిల్ 17న) విడుదలైంది. తొలిసారి నాగసాధువు భైరవి పాత్రలో తమన్నా నటించారు. ప్రేతాత్మ తిరుపతిగా వశిష్ఠ నటించారు. ఈ మూవీలో తమన్నా నటన హైలైట్‌గా నిలిచింది. ‘ఓదెల రైల్వేస్టేషన్’ ఓటీటీలో విడుదలైనా మంచి హిట్‌గా నిలవడంతో ‘ఓదెల 2’పై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ నెలకొంది. కాగా ఈ సినిమాకి కొనసాగింపుగా ‘ఓదెల 3’ ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించడం విశేషం.తొలి, మలి భాగాలకు మించి... హీరో నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు చందు మొండేటిలది సూపర్ హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి. వీరిద్దరి కలయికలో వచ్చిన మొదటి సినిమా ‘కార్తికేయ’ (2014) సూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ‘కార్తికేయ 2’ 2022 ఆగస్టు 13న విడుదలై పాన్ ఇండియా హిట్ అందుకుంది. అంతేకాదు... రూ. 100కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాటు 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవడం విశేషం. ఈ కోవలోనే ‘కార్తికేయ 3’ ఉంటుందని దర్శకుడు చందు మొండేటి, నిఖిల్ సిద్ధార్థ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘కార్తికేయ, కార్తికేయ 2’ సూపర్ హిట్స్ కావడంతో ‘కార్తికేయ 3’పై అటు ఇండస్ట్రీలో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు, క్రేజ్ నెలకొన్నాయి. అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ మూవీ తొలి, ద్వితీయ భాగాలకు మించి అద్భుతంగా ఉంటుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. నాగచైతన్య హీరోగా ‘తండేల్’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న చందు మొండేటి ప్రస్తుతం ‘కార్తికేయ 3’కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌పై పని చేస్తున్నారు. అదేవిధంగా నిఖిల్ ప్రస్తుతం ‘స్వయంభూ’ సినిమా చేస్తున్నారు. మరి ‘కార్తికేయ 3’ పట్టాలెక్కే సమయం ఎప్పుడు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. టిల్లు క్యూబ్‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాలతో ప్రేక్షకులను తనదైన యాటిట్యూడ్, మేనరిజమ్‌తో నవ్వించారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ ఫ్రాంచైజీలో రూపొందనున్న మూడో చిత్రం ‘టిల్లు క్యూబ్’. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాకి సీక్వెల్‌గా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. 2024 మార్చి 29న రిలీజైన ఈ మూవీ తొలి భాగం మంచి హిట్‌గా నిలిచింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ రూ.వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి, సిద్ధు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ సినిమా తెరకెక్కనున్నట్లు యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి తొలి, మలి భాగాలకు దర్శకత్వం వహించిన విమల్ కృష్ణ, మల్లిక్ రామ్ కాకుండా కల్యాణ్ శంకర్(మ్యాడ్ ఫేమ్) దర్శకత్వం వహించనుండటం విశేషం. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు... ‘టిల్లు క్యూబ్’లో హీరో పాత్రను సూపర్ హీరోగా చూపించే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ‘టిల్లు క్యూబ్’ చిత్రీకరణ మొదలయ్యే అవకాశాలున్నాయి. మూడో పొలిమేరలో... ‘సత్యం’ రాజేశ్ కీలక పాత్రలో నటించిన ‘మా ఊరి పొలిమేర’ (2021), ‘మా ఊరి పొలిమేర 2’ (2023) సినిమాలు మంచి విజయం సాధించాయి. చేతబడి నేపథ్యంలో వచ్చిన ఈ రెండు చిత్రాలు హిట్ అయ్యాయి. కాగా ఈ ఫ్రాంచైజీలో 'పొలిమేర 3’ (Polimera 3 Movie) రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తొలి, మలి భాగాలకి దర్శకత్వం వహించిన అనిల్ విశ్వనాథ్ మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ‘సత్యం’ రాజేశ్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, ‘చిత్రం’ శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి నిర్మిస్తున్నారు. చిత్రయూనిట్ విడుదల చేసిన ‘పొలిమేర 3’ వీడియో గ్లింప్స్ చూస్తే మొదటి, ద్వితీయ భాగంతో పోలిస్తే ప్రేక్షకుల ఊహకందని ట్విస్టులు మరిన్ని ఉంటాయని తెలుస్తోంది.మూడోసారి మత్తు వదలరా... ‘మత్తు వదలరా’, ‘మత్తు వదలరా 2’ చిత్రాల ఫ్రాంచైజీలో రూపొందనున్న చిత్రం ‘మత్తు వదలరా 3’. శ్రీ సింహా కోడూరి, నరేశ్ అగస్త్య, సత్య లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ మూవీ 2019లో విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘మత్తు వదలరా 2’. తొలి భాగాన్ని తెరకెక్కించిన రితేష్ రానా రెండో భాగానికి కూడా దర్శకత్వం వహించారు. శ్రీ సింహా కోడూరి, ఫరియా అబ్దుల్లా, సత్య ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా 2024 సెప్టెంబరు 13న విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ ఫ్రాంచైజీలో ‘మత్తు వదలరా 3’ కూడా ఉంటుందని ప్రకటించింది చిత్రయూనిట్. అయితే వెంటనే షూటింగ్ ఉండదని దర్శకుడు రితేష్ రానా ప్రకటించారు. మరి ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నవ్వులు మూడింతలు సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం 2023 అక్టోబరు 6న రిలీజై ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. ‘మ్యాడ్’ కాంబినేషన్లోనే ఈ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. తొలి భాగం హిట్‌తో ద్వితీయ భాగంపై అంచనాలు నెలకొన్నాయి. ఈ మార్చి 28న విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ సక్సెస్‌మీట్‌కి హీరో ఎన్టీఆర్ రావడం విశేషం. కాగా ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలకు సీక్వెల్‌గా ‘మ్యాడ్ 3’ కచ్చితంగా ఉంటుందని చిత్రబృందం ప్రకటించింది. అయినప్పటికీ ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లేందుకు సమయం పడుతుందని స్పష్టం చేశారు. పై సినిమాలే కాదు... మరికొన్ని చిత్రాలు కూడా మూడో భాగం రానున్నాయి.చదవండి: నలుగురికిపైగా హీరోయిన్లు.. అందులో తమన్నా కూడా! -
హిట్ 3 ట్రైలర్.. 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ గల్లంతు!
నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3. నిన్న(ఏప్రిల్ 14) ట్రైలర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగానే వచ్చింది. కానీ 24 గంటలు గడిచేసరికి మాత్రం రాజమౌళి మూవీస్ రికార్డ్స్ దాటిపోయింది. ఇది మాత్రం ఓ రకంగా షాకింగ్ అని చెప్పొచ్చు.హిట్ సిరీస్ లో తొలి రెండు సినిమాల్ని థ్రిల్లర్స్ గా మలిచారు. కానీ మూడో భాగాన్ని మాత్రం నరుక్కోవడం, రక్తం ఏరులై పారడం అనేలా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమైంది. చిన్నపిల్లలు, సున్నిత మనస్కులు తమ సినిమాని చూడొద్దని నాని చెప్పడం కూడా సినిమాపై ఓ రకంగా బజ్ పెంచింది.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ జస్ట్ టైర్-2 హీరో.. ఇక్కడ దేవుడిలా ట్రీట్ చేస్తున్నారు!)అలా రిలీజైన 24 గంటల్లో హిట్ 3 ట్రైలర్ కి 23.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తద్వారా బాహుబలి 2 (21.81 మిలియన్), ఆర్ఆర్ఆర్ (20.45 మిలియన్), కేజీఎఫ్ 2 (19.38 మిలియన్) రికార్డ్స్ దాటేసినట్లు తెలుస్తోంది. ఇదంతా కూడా తెలుగు వెర్షన్ వరకు మాత్రమే.మే 1న థియేటర్లలోకి రాబోతున్న హిట్ 3 సినిమాకు శైలేష్ కొలను దర్శకుడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్. మిక్కీ జే మేయర్ సంగీతమందించాడు. మరి బ్లడ్ బాత్ అనేలా ఉన్న ఈ మూవీ ఫలితం ఏమవుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?) -
నేచురల్ స్టార్ నాని ‘హిట్-3’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
అది మనం క్రియేట్ చేసుకున్నదే.. వదిలేస్తే బాగుంటుంది: హీరో నాని
నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం హిట్-3. టాలీవుడ్ డైరెక్టర్ శైలేశ్ కొలను హిట్ సిరీస్‌లో వస్తోన్న మూడో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఫుల్ వయొలెంట్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా చాగంటి ప్రవచనాలు ట్రైలర్లో ఉండడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు.మూవీ రిలీజ్ తేదీ ఇంకా రెండు వారాలు పైగా సమయం ఉండగానే మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇవాళ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన నాని మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మీరు రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన హీరో.. ఇక టైర్- 1 జాబితాలో చేరినట్టేనా? అని ఒకరు ప్రశ్నించగా.. దానిపై నాని స్పందించారు.నాని మాట్లాడుతూ.. 'అది మన డిక్షనరీలో ఉన్నది కాదు. కేవలం మనం క్రియేట్ చేసుకున్న పదమే. నటుడికి తగినట్లుగానే సినిమాలు తెరకెక్కిస్తారు. వారిని ఆ పేర్లతో ఎందుకు డివైడ్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అది చాలా స్టుపిడ్ కాన్సెప్ట్. ఎవరు మొదలుపెట్టారోగానీ.. మనమంతా దానినే పెంచి పోషిస్తున్నాం. ఇకపై ఆ వేరియేషన్ ఆపితే మన తెలుగు చిత్ర పరిశ్రమకు మంచిది. అది బాగుంటే అందరం హ్యాపీగా ఉంటాం' అని అన్నారు. కాగా.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా కనిపించింది. -
'అలా జరగకపోతే నన్ను నమ్మకండి'.. నాని ఆసక్తికర కామెంట్స్
నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న మోస్ట్ వయొలెంట్ యాక్షన్ థ్రిల్లర్ హిట్-3. ఈ సిరీస్‌లో శైలేశ్ కొలను డైరెక్షన్లో వస్తోన్న మూడో చిత్రం. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రంలో అర్జున్ సర్కార్ పాత్రలో నాని అభిమానులను మెప్పించనున్నారు. ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్స్, టీజర్ చూస్తుంటే నాని గతంలో ఎన్నడు చూడని పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా హిట్-3 ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూశాక నాని వయొలెన్స్ ఓ రేంజ్లో ఉండనుందని అర్థమవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది. దీనికి హాజరైన హీరో నాని మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. గతంలో కోర్ట్ మూవీ హిట్ కాకపోతే హిట్-3 చూడొద్దని చెప్పారు కదా? మరీ ఈ సినిమాకు ఏం చెబుతారని నానిని ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందించారు.(ఇది చదవండి: మోస్ట్ వైలెంట్‌గా 'హిట్-3' ట్రైలర్.. మార్కోను మించిపోయిన 'నాని')నాని మాట్లాడుతూ..'ఈ సినిమాకు ఆ డైలాగ్ వాడితే నెక్ట్స్ సినిమాకు నేను నిర్మాతను కాదు. నన్ను నేను తాకట్టు పెట్టుకోగలను.. వాళ్ల ఎవరినో ఎందుకు పెడతాను. హిట్-3 లాంటి జోనర్ లాంటి సినిమాలు ఇష్టపడే వారికి మాత్రం మే 1న ఫుల్ మీల్స్ పక్కా. కొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఇది కనక తప్పని మీకు అనిపిస్తే నెక్ట్స్ టైమ్ నానిని నమ్మకండి' అంటూ సరదా నవ్వుతూ మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 'Next time Nani ni nammakandi, anthe'A BOLD STATEMENT by Natural Star @NameisNani.Betting big on himself and #HIT3.#HIT3Trailer TRENDING #1 on YouTube 💥💥▶️ https://t.co/BU8cVg4IJD#HIT3 in cinemas worldwide on 1st MAY, 2025.#AbkiBaarArjunSarkaarNatural Star… pic.twitter.com/ZWZlwKDwhu— Wall Poster Cinema (@walpostercinema) April 14, 2025 -
'హిట్-3' ట్రైలర్ రిలీజ్
-
మోస్ట్ వైలెంట్‌గా 'హిట్-3' ట్రైలర్.. మార్కోను మించిపోయిన 'నాని'
హిట్3 సినిమాలో అర్జున్ సర్కార్‌గా పోలీస్ పాత్రలో దుమ్మురేపేందుకు నాని సిద్ధం అయ్యాడు. మే 1న విడుదల కానున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మలయాళంలో గతేడాది వచ్చిన 'మార్కో' సినిమాకు మించిన వయలెన్స్ హిట్-3లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గతంలో చెప్పిన వ్యాఖ్యలను హిట్3 నాని పాత్రకు కలుపుతూ ఎలివేషన్స్ ఇచ్చారు. ఇదీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకుడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ఏ సర్టిఫికెట్ పొందింది. అంటే 18 ఏళ్లు నిండిన వాళ్లు మాత్రమే ఈ మూవీ చూసేందుకు అర్హులు. హిట్ 3 సినిమా రన్‌టైమ్ 2 గంటల 35 నిమిషాలు ఉండనుంది. ఈ కామెంట్‌తో వెండితెరపై రక్తపాతం చూపించబోతున్నారని క్లియర్‌గా అర్థం అవుతుంది. ఇప్పటికే హిట్ 3(Hit 3 Movie) గురించి నాని ఇలా హింట్ ఇచ్చేశాడు. యాక్షన్ గట్టిగా ఉంటుందని, కచ్చితంగా పిల్లలు చూడకూడదని చెప్పుకొచ్చాడు. దీనిని బట్టి చూస్తే సినిమాలో ఏ రేంజ్లో వయలెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా భారీ బడ్జెట్‌తో వాల్‌పోస్టర్ సినిమా ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై నానినే ఈ చిత్రాన్ని నిర్మించారు. -
'హిట్ 3' సెన్సార్ రిపోర్ట్.. ఆ సీన్లన్నీ బ్లర్!
నాని(Nani) అంటే కుర్రాళ్ల దగ్గర నుంచి ఫ్యామిలీస్ వరకు నచ్చే హీరో. కానీ గత కొన్నాళ్ల నుంచి ట్రెండ్ కి తగ్గట్లు తను కూడా మారుతున్నాడు. యాక్షన్ మూవీస్ చేస్తూ వస్తున్నాడు. ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీకి తాజాగా సెన్సార్ జరగ్గా.. పిల్లలు, సున్నిత మనస్కులకు నో ఎంట్రీ అనే టాక్ వినిపిస్తోంది.చాన్నాళ్ల క్రితమే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని.. హిట్ 3(Hit 3 Movie) గురించి హింట్ ఇచ్చేశాడు. యాక్షన్ గట్టిగా ఉంటుందని, కచ్చితంగా పిల్లలు చూడకూడదని అన్నాడు. ఇప్పుడు అదే జరిగింది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే 18 ఏళ్లు నిండిన వాళ్లు మాత్రమే ఈ మూవీ చూసేందుకు అర్హులు.(ఇదీ చదవండి: చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ) మరోవైపు గతకొన్నాళ్ల క్రితం రిలీజై టీజర్(Hit 3 Teaser) కూడా రక్తపాతం అనేలా ఉంది. దీంతో మూవీ ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే సినిమాలోనూ అలాంటి సీన్లు చాలానే ఉన్నాయని, సెన్సార్ వాటిని బ్లర్ చేయమని ఆదేశించిందని తెలుస్తోంది. బూతులు కూడా ఉన్నాయని అందుకే ఏ సర్టిఫికెట్ ఇచ్చారని తెలుస్తోంది.నాని పోలీస్ గా నటించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకుడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్. మే 1న థియేట్రికల్ రిలీజ్. కానీ మూడు వారాల ముందే సెన్సార్ చేయించేశారు. సోమవారం ఉదయం ట్రైలర్ రిలీజ్ చేస్తారు. అలా ప్రమోషన్స్ షురూ చేస్తారనమాట.(ఇదీ చదవండి: తమన్నా ట్రెండీ ఐటమ్ సాంగ్.. రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు?) -
అబ్కీ బార్.. అర్జున్ సర్కార్ అంటోన్న నాని.. హిట్-3 సాంగ్ వచ్చేసింది!
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ హిట్-3. శైలేశ్ కొలను దర్శకత్వంలో హిట్ సిరీస్ మూడో చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. గతంలో వచ్చిన హిట్, హిట్-2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఈ చిత్రంలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపుర్నేని నిర్మిస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి అబ్కీ బార్.. అర్జున్ సర్కార్..అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించగా.. కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. ఈ పాటకు మిక్కీ జె మేయర్ సంగీతమందించారు. కాగా.. ఇప్పటికే రిలీజైన మెలోడి సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.Lil something to start the heat. Fireworks on 14th. All hell breaks loose on May 1st. #AbKiBaarArjunSarkaar full song is here. https://t.co/6URUQmtchs #HIT3 pic.twitter.com/z104cXigpE— Nani (@NameisNani) April 9, 2025 -
హిట్ 8 లో 8 మంది హీరోలా? ఎవరెవరు?
ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా సీక్వెల్స్ సందడి చేస్తున్నాయి. ఒక సినిమా హిట్ అయితే అదే లైన్‌తో వరుసగా 2, 3 తీయడం అనేది ఒక సంప్రదాయంగా మారిపోతోంది. అయితే ఇప్పటి దాకా సీక్వెల్స్ అంటే 2 లేదా 3కే పరిమితం కాగా...ఓ సినిమా మాత్రం పెద్ద ఎత్తున సీక్వెల్స్‌తో కొత్త ట్రెండ్‌ని సెట్ చేయనుంది. ఆ సినిమా పేరు హిట్.నేచురల్ స్టార్ నాని నిర్మాణ బాధ్యతలు పంచుకుని శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ‘హిట్’ ఫస్ట్, సెకండ్ కేస్లు రెండూ కమర్షియల్ గా విజయాలు దక్కించుకున్నాయి. ఈ నేపధ్యంలో త్వరలోనే హిట్ 3 (HIT 3) కూడా రానున్న సంగతి మనకి తెలుసు. ’హిట్’ లో విశ్వక్ సేన్, ‘హిట్ 2’ లో అడివి శేష్, ‘హిట్ 3’ లో నాని హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే.అయితే ‘హిట్’ సిరీస్ లో భాగంగా మొత్తం 8 సినిమాలు వస్తాయని గతంలోనే సినిమా టీమ్ వెల్లడించింది కాబట్టి ‘హిట్ 4’ ‘హిట్ 5’ ‘హిట్ 6’ ‘హిట్ 7’ ‘హిట్ 8’ కూడా తెరకెక్కనున్నట్టు స్పష్టం అవుతోంది. అయితే హిట్ 8 కోసం ఓ కొత్త సెన్సేషన్ క్రియేట్ చేయాలని టీమ్ యోచిస్తోందని సమాచారం. హిట్ 1 నుంచి ‘హిట్ 7 వరకు నటించిన హీరోలందరూ కలిసి హిట్ 8లో తెర పంచుకోనున్నారని తెలుస్తోంది. వీరంతా కలిసి ఓ పెద్ద కేసుని సాల్వ్ చేస్తారని అంటున్నారు.నిజానికి హిట్ ‘హిట్ 2’లో నాని కనిపించినట్టే హిట్ 3లో హీరో అడివి శేష్, విశ్వక్సేన్ కూడా కనిపించాల్సి ఉంది. అయితే అడవి శేష్ మాత్రం స్పెషల్ రోల్ చేస్తున్నాడు కానీ, విశ్వక్సేన్ మాత్రం లేకపోవడానికి కారణం...నాని వెనుక చేతులు కట్టుకుని నిలబడటానికి విశ్వక్ సేన్ సుముఖుత వ్యక్తం చేయలేదని వినికిడి. దీంతో అతని రిఫరెన్స్ ను మాత్రమే తీసుకుంటారట. అయితే హిట్ 2లో చేసినట్టే... క్లైమాక్స్ లో ‘హిట్ 4’ లో నటించే హీరో ఎవరు అనేది రివీల్ చేస్తారంటూ కూడా మరో ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు బాలకృష్ణ ‘హిట్ 4’లో హీరో గా చేయనున్నారంటూ కొన్ని వార్తలు హల్చల్ చేశాయి. కారణమేమో గానీ అది వాస్తవరూపం దాల్చలేదు. ఇప్పుడు తెలుగులోనూ ప్రేక్షకులకు చిరపరిచితమైన తమిళ హీరో కార్తీ ‘హిట్ 4’ లో హీరోగా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని రివీల్ చేసే విధంగా ‘హిట్ 3’ లో కార్తీ కామియో ఉంటుందని సమాచారం. అయితే ఈ విశేషాలను టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో ప్రకటిస్తుందా? లేక సర్ప్రైజ్ కోసం సీక్రెసీ మెయిన్టైన్ చేస్తుందా? చూడాలి.