Top Stories
ప్రధాన వార్తలు

పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా!
వాషింగ్టన్ : జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి అంశంపై పాకిస్తాన్‌కు అమెరికా షాకిచ్చింది. మతిలేని చర్యను వెనకేసుకు రావొద్దని హెచ్చరించింది. పహల్గాం దాడి విషయంలో చేపట్టే దర్యాప్తులో భారత్‌కు సహకరించాలని సూచించింది. పహల్గాం ఉగ్రదాడితో భారత్ - పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బుధవారం.. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పాక్ ప్రధాని హహబాద్ షరీఫ్‌తో ఫోన్లో మాట్లాడారు.ఫోన్ సంభాషణలో రూబియో.. ఉగ్రవాదంపై భారత్ తీసుకునే ప్రతి చర్యలో అమెరికా పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. అదే సమయంలో పహల్గాంలో 26 మంది ప్రాణాలు తీసిన అమానుష చర్యపై భారత్ చేపట్టే దర్యాప్తుకు సహకరించాలని సూచించినట్లు సమాచారం.Today, Secretary Marco Rubio spoke with Pakistan's Prime Minister Muhammad Shehbaz Sharif and encouraged Pakistan to work with India to de-escalate tensions, re-establish direct communications, and maintain peace and security in South Asia: US State Department spokesperson Tammy…— ANI (@ANI) April 30, 2025Secretary of State Marco Rubio spoke with Indian External Affairs Minister Dr S Jaishankar today. The Secretary expressed his sorrow for the lives lost in the horrific terrorist attack in Pahalgam, and reaffirmed the United States' commitment to cooperation with India against…— ANI (@ANI) April 30, 2025 జైశంకర్‌తో మాట్లాడిన సమయంలో మార్కో రూబియో పహల్గాం దాడి బాధితులకు సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై జరిపే పోరాటంలో భారత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ముందు నుంచి పహల్గాం ఉగ్రదాడి విషయంలో పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఈ విషయంలో ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి, శాంతి భద్రతలను కాపాడుకోవడానికి పాకిస్తాన్‌తో కలిసి పనిచేయాలని భారత్ కృషి చేయాలని కోరారు. Discussed the Pahalgam terrorist attack with US @SecRubio yesterday. Its perpetrators, backers and planners must be brought to justice.— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 1, 2025అందుకు ప్రతిస్పందనగా ఎక్స్ వేదికగా జైశంకర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో దాడికి పాల్పడ ఉగ్రవాదుల్ని, వాళ్లను పెంచి పోషిస్తున్న వారిని, పహల్గాం ఉగ్రదాడికి ప్రణాళిక వేసిన వారిని న్యాయం ముందు నిలబెట్టాలి’ అని పేర్కొన్నారు. రుబియో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్‌తో జరిపిన సంభాషణల్లో పాకిస్తాన్ పహల్గాం దాడిని ఖండించాలని, దర్యాప్తులో సహకరించాలని కోరారు. ఈ దాడిపై పాకిస్తాన్ బాధ్యత వహించాలని, భారత్‌తో నేరుగా సంభాషణలు పునరుద్ధరించి శాంతి దిశగా కృషి చేయాలని సూచించినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరి తాజా పరిణామలపై భారత్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

పహల్గాం ఉగ్రదాడి.. వెలుగులోకి సంచలన విషయాలు
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడిలో కేసులో ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. ఉగ్రదాడి జరిగిన బైసరన్ వ్యాలీకి ఎన్ఐఏ డీజీ చేరుకున్నారు. పహల్గాం ఉగ్రదాడి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జమ్మూ కశ్మీర్లో మూడు పర్యాటక ప్రాంతాలను ఉగ్రవాదులు రెక్కీ చేసినట్లు తేలింది. ఏప్రిల్ 15న జమ్మూ కశ్మీర్ అమ్యూజ్మెంట్ పార్క్ వద్ద ఉగ్ర వాదులు రెక్కీ నిర్వహించారు.మరో వైపు, బైసారన్ గడ్డి మైదానంలో సుందర కశ్మీర్ అందాలను చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారని నిర్ధారించుకున్నాకే ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారన్న వాదనకు బలం చేకూరుతోంది. పహల్గాంలో కాల్పులకు తెగబడిన ఉగ్రవాదుల ఊహాచిత్రాలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విడుదల చేయగా మహారాష్ట్రలోని జల్నా జిల్లా వాసి ఆ ఊహాచిత్రాల్లోని ఒక ఉగ్రవాదిని గుర్తుపడ్డారు.ఆ ఉగ్రవాది తనతో పాశవిక దాడికి ఒక రోజు ముందు అదే ప్రాంతంలో మాట్లాడానని ఆదర్శ్ రౌత్ అనే యువకుడు వెల్లడించారు. నాటి ఘటన వివరాలను రౌత్ మీడియాకు వెల్లడించారు. ‘‘ ఏప్రిల్ 22వ తేదీ మధ్యహ్నం ఉగ్రవాదులు దాడిచేశారు. అయితే అంతకు ఒకరోజు ముందు అంటే 21వ తేదీన అదే బైసారన్‌లో నేను పర్యటించా. గుర్రపు స్వారీ చేశా. ఆకలేసి అక్కడి మ్యాగీ స్టాల్ వద్ద ఆగా. అదే సమయంలో ఈ అనుమానిత ఉగ్ర వాది నా దగ్గరకు వచ్చాడు.‘నువ్వు హిందువు కదా. కశ్మీర్ వాడిలా లేవు’ అని నాతో అనేసి కాస్తంత దూరం నిల్చున్నాడు. అక్కడ ఇంకో వ్యక్తితో మాట్లాడుతూ ‘ఈరోజు జనం తక్కువగా వచ్చినట్లున్నారుగా’ అని అనేసి ఇద్దరూ వెళ్లిపో యారు. అతను ఎందుకు మతం గురించి అడిగా డో అర్థంకాలేదు. జనం తక్కువగా వచ్చిన విష యం గురించి ఎందుకు చర్చించుకున్నారో అస్స లు బోధపడలేదు. కానీ కాల్పుల ఘటన, ఊహా చిత్రాల్లో ఇతని ఫొటో చూశాక విషయం పూర్తిగా అర్థమైంది’’ అని ఆదర్శ్ రౌత్ చెప్పారు. విషయాలన్నీ పూసగుచ్చినట్లు ఎన్ఐఏకు ఈ–మెయిల్లో వివరంగా రాశానన్నారు.

ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. ఐపీఎల్ నుంచి అతడు అవుట్
రాజస్తాన్ రాయల్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన చేసింది. తమ యువ స్పిన్నర్ విఘ్నేశ్ పుతూర్ (Vignesh Puthur) ఐపీఎల్-2025 (IPL 2025)లో మిగిలిన మొత్తం మ్యాచ్‌లకు దూరమైనట్లు తెలిపింది. అతడి స్థానంలో రఘు శర్మ (Raghu Sharma)ను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది.చెన్నైతో మ్యాచ్‌లో అరంగేట్రంకాగా ఐపీఎల్ తాజా ఎడిషన్ మార్చి 22న ప్రారంభం కాగా.. ఆ మరుసటి రోజు ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ఆడింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా కేరళకు చెందిన విఘ్నేశ్ పుతూర్ ముంబై తరఫున అరంగేట్రం చేశాడు.రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు శివం దూబే, దీపక్ హుడా వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఓడినా 24 ఏళ్ల ఈ లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్ మాత్రం తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మరో నాలుగు మ్యాచ్‌లు ఆడిన విఘ్నేశ్ పుతూర్ మొత్తంగా ఆరు వికెట్లు పడగొట్టాడు.గాయం కారణంగా దూరంఅయితే, ఇటీవల విఘ్నేశ్ గాయపడ్డాడు. అతడి రెండు కాళ్ల ఎముకల్లోనూ నొప్పి రావడంతో ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో లెగ్ స్పిన్నర్ రఘు శర్మను తీసుకుంది.ఇక మ్యాచ్‌లకు దూరంగా ఉన్నప్పటికీ విఘ్నేశ్ పుతూర్ మాత్రం జట్టుతో కలిసి ప్రయాణం చేయనున్నాడు. ముంబై ఇండియన్స్ వైద్య బృందం పర్యవేక్షణలో అతడు చికిత్స తీసుకుంటాడని ఫ్రాంఛైజీ తమ ప్రకటనలో వెల్లడించింది.రఘు శర్మ ధర రూ. 30 లక్షలుకాగా ముంబై నెట్ బౌలర్లలో ఒకడైన రఘు శర్మ కనీస ధర రూ. 30 లక్షలతో విఘ్నేశ్ పుతూర్ స్థానాన్ని భర్తీ చేశాడు. 32 ఏళ్ల రఘు దేశవాళీ క్రికెట్లో పంజాబ్, పుదుచ్చేరి జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటికి 11 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 57 వికెట్లు తీసిన రఘు శర్మ.. లిస్ట్-ఎ క్రికెట్లో తొమ్మిది మ్యాచ్‌లలో 14 వికెట్లు.. మూడు టీ20లలో మూడు వికెట్లు పడగొట్టాడు.ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌ను పరాజయాలతో ఆరంభించిన ముంబై ఇండియన్స్... ఆ తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుంది. వరుసగా గత ఐదు మ్యాచ్‌లు గెలిచి సత్తా చాటిన హార్దిక్ సేన.. ఇప్పటికి పది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మొత్తం ఆరు విజయాలు సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: గెలుపు జోష్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు షాక్!

‘హిట్ 3’ మూవీ రివ్యూ
హాలీవుడ్, బాలీవుడ్‌తో పోలిస్తే తెలుగులో ఫ్రాంచైజీ సినిమాలు చాలా తక్కువ. ఎఫ్ 2తోనే ఆ సినిమాలు పరిచయం అయ్యాయి. ఆ తర్వాత ‘హిట్’ కూడా ఫ్రాంచైజీగా వస్తోంది. నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ ఫ్రాంచైజీ తొలి చిత్రం ‘హిట్’లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా.. రెండో కేసుతో అడివి శేష్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక మూడో కేసుకి ఏకంగా నానినే రంగంలోకి దిగాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘హిట్ 3’పై మంచి హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మే 1) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ (HIT 3: The Third Case Movie Review )లో చూద్దాం.కథేంటంటే..ఎస్పీ అర్జున్ సర్కార్(నాని) జమ్ము కశ్మీర్ నుంచి ఏపీకి బదిలీపై వస్తారు. డ్యూటీలో జాయిన్ అయ్యే కంటే ముందే అడవిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేస్తారు. తర్వాత ఆ కేసును ఆయనే విచారణ చేస్తారు. అలా రెండో హత్య చేస్తున్న సమయంలో అర్జున్ సర్కార్ టీం సభ్యురాలు వర్ష(కోమలి ప్రసాద్) అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. దీంతో అర్జున్ సర్కార్ హత్యలు ఎందుకు చేస్తున్నాడో ఆమెకు వివరిస్తూ.. సీటీకే(కాప్చర్ టార్చర్ కిల్) డార్క్ వెబ్సైట్ గురించి చెబుతాడు. అసలు సీటీకే ఉద్దేశం ఏంటి? ఆ డార్క్ వెబ్సైట్ రన్ చేస్తున్నదెవరు? వారి లక్ష్యం ఏంటి? అర్జున్ సర్కార్ సీటీకే గ్యాంగ్ ఆటలకు ఎలా అడ్డుకట్ట వేశాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏంటి? తల్లిలేని అర్జున్ సర్కార్ జీవితంలోకి మృదుల(శ్రీనిధి శెట్టి) ఎలా వచ్చింది? ఆమె నేపథ్యం ఏంటి? అర్జున్ సర్కార్ ఆపరేషన్‌కి ఆమె ఎలా సహాయపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఓ హత్య జరగడం.. దానిని ఛేదించేందుకు హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ (హిట్) రంగంలోకి దిగడం.. చిక్కుముడులన్నీ విప్పి చివరకు హంతకులను పట్టుకోవడం.. ‘హిట్’, హిట్ 2.. ఈ రెండు చిత్రాల నేపథ్యం ఇలాగే ఉంటుంది. అదే ప్రాంఛైజీలో వచ్చిన హిట్ 3 మాత్రం ఒక హత్య చుట్టు కాకుండా కొన్ని హత్యలు చుట్టూ తిరుగుతుంది. ఆ హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? హీరో ఈ కేసును ఎలా పరిష్కరించాడన్నదే ఈ సినిమా కథ. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల కథలన్నీ దాదాపు ఇదే లైన్లో ఉంటాయి. తెరపై ఎంత ఆసక్తికరంగా, భయంకరంగా చూపించారనే దానిపై విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయం దర్శకుడు శైలేష్ కొలనుకు బాగా తెలుసు. అందుకే హిట్ ఫ్రాంచైజీలలో క్రైమ్ సీన్లు అన్ని భయంకరంగా తీర్చిదిద్దాడు. హిట్ 3లో అయితే ఆ భయాన్ని మూడింతలు చేశాడు. సైకో గ్యాంగ్ చేసే అరాచకాలను తెరపై చూస్తున్నప్పుడు రక్తం మరిగిపోతుంది. అసలు వీళ్లు మనుషులేనా అనే అనుమానం కలుగుతుంది. వాళ్ల ప్రవర్తన, హత్యలు చేసే తీరు చూస్తే.. బయట అక్కడక్కడ జరుగుతున్న సంఘటనలు గుర్తుకొస్తాయి. చిత్రబృందం ముందు నుంచి చెబుతున్నట్లుగా ఇందులో యాక్షన్ సీన్లు లిమిట్ దాటి ఉన్నాయి. యానిమల్, మార్కో, కిల్ సినిమాల ప్రభావం దర్శకుడిపై బాగానే పడిందన్న విషయం ఆ యాక్షన్ సన్నివేశాలను చూస్తే అర్థమవుతుంది. కథ ప్రారంభమే భయంకరమైన సీన్‌తో ప్రారంభించాడు. ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీతో యాక్షన్ థ్రిల్లర్.. కాస్త లవ్ ఎంటర్టైనర్లోకి వెళ్తుంది. పెళ్లి కోసం మాట్రిమొనీలో అమ్మాయిలను చూడడం.. అర్జున్ వేసే ప్రశ్నలకు ఆ అమ్మాయిలు పారిపోవడం అంతా హిలేరియస్‌గా సాగుతుంది. సీటీకే డార్క్ వెబ్సైట్ గురించి తెలిసిన తర్వాత కథనం ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంటుంది. ఫస్టాఫ్ అంతా సైకో గ్యాంగ్ చేసే హత్యలు.. ఇన్వెస్టిగేషన్తో ముందుకు వెళ్లిపోతుంది. జమ్ములో జరిగిన హత్య వెనుక సీటీకే గ్యాంగ్ ఉందన్న విషయాన్ని అర్జున్ కనుక్కునే ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్‌లో కథనం మొత్తం సీటీకే గ్యాంగ్‌తో అర్జున్ సర్కార్ చేసే యుద్ధమే ఉంటుంది. ద్వితీయార్థంలో అక్కడక్కడా ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలు ఉంటాయి. చిన్నపిల్ల ఎపిసోడ్‌ని చాలా ఎమోషనల్‌గా రాసుకున్నాడు. క్లైమాక్స్‌లో నాని యాక్షన్ సీక్వెన్సులు చూస్తే భయమేస్తుంది. అయితే ఈ తరహా పోరాట ఘట్టాలను చాలా హాలీవుడ్ చిత్రాల్లో చూసే ఉంటాం. అలాగే ఈ మధ్య వచ్చిన కొన్ని వెబ్ సిరీస్‌లలో కూడా ఇలాంటి సీన్లు ఉన్నాయి. సైకో గ్యాంగ్ అంతు చూసేందుకు హీరో కూడా సైకోగా మారడం ఇబ్బందికరంగా అనిపించినా.. ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలతో పోలిస్తే.. ఇందులో హీరో చేసే పనికి ఓ బలమైన కారణం ఉండడంతో ఆ ప్లేస్‌లో ఏ వ్యక్తి ఉన్నా అలాంటి పనే చేస్తాడనే భావన ఆడియన్స్‌లో కలుగుతుంది. పైగా హీరో చేసే అరాచక పనులకు చాగంటి ప్రవచనాలను ముడిపెట్టి దర్శకుడు తన ప్రతిభను చాటుకున్నాడు. చివరగా చెప్పేది ఏంటంటే.. చిన్న పిల్లలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను చూపించొద్దు. క్రైం యాక్షన్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్లకు హిట్ 3 తెగ నచ్చేస్తుంది. మిగతా వారికి మాత్రం ఇంత హింసాత్మక చిత్రాలు అవసరమా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతాడు. అర్జున్ సర్కార్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. నిజమైన పోలీసు ఆఫీసర్‌లాగే తెరపై కనిపించాడు. యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. శ్రీనిధి శెట్టి అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. కథని మలుపు తిప్పే పాత్ర ఆమెది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.చదవండి: హిట్-4లో హీరో ఫైనల్.. ఏసీపీ వీరప్పన్‌గా ఎంట్రీ

ఎవరి అక్షయపాత్ర అమరావతి?
'అక్షయపాత్ర అమరావతి" ఎల్లో మీడియా ఈనాడులో ప్రధాన శీర్షిక ఇది. ప్రశ్న ఏమిటంటే.. ఇది ఎవరి అక్షయపాత్ర? పేదలకా? లేక ధనికులు, భూస్వాములు, కాంట్రాక్టర్లకా? బాబు గారి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని ఒకరోజు కోసమైనా మళ్లించేందుకు ఇలాంటి శీర్షికలు, కథనాలు ఉపయోగపడతాయేమో కానీ.. అన్నివేళలా మాత్రం కాదు. లేదంటే.. తమ వర్గానికి అనూహ్యస్థాయి లబ్ధి చేకూరుతోందని ఈనాడు యాజమాన్యం సంతోషంతో ఇలాంటి కథనాలు వండి వార్చి ఉండాలి. అయితే... ఈ కథనం వచ్చిన రోజే సాక్షి దినపత్రికలో ఇంకో కథనం వచ్చింది. దీని శీర్షిక 'అవినీతి ఐకానిక్’... అమాంతంగా పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం’’ అని వివరమైన బ్యానర్ కథనం వచ్చింది. నిజానికి పాత్రికేయ వృత్తిలో ఉన్నవారు. ప్రభుత్వ వ్యవహారాలతోపాటు, అధికారంలో ఉన్నవారు చేస్తున్న వాటిలో మంచి,చెడు విశ్లేషించి రాయాలి. ఎల్లో మీడియా ఆ పని మానేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ అధికారంలో ఉన్నా, లేకపోయినా, ఆయనపైనే ఏడుపుగొట్టు వార్తలు, అబద్ధాలు రాయడమే పనిగా పెట్టుకుంది. కూటమి వైఫల్యాలను కప్పిపుచ్చుతూ ప్రజలను వంచించడానికి కృషి చేస్తోంది. అందుకే ఆరికి అమరావతిలో అంతా అద్భుతంగానే కనిపిస్తోంది.2014-19 మధ్యకాలంలోనూ అమరావతికి విపరీతమైన హైప్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి అదే బాకా ఊదుతున్నారు. అక్షయపాత్ర అని, ప్రపంచ స్థాయి రాజధాని అని ఊదరగొడుతున్నారు. అయితే వీరి ప్రచార ఆర్భాటానికి మోసపోయి అప్పట్లో భూములు కొన్న వారు ఇప్పటికీ తేరుకోలేదు. మరోసారి మోసపోయేందుకు వారు సిద్ధంగా ఉన్నారా? అన్నది ప్రశ్న. చంద్రబాబు ప్రధానమంత్రి మోడీని కలిసి అమరావతి పనుల పునఃప్రారంభానికి ఆహ్వానించారు. అంతవరకు ఓకే. కాని ఆ సందర్భంగా మోడీతో మాట్లాడిన విషయాలు అంటూ ఈ అక్షయపాత్రను సృష్టించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల వాసుల అవసరాలు తీర్చే నగరంగా తీర్చిదిద్దనున్నామని, విద్య, ఉపాధి, వైద్య అవకాశాలు కల్పించే అక్షయపాత్రలా తయారు చేయాలన్నది ముఖ్య ఉద్దేశమని చంద్రబాబు ప్రధానితో అన్నారని ఈ కథనంలో చెప్పారు.ఇది ఎంత వరకూ వాస్తవరూపం దాలుస్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రజలందరి నెత్తిన రూ. లక్ష కోట్ల రుణ భారమైతే గ్యారెంటీ. ఎందుకంటే చంద్రబాబు అండ్ కో గతంలో నొక్కి వక్కాణించినట్లు ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ నగరం ఏమాత్రం కాదని ఇప్పటికే స్పష్టమైపోయింది. ఈ నగర నిర్మాణానికి తెచ్చే అప్పులు ఏదో ఒక రూపంలో కట్టాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. లబ్ధి మాత్రం నేతలదవుతుంది. అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణ టెండర్లు పిలిచిన తీరు, కావల్సిన వారికి వాటిని కేటాయించుకున్న వైనం, అమాంతం రేట్లు పెంచేసిన పద్దతి ఇవన్ని చూస్తుంటే కాంట్రాక్టర్లకు, కూటమి పెద్దలకు అమరావతి కచ్చితంగా అక్షయపాత్రే కానుందని చెప్పవచ్చు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సిమెంట్, స్టీల్ రేట్లు 2019 నాటికన్నా తగ్గాయని, అయినా అమరావతిలో నిర్మాణాల వ్యయాన్ని రూ.38 వేల కోట్ల నుంచి రూ.77 వేల కోట్లకు పెంచేశారని విమర్శించారు. సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాల అధిపతుల కార్యాలయాల కోసం సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. చదరపు అడుగుకు రూ.8981ల చొప్పున ఖర్చుపెట్టడానికి ఓకే అయింది. మొత్తం రూ.4688 కోట్ల వ్యయం అవుతుంది. 2018లో ఇవే టవర్లకు రూ.2271 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అప్పట్లో చదరపు అడుగుకు రూ.4350లే చాలా ఎక్కువ అని అనుకుంటే, ఇప్పుడు దానిని డబుల్ చేశారు.నిజానికి హైదరాబాద్‌లో భూమి విలువతో లెక్కవేసుకున్నా ఈ స్థాయి ఖర్చు కాదని పలువురు బిల్డర్లు చెబుతున్నారు. అమరావతిలో భూమి ఖర్చు లేదు. ఇసుక ఉచితం. ఇతర నిర్మాణ సామాగ్రీ ధరలు కూడా గతంతో పోలిస్తే తక్కువగా ఉన్న నేపథ్యంలో నిర్మాణ వ్యయం పెరగడం అసాధారణమైన విషయమని చెబుతున్నారు. ఒక ఐకానిక్ టవర్‌లో 49 అంతస్తులు, మరో మూడు టవర్లు 39 అంతస్తులు చొప్పున నిర్మించబోతున్నారు. మొత్తం ప్రభుత్వంలో పర్మనెంట్ సిబ్బంది రెండువేల లోపు ఉంటే, ఇతరత్రా అంతా కలిపి మరో రెండువేల మంది ఉంటారని అనుకున్నా, ఈ స్థాయిలో భవనాల అవసరం ఏమిటో అర్థః కాదు.ప్రస్తుతం తాత్కాలిక సచివాలయంలో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. పోనీ దీనికి రెట్టింపు స్థలం అవసరం అనుకుంటే 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనాలు నిర్మిస్తే సరిపోతుంది. అలా కాకుండా ఏకంగా 52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నిర్మాణాలు చేపడతారట. నాలుగు టవర్లలో మొత్తం సచివాలం నిర్మిస్తుంటే, ఇన్నివేల ఎకరాల భూమి దేనికో తెలియదు.ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ సచివాలయంతో సహా అన్ని భవనాలు కలిపి కూడా సుమారు 250 ఎకరాలలోపే ఉంటాయని అంటారు. ఇతర రాష్ట్రాల రాజధానులలో సైతం ఎక్కడా రెండు, మూడు వేల ఎకరాలకు మించి కార్యాలయాలకు వాడడం లేదు. తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నిర్మించిన సచివాలయానికి సుమారు వెయ్యికోట్లు అయితే, విభజిత ఏపీలో కేవలం రూ.4688 కోట్లు ఖర్చుపెట్టబోతున్నారు. ఇది ఇక్కడితో ఆగుతుందని గ్యారంటీ లేదు. ఇప్పటికే తాత్కాలిక సచివాలయం కోసం వెయ్యి కోట్లకుపైనే వ్యయం చేశారు. అందులో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడం, కేంద్ర ప్రభుత్వ శాఖలు అప్పటి చంద్రబాబు పీఏ ఇంటిపై దాడిచేసి రూ.రెండు వేల కోట్ల అక్రమాలు జరిగాయని గుర్తించడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు దానిని మేనేజ్ చేశారని అంటున్నారు. అందువల్లే అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు తదుపరి అడుగు ముందుకు వేయలేదు. అది వేరే సంగతి.ఇప్పుడు కూడా ఈ స్థాయిలో ఖర్చుపెడితే ప్రజలపైనే భారం పడుతుంది కదా! అసెంబ్లీ, తదితర నిర్మాణాలకు ,భూములు ఇచ్చిన రైతులకు రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, నీరు తదితర అన్ని వసతులు కల్పించడానికి ఇంకెన్ని వేల కోట్లు అవసరం అవుతాయో ఎవరూ చెప్పలేరు. కాంట్రాక్టర్లకు పనుల విలువలో పది శాతం ముందుగానే ప్రభుత్వం చెల్లిస్తుందట. ఇందులో ఎనిమది శాతం వరకు ప్రభుత్వ పెద్దలకు కాంట్రాక్టర్లు ముట్ట చెబుతారని ఇప్పటికే వైసీపీ ఆరోపించింది. గతంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ పద్దతిని వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడు ఎందుకు అమలు చేస్తోందో చెప్పాలి కదా? మొత్తం మీద ఇది పేదలు, మధ్య తరగతి వర్గాలకు ఉపయోగపడే రాజధాని కాదు. పెత్తందార్లకు, కాంట్రాక్టర్లు, బడాబాబులకు మాత్రమే ఉపయోగపడేదని తేలడం లేదా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

ఇజ్రాయెల్‌లో భీకర కార్చిచ్చు.. జెరూసలెంను కమ్మేసిన పొగ
జెరూసలెం శివారులోని అడవుల్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో వేలాది మంది తమ నివాసాలను ఖాళీ చేశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. కార్చిచ్చు కారణంగా 13 మంది గాయపడినట్లు సమాచారం. ప్రాణనష్టంపై వివరాలు ఇంకా తెలియరాలేదు. వాతావరణం పొడిగా ఉండటం, బలమైన గాలులతో ఈ మంటలు వేగంగా చెలరేగుతున్నాయి.మంటలకు సంబంధించిన వీడియోలు, రోడ్లపై పలువురు తమ వాహనాలు విడిచి.. పరుగులు పెడుతున్నా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జెరూసలెం చుట్టుపక్కల కొండలపై దట్టమైన పొగ అలముకుంది. దీంతో దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. దేశ చరిత్రలో అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఒకటిగా అధికారులు చెబుతున్నారు.ఈ మంటలు జెరూసలెం నగరానికి చేరుకోవచ్చని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే హెచ్చరికాలు జారీ చేశారు. రహదారులపై దట్టమైన పొగ కమ్ముకోవడంతో టెల్ అవీవ్, జెరూసలెంను కలిపే రహదారిని మూసేశారు. సహాయక చర్యల కోసం సైన్యం కూడా రంగంలోకి దిగింది. మంటలు చెలరేగుతున్న ప్రాంతాలలోని పర్యాటక ప్రదేశాలను మూసివేశారు.📹1-The fires are spreading over increasingly larger areas as Israeli firefighting units are unable to bring them under control. https://t.co/Ls6gBs07h0📹2-A major highway of the occupying state was closed after #wildfires engulfed it with flames & smoke, forcing drivers &… pic.twitter.com/Ena9kmPjOS— ⚡️🌎 World News 🌐⚡️ (@ferozwala) May 1, 2025

మంచి తరుణం మించి పోరాదు! పసిడి తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఈరోజు తగ్గుముఖం పట్టింది. బుధవారంతో పోలిస్తే గురువారం భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.87,750 (22 క్యారెట్స్), రూ.97,730 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.2000, రూ.2180 తగ్గింది.చెన్నైలో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.2000, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2180 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.87,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.95,730 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.2000 దిగి రూ.87,900కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.2160 తగ్గి రూ.95,880 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు తగ్గుముఖం పట్టినట్లుగానే వెండి ధరలు(Silver Price) కూడా గురువారం తగ్గాయి. బుధవారం ముగింపు ధరలతో పోలిస్తే వెండి ధర కేజీ రూ.2,000 తగ్గింది. దాంతో కేజీ వెండి రేటు రూ.1,07,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

ప్రియురాలితో గొడవ, అమాంతం దూకేశాడు, ట్విస్ట్ ఏంటంటే..!
క్షణికావేశం ఎంతటి అనర్థానికి దారి తీస్తుంది. తీవ్ర వాగ్వాదం, మానసిక ఒత్తిడి, భావోద్వేగం వీటిమీద నియంత్రణ లేకపోతే ప్రాణాలకే ముప్పు. కానీ చైనాలో జరిగిన సంఘటన గురించి తెలిస్తే.. ఔరా అంటారు. హాలీవుడ్ రేంజ్లో..ఇదేం ట్విస్ట్ రా మామా.. అనుకోవాల్సిందే. అసలు ఏం జరిగిందంటే..A high school student in China jumps out of building to express his true love pic.twitter.com/m96l96VcbG— Crazy Clips (@crazyclipsonly) April 21, 2025 y"> ప్రియురాలితో గొడవ పడుతూ.. క్షణం ఆలోచించకుండా పక్కనే ఉన్న కిటికీ లోంచి అమాంతం దూకేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఇది చాలా ఎత్తైన భవనంలా కనిపిస్తోంది. మొదట దూకడానికి ప్రయత్నించి నపుడు అమ్మాయి తీవ్రంగా అడ్డుకుంది. వెనక్కి వచ్చాడు. కానీ రెండో సారి అంతే వేగంగా ముందుకు దూకేశాడు. దెబ్బకు ప్రాణాల్లో కలిసి పోవాల్సిందే. ఈ నెల ప్రారంభంలో హునాన్ ప్రావిన్స్‌లోని చాంగ్షా నగరంలోని యుహువా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అయితే ట్విస్ట్ ఏంటంటే..వీధికి అవతలి వైపు ఉన్న వేరే కెమెరాలో మాత్రం అసలు విషయం బైటపడింది. కిటీకిలోంచి దూకిన తరువాత అతడు మరో చిన్న వాల్ పై పడ్డాడు. దీంతో దుమ్ము దులుపుకొని తాపీగా, సైడ్ వాక్నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. సో..ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత హోటల్ ఈ సంఘటనను ధృవీకరించింది. అంతేకాదు కిటికీ గ్లాస్ నష్టాన్ని వసూలు చేసింది. స్థానిక పోలీసులు కూడా వారిద్దరూ లవర్స్ అని తేల్చి చెప్పింది. ఇద్దరూ ఎవరూ ఫిర్యాదు చేయలేదు కాబట్టి, తాము జోక్యం చేసుకోలేదని పోలీసు అధికారులు తెలిపారు. అయితే అసలు గొడవ ఎందుకు జరిగిందనే దానిపై స్పష్టత లేనప్పటికీ, నెటిజన్లు మాత్రం రోజర్ రాబిట్ సినిమాను గుర్తుచేసుకున్నారు. హాలీవుడ్లో స్టంట్ మాస్టర్లా పనికి వస్తాడంటూ కమెంట్స్ చేస్తున్నారు.ఇదీ చదవండి: రెండో కొడుకు... అనాథగా వచ్చి.. సెలబ్రిటీగా ఎవరో తెలుసా?చివరిగా సరదాగా అనిపించినా.. ఇలాంటి స్టంట్లు ఒక్కోసారి ప్రాణాలకే చేటు తెస్తాయి.అలాగే ప్రేమలో వైఫల్యం, జీవితంలో బాధలు, అనారోగ్యం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇలా కారణం ఏదైనా సయమనం ఉండాలి. అప్పుడే భవిష్యత్తు బంగారమవుతుంది. ఆత్మహత్యా ప్రయత్నాలనుంచి బైటపడిన వారి గాథలు వింటే ఇది ఎంత సత్యమో అర్థం మవుతుంది. క్షణికావేశం..కుటుంబాల్లోని ఆప్తులకు, సన్నిహితులకు కూడా మరణశాసనం లాంటి ఇది గుర్తు పెట్టుకోవాలి. ఆగి ఆలోచించే ఓపిక తెచ్చుకోవాలి. బతుకు బంగారు బాటను చేసుకోవాలి.

ఇదేందయ్యా ఇది!.. ఒక్క నిమిషంలోనే ముగించేసింది.. సైంటిస్టులు సైతం ఫిదా
వయసుతో సంబంధం లేకుండా కొందరు అద్భుతాలు చేసి ఆశ్చర్యపరుస్తుంటారు. అదికూడా లేటు వయసులో సాహసోపేతమైన పనులు చేసి వయసు అనేది శరీరానికే గానీ మనసుకు కాదని చేతల్లో చూపిస్తుంటారు. వృద్ధాప్య దశలో పీజీలు, పీహెచ్‌డీలు చేస్తే..కొందరు మాత్రం ఆ వయసుకి సాధ్యవుతాయా..? అనేలా ఛాలెంజింగ్ సాహసాలకు పూనుకుని, రికార్డులు సృష్టిస్తారు. అలాంటి కోవకు చెందిందే ఈ 91 ఏళ్ల బామ్మ. ఈమె ఏం చేసిందో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. శాస్త్రవేత్తలక సైతం ఆమె చురుకైన యాక్టివిటీని చూసి కంగుతిన్నారు.ఇటలీకి చెందిన 91 ఏళ్ల ఎమ్మా మరియా మజ్జెంగా(Emma Maria Mazzenga) అనే బామ్మ 90 ప్లస్ 200 మీటర్ల రన్నింగ్ రేసులో ఊహకందని విధంగా ప్రపంచ రికార్డును సృష్టించింది. జస్ట్ ఒక్క నిమిషంలోపే రన్నింగ్ రేస్‌ని ముగించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. నిజానికి ఆ వయసులో మరొకరి సాయం లేనిదే అడుగులు వేయలేరు. కానీ ఆమె మాత్రం చాలా వేగంగా పరుగులు తీయడం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. పైగా ఎలాంటి ఆయాసం లేకుండా యువకుల మాదిరిగా అత్యంత ఉత్సాహంగా పరుగులు తీయడం అత్యంత షాకింగ్ విషయం. ఆమె తోటివారందరూ ఆయాసంతో ఆందోళపడుతుంటే..ఆమె మాత్రం చాలా ప్రశాంతంగా సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకుంది. ఇది శాస్త్రవేత్తలను ఎంతగానో ఆకర్షించింది. ఈ వయసులో ఆ బామ్మ మజ్జెంగా ఇంత చురుగ్గా ఉండటానికి వెనుకున్న ఆరోగ్య రహస్యం ఏంటా అని ఆసక్తిని రేకత్తించింది. చివరికి అదేంటో సవివరంగా తెలుసుకున్నారు కూడా.ఇక్కడ బామ్మ 200 మీటర్ల పరుగును కేవల 51.47 సెకన్లలో పూర్తిచేసి, మునుపటి 90-ప్లస్ ప్రపంచ రికార్డును బ్రేక్ చేసింది. ఇంత వేగంగా చేయడానికి ఆమె శరీరం ధర్మం ఎలా సహకరిస్తుందో తెలుసుకునే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. అందుకోసం ఆమెకు శారీరక కసరత్తులకు సంబంధించిన పలు పరీక్షలు నిర్వహించి మరీ ఆమె ఆరోగ్య రహస్యాన్ని తెలుసుకున్నారు. 90 ఏళ్ల వయసులో బామ్మను సూపర్ ఫిట్‌గా ఉండేలా చేసినవి..పుణుల అభిప్రాయం ప్రకారం బామ్మ మజ్జెంగా వండర్ ఉమెన్. అందుకు రెండే రెండు ప్రధాన అంశాలని చెబుతున్నారు. ఆమె కార్డియోస్పిరేటరీ ఫిట్‌నెస్‌లో ఆమె గుండె,ఊపిరితిత్తులు, రాలకు ఆక్సిజన్‌ను పంప్ చేసే విధానం 40 లేదా 50 ఏళ్ల వయసులో ఉన్న ఆరోగ్యవంతమైన మహిళతో సమానంగా ఉంటుందట.ఆమె కండరాలు ప్రత్యేకమైనవి మరియు తక్కువ బర్నింగ్‌ని కలిగి ఉంటాయి. అంటే ఎనర్జీని కోల్పోకుండా ఉండటంతో అలిసిపోతు. అందువల్లే ఆమె సుదురాలకు సులభంగా పరిగెత్తగలతు. ఆమెలో "చాలా ఎక్కువ శాతం" వేగవంతమైన సంకోచ ఫైబర్లు కూడా ఉన్నాయి, ఇవి శక్తివంతమైన శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇవే ఆమె వేగవంతమైన కదిలికలకు కారణమని అన్నారు. ఈ ప్రత్యేకమైన లక్షణాలే ఈ 200 మీటర్ల రన్నింగ్ రేసులో అలవోకగా రికార్డు చేచేసందుకు దారితీసిందని చెబుతున్నారు డాక్టర్ మార్టా కొలోసియో.ఈ ప్రత్యేకమైన శరీరాకృతి ఎలా వచ్చిందంటే..ఆమె దశాబ్దాలుగా కష్టపడి పనిచేస్తోంది. అదే ఆమె శరీరానికి వరంగా మారింది1933లో జన్మించిన మజ్జెంగా మొదట విశ్వవిద్యాలయంలో తన ఫిట్నెస్ ప్రయాణాన్ని ప్రారంభించింది, 100, 200, 400 మరియు 800 మీటర్ల రేసుల్లో కూడా పోటీ పడింది. అప్పటి నుంచే ఆమె విజయపరంపర మొదలైంది. ఆరోజుల్లో రోమ్‌లో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో నాల్గవ స్థానంలో నిలిచింది.తన విజయాలకు బ్రేక్‌పడింది పెళ్లి, పిల్లలు అనే చెప్పొచ్చు. అలా ఆమె రెండు దశాబ్దలకు పైగా తన ఫిట్నెస్ కెరీర్‌కు దూరంగాఉంది. మళ్లీ తిరిగి 1986లో తన కెరీర్ రన్నింగ్ రేస్‌లోకి వచ్చింద. అంటే.. 50ల వయసులో తన పాత సహచరులతో పోటీ పడటం మొదలైంది. మళ్లీ పుంజుకోవడానికి చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చినా..ఈ రన్నింగ్ రేసులో పాల్గొనడం చాలా సంతృప్తినిస్తుందని అంటోంది బామ్మ. అదే కారణం..ఒక రేసు ఇచ్చే కిక్కే వేరు అంటోంది. ప్రతి శిక్షణా సెషన్ తనకు మంచి జీవితకాల వ్యాయామ శిక్షణ, అసాధారణ పనితీరుని అందిస్తుందట. అందువల్లే తొమ్మిది పదుల వయసులో కూడా ఇంతలా యువ క్రీడాకారులతో సరితూగేలా పోటీపడగలను అంటోంది. కాగా, బామ్మ ఐదు ప్రపంచ రికార్డులు, తొమ్మిది యూరోపియన్ రికార్డులు, మాస్టర్ స్ప్రింటింగ్ విభాగంలో 28 ఉత్తమ ఇటాలియన్ పెర్ఫామెన్స్‌గా అవార్డులు గెలుచుకుంది. ఈ బామ్మ నేటి యువతరానికి ఎంతోస్ఫూర్తి కదూ..!.(చదవండి: పిల్లలకు చెప్పాల్సిన 'మాయాబజార్' పాఠాలు..!)

దూసుకొస్తున్న కాస్మోస్ 482
సోవియట్ యూనియన్ ఎప్పుడో అర్ధ శతాబ్దం క్రితం ప్రయోగించిన అంతరిక్ష నౌక ‘కాస్మోస్ 482’ త్వరలో భూమిపై కూలబోతోంది. మే నెల 8-11 తేదీల మధ్య అది భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. శుక్ర గ్రహాన్ని పరిశోధించడానికి 1972 మార్చి 31న సోవియట్ ఈ అంతరిక్ష నౌకను ప్రయోగించింది. వాస్తవానికి ‘కాస్మోస్ 482’ ఓ లాండింగ్ మాడ్యూల్. 495 కిలోల ల్యాండరును శుక్రగ్రహంపై దింపడం ఈ మిషన్ ఉద్దేశం. సాంకేతిక లోపం తలెత్తి ప్రయోగం విఫలమవడంతో ‘కాస్మోస్ 482’ స్పేస్ క్రాఫ్ట్ ముందుకు ప్రయాణించడానికి అవకాశం లేక భూకక్ష్యలోనే ఇరుక్కుపోయింది. గత 53 సంవత్సరాలుగా అది భూమి కక్ష్యలోనే పరిభ్రమిస్తోంది. ఇప్పుడు కూలే సమయం ఆసన్నమవడంతో శాస్త్రవేత్తలు దాని ఆర్బిటల్ ఎత్తును నిరంతరాయంగా గమనిస్తున్నారు. అంతరిక్ష నౌక కచ్చితంగా ఏ తేదీన భూమిపై కూలుతుందో త్వరలో తెలుస్తుంది. మే 8-11 తేదీల్లో ‘కాస్మోస్ 482’ భూమిపై కూలవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నప్పటికీ... ‘సూర్యుడి క్రియాశీలత’ ప్రభావంతో సదరు తేదీలకు కాస్త ముందుగా గానీ, లేదా ఆ తర్వాత గానీ నౌక కూలే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే సూర్యుడి క్రియాశీలత అధికంగా ఉంటే భూమి ఎగువ వాతావరణం త్వరగా వేడెక్కి వ్యాకోచిస్తుంది. ఫలితంగా దిగువ కక్ష్యలో పరిభ్రమించే వస్తువులను భూ వాతావరణం త్వరితగతిన లాక్కుంటుంది. అంటే ‘కాస్మోస్ 482’ అంతరిక్ష నౌక మనం అనుకున్న సమయం కంటే ముందుగానే కూలిపోవచ్చు. 52 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల్లో కూలవచ్చు!భూ వాతావరణంలోకి అనియంత్రిత ప్రవేశం’ కనుక ‘కాస్మోస్ 482’ స్పేస్ క్రాఫ్ట్ భూమిపై ఏ ప్రాంతంలో కూలిపోతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కానీ ప్రస్తుతం నౌక కక్ష్యను పరిశీలిస్తే భూమిపై 52 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 52 డిగ్రీల దక్షిణ అక్షాంశం మధ్య గల సువిశాల ప్రదేశంలో... అంటే ఉత్తరాన బ్రిటన్ మొదలుకొని దక్షిణాన న్యూజిలాండ్ దాకా ఎక్కడైనా అది కూలవచ్చు. భూమిపై జలావరణమే అధికం కనుక నౌక నేలపై కాకుండా సముద్రాల్లో కూలిపోయే అవకాశాలే ఎక్కువ. సముద్ర ప్రదేశాలు కాకుండా భూభాగంపై లేదా జనావాస ప్రాంతాలపై అది కూలిపోయే అవకాశాలు స్వల్పమే అయినప్పటికీ ఓ అంశం శాస్త్రవేత్తలను కొంచెం కలవరపెడుతోంది. ‘కాస్మోస్ 482’కు ఓ విశిష్టత ఉంది. అది ‘వెనెరా’ మిషన్ ల్యాండర్ల తరహా అంతరిక్ష నౌక. శుక్ర గ్రహంపై దిగేటప్పుడు అక్కడి కఠినాతి కఠినమైన అత్యధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర పీడనాన్ని తట్టుకునేలా ‘కాస్మోస్ 482’ను రూపొందించారు. సాధారణంగా ఖగోళ వస్తువులు భూవాతావరణంలోకి ప్రవేశించాక గాలి ఒరిపిడికి మండిపోయి చిన్న శకలాలుగా రాలిపోతాయి. వాటిలోని పెద్ద, బరువైన భాగాలు మాత్రమే భూమిని తాకుతాయి. డిజైన్ ప్రత్యేకత దృష్ట్యా ‘కాస్మోస్ 482’ మాత్రం భూ వాతావరణంలోకి ప్రవేశించినా ధ్వంసం అవదు. సముద్రాల్లో కాకుండా అది భూభాగంపై కూలిపోవడమంటూ సంభవిస్తే... ఏమాత్రం చెక్కు చెదరకుండా 495 కిలోల ‘కాస్మోస్ 482’ ధడేల్మని ‘ఒకే ముక్క’గా నేల రాలుతుంది! అలా చిన్న ఉల్క మాదిరి ప్రభావం చూపుతుంది. శాస్త్రవేత్తలకు ఆందోళన కలిగిస్తున్న అంశం ఇదే. - జమ్ముల శ్రీకాంత్
పహల్గాం ఉగ్రదాడి.. వెలుగులోకి సంచలన విషయాలు
ప్రియురాలితో గొడవ, అమాంతం దూకేశాడు, ట్విస్ట్ ఏంటంటే..!
ఆస్తులు తాకట్టు పెట్టి సినిమా తీశాం.. మా బాధ మీకేం తెలుసు?
ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. ఐపీఎల్ నుంచి అతడు అవుట్
‘హిట్ 3’ మూవీ రివ్యూ
ఘనంగా మైక్రోసాప్ట్ ఐడీసీ పినాకిల్ సమ్మిట్-2025
ఆసియా తొలి ప్లేయర్‌గా రికార్డు.. చరిత్ర పుటల్లోకి అతడి పేరు!
పూర్తి కోడింగ్ పనంతా ఏఐదే!
ఇదేందయ్యా ఇది!.. ఒక్క నిమిషంలోనే ముగించేసింది.. సైంటిస్టులు సైతం ఫిదా
..చాలా కాలాం తర్వాత మీరు పర్యటిస్తున్నారుగా.. జనం మర్చిపోయార్సార్!
పహల్గాం ఉగ్రదాడి.. వెలుగులోకి సంచలన విషయాలు
ప్రియురాలితో గొడవ, అమాంతం దూకేశాడు, ట్విస్ట్ ఏంటంటే..!
ఆస్తులు తాకట్టు పెట్టి సినిమా తీశాం.. మా బాధ మీకేం తెలుసు?
ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. ఐపీఎల్ నుంచి అతడు అవుట్
‘హిట్ 3’ మూవీ రివ్యూ
ఘనంగా మైక్రోసాప్ట్ ఐడీసీ పినాకిల్ సమ్మిట్-2025
ఆసియా తొలి ప్లేయర్‌గా రికార్డు.. చరిత్ర పుటల్లోకి అతడి పేరు!
పూర్తి కోడింగ్ పనంతా ఏఐదే!
ఇదేందయ్యా ఇది!.. ఒక్క నిమిషంలోనే ముగించేసింది.. సైంటిస్టులు సైతం ఫిదా
..చాలా కాలాం తర్వాత మీరు పర్యటిస్తున్నారుగా.. జనం మర్చిపోయార్సార్!
సినిమా

'శివయ్యా...' హర్టయిన కన్నప్ప టీమ్.. సారీ చెప్పిన శ్రీవిష్ణు
శ్రీ విష్ణు (Sree Vishnu).. వరుస హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పుడు సింగిల్ సినిమా (Single Movie)తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకునే ప్లాన్‌లో ఉన్నాడు. శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సింగిల్. కేతిక శర్మ, లవ్ టుడే బ్యూటీ ఇవానా హీరోయిన్లుగా నటించారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.హర్టయిన మంచు విష్ణు!ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సింగిల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అందులో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన కొన్ని వీడియో క్లిప్పింగ్స్‌ను రీక్రియేట్ చేశారు. నందమూరి బాలకృష్ణ.. హనీరోజ్‌తో మలయాళం మాట్లాడేందుకు ప్రయత్నించినదాన్ని సినిమాలో వాడేశారు. అలాగే మంచు విష్ణు కన్నప్ప సినిమాలోని శివయ్యా అనే డైలాగ్‌ను కూడా సింగిల్ మూవీలో రిపీట్ చేశారు. ఇది చూసిన కన్నప్ప టీమ్ హర్టరయ్యారని తెలిసి శ్రీ విష్ణు.. వారికి సారీ చెప్పాడు.మీమ్స్ వాడాం..శ్రీ విష్ణు మాట్లాడుతూ.. సింగిల్ సినిమా ట్రైలర్‌లోని కొన్ని డైలాగులకు కన్నప్ప టీమ్ (Kannappa Movie) హర్టయిందని తెలిసింది. దానికోసమే ఈ వీడియో చేస్తున్నాం. మేం కావాలని చేయలేదు. కానీ, అది తప్పుగా జనాల్లోకి వెళ్లడం వల్ల ఆ డైలాగ్స్‌ను డిలీట్ చేశాం. సినిమాలో కూడా ఆ డైలాగ్స్ ఉండవు. ఎవరినీ హర్ట్ చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. ఈ జనరేషన్లో ఎక్కువ ఫాలో అయ్యే మీమ్స్, సినిమా క్లిప్పింగ్స్ కానీ, బయట ఎక్కువ వైరల్ అయ్యేవాటిని తీసుకుని దాన్ని రీక్రియేట్ చేశాం.క్షమించండి: శ్రీ విష్ణుఆ క్రమంలోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్.. ఇలా అందరి డైలాగ్స్ వాడాం. ఎవరికైనా మా వల్ల ఇబ్బంది కలిగితే మమ్మల్ని క్షమించండి. ఇకపై మా టీమ్ నుంచి అలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటాం. ఇండస్ట్రీలో ఉన్న అందరం కూడా ఒక కుటుంబంలాగా ఉంటాం. ఒకరినొకరు కించపరుచుకోవాలన్న దురుద్దేశమైతే మాకు లేదు. హర్టయినవారికి క్షమాపణలు చెప్పేందుకే ఈ వీడియో చేస్తున్నా అన్నాడు శ్రీవిష్ణు. ఇకపోతే మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప చిత్రంలో శివయ్యా అనే డైలాగ్పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే! ఈ సినిమాను జూన్ 27న విడుదల చేయనున్నారు.చదవండి: HIT3 X Review: ‘హిట్ 3’ ట్విటర్ రివ్యూ

రెట్రో మూవీ ట్విటర్ రివ్యూ.. సందడి లేదేంటి?
సినీ ప్రియులకు నేడు డబుల్ ధమాకా.. అటు నాని హీరోగా నటించిన హిట్ 3 రిలీజవుతుండగా.. ఇటు సూర్య నటించిన రెట్రో (Retro Movie) కూడా సరిగ్గా ఇదే రోజు (మే 1న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన రెట్రో చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ సినిమా గురించి ఎక్స్ (ట్విటర్)లో ఎటువంటి సందడి కనిపించడం లేదు.కనిపించని సందడిఈ సినిమాకు ప్రీమియర్స్ వేసినట్లు లేరు. చాలాచోట్ల ఇప్పుడిప్పుడే షోలు పడుతున్నాయి. దీంతో జనాల రెస్పాన్స్ తెలియడానికి మరికాస్త సమయం పట్టేట్లు ఉంది. విదేశాల్లో ప్రీమియర్ షోలు వేయడం వల్ల పని కట్టుకుని కొందరు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని.. దీన్ని అరికట్టేందుకే రెట్రో టీమ్ ఎర్లీ షోలు ఎత్తేసిందని ప్రచారం జరుగుతోంది. కొన్నిచోట్ల మాత్రం తొలి షో అయిపోయిందని.. సినిమా బాగుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.కంగువా డిజాస్టర్.. ఈసారైనా..అసలే సూర్య (Suriya) చివరి సినిమా కంగువా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమా ఎలాగైనా హిట్టవ్వాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అటు పూజా హెగ్డే (Pooja Hegde) సైతం ఈ చిత్ర ప్రమోషన్స్‌లో తెగ కష్టపడింది. ఎక్కడికి వెళ్లినా 'కనిమా..' అంటూ తన పాటకు స్టెప్పులేసింది. మరి వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందో, లేదో చూడాలి! Very worst till now Rohini theater Gate not opened Time 7:30 AM May 01 #RetroFDFS #Retro pic.twitter.com/mg0fn8tN8N— Rolex_07_Rahul (@_Rolex07_) May 1, 2025#RETRO: BLOCKBUSTER 🔥💯🏆— Vinveli Nayagan (@Vinveli_nayaga) May 1, 2025#RETRO negative reviews from overseas 🥺😒— 💙🎊Thala Sudhakar🎊💙 (@Sudhkaar1) May 1, 2025#Retro Premiers leva Reviews levu asalu X Lo— Pavan Prabhas (@Pa1Prabhas_45) May 1, 2025Number of Tickets sold on BookMyShow in last 24 Hours 1. #Thudarum 290.88 🤯2. #HitTheThirdCase 189.96K3. #Retro 138.67K 4. #Raid2 89.82K 5. #KesariChapter2 41.61K6. #Gangers 7.68K7. #UntilDawn 7.42K8. #GroundZero 6.94K9. #Phule 6.91K10. #Sinners 6.50K11. #Jaat 5.58K— Movie Industry Updates (@movies_N_update) May 1, 2025 చదవండి: నాని ‘హిట్ 3’ సినిమాకి ఊహించని టాక్.. అదే మైనస్ అట!

HIT3 X Review: ‘హిట్ 3’ ట్విటర్ రివ్యూ
నేచురల్ స్టార్ నాని(Nani) నటించిన 'హిట్: ది థర్డ్ కేస్'(HIT3) సినిమా ఎట్టకేలకు నేడు(మే 1) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ‘హిట్’ ఫ్రాంచైజీలో మూడో చిత్రమిది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇందులో నాని ఎస్పీ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమా పై హైప్ క్రియేట్ అయింది. భారీ లంచనాల మధ్య మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. హిట్ 3 కథేంటి? ఎలా ఉంది? నాని ఖాతాలో మరో హిట్ పడిందా లేదా తదితర అంశాలను ఎక్స్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.ఎక్స్‌లో హిట్ 3(HIT3 Review) సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది.కొంతమంది నెటిజన్స్ సినిమా మొదటి సగం అద్భుతంగా ఉందని, నాని నటన, రొమాంటిక్ ఎపిసోడ్లు ఆకట్టుకున్నాయని ప్రశంసింస్తే..మరికొంతమంది ఈ సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఆకట్టుకోలేదని, గత హిట్ సినిమాలతో పోలిస్తే ఈ భాగం సాధారణంగా ఉందని అభిప్రాయపడ్డారు. సినిమా రెండో సగం కథలో మెరుగైన ఆలోచనలు, ఎగ్జిక్యూషన్ లోపించాయని కొందరు విమర్శించారు. అయినప్పటికీ, నాని పాత్రలో కొత్త జోన్లో కనిపించాడని, అతని నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చాలామంది కొనియాడారు. #Hit3 is a very violent action crime thriller that has moments that work well but at the same time portions that are too run of the mill and narrated on the slower side.The first half is pretty average and predictable till the pre-interval which starts to engage. The second…— Venky Reviews (@venkyreviews) April 30, 2025 హిట్ 3' ఒక వయలెంట్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్.కొన్ని సీన్స్ భాగా వర్కౌట్ అయ్యాయి.అదే సమయంలో కొన్ని రోటీన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఫస్టాఫ్ రొటీన్‌గా, ఊహించదగిన విధంగా ఉంటుంది. ప్రీ-ఇంటర్వెల్ వరకు, అక్కడ నుండి ఆసక్తికరంగా మారుతుంది. రెండవ సగం స్క్విడ్ గేమ్ నుండి ప్రేరణ పొందిన సెటప్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ కథనం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే, ముందుగా చెప్పినట్లు కథనం ఊహించదగిన విధంగా ఉంటుంది, తక్కువ ట్విస్ట్‌లతో మరియు మాస్ మూమెంట్స్‌పై ఎక్కువగా ఆధారపడుతుంది. నిర్మాణ విలువలు మరియు సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా నిలుస్తాయి. సంగీతం ప్రభావవంతంగా లేదు . నాని అద్భుతంగా నటించాడు అంటూ ఓ నెటిజన్ ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇచ్చాడు.#Hit3One time watch for NaNiHighlights __________NaNi’s performance Cinematography Climax Negatives__________Forceful violenceNo twists and turnsUneven screenplayBGM— praneeth nukala (@praneethnukala) May 1, 2025 హిట్ 3 ఒక్కసారి చూడొచ్చు. నాని నటన, సినిమాటోగ్రఫీ, క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయితే.. వయెలెన్స్ బలవంతగా ఇరికించడం, ట్విస్టులు,మలుపులు లేకపోవడం, స్క్రీన్‌ప్లే, బీజీఎం మైనస్ పాయింట్స్ అని మరో నెటిజన్ అభిప్రాయ పడ్డాడు#HIT3 #HIT3Review RAW..BLOODY..🎯🎯🎯🎯Not for family audiences or kids. What an actor @NameisNani . He is growing as multitalented, big box office star. Best of #Nani movie I have ever watched. Totally new experience 👏🏼👏🏼Strictly NO Kids ⛔️⛔️***BLOCKBUSTER***— Karthik (@meet_tk) April 30, 2025#HIT3 rating : ⭐⭐🌟3/5!!@NameisNani show🔥 an Griping action pack thriller, #SrinidhiShetty and #nani chamestry good overall an watchable.#hit3review #HIT3FromMay1st pic.twitter.com/guu9TKRMsS— its cinema (@iitscinema) April 30, 2025 ఇది నాని షో. గ్రిస్పింగ్ యాక్షన్‌ప్యాక్ థ్రిల్లర్. శ్రీనిధి శెట్టి, నాని కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్‌గా హిట్3 థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా అంటూ మరో నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాడు.First half Good Second Half & Pre climax 💥💥💥💥💥💥💥💥💥💥💥. #HIT3 pic.twitter.com/8074TXw1v1— Vishnu Varthan Reddy (@RVVR9999) May 1, 2025#hit3review – Gritty & violent thriller with flashes of brilliance. First half dull, second half picks up with Squid Game vibes. Nani excels, but predictable plot, excess violence & weak music pull it down. Not for families.Rating: 2.75/5#Nani #HIT3TheThirdCase #HIT3 #hit3 pic.twitter.com/98Rk6J9tUs— Tha Cinema (@tha_cinema) May 1, 2025#HIT3Review:Positives• Nani🔥💥💥• The Final Act🥵👿• Concept😮• Sailesh's Screenplay👌• Cameos💥Suspenses🙌Investigation💥Final Verdict: An Engaging Suspense Thriller that serves its Purpose.#HIT3 | #NANI | #HIT3TheThirdCase #castesensuspic.twitter.com/eDn379ICBk— IndianCinemaLover (@Vishwa0911) May 1, 2025

అడవి పిలిచింది!
‘అడవి పిలిచింది... నేను సమాధానం చెప్పాను’ అని అంటున్నారు హీరోయిన్ తమన్నా. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా అరుణభ్ కుమార్–దీపక్ మిశ్రా దర్శకత్వంలో ‘వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ అనే మైథలాజికల్ మూవీ తెరకెక్కుతోంది. బాలాజీ మోషన్ పిక్చర్స్, ది వైరల్ ఫీవర్ మోషన్ పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో తమన్నా నటిస్తున్నట్లుగా వెల్లడించి, ఆమెపాత్ర తాలూకు ప్రీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. రాత్రి వేళ ఎర్రటి చీర ధరించిన తమన్నా కారు దిగి, అడవిలోకి వెళ్లి, అక్కడ ఓ దీపం వెలిగించడం, అక్కడ ఏదో దృశ్యాన్ని చూసి కళ్లు పెద్దవి చేయడం వంటి విజువల్స్ ఈ వీడియోలో కనిపించాయి. ‘‘అడవి పిలిచింది. నేను సమాధానం చెప్పాను. ‘వ్వాన్’లో భాగం కావడం థ్రిల్లింగ్‌గా ఉంది’’ అంటూ ‘ఎక్స్’లో పేర్కొన్నారు తమన్నా. ఈ సినిమా 2026లో విడుదల కానుంది.
న్యూస్ పాడ్‌కాస్ట్

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన... కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో అంతులేని అవినీతి, అంతా అరాచకమే... చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

ఏపీలో కేంద్ర సంస్థలకైతే కోట్లు.. ఉర్సా సంస్థకైతే ఊరకే!

పాక్ కాల్పుల పోరు.. బదులిచ్చిన భారత బలగాలు.

ఏపీ రాజధానిలో దోపిడీ ఐకానిక్.. 5 టవర్ల నిర్మాణ వ్యయం పెంపు

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు.. తీవ్రస్థాయికి ఉద్రిక్తతలు

పాకిస్తాన్‌కు భారత్ పంచ్. పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్. దౌత్య సంబంధాలకు కత్తెర. సింధూ ఒప్పందం సస్పెన్షన్. ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ

జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి... కాల్పులకు 26 మంది బలి, మరో 20 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ఇద్దరు విదేశీయులు

బాబోయ్ బంగారం. దేశంలో తొలిసారి లక్ష రూపాయల మార్కును దాటేసిన పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం
క్రీడలు

వాళ్లిద్దరు అద్భుతం.. అతడు గొప్ప ఫీల్డర్.. కానీ అక్కడే వెనుకబడ్డాం: ధోని
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రయాణం ముగిసిపోయింది. పంజాబ్ కింగ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఓడిన తర్వాత ధోని సేన అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.పంజాబ్‌తో మ్యాచ్‌లో తమ బ్యాటర్లు మెరుగ్గానే ఆడారని.. అయితే, కనీసం ఇంకో 15 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. ‘‘ఈరోజు తొలిసారి మా బ్యాటర్లు స్కోరు బోర్డుపై మెరుగైన సంఖ్యను ఉంచారు. కానీ ఇలాంటి పిచ్‌పై ఇది సరిపోదు.ఆఖరి నాలుగు బంతులు వృథా చేశాంమా వాళ్లు ఇంకాస్త మెరుగ్గా ఆడితే బాగుండేది. అదే విధంగా మేము కీలక సమయాల్లో కీలక క్యాచ్‌లు జారవిడవడం కూడా ప్రభావం చూపింది.ఏదేమైనా ఈరోజు బ్రెవిస్, సామ్ అద్భుతంగా ఆడి విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, మేము దురదృష్టవశాత్తూ ఆలౌట్ అయ్యాము. ఆఖరి నాలుగు బంతులు వృథా చేశాం. అంతకంటే ముందు మా వాళ్లు నలుగురు అవుట్ అయ్యారు.అతడొక పోరాట యోధుడుఇలాంటి కీలక పోరులో ఒక్క బంతి ఆడటం కూడా మ్యాచ్‌ను మలుపు తిప్పుతుంది’’ అని ధోని పేర్కొన్నాడు. ఇక పంజాబ్‌తో మ్యాచ్‌లో అద్భుత అర్థ శతకంతో మెరిసిన సామ్ కరన్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అతడొక పోరాట యోధుడు. తనకు అవకాశం దొరికినప్పుడల్లా కచ్చితంగా రాణిస్తాడు.అయితే, దురదృష్టవశాత్తూ పిచ్ దృష్ట్యా అతడికి ఎక్కువగా ఛాన్సులు ఇవ్వలేకపోయాం. కానీ ఈరోజు మా సొంతమైదానంలో టోర్నీలోనే అత్యుత్తమ వికెట్ మీద ఆడి తానేంటో నిరూపించుకున్నాడు.అతడొక అద్భుతమైన ఫీల్డర్ కూడామేము ఇంకొక్క పదిహేను పరుగులు చేసి ఉంటే బాగుండేది’’ అని ధోని అన్నాడు. అదే విధంగా అద్భుత ఫీల్డింగ్ నైపుణ్యాలు కనబరిచిన డెవాల్డ్ బ్రెవిస్ గురించి మాట్లాడుతూ.. ‘‘మిడిలార్డర్లో తను మొమెంటమ్ తీసుకువచ్చాడు.చిన్న అవకాశం దొరికినా బంతిని బౌండరీకి తరలించాలని చూస్తాడు. అంతేకాదు.. అతడొక అద్భుతమైన ఫీల్డర్ కూడా. జట్టులో సరికొత్త ఉత్సాహం నింపుతున్నాడు. అతడి ఆట పట్ల సంతృప్తిగా ఉన్నాము. భవిష్యత్తులో అతడొక విలువైన ఆస్తిగా మారతాడు’’ అని ధోని ఈ సౌతాఫ్రికా యువ బ్యాటర్‌పై ప్రశంసలు కురిపించాడు.Brilliant Brevis catch: Composure. Presence of mind & Athleticism at its best 🫨Watch 🔽🎥#TATAIPL | #CSKvPBKS— IndianPremierLeague (@IPL) April 30, 2025 సీఎస్కేకే ఇదే తొలిసారికాగా చెపాక్ స్టేడియంలో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది చెన్నై. ఓపెనర్లు షేక్ రషీద్ (11), ఆయుశ్ మాత్రే (7) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన సామ్ కరన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.మొత్తంగా 47 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 88 పరుగులతో ఆకట్టుకున్నాడు. అతడికి తోడుగా డెవాల్డ్ బ్రెవిస్ (32) రాణించాడు. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. ఈ క్రమంలో 19.2 ఓవర్లో 190 పరుగులు చేసి చెన్నై జట్టు ఆలౌట్ అయింది.ఇక ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. చెన్నైని ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకొనేలా చేసింది. అయితే, ఈ మ్యాచ్‌లో బేబీ ఏబీడీ బ్రెవిస్ అద్భుతమైన క్యాచ్‌లతో మెరిశాడు. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (54) ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టాడు.అయితే, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో శశాంక్ సింగ్ (23) ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద అద్భుత రీతిలో అందుకున్న బ్రెవిస్ అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు. బౌండరీ లైన్‌కు తాకే ప్రమాదం ఉండటంతో బంతిని మూడుసార్లు గాల్లోకి లేపి ఆ తర్వాత సురక్షితంగా క్యాచ్ పట్టాడు. కాగా గతేడాది కూడా చెన్నై టాప్-4కు చేరలేదన్న విషయం తెలిసిందే. ఇలా వరుసగా రెండు సీజన్లలో చెన్నై ప్లే ఆఫ్స్ చేరకపోవడం ఇదే తొలిసారి.చదవండి: క్రికెట్ నీకు రెండో ఛాన్స్ ఇచ్చింది.. కానీ.. Hat-trick 👌Powerful start with the bat 🔥Captain's knock 🫡The Battle of Kings goes the @PunjabKingsIPL way again this season ❤Scorecard ▶ https://t.co/eXWTTv7Xhd #TATAIPL | #CSKvPBKS pic.twitter.com/Yk1SOZOzip— IndianPremierLeague (@IPL) April 30, 2025

ఏడాదిన్నర క్రితమే విడాకులు.. డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ
న్యూఢిల్లీ: భారత దిగ్గజ బాక్సర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీకోమ్ (Mary Kom) తన వైవాహిక బంధం గురించి వస్తున్న వార్తలపై తొలిసారి స్పందించింది. తన భర్త కరుంగ్ ఓన్‌కోలర్ (Karong Onkholer Kom)తో దాదాపు ఏడాదిన్నరే క్రితమే విడిపోయినట్లు ఆమె ధ్రువీకరించింది. పెద్దల సమక్షంలో విడాకుల ప్రక్రియ కూడా పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించింది. కాగా ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ (Boxing World Champion)గా నిలిచిన 43 ఏళ్ల మేరీకోమ్ ఇటీవల తరచుగా వ్యక్తిగత అంశాలతో వార్తల్లో నిలిచింది. భర్తతో విడాకులతో పాటు హితేశ్ చౌధరీ అనే వ్యాపార్తవేత్తతో ఆమె బంధం గురించి కూడా తరచుగా కథనాలు వస్తున్నాయి. వీటన్నింటికి సమాధానమిస్తున్నట్లుగా తన లాయర్ ద్వారా మేరీ కోమ్ ఒక బహిరంగ ప్రకటనను విడుదల చేసింది. ‘కోమ్ చట్టాల ప్రకారం’ విడాకులు‘మేరీకోమ్‌కు, ఓన్కోలర్కు మధ్య ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు. 2023 డిసెంబర్ 20న ఇద్దరి అంగీకారంతో ‘కోమ్ చట్టాల ప్రకారం’ కుటుంబసభ్యులందరి మధ్య వీరిద్దరికి విడాకులు మంజూరయ్యాయి. పెళ్లి అంతా ముగిసిన గతం కాబట్టి దానిపై ఏమీ వ్యాఖ్యానించదల్చుకోలేదు.అవన్నీ వదంతులు మాత్రమేమరోవైపు హితేశ్‌తో గానీ మరో బాక్సర్ భర్తతో గానీ ఆమెకు వ్యక్తిగత సంబంధం ఉన్నట్లుగా వస్తున్న వదంతుల్లో వాస్తవం లేదు. ఇకపై ఎవరూ దీనిని ప్రస్తావించరాదు. మేరీకోమ్ ఫౌండేషన్ వ్యవహారాలు చూసే వ్యక్తిగా హితేశ్‌తో వృత్తిపరమైన సంబంధం మాత్రమే ఉంది. ఇకపై మేరీకోమ్‌కు సంబంధించి ఎలాంటి తప్పుడు వార్తలు రాయరాదని, ప్రచారం కల్పించరాదని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని మేరీకోమ్ తరఫున ఆమె న్యాయవాది రజత్ మాథూర్ ప్రకటించారు. కాగా మణిపూర్‌కు చెందిన మేరీకోమ్, కరుంగ్ ఓన్‌కోలర్ వివాహం 2005లో జరిగింది. వీరిద్దరికి ముగ్గురు మగ పిల్లలుకాగా... 2018లో కరుంగ్ ఓన్‌కోలర్ ఒక పాపను దత్తత తీసుకున్నాడు. చదవండి: మా గురించి మీకేం తెలుసు?.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్

‘టాప్స్’లో జ్యోతి సురేఖ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖకు టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్)లో చోటు దక్కింది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీ కాంపౌండ్ విభాగాన్ని కూడా చేర్చడంతో... ఈ విభాగంలో పోటీ పడుతున్న జ్యోతి సురేఖకు మరింత మెరుగైన శిక్షణ తీసుకునేందుకు ‘టాప్స్’ ఉపయోగపడనుంది. ఈ మేరకు బుధవారం మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ) 155వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, వీరేన్ రస్కిన్హా, ప్రశాంతి సింగ్, సోమయ్య, సిద్ధార్థ్ శంకర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జ్యోతి సురేఖతో సహా ఏడుగురు కాంపౌండ్ ఆర్చర్లకు ‘టాప్స్’లో చోటు కల్పించారు. ఇందులో ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేతలు అభిషేక్ వర్మ, పర్ణీత్ కౌర్, ప్రవీణ్ ఒజస్, ప్రపంచ చాంపియన్ అదితి గోపీచంద్, ప్రియాన్‡్ష, ప్రథమేశ్ ఉన్నారని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో జ్యోతి సురేఖ మూడు స్వర్ణ పతకాలతో మెరిసింది. గత ఆసియా క్రీడల్లో మిక్స్డ్, టీమ్, వ్యక్తిగత విభాగాల్లో విజేతగా నిలిచింది. ‘2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీ కాంపౌండ్ విభాగాన్ని చేర్చాలని ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయించింది. దీంతో ఎంఓసీ భేటీ నిర్వహించి కాంపౌండ్ ఆర్చర్లకు టాప్స్‌లో అవకాశం కల్పించాం. ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్, ప్రపంచకప్‌లలో ప్రదర్శన ఆధారంగా ఆర్చర్లను టాప్స్‌కు ఎంపిక చేశాం. అలాగే టాప్స్‌లో ఉన్న ఇతర క్రీడాకారులకు కూడా నిధులు విడుదల చేశాం’ అని భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) ఒక ప్రకటనలో తెలిపింది. » ‘టాప్స్’లోని 56 మంది అథ్లెట్లకు సంబంధించిన రూ. 4.37 కోట్ల నిధులను బుధవారం విడుదల చేశారు. » తాష్కెంట్లో 17 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ శిక్షణలో పాల్గొనేందుకు తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు ఆమోదం లభించింది. ఈ నెల 8 నుంచి 23 వరకు ఉజ్బెకిస్తాన్ జట్టుతో ఈ ట్రైనింగ్ సాగనుంది. » టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్లు ఆకుల శ్రీజ, మనిక బత్రా ఐటీటీఎఫ్ ప్రపంచ చాంపియన్ షిప్లో పాల్గొనేందుకు ముందస్తు నిధులు విడుదల చేశారు. ఖతర్ వేదికగా ఈ నెల 17 నుంచి 25 వరకు ఈ టోర్నీ జరగనుంది. » ఈ నెల 9 నుంచి యూఏఈ వేదికగా జరుగుతున్న అథ్లెటిక్స్ గ్రాండ్‌ప్రిలో పాల్గొనేందుకు లాంగ్ జంపర్ శైలి సింగ్‌కు ఆర్థిక సాయం కూడా అందించారు. » ఇక టెన్నిస్ యువ సంచలనం మాయా రాజేశ్వరన్కు కూడా ‘టాప్స్’ నిధులు అందించింది. స్పెయిన్‌లోని రఫా నాదల్ అకాడమీలో శిక్షణ పొందేందుకు అవసరమైన నిధులు విడుదల చేసింది.

భారత బాక్సర్ల పసిడి పంచ్
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా జూనియర్ బాక్సింగ్ టోర్నమెంట్ అండర్–15 విభాగంలో భారత బాక్సర్లు ఏకంగా 25 పతకాలతో అదరగొట్టారు. ఇందులో 11 స్వర్ణాలు, మూడు రజతాలు, 11 కాంస్యాలు ఉన్నాయి. ఫలితంగా ఈ విభాగంలో భారత్ ఓవరాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. బాలికల విభాగంలో భారత బాక్సర్లు కోమల్ (33 కేజీలు), ఖుషీ (35 కేజీలు), తమన్నా (37 కేజీలు), సువీ (40 కేజీలు), మిల్కీ (43 కేజీలు), ప్రిన్సీ (52 కేజీలు), నవ్య (58 కేజీలు), సునైనా (61 కేజీలు), తృష్ణ (67 కేజీలు), వన్షిక (ప్లస్ 70 కేజీలు)... బాలుర విభాగంలో సంస్కార్ వినోద్ (35 కేజీలు) బంగారు పతకాలు గెల్చుకున్నారు. బాలుర విభాగంలో రుద్రాక్ష్ (46 కేజీలు), అభిజీత్ (61 కేజీలు), లక్షయ్ (64 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలు దక్కించుకున్నారు.
బిజినెస్

ఇండస్‌ఇండ్‌లో ఎగ్జిక్యూటివ్‌ల కమిటీ ఏర్పాటు
డెరివేటివ్స్ అకౌంటింగ్ అవకతవకల నేపథ్యంలో సీఈవో సుమంత్ కథ్పాలియా రాజీనామాతో కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఎగ్జిక్యూటివ్‌ల కమిటీని బోర్డు నియమించినట్లు ఇండస్ఇండ్ బ్యాంక్ వెల్లడించింది. కొత్త ఎండీ, సీఈవో బాధ్యతలు చేపట్టే వరకు లేదా మూడు నెలల వరకు ఈ కమిటీ ఉంటుందని పేర్కొంది. దీనికి బోర్డ్ చైర్మన్ సారథ్యం వహిస్తారు. ఆడిట్ కమిటీ, కాంపన్సేషన్, నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ, రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ నుంచి సభ్యులు ఉంటారు. డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియో లెక్కింపులో తప్పుడు అకౌంటింగ్ విధానం కారణంగా బ్యాంకుపై సుమారు రూ. 1,960 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడుతుందనే అంచనాల నడుమ, నైతిక బాధ్యత వహిస్తూ సీఈవో మంగళవారం నాడు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.ఏం జరిగిందంటే..డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోను లెక్కగట్టే అకౌంటింగ్ విధానాల్లో లోపాల కారణంగా బ్యాంక్ నికర విలువపై సుమారు 2.35 శాతం ప్రతికూల ప్రభావం పడొచ్చని ఇండస్ఇండ్ బ్యాంక్ గత నెల ప్రకటించడం కలకలం రేపింది. దీనిపై స్వతంత్ర విచారణ జరిపేందుకు మార్చి 20న బ్యాంకు ఓ ప్రొఫెషనల్ సంస్థను నియమించింది. అంతర్గతంగా డెరివేటివ్స్ ట్రేడ్లను నమోదు చేయడంలో లోపాల వల్ల ఊహాజనిత లాభాలు నమోదు కావడమే అకౌంటింగ్ అవకతవకలకు దారి తీసిందని, దీనితో మొత్తం గణాంకాలన్నీ మారిపోయాయని సదరు సంస్థ తన నివేదికలో విశ్లేషించింది.ఇదీ చదవండి: సమస్యలు విని.. పరిష్కారాలు చెబుతోంది!ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఇంటర్నల్ డెరివేటివ్ ట్రేడింగ్‌ను బ్యాంక్ నిలిపివేసినప్పటికీ, అంతకన్నా ముందు 5–7 ఏళ్లుగా డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియో ఖాతాల్లో వ్యత్యాసాలు నమోదవుతూ వస్తున్నాయి. ఇది అంతర్గత, ఆర్బీఐ ఆడిట్లలో కూడా బైటపడకపోవడం గమనార్హం. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎండీగా సుమంత్‌ను మరో మూడేళ్ల పాటు పొడిగించాలన్న బ్యాంక్ ప్రతిపాదనకు ఆర్బీఐ నిరాకరించి, ఏడాదికే అనుమతించడం పరిస్థితి తీవ్రతపై సందేహాలు రేకెత్తాయి.

ఐపీవోతో ప్రభుత్వ షేర్ల జోరు
కొద్ది నెలలుగా దేశీ స్టాక్ మార్కెట్లో కేంద్ర ప్రభు త్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)లు లాభాల దుమ్ము రేపుతున్నాయి. గతేడాది అక్టోబర్ మొదలు విదేశీ ఇన్వెస్టర్లు భారీస్థాయిలో అమ్మకాలు చేపట్టడంతో సెకండరీ మార్కెట్లు క్షీణపథం పట్టాయి. అయినప్పటికీ గత 8ఏళ్ల కాలాన్ని పరిగణిస్తే ఐపీవోకు వచ్చిన పలు ప్రభుత్వ రంగ కౌంటర్లు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను పంచాయి. వివరాలు చూద్దాం.. పబ్లిక్ ఇష్యూ చేపట్టడం ద్వారా గత 8 ఏళ్లలో లిస్టయిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు(సీపీఎస్ఈ) జోరు చూపుతున్నాయి. కొద్ది నెలలుగా సెకండరీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఉన్నట్టుండి పెట్టుబడుల ఉపసంహరణకు దిగడంతో మార్కెట్లు ఏప్రిల్ తొలి వారం వరకూ క్షీణ పథంలో సాగాయి. అయితే తిరిగి ఇటీవల ఎఫ్‌పీఐల పెట్టుబడులు పెరగడంతో మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీవోలు చేపట్టిన 18 సీపీఎస్ఈలలో 15 కంపెనీలు భారీ రిటర్నులు అందించడం గమనార్హం! వీటిలో రక్షణ, రైల్వే రంగ కౌంటర్ల హవా కొనసాగుతోంది. ఈ జాబితాలో ప్రధానంగా మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ ఏకంగా 3,700 శాతం లాభపడటం విశేషం! పీఎస్‌యూ గుర్రాలు స్టాక్ మార్కెట్ల లాభాల రేసులో పలు ప్రభుత్వ రంగ సంస్థలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. సీపీఎస్ఈలలో బీమా రంగ సంస్థలను మినహాయిస్తే షిప్ బిల్డింగ్, రైల్వే రంగ కౌంటర్లు రేసు గుర్రాల్లా దౌడు తీస్తున్నాయి. 2017 మే నుంచి పరిగణిస్తే ఐపీవోల ద్వారా స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్టయిన మెజారిటీ సీపీఎస్ఈలు ఇప్పటివరకూ పెట్టుబడులు కొనసాగించిన ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించాయి. ఈ జాబితాలో మజగావ్ డాక్సహా.. రైల్ వికాస్ నిగమ్(ఆర్వీఎన్ఎల్), గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్(జీఆర్ఎస్ఈ), ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) 1000 శాతందాటి రిటర్నులు సాధించాయి. ఐపీవో ధర రూ. 19 మజగావ్ డాక్ రూ. 145 ధరలో 2020లో ఐపీవోకు వచ్చింది. 2024 డిసెంబర్లో షేరు విభజన(రూ. 10 నుంచి రూ.5కు) చేపట్టింది. 2025 ఏప్రిల్ 28న రూ. 2,786కు చేరింది. వెరసి రూ. 5,500ను అధిగమించింది. ఈ బాటలో గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ 2018లో రూ. 118 ధరలో ఐపీవో చేపట్టింది. ప్రస్తుతం రూ. 1,750ను తాకింది. అంటే 1,370 శాతానికి మించి పరుగుతీసింది. 2017లో రూ. 432 ధరలో ఐపీవో చేపట్టి లిస్టయిన కొచిన్ షిప్‌యార్డ్ రూ. 1,502 వద్ద కదులుతోంది. 2024 జనవరిలో షేర్ల విభజన(రూ. 10 నుంచి రూ.5కు) చేపట్టింది. 600 శాతం జంప్‌చేసింది. రైల్వే రంగ కౌంటర్లలో ఆర్వీఎన్ఎల్ 2019లో రూ. 19 ధరలో ఐపీవోకు వచ్చి ప్రస్తుతం రూ. 361కు చేరింది. 1865 శాతం దూసుకెళ్లింది. 2019లో రూ. 320 పలికిన ఐఆర్సీటీసీ 2021 అక్టోబర్‌లో షేర్ల విభజన(రూ. 10 నుంచి రూ.2) చేపట్టింది. ప్రస్తుతం రూ. 765 వద్ద ట్రేడవుతోంది. 1,110 శాతం రాబడి సాధించింది. ఇతర కౌంటర్లలో 2018లో లిస్టయిన రైట్స్(ఆర్ఐటీఈఎస్), ఇర్కాన్ ఇంటర్నేషనల్ సగటున 230 శాతం లాభపడ్డాయి. 2021లో లిస్టయిన రైల్‌టెల్ రూ. 310కు చేరి 238 శాతం ఎగసింది. 600 శాతం అప్ డిఫెన్స్ రంగ కౌంటర్లలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్(హెచ్ఏఎల్), భారత్ డైనమిక్స్(బీడీఎల్), మిశ్రధాతు నిగమ్(మిధాని) సైతం వరుసగా 605%, 558 %, 227% చొప్పున లాభపడ్డాయి. 2023లో రూ. 32 ధరలో ఐపీవోకు వచి్చన ఇండియన్ రెనెవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఇరెడా) రూ. 170కు చేరడం ద్వారా 450 శాతానికిపైగా బలపడింది. హౌసింగ్, పట్టాణాభివృద్ధి కార్పొరేషన్(హడ్కో) 2017లో రూ. 60 ధరలో ఐపీవో చేపట్టి ప్రస్తుతం రూ. 226కు చేరింది. 280% రాబడి అందించింది. రూ. 120 ఐపీవో ధరతో పోలిస్తే ఎంఎస్టీసీ రూ. 528ను తాకడం ద్వారా 350% పురోగమించింది. న్యూ ఇండియా అస్యూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్ప్(ఎల్ఐసీ), జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(జీఐసీ) మాత్రం ఐపీవో ధరతో పోలిస్తే వెనుకంజలో ఉన్నాయి. 2018 జూన్, జులైలలో న్యూ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయడం గమనార్హం.! – సాక్షి, బిజినెస్ డెస్క్

అమ్మకాలు 'అక్షయం'!
న్యూఢిల్లీ: అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆభరణాల విక్రయాలు సానుకూలంగా నమోదైనట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ అక్షయ తృతీయ రోజున పసిడి కొంటే కలిసొస్తుందన్న విశ్వాసం అమ్మకాలకు అండగా నిలిచింది. విలువ పరంగా 35 శాతం అధిక అమ్మకాలు ఉంటాయని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ రాజేష్ రోక్డే తెలిపారు. పరిమాణం పరంగా గతేడాది మాదిరే 20 టన్నులుగా ఉండొచ్చని పేర్కొన్నారు. మరోపక్క, బుధవారం బంగారం, వెండి ధరలు కాస్త శాంతించడం కూడా కలిసొచ్చింది. దక్షిణాదిన జ్యుయలరీ దుకాణాలకు ఉదయం నుంచే వినియోగదారులు క్యూకట్టారు. ఉత్తరాదిన మధ్యాహ్నం నుంచి వినియోగదారులు రావడం పెరిగింది. అయినప్పటికీ దక్షిణ భారత్‌లోనే కస్టమర్ల రాక అధికంగా ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా మంగళ సూత్రాలు, చైన్లు, వెండి ఉత్పత్తుల కొనుగోళ్లు పెరిగినట్టు వర్తకులు తెలిపారు. వివాహాల సీజన్ ఆరంభం కావడంతో మంగళసూత్రాల కొనుగోలుకు కస్టమర్లు ఆసక్తి చూపించినట్టు చెప్పారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు ధోరణి సాధారణంగా దక్షిణాదిన కనిపించేది. క్రమంగా ఇది ఉత్తరాదికీ విస్తరించినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 25–40 ఏళ్ల వయసులోని కస్టమర్లు సైతం బంగారం కొనుగోళ్లకు ముందుకొచ్చినట్టు రోక్డే తెలిపారు. ముఖ్యంగా ఆభరణాలు, కాయిన్లు, బార్లు కొనుగోలుకు ఆసక్తి చూపించినట్టు చెప్పారు. ‘‘ధరల పెరుగుదలతో కొనుగోలు శక్తిపై ప్రభావం పడింది. అయినప్పటికీ అక్షయ తృతీయ రోజున బలమైన కొనుగోళ్ల సెంటిమెంట్ ఉంది’’ అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా సీఈవో సచిన్ జైన్ తెలిపారు. 2024 అక్షయ తృతీయ రోజున రూ.72,300గా ఉన్న 24 క్యారెట్ల పసిడి ధర ఇటీవలే రూ. లక్ష స్థాయిని అధిగమించి... ప్రస్తుతం 99,000 స్థాయిలో ఉంది. అంటే దాదాపు 37 శాతం ఎగసింది. పాత ఆభరణాల మార్పిడి.. అక్షయ తృతీయ రోజున అమ్మకాల్లో 50 శాతం మేర పాత బంగారం మార్పిడితోనే ఉన్నట్టు పీఎన్జీ జ్యుయలర్స్ చైర్మన్ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. ధరల పెరుగుదలతో వినియోగదారులు బడ్జెట్ నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. మొత్తం మీద గతేడాది అక్షయ తృతీయతో పోల్చి చూస్తే అమ్మకాలు 10–15 శాతం పెరిగాయని కామా జ్యుయలర్స్ ఎండీ కొలిన్‌షా తెలిపారు. దేశవ్యాప్తంగా కీలక మార్కెట్లలో స్టడెడ్ జ్యుయలరీ అమ్మకాలు పెరిగినట్టు జీఎస్ఐ ఇండియా ఎండీ రమిత్ కపూర్ వెల్లడించారు.దిగొచ్చిన బంగారం ధర అక్షయ తృతీయ రోజున బంగారం ధరలు తగ్గడం కొనుగోలుదారులకు కలిసొచ్చింది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.900 తగ్గి రూ.98,550 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు ఒకదశలో 43 డాలర్ల వరకు క్షీణించి 3,274 డాలర్లను తాకింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆటో టారిఫ్‌ల ప్రభావం తగ్గించే దిశగా ఆదేశాలు జారీ చేయడం.. పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి చర్చల్లో పురోగతి ఉందని ప్రకటించడం బంగారం ధరలు తగ్గేందుకు కారణమైనట్టు కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కేనత్ చైన్వాలా తెలిపారు.

హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి బిస్కెట్ ఫ్యాక్టరీ
ప్రముఖ వ్యాపార సమ్మేళనం లోహియా గ్రూప్ హైదరాబాద్ శివారు మేడ్చల్ లో బిస్కెట్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇందుకోసం వచ్చే నాలుగేళ్లలో రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు, 6,000 ఉద్యోగాలు కల్పించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఏడు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కొత్త హైస్పీడ్ ఆటోమేటెడ్ ఫెసిలిటీ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 1,000 టన్నులు కాగా దీన్ని 5,000 టన్నులకు పెంచుకునే వీలుందని సంస్థ వెల్లడించింది. బిస్కెట్ల ఉత్పత్తికి కావాల్సిన పిండి, చక్కెర, బెల్లం, తేనె, పాల ఉత్పత్తులు, ఇతర సహజ పదార్ధాలను స్థానికంగా సేకరించనున్నారు. ఉత్పాదక రంగంలో మహిళల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన 'ఉమెన్ ఫస్ట్ ఎంప్లాయిమెంట్ డ్రైవ్'కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం 40 శాతానికి పైగా సిబ్బంది మహిళలేనని కంపెనీ తెలిపింది.బిస్కెట్ల తయారీ ప్రక్రియ వెనుక అధిక నాణ్యత పదార్థాలు, సంక్లిష్టమైన డిజైన్లు, అధునాతన బయోటెక్నాలజీ ఉన్నాయని లోహియా కన్ఫెక్షనరీ మేనేజింగ్ డైరెక్టర్ మనీషా లోహియా లహోటి తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్ గఢ్ లలో కార్యకలాపాలను ఏర్పాటు చేసిన ఈ సంస్థ త్వరంలో ఎగుమతులను ప్రారంభించాలని యోచిస్తోంది.
ఫ్యామిలీ

అపుడు కాలుష్య కాసారం : ఇపుడు ఏడాదికి 600 టన్నుల పళ్లు
లయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అనగానే ఆయిల్ నుంచి టెలికాం దాకా వివిధ రంగాల్లో అందిస్తున్న సేవలు గుర్తొస్తాయి. ముఖేష్ అంబానీ (Mukesh Ambani) సారధ్యంలోని రిలయన్స్ ప్రపంచంలోనే అత్యధికంగా మామిడిపండ్లను ఎగుమతి చేసే సంస్థల్లో ఒకటిగా ఉందని తెలుసా? అంబానీకి ఎన్ని ఎకరాల మామిడి తోట ఉంది? ఎన్ని రకాలు మామిడి పళ్లను పండిస్తారు? అసలు మ్యాంగో ఫామ్ వెనుకున్న రియల్ స్టోరీ ఏంటి? ఆ వివరాలు మీకోసం.గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 600 ఎకరాల మామిడి తోట (Reliance Mango Farm) రిలయన్స్ సొంతం. ఇందులో 1.5 లక్షలకు పైగా వివిధ రకాల మామిడి చెట్లున్నాయి. అల్ఫాన్సో మొదలు టామీ అట్కిన్స్ , 200లకు పైగా దేశీ, విదేశీ రకాల మామిడి చెట్లు ఫలాలనిస్తాయి. వీటిల్లో చాలా వరకు ప్రపంచంలోని అత్యుత్తమ రకాలకు చెందినవి కావడం విశేషం.ఇదీ చదవండి : ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్అయితే రిలయన్స్ మామిడి వ్యాపారంలోకి ప్రవేశించటానికి వెనుక ఒక కథ ఉంది. మ్యాంగో ఫామ్ హౌస్ వెనకాల పెద్ద చరిత్ర ఉంది. 1997లో, జామ్‌నగర్‌లోని రిలయన్స్ శుద్ధి కర్మాగారం భారీ కాలుష్యానికి కారణమైంది. గుజరాత్ కాలుష్య నియంత్రణ బోర్డు నుండి పదేపదే నోటీసులిచ్చింది. పర్యావరణాన్ని కాపాడి, ఫ్యాక్టరీని కొనసాగించే లక్ష్యంతో, అనివార్యంగా రిలయన్స్ మామిడి తోటను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది రిలయన్స్. 1998 లో ఈ కర్మాగారం చుట్టూ ఉన్న బంజరు, ఉప్పునీటి భూముల్లో మామిడి చెట్లను నాటించింది. ఇక్కడున్న అనేక ప్రతికూలతలను అధిగమించేందకు కంపెనీ కొత్త టెక్నాలజీని వినియోగించింది. డీశాలినేషన్, బిందు సేద్యం, వర్షపు నీటి సంరక్షణ, పోషక నిర్వహణ పద్దతులను పాటించారు. సముద్రపు నీటిని శుద్ధి చేసేందుకు, డీశాలినేషన్, నీటి కొరత సమస్యను ఎదుర్కోవడానికి వాటర్ హార్వెస్టింగ్ వంటి పద్దతులను ఉపయోగించారు.చదవండి: ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్దాదాపు 7-8 సంవత్సరాల ప్రయత్నాలు ఫలించాయి. ఈ గార్డెన్ పేరే ధీరూభాయ్ అంబానీ లఖిబాగ్ అమ్రాయీ. ప్రపంచంలోనే అతిపెద్దదిగా 600 ఏకాల విస్తీర్ణంలో చుట్టూ పచ్చని చెట్లతో ఏడాది 600 టన్నుల మామిడి పళ్లను అందిస్తుందీ తోట. అందుకే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి పండ్ల ఎగుమతిదారుగా అవతరించింది. అలా కాలుష్య కాసార నుంచి పచ్చని ప్రకృతిక్షేత్రంగా ఎదిగింది. దీంతో పాటు రిలయన్స్ ప్రతి సంవత్సరం ఒక లక్ష మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తుంది. అలాగే ఆధునిక వ్యవసాయంలో శిక్షణ అందించడం ద్వారా స్థానిక రైతులకు సహాయం చేస్తుంది. ఇదీ చదవండి: మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర?

ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్
ప్రిన్స్ హ్యారీ (Prince Harry), మేఘన్ మార్కెల్ (Meghan Markle ) వివాహం ప్రపంచంలోనే అత్యధికమంది వీక్షించిన రాయల్ వెడ్డింగ్‌గా నిలిచింది. అయితేఈ దంపతులు విడిపోతున్నారనే ఊహాగానాలు బాగా వ్యాపించాయి. ఈ వార్తలను మేఘన్ మార్కెల్ తొలిసారి క్లారిటీ ఇవ్వడం విశేషం. తన భర్త మనసు చాలా మంచిదనీ, చాలా చాలా అందగాడని చెప్పుకొచ్చింది. ఇంకా వారి వివాహ బంధంపై ఆమె చెప్పిందో వివరాలను తెలుసుకుందాం. 2018, మే 19న యూకేలోని విండ్సర్ కాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్‌లో అత్యంత ఘనంగా వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బ్రిటిష్ రాచరికంలో సంచలన మార్పును ప్రకటించారు. 2020లో తాము తమ రాజ విధులనుండి తప్పుకున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ తరువాత ప్రిన్స్హ్యారీ, మేఘన్ విడిపోతున్నారనే వార్తలు జోరుగా వ్యాపించాయి. చాలా రోజుల తరువాత మేఘన్ మార్కెల్ భర్త ప్రిన్స్ హ్యారీతో తన అందమైన బంధాన్ని పంచుకుంది. తన స్నేహితురాలు, IT కాస్మెటిక్స్ CEO జామీ కెర్న్ లిమా పాడ్‌కాస్ట్‌లో ది జామీ కెర్న్ లిమా షో. చిట్-చాట్‌లో మేఘన్ మార్కెల్ మౌనం వీడి కొన్ని ఆసక్తికర సంగతులను పంచుకుంది. ఏడేళ్ల సుదీర్ఘ వివాహ బంధంలో తమ ప్రయాణాన్ని ఆనందంగా కొనసాగిస్తున్నామని తెలిపింది. అంతేకాదు తమ బంధాన్ని 1985 నాటి ప్రముఖ వీడియో గేమ్ సూపర్ మారియో బ్రదర్స్‌తో సరదాగా పోల్చారు. తన భర్త ప్రిన్స్ హ్యారీ చాలా, చాలా అందగాడని కితాబిచ్చింది. అతనికి చాలా మంచి హృదయం ఉన్నవాడని, తనను చాలా ప్రేమిస్తున్నాడని వెల్లడించింది. ఇద్దరం కలిసి ఒక అందమైన జీవితాన్ని నిర్మించు కున్నాం, ఇద్దరు అందమైన పిల్లలున్నారు. మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ అంటూ చెప్పుకొచ్చింది.అదే పాడ్‌కాస్ట్‌లో, మేఘన్ మార్కెల్ డేటింగ్ , ప్రారంభ రోజులు ఎలా ఉన్నాయో కూడా వివరించింది. కాలక్రమేణా, ప్రతి సంబంధం అభివృద్ధి చెందుతుందని, అందుకే ఇదిఒకరికొకరు సహవాసాన్ని కొత్త మార్గంలో ఆస్వాదించడం లాంటిదని పేర్కొంది. హ్యారీతో ఆమె శాశ్వత ప్రయాణం ఇంకా కొనసాగుతుందా అని అడిగినప్పుడు 'అవును' అని స్పష్ట చేసింది మేఘన్.ఇదీ చదవండి: Akshaya tritiya 2025 దయచేసి ఇలా చేయండి : గాయని చిన్మయి ‘‘ మీకో విషయం తెలుసా? మా బంధం ప్రారంభంలో సీతాకోక చిలుకల్లా విహరించాం. ఆరు నెలల డేటింగ్ తరువాత పెళ్లి అనే బంధంలోకి వెళ్లాం. ఈ ఏడేళ్ల కాలం ఒకరినొకరు కొత్త మార్గంలో ఆనందిస్తున్నాం. మరో విధంగా చెప్పాలంటే ఇది మాకు హనీమూన్ కాలంలా అనిపిస్తుంది." అని మేఘన్ మార్కెల్ చెప్పడం విశేషం.2016లో, ఈ జంట తొలి సారు కలుసుకున్నారు. 2018లో పెళ్లి తరువాత, 2019లో తొలి బిడ్డ ప్రిన్స్ ఆర్చీని, 2021లో తమ రెండవ బిడ్డ ప్రిన్సెస్ లిలిబెట్ను స్వాగతించారు. ప్రస్తుతం, రాజ దంపతులు పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్నారు.చదవండి: మనవడితో 50 ఏళ్ల మహిళ పెళ్లి : ఫ్యామిలీని లేపేసేందుకు కుట్ర?

జీవామృత కేంద్రానికి రూ. లక్ష : కేంద్రం కొత్త మార్గదర్శకాలు తెలుసా?
Bio-input Resource Centres (BRC) ప్రకృతి వ్యవసాయానికి ఉపయోగపడే సేంద్రియ ఎరువులు, ద్రావణాలు, కషాయాలను ఏ రైతుకు ఆ రైతు స్వయంగా తయారు చేసుకోవటం చాలా కష్టసాధ్యమైన పని. నిన్నటి వరకు రసాయనిక వ్యవసాయంలో వాడే ఎరువులు, పురుగుమందులు వంటి ఉత్పాదకాలన్నీటినీ కొని వినియోగించడానికి అలవాటు పడిన రైతులు ఇప్పుడు అన్నీ ఎవరికి వారు తయారు చేసుకోవటం కష్టమే. ఈ ఇబ్బందిని అధిగమించకుండా ప్రకృతి సేద్యం విస్తరించడం అంత తేలిక కాదు. అందుకే ప్రకృతి సేద్యంలో వాడే ఘనజీవామృతం, జీవామృతం వంటి అన్ని రకాల ఉత్పాదకాలను తయారు చేసి విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం బయో–ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ (బిఆర్‌సిలు) ఏర్పాటు చేయిస్తోంది. వీటిని సులువుగా ఉండటం కోసం ‘జీవామృత కేంద్రాలు’ అని చెప్పుకుందాం. తొలి విడద దేశవ్యాప్తంగా 10 వేల బిఆర్‌సిలు ఏర్పాటు చేయాలని 2023–24 బడ్జెట్లోనే పేర్కొన్నారు. అయితే, వీటిని ఏర్పాటు చేయటానికి మార్గదర్శకాలను తాజాగా (ఏప్రిల్ 23న) విడుదల చేసింది. ఆ వివరాలు: ప్రతి బిఆర్సి ఏర్పాటుకు ర. లక్ష చొప్పున (ర. 50 వేల చొప్పున రెండు విడతలుగా) ఆర్థిక సహాయం అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ మార్గదర్శకాల్లో పేర్కొంది. ఉత్పాదకాలను తయారు చేసి రైతులకు అందుబాటులోకి తేవటంతో ΄ాటు వాటిని ఎలా ఉపయోగించాలో, ఎంత మోతాదులో వాడాలో కూడా ఈ జీవామృత కేంద్రాల నిర్వాహకులే రైతులకు తెలియజెప్పాల్సి ఉంటుంది. బయో–ఇన్పుట్ రిసోర్స్ సెంటర్(బిఆర్సి) లను నెలకొల్పే వ్యక్తులు / సంస్థలు / బృందాలు మొదట తాము ప్రకృతి వ్యవసాయం చేస్తూ, ఈ ఉత్పాదకాలను వారు వాడుతున్న అనుభవం కలిగి ఉండాలి. స్థానిక రైతుల అవసరాలకు, స్థానిక భూములకు తగిన, స్థానికంగా సాగయ్యే పంటల సరళికి అవసరమైన రీతిలో ద్రావణాలు, కషాయాలను తయారు చెయ్యాలి. వీటి ధరలు స్థానిక చిన్న, సన్నకారు రైతులకు సైతం అందుబాటులో ఉండేలా చూసే బాధ్యత రాష్ట్ర స్థాయి ప్రకృతి సేద్య విభాగం, జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలపై ఉంది. బీఆర్‌సి ఏర్పాటు కోసం ర. లక్షతో భూమిని, షెడ్డును, డ్రమ్ములు, ఇతరత్రా యంత్ర పరికరాలను సమకర్చుకోవటం ఎలా సాధ్యమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తూతూ మంత్రంగా కాకుండా.. దీర్ఘకాలంపాటు బిఆర్‌సిలకు వెన్నుదన్నుగా ఉండేలా ప్రభుత్వం ఆలోంనప్పుడే ఆశింన ప్రయోజనం నెరవేరుతుందని నిపుణులు సూస్తున్నారు.

ఆమె నమ్మకమే కాపాడింది..! తృటిలో బయటపడ్డ పహల్గామ్ పర్యాటకుడి ఫ్యామిలీ
ఆ పహల్గాం దారుణ ఘటన ప్రత్యక్షంగా చూసిన పర్యాటకులెవ్వరికీ కంటిమీద కునుకుపట్టనివ్వడం లేదు. తలుచుకుంటేనే వెన్నులో వణుకుపుట్టి..బతికే ఉన్నామా..! అనే ఆందోళనలకు లోనవ్వుతున్నారు. ఆ ఘటనలో తమవాళ్లను తమ కళ్ల ముందే చంపేస్తున్న హృదయవిదారక దృశ్యాలు కనులముందు మెదులుతూనే ఉన్నాయంటున్నారు కొందరు బాధితులు. వాళ్లు ఎదుర్కొన్న అనుభవాలు వింటున్న మనకే గుండె తరుక్కుపోతుంటే..ఇక ఆ బాధితులకు బాధ వర్ణనాతీతమే. ఇప్పట్లో దాన్నుంచి బయటపడటం కూడా కష్టమే. అయితే ఇదే దుర్ఘటనలో వెంట్రుకవాసిలో ఓ కుటుంబం సురక్షితంగా బయటపడింది. వాళ్ల భయానక అనుభవం వింటుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ స్టోరీ ఏంటో చకచక తెలుసుకుందామా..!కర్ణాటక చెందిన ప్రదీప్ హెగ్డే,అతని భార్య శుభ హెగ్డే, వారి కుమారుడు సిద్ధాంత్ ఏప్రిల్ 21న శ్రీనగర్‌కు చేరుకున్నారు. ఆ మరుసటి రోజు పహల్గామ్కు బయలుదేరారు. ఆ కుటుంబం టూర్లో 'మినీ స్విట్జర్లాండ్'గా ప్రసిద్ధి చెందిన బైసరన్ ఉంది. అందుకోసం మూడు గుర్రాలు అద్దెకు తీసుకున్నారు. ఆ రోజు రోడ్డంతా భయానకంగా, బురదగా జారేలా ఉండటంతో. పైకి చేరుకోవడానికి ఒక గంట 15 నిమిషాలు పట్టేసిందట వారికి. అయితే అప్పటికే కొంతమంది పర్యాటకుల గుంపు ఉంది. ఇక ప్రదీప్ హెగ్డే కుటుంబం కూడా వారితో జాయిన్ అవ్వాలనుకున్నారు. అయితే రైట్‌సైడ్ జిప్‌లైన్ ప్రారంభమయ్యే చోట ఖాళీ ప్రాంతం ఉండటంతో అక్కడే పోటోలు తీస్తూ.. గడిపిందట ఆ కుటుంబం. ఆ తర్వాత కొంతసేపటికి లోయలోని సాహస కార్యకలాపాలు జరుగుతున్న ప్రాంతం వైపు ఉన్న స్టాళ్లువై పుగా సాగారు. సరిగ్గా అప్పటికే మధ్యాహ్నం 1.45 అయ్యింది. వాళ్ల కుమారుడు సిద్ధాంత్ ఆకలిగా ఉందని గొడవ చేయడం మొదలు పెట్టినట్లు తెలిపారు ప్రదీప్. నచ్చచెబుతున్నా.. వినకపోవడంతో చేసేదేమి లేక ఇక అక్కడ ఓ స్టాల్ వద్ద మ్యాగీ ఆర్డర్ చేశామని అన్నారు. ఇక తన భార్య ఈలోగా వాష్‌రూమ్‌కి వెళ్లి వచ్చిందన్నారు. సరిగ్గా ఆ టైంలోనే ఒక రౌండ్ కాల్పులు వినిపించాయి. అప్పుడే టీ కూడా ఆర్డర్ చేసినట్లు తెలిపారు ప్రదీప్. అయితే అవి క్రాకర్ల శబ్దాలు కావచ్చని దుకాణ యజమాని చెప్పడంతో తేలిగ్గా తీసుకున్నామని చెప్పారు ప్రదీప్. పైగా అవి బుల్లెట్ శబ్దాలని మాకస్సలు తెలియదని అన్నారు. ఇక సుమారు 15-20 సెకన్ల తర్వాత, పెద్ద తుపాకులు పట్టుకున్న ఇద్దరు వ్యక్తులను చూశామన్నారు. అందులో ఒక ఉగ్రవాది లోయ దిగువ భాగం వైపు వెళ్తుండగా, మరొక ఉగ్రవాది తమ వైపుకి దూసుకు వస్తున్నాడంటూ నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు ప్రదీప్. వెంటనే తమ కుటుంబం అంతా నేలపై పడుకుని ఉన్నాం. ఇంతలో తన భార్య టేబుల్‌పై తమ ఐడెంటిలన్నీ ఉన్న బ్యాగ్‌ని తీసుకునేందుకు పైకి లేచింది. అంతే ఒక తూటా ఆమె కుడి చెవి నుంచి దూసుకుపోయింది. అయితే ఆమె వంగడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇక ప్రదీప్ భార్య శుభ హెగ్డే కూడా మాట్లాడుతూ..తన వెంట్రుకలను రాసుకుంటూ ఏదో వెళ్తున్నట్లు అనిపించిందన్నారు. ఏంటా అని పక్కకు చూసేంతవరకు తెలియలేదు అది బుల్లెట్ అని అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ఒక్క క్షణం అసలేం జరగుతుందో అర్థంకానీ భయాందోళన ఎదురైంది. ఇంతలో ఎవరో గట్టిగా అరిచి గేటువైపుకి పరిగెత్తమని చెప్పారు. నూరుశాతం చనిపోతామనే అనుకున్నాం..అదంతా చూశాక కచ్చితంగా తన కుటుంబం అంతా చనిపోతుందనే అనుకున్నానని అన్నారు ప్రదీప్. అయితే తన భార్య మాత్రం ఏం జరగదు అని ధైర్యం చెబుతూనే ఉంది. నిజానికి ఆమె నమ్మకమే మమ్మల్ని కాపాడింది. అక్కడున్న పర్యాటకులంతా ఒకేసారిగా గేటు వద్దకు వచ్చేయడంతో తమ కొడుకు కింద పడిపోయాడన్నారు. అలా బయటకు వచ్చాక ఎటు వెళ్లాలి అనేది తెలియని గందరగోళానికి గురయ్యాం. గుర్రపుస్వారీ సైనికులు కనిపంచడంతో వాళ్లని రక్షించమని ప్రాధేయపడినట్లు చెప్పుకొచ్చారు. వాళ్లు మాకు రెండు గుర్రాలని అందించి కిందకు వచ్చేందుకు సహాయం చేశారంటూ ఆ బాధకరమైన అనుభవాన్ని వివరించారు ప్రదీప్ హెగ్డే. ఆ పర్యాటకుడి అనునభవం విపత్కర పరిస్థితుల్లో మసులుకోవాల్సిన విధానం తోపాటు..ఒకరు భయపడుతుంటే మరొకరు ఎలా సానుకూలంగా వ్యవహరించాలో చెబుతోంది. ఆ పరిస్థితుల్లో శుభా హెగ్డేలా ఏదో రకంగా ధైర్యం చెప్పాలే కానీ బ్యాలెన్స్ తప్పకూడదు. ఆ దృక్పథమే మనల్ని ఆపద నుంచి గట్టేక్కేలా చేస్తుందనడానికి ఆ పర్యాటకుడి కుటుంబమే ఓ ఉదహరణ. (చదవండి: పర్యావరణ హిత: ఈ చిత్రాన్ని మీకు సమర్పిస్తున్న వారు...)
ఫొటోలు


రెట్రో లుక్‌లో పూజా హెగ్డే.. సింప్లీ సూపర్ (ఫోటోలు)


కృతీ శెట్టిని ఇలా చూస్తే అభిమానులు ఫుల్ ఖుషీ (ఫోటోలు)


CSK vs PBKS : చహల్ హ్యాట్రిక్, చెన్నై ఖేల్ ఖతం (ఫోటోలు)


బాబే అన్నింటికీ దోషి.. సింహాచలం బాధిత కుటుంబానికి వైఎస్ జగన పరామర్శ (ఫొటోలు)


అక్షయ తృతీయ: మీకంతా శుభాలే.. నటి (ఫొటోలు)


శ్రేయాంకతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్ (ఫొటోలు)


సింహాచలం దుర్ఘటన.. ఎటు చూసినా ఆర్తనాదాలే


హ్యాపీ బర్త్‌డే హిట్‌మ్యాన్... రోహిత్ శర్మ అరుదైన ఫొటోలు


సింహాచలంలో మాటలకందని విషాదం.. (ఫోటోలు)


ప్రెగ్నెన్సీతో హీరోయిన్.. కానీ భర్తతో కలిసి ఫారెన్ టూర్ (ఫొటోలు)
అంతర్జాతీయం

లిబరల్ పార్టీ విజయం
టొరంటో: కెనడా సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి మార్క్ కార్నీ సారథ్యంలోని అధికార లిబరల్ పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది. జస్టిన్ ట్రూడో హయాంలో ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆక్రమణ హెచ్చరికలు, ఆ దేశంతో వాణిజ్య యుద్ధం వంటివి కలిసొచ్చాయి. దీనికి తోడు ఆర్థిక నిపుణుడిగా పేరున్న కార్నీ అమెరికాకు వ్యతిరేకంగా కెనడా ప్రజలను ఏకం చేయడంలో విజయం సాధించారు. అధికార పార్టీ అనుకూల పవనాలను ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ గట్టిగా ఎదుర్కొనలేక రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ట్రంప్ మాదిరిగా కెనడా ఫస్ట్ అంటూ ఆ పార్టీ నేత పియెర్రె తీసుకువచ్చిన నినాదాన్ని జనం నమ్మలేదు. మొన్నమొన్నటిదాకా ప్రజాదరణలో ముందుండి, కెనడా తదుపరి ప్రధాని, ఫైర్‌బ్రాండ్ అంటూ ప్రచారం జరిగిన పియెర్రె స్వయంగా ఒట్టావా నియోజకవర్గంలో ఓటమి చవిచూశారు. పార్లమెంట్‌లోని మొత్తం 343 స్థానాలకు గాను కన్జర్వేటివ్‌ల కంటే లిబరల్స్‌కే అత్యధికంగా దక్కుతాయనే అంచనాలున్నాయి. ఫలితాలు వెలువడే సమయానికి లిబరల్ పార్టీకి చెందిన అభ్యర్థులు 168 సీట్లలో గెలుపు/ఆధిక్యం సాధించారు. మెజారిటీ మార్కు 172కు మరో నాలుగు సీట్ల దూరంలో ఆ పార్టీ నిలిచింది. ఒకవేళ 168 సీట్లకే పరిమితమైన పక్షంలో అధికారంలో కొనసాగాలన్నా, చట్టాలు చేయాలన్నా ఏదో ఒక చిన్న పార్టీని కలుపుకుని వెళ్లాల్సి ఉంటుంది. కెనడా ఆక్రమణ ట్రంప్ తరంకాదు: మార్క్ కార్నీ లిబరల్ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా ప్రధాని మార్క్ కార్నీ విజయోత్సవ ప్రసంగం చేశారు అమెరికా నుంచి ముప్పు ఎదురవుతున్న తరుణంలో కెనడా ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కెనడా–అమెరికాలు పరస్పరం సహకరించుకుంటూ ప్రయోజనం పొందే విధానం రెండో ప్రపంచ యుద్ధం నుంచి అమలవుతోందని గుర్తుచేశారు. అది ఇటీవలే ముగిసిందని అన్నారు. అమెరికా తమను దగా చేసిందని మండిపడ్డారు.అమెరికా తీరుపట్ల దిగ్భ్రాంతికి గురైనప్పటికీ ఆ పాఠాలు ఎప్పటికీ మర్చిపోలేమని వ్యాఖ్యానించారు. కొన్ని నెలలుగా హెచ్చరికలు వస్తున్నాయని, మన భూమి, మన వనరులు, మన నీరు, మన దేశాన్ని ఆక్రమించుకుంటామని కొందరు బెదిరిస్తున్నారని ఆరోపించారు. కెనడాను విచి్ఛన్నం చేసి, సొంతం చేసుకోవాలన్నదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పన్నాగమని ధ్వజమెత్తారు. అది ఎప్పటికీ సాధ్యం కాదన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికారు. అయితే, ప్రపంచం మారుతోందన్న నిజాన్ని మనం గుర్తించాలని కెనడా పౌరులకు మార్క్ కార్నీ సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం సాధించడంతో ఆయన మరోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. కెనడాతో బంధం బలోపేతం చేసుకుంటాం: మోదీ కెనడా ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మార్క్ కార్నీకి భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అభినందనలు తెలియజేశారు. కెనడాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలన్నదే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. రెండు దేశాల పౌరులకు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధ పాలనలకు ఇరుదేశాలూ కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. సత్తా చాటిన భారత సంతతి అభ్యర్థులుకెనడా ఎన్నికల్లో పలువురు భారత సంతతి అభ్యర్థులు సత్తా చాటారు. లిబరల్, కన్జర్వేటివ్ పార్టీల నుంచి రికార్డు స్థాయిలో 22 మంది అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. ప్రస్తుతం కెనడా పార్లమెంట్ దిగువ సభలో 17 మంది భారత సంతతి ఎంపీలున్నారు. ఈ సంఖ్య 22కు చేరుకుంది. పంజాబ్ నుంచి వలసవెళ్లిన కుటుంబంలో జన్మించిన సుఖ్ దలీవాల్(లిబరల్) ఆరోసారి నెగ్గడం విశేషం. బర్నాబై సెంట్రల్ స్థానం నుంచి పోటీ చేసిన న్యూ డెమొక్రటిక్ పార్టీ(ఎన్డీపీ) నేత జగ్మీత్‌సింత్(46) పరాజయం పాలయ్యారు. 18.1 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. ఇక్కడ లిబరల్ పార్టీ అభ్యర్థి వేడ్ చాంగ్ గెలిచారు. కెనడా జనాభాలో 3 శాతానికిపైగా భారత సంతతి ప్రజలు ఉన్నారు.

చైనా రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం.. 22 మంది మృతి
చైనాలోని లియావోయాంగ్ నగరంలోని ఓ రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. రెండు, మూడు అంతస్తుల భవనాల నుంచి భారీగా మంటలు చెలరేగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మంటలను అర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ నెలలో చైనాలో జరిగిన రెండో అతిపెద్ద అగ్ని ప్రమాదం ఇది.ఏప్రిల్ 9న ఓ నర్సింగ్ హోమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. చెంగ్డే నగరంలోని లాంగ్హువా కౌంటీలో రాత్రి 9 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మొత్తం 20 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. మంటలు చెలరేగిన సమయంలో ఈ హోమ్‌లో మొత్తం 260 మంది వృద్ధులు ఉన్నారు.#BREAKING 🚨First images from the restaurant fire 🔥22 people dead and 3 injured after a #fire broke out at a restaurant near a resettlement housing complex in Liaoyang, #Liaoning Province. The investigation is ongoing. #China #fire pic.twitter.com/WRelu9T8ov— Nazlı Özdemir (@nazliiozdemr) April 29, 2025

భారత్‌లో పాక్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతా నిలిపివేత
ఢిల్లీ: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఎక్స్ ఖాతాను భారత ప్రభుత్వం నిలిపివేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్ పై పాక్ మంత్రి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో ఎక్స్ ఖాతాను కేంద్రం బ్లాక్ చేసింది. భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిషేధించిన సంగతి తెలిసిందే. భారత్‌లో పాక్ జర్నలిస్టుల ఎక్స్ ఖాతాలను కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఐఎస్ఐ, పాకిస్థాన్ ప్రభుత్వంతో కలిసి భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు ఈ చర్యలు చేపట్టింది.భారత సైన్యం కదలికలపై పాక్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడమరోవైపు, భారత సైన్యం కదలికలపై పాక్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. సైన్యం కదలికలపై పాకిస్థాన్ ఐఎస్ఐ ఆరా తీస్తోంది. సరిహద్దులోని మిలిటరీ సిబ్బంది, పౌరులకు.. భారతీయ సైనిక్ స్కూల్ ఉద్యోగులమంటూ ఐఎస్ఐ ఫోన్లు చేస్తోంది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని.. తెలియని వారికి ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని సరిహద్దు ప్రజలకు కేంద్రం సూచిస్తోంది.కాగా, పహల్గాం దాడి తర్వాత పాక్ రక్షణ మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అమెరికా, బ్రిటన్ కోసమే చెత్త పనులు చేశామని.. ఉగ్రవాదాన్ని పోత్సహించడం పొరబాటని అర్థమైందంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమెరికా కోసమే ఉగ్రవాదులను పెంచిపోషించామంటూ ఆయన తప్పును ఒప్పుకున్నారు. ఉగ్రవాదం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ కోరుకునేది ఎన్నటికీ జరగదు.. విక్టరీ స్పీచ్‌లో మార్క్ కార్నీ
టొరంటో: కెనడాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అధికార లిబరల్ పార్టీ(Liberal Party of Canada) విజయం దిశగా దూసుకెళ్తోంది. వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టడం దాదాపు ఖాయం కావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. ఈ క్రమంలో మార్క్ కార్నీ(Mark Carney) మద్ధతుదారుల్ని ఉద్దేశిస్తూ విజయ ప్రసంగం చేస్తూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు.‘‘కెనడా చరిత్రలో కీలకమైన క్షణం ఇది. అమెరికా(America)తో మన పాత ఏకీకరణ సంబంధం ఇప్పుడు ముగిసింది. ఇకపై అమెరికాను స్థిరమైన మిత్రదేశంగా నమ్మలేం. అమెరికా చేసిన ద్రోహం నుండి మనం తేరుకుంటున్నాం. నెలల తరబడి నుంచి నేను ఈ విషయంలో హెచ్చరిస్తూ వస్తున్నా. అమెరికా మన భూమిని, మన వనరులను, మన నీటిని, మన దేశాన్ని కోరుకుంటోంది. మనల్ని విచ్ఛిన్నం చేసి తద్వారా కెనడాను సొంతం చేసుకోవాలని ట్రంప్ ప్రయత్నించారు. కానీ, అది ఎప్పటికీ జరగదు’’ అని కార్నీ అన్నారు.అమెరికాతో సుంకాల యుద్ధం, కెనడా యూఎస్‌లో 51వ రాష్ట్రంగా చేరాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బెదిరింపుల వేళ ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కెనడా పార్లమెంట్లో 343 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటునకు 172 మెజారీటీ అవసరం. ఇప్పటికే కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పొయిలివ్రా ఓటమిని అంగీకరించారు. అయితే లిబరల్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో మిత్రపక్షాలతో కలిసి మార్క్ కార్నీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.ఈ ఏడాది జనవరిలో జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో లిబరల్ పార్టీ సభ్యులు తదుపరి ప్రధానిగా ఆర్థిక వేత్త అయిన మార్క్ కార్నీని ఎన్నుకున్నారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన కార్నీ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.ఇదీ చదవండి: ట్రంప్‌తో కయ్యం.. ఎవరీ మార్క్ కార్నీ?
జాతీయం

ఇండియాలో ఐస్‌క్రీం అమ్ముతున్న పాక్ మాజీ ఎంపీ!
జమ్మూకశ్మీర్‌లోని పెహల్గావ్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా భారత్‌లో నివసిస్తున్న పాకిస్తాన్ పౌరులు తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది. దీంతో మన దేశంలో ఉన్న పాకిస్తానీయులను గుర్తించి వారిని తమ దేశానికి పంపించేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో దాయాది దేశంలో న్యాయం దొరక్కపోవడంతో తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు మనదేశానికి వలస వచ్చి బతుకుబండిని లాగిస్తున్న పాకిస్తాన్ మాజీ ఎంపీ ఒకరు వెలుగులోకి వచ్చారు.పాకిస్తాన్‌కు చెందిన మాజీ ఎంపీ దబయా రామ్.. బండిపై ఐస్‌క్రీములు అమ్ముతూ హరియాణాలో జీవిస్తున్నారు. ఫతేహాబాద్ జిల్లాలోని రతియా తహసీల్ పరిధిలోని రతన్‌గఢ్ గ్రామంలో తన కుటుంబంతో కలిసి ఆయన నివసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు ఇటీవల ఆయనను విచారించినట్టు న్యూస్ 18 వెల్లడించింది. విచారణ ముగిసిన తర్వాత రత్తన్గఢ్ గ్రామానికి తిరిగి వెళ్లేందుకు ఆయనను పోలీసులు అనుమతించారని తెలిపింది. దబయా రామ్ కుటుంబంలోని ఆరుగురు సభ్యులు భారత పౌరసత్వం (Indian citizenship) పొందారు. మిగిలిన 28 మంది ఇప్పటికీ శాశ్వత నివాసం కోసం ఎదురు చూస్తున్నారు.రక్షణ కోసం ఇండియాకు వలస దేశ విభజనకు రెండేళ్ల ముందు పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో దబయ రామ్ (Dabaya Ram) జన్మించాడు. 1947 తర్వాత కూడా ఆయన అక్కడే నివసించాడు. మతం మారాలని ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా దబయ రామ్, ఆయన కుటుంబం తలొగ్గలేదు. 1988లో లోహియా, బఖర్ జిల్లాల నుంచి పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన పదవీకాలంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. తమ బంధువుల్లో ఓ మహిళను మతోన్మాదులు కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లిచేసుకున్నారు. దీనిపై న్యాయపోరాటం చేసిన దబయ రామ్‌కు చుక్కెదురైంది. పాకిస్తాన్ సుప్రీంకోర్టు (Pakistan Supreme Court) ఆయన పిటిషన్‌ను కొట్టేసింది. అక్కడవుంటే తమకు రక్షణ లేదని భావించిన దబయ రామ్ కుటుంబంతో సహా 2000 సంవత్సరంలో పాకిస్తాన్‌ను విడిచిపెట్టాడు.ఆరుగురికి భారత పౌరసత్వంబంధువు అంత్యక్రియలకు హాజరు కావడానికి ఒక నెల వీసాపై హరియాణాలోని రోహ్తక్కు వచ్చారు. తర్వాత రతన్‌గఢ్ గ్రామంలో (Rattangarh village) స్థిరపడ్డారు. తన పెద్ద కుటుంబాన్ని పోషించడానికి దబయ రామ్ ఐస్‌క్రీమ్ వాలాగా మారారు. సైకిల్ రిక్షాపై కుల్ఫీలు, ఐస్‌క్రీమ్ అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఆయన ఏడుగురు పిల్లలు వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డారు. మొత్తం 34 మంది కుటుంబ సభ్యుల్లో ఇద్దరు మహిళలతో సహా ఆరుగురికి భారత పౌరసత్వం దక్కింది. మిగిలిన 28 మంది దరఖాస్తులు ప్రాసెస్‌లో ఉన్నాయి. దబయ రామ్ మొదట్లో ఒక నెల వీసాపై తన కుటుంబంతో కలిసి భారతదేశానికి వచ్చాడు. 2018 వరకు ఏటా వీసా గడువును పొడిగించుకుంటూ నెట్టుకొచ్చాడు. మొదట్లో సంవత్సరం పాటు వీసా గడువు పొడిగింపు దక్కింది. తర్వాత ఐదేళ్ల పాటు అనుమతులు లభించాయి.చదవండి: పాకిస్తాన్‌పై భారత్ ఆర్థిక యుద్ధంవారికి మినహాయింపుపెహల్గావ్ దాడి తర్వాత పరిణామాల నేపథ్యంలో ఇప్పటివరకు 537 మంది పాకిస్తాన్ పౌరులు ఇండియా నుంచి తిరిగివెళ్లారు. అలాగే పాకిస్తాన్ నుంచి 240 మంది భారతదేశంలోకి ప్రవేశించారు. వారిలో 50 మంది NORI (నో అబ్లిగేషన్ టు రిటర్న్ టు ఇండియా) వీసాదారులు ఉన్నారు. పాకిస్తానీయులు ఏప్రిల్ 29లోపు దేశం విడిచి వెళ్లాలని భారత్ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే కొంత మందికి మాత్రం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) మినహాయింపు ఇచ్చింది. దీర్ఘకాలిక వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న పాకిస్తానీ హిందువులను బహిష్కరణ ప్రక్రియ నుంచి మినహాయిస్తూ హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. దీర్ఘకాలిక వీసాకు అర్హత ఉండి, దరఖాస్తు చేసుకోని హిందూ వలసదారులకు కూడా మినహాయింపు ఇచ్చింది. అయితే వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలనే షరతు విధించింది.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జనగణనలోనే కుల గణన కూడా చేయడానికి కేబినెట్ అంగీకారం తెలిపింది. వచ్చే జనాభా లెక్కల్లో కులగణనను చేరుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనగణన చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. దీనిలో భాగంగా జనగణనతో కలిపి కులగణన కూడా చేయడానికి నిశ్చయించింది. 2019లోనే జనగణన చేయాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా అప్పుడు ముందుడగు పడలేదు. దాంతో పాటు షిల్లాంగ్-సిల్చారు జాతీయ రహదారి నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 22,864 కోట్ల రూపాయల ఖర్చుతో 166 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా త్రిపుర, మిజోరం, మణిపూర్, అస్సాంలోని బరాక్ వ్యాలీకి కనెక్టివిటీ పెరగనుంది. అదే సమయంలో చెరకు మద్దతు ధర క్వింటా రూ. 350 పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి మండలి నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.పహల్గామ్ పై నో డిస్కషన్.. ఓన్లీ సైలెన్స్‌అయితే ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే నేటి భేటీలో ఆ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి ఎటువంటి చర్చ లేకుండా భేటీ ముగిసింది. దీనిపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎటువంటి ప్రకటన చేయలేదు. దాంతో దాడికి సంబంధించి ప్రతిచర్యలపై కేంద్రం మౌనం పాటిస్తూ ముందుకెళ్లడం కూడా వ్యూహాత్మక ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు.కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఏమన్నారంటే..జన గణనలో కులగణన చేయాలని క్యాబినెట్ నిర్ణయంవచ్చే జనాభా లెక్కల్లో కుల గణన కాలమ్ చేర్చాలని నిర్ణయంబీహార్, బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోడీ కీలక నిర్ణయంకుల గణన కోసం ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్న బిసి సంఘాలుకుల గణనను కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉన్నాయి.స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి జరిగిన అన్ని జనాభా గణన కార్యకలాపాలలో కులాన్ని చేర్చలేదు.కుల గణన అంశాన్ని కేబినెట్లో పరిశీలిస్తామని 2010లో అప్పటి ప్రధాని దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్ లోక్‌సభకు హామీ ఇచ్చారు.ఈ అంశాన్ని పరిశీలించేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. చాలా రాజకీయ పార్టీలు కుల గణనను సిఫార్సు చేశాయి.కుల గణనకు బదులు సర్వే మాత్రమే చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సర్వేనే SECC అంటారు.కాంగ్రెస్ మరియు దాని భారత కూటమి భాగస్వామ్య పక్షాలు కుల గణనను రాజకీయ సాధనంగా మాత్రమే ఉపయోగించుకున్నాయని బాగా అర్థమైంది.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారం, సబ్జెక్ట్ సెన్సస్ ఏడవ షెడ్యూల్లోని యూనియన్ జాబితాలో 69గా జాబితా చేయబడింది. భారత రాజ్యాంగం ప్రకారం, జనాభా గణన అనేది యూనియన్ సబ్జెక్ట్.కొన్ని రాష్ట్రాలు కులాలను లెక్కించేందుకు సర్వేలు నిర్వహించాయి. కొన్ని రాష్ట్రాలు దీన్ని బాగా చేశాయి, మరికొన్ని పారదర్శకంగా రాజకీయ కోణం నుండి ఇటువంటి సర్వేలను నిర్వహించాయి.ఇలాంటి సర్వేలు సమాజంలో అనుమానాలకు తావిస్తున్నాయి.ఈ వాస్తవాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, రాజకీయాల వల్ల మన సామాజిక వ్యవస్థకు భంగం కలగకుండా చూసేందుకు, కుల గణనను సర్వేలకు బదులు పారదర్శకంగా జనాభా గణనలో చేర్చాలి.ఇది దేశం పురోగమిస్తూనే మన సమాజం యొక్క సామాజిక మరియు ఆర్థిక నిర్మాణాన్ని బలోపేతం చేస్తుంది.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ నేతృత్వంలో, రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, ఈ రోజు (30 ఏప్రిల్, 2025) రాబోయే జనాభా గణనలో కుల గణనను చేర్చాలని నిర్ణయించింది.గతంలో మా ప్రభుత్వం సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు ప్రవేశపెట్టినప్పుడు సమాజంలోని ఏ వర్గానికి ఒత్తిడి కలిగించకుండా మన ప్రభుత్వం మన సమాజం మరియు దేశం యొక్క విలువలు మరియు ప్రయోజనాలకు కట్టుబడి ఉందని ఇది నిరూపిస్తుంది.

జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్మన్‌గా అలోక్ జోషి
ఢిల్లీ: జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్మన్‌గా ‘రా’ మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించింది. ఏడుగురు సభ్యులతో జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరించింది. సభ్యులుగా మాజీ ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఆర్మీ అధికారులను నియమించింది. కాగా, ప్రధాని నివాసంలో బుధవారం.. భద్రతా వ్యవహారాల క్యాబినెట్ భేటీ నిర్వహించారు.ఈ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జయశంకర్, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలకు ఇప్పటికే భద్రత బలగాలకు ప్రధాని మోదీ సంపూర్ణ స్వేచ్ఛనిచ్చిన సంగతి తెలిసిందే. సీసీఎస్ అనంతరం సీసీపీఏ, సీసీఈఏ సమావేశాలు నిర్వహించారు. చివర్లో క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. భద్రత వ్యవహారాలను సీసీఎస్ చర్చించింది. రాజకీయ పరిస్థితులను సీసీపీఏ చర్చించింది. ఆర్థిక అంశాలపై సీసీఈఏ పలు నిర్ణయాలు తీసుకుంది.సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై భారత్ మరిన్ని ఆంక్షలు విధించనుంది. ఫార్మా ఎగుమతులను నిలిపివేసే అవకాశం, భారత గగనతలంలోకి పాకిస్తాన్ విమానాల నిషేధం.. అరేబియా సముద్రంలో పోర్టుల కార్యకలాపాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఆంక్షలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టే వ్యూహంలో భారత్ ఉంది. ఇవాళ 3 గంటలకు సీసీఎస్, సీసీపీఏ, సీసీఈఏ, కేంద్ర కేబినెట్ నిర్ణయాలను ప్రెస్మీట్లో వెల్లడించనున్నారు.

అప్పు ఇవ్వొద్దు.. పాక్‌పై భారత్ ఆర్థిక యుద్ధం
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్ .. పాకిస్తాన్‌ను ఆర్ధికంగా మరింత ఇబ్బందే పెట్టే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా దాయాది దేశంపై భారత్ ఆర్థిక యుద్ధం ప్రకటించింది.పాకిస్తాన్‌కు అప్పు ఇవ్వొద్దంటూ భారత్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund - IMF) పై ఒత్తిడి చేస్తోంది. ఆ మేరకు అభ్యంతరం తెలిపింది. గతేడాదిలో ప్రకటించిన పాకిస్తాన్‌కు ఏడు బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ విషయంలో సమీక్షించాలని కోరింది. పాక్‌కు నిధులు ఇస్తే ఉగ్రవాదులకు మళ్ళిస్తోందని ఐఏఎఫ్ మెంబర్స్‌కు భారత్ వివరిస్తోంది.మే 9న పాకిస్తాన్‌కు అప్పు ఇచ్చే అంశంపై ఐఎంఎఫ్ బోర్డు చర్చించనుంది. ఈ తరుణంలో పాక్‌కు ఎట్టి పరిస్థితుల్లో అప్పు ఇవ్వొదని భారత్ వాదిస్తోంది. ఇదే అంశంపై భద్రతామండలి నాన్ పర్మినెంట్ మెంబర్స్‌తో భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ చర్చలు జరుపుతున్నారు. పాకిస్తాన్‌కు ఏడు బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీని సమీక్షించాలని కోరనున్నారుIndia can voice opposition to Pakistan’s $1.3 billion IMF loan, but its 2.63% voting share limits its influence. The IMF typically approves loans by consensus, and a formal vote only needs a simple majority, not an 85% supermajority. To block the loan, India would need to build…— Grok (@grok) April 29, 2025
ఎన్ఆర్ఐ

డల్లాస్‌లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
ఆస్టిన్: అమెరికా టెక్సాస్‌లో తెలుగు విద్యార్థిని హిట్ అండ్ రన్ కేసు విషాదాంతంగా ముగిసింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వంగవోలు దీప్తి(Deepthi Vangavolu)కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో గుంటూరులోని ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీప్తి(23) తండ్రి హనుమంత రావు చిరువ్యాపారి. ఆమె కుటుంబం గుంటూరు(Guntur) రాజేంద్రనగర్ రెండో లైనులో నివాసం ఉంటోంది. టెక్సాస్‌లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈలోపు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. క్రౌడ్ ఫండింగ్(Crowd Funding) ద్వారా ఆమె చికిత్స కోసం ప్రయత్నాలు కొనసాగగా.. మంచి స్పందన లభించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చికిత్స పొందుతూ కన్నుమూసింది. శనివారం(ఏప్రిల్ 19) నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో బాధితురాలు స్నిగ్ధ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అవే ఆమె చివరి మాటలు..దీప్తి మృతి వార్త విని ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తున్నారు. చదువులో చాలా చురుకైన విద్యార్థిని అని, అందుకే పొలం అమ్మి మరీ అమెరికాకు పంపించామని చెప్పారు. నెల రోజుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి కావాల్సి ఉందని, ఆ టైంకి మమ్మల్ని అమెరికాకు రావాలని ఆమె కోరిందని, అందుకు ఏర్పాట్లలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన దీప్తి చివరిసారిగా తమతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కాలేజీకి టైం అవుతోందని.. ఆదివారం మాట్లాడతానని చెప్పి హడావిడిగా ఫోన్ పెట్టేసిందని.. అవే తమ బిడ్డ మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని బోరున విలపించారు.

దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్‌తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన స్వర్గం శ్రీనివాస్ లు దుబాయి లో హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయి నుంచి మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల్ని ఆదేశించినట్లు అనిల్ తెలిపారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయి లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ బృందం, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి లు మృతుల కుటుంబాలను పరామర్శించారు.

రాయలసీమ ప్రగతికి డాలస్‌లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్‌లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు.
క్రైమ్

థాయ్‌లాండ్‌లో హ్యాండ్లర్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు మంగళవారం అరెస్టు చేసిన అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఈ దందాలో కీలక వ్యక్తిగా భావిస్తున్న ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ థాయ్‌లాండ్‌లో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. హవాలా నెట్వర్క్ మీద దృష్టి పెట్టిన పోలీసులు సహకరించిన వారి కోసం ఆరా తీస్తున్నారు. తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీíÙయల్ రిమాండ్‌లో ఉన్న అభిష్ క్, హర్షవర్థన్, ధావల్, రాహుల్‌లను పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి అనుమతి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఓజీ కుష్ పండించేదీ అతడేనా..? ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్, మారువానా, హైడ్రాపోనిక్ గాంజా, ఓజీ కుష్ ఇలా వివిధ పేర్లతో పిలిచే గంజాయితో పాటు మ్యాజిక్ మష్రూమ్స్‌ను ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ సరఫరా చేస్తున్నాడు. ఈ గంజాయి థాయ్లాండ్లోనే ఎక్కువగా పండుతుంది. జబల్పూర్కు చెందిన హర్షవర్థన్‌కు ఓడల ద్వారా చేరింది కూడా థాయ్‌లాండ్ నుంచే. దీన్నిబట్టి ఈ ఓజీ కుష్‌ను హ్యాండ్లరే పండించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నుంచి ఈ ఓజీ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి అవుతోంది. హైడ్రోఫోనిక్ టెక్నిక్ విధానంలో కృత్రిమ కాంతితో పండిస్తుంటారు. ఆన్లైన్లో విత్తనాలు ఖరీదు చేసి, ఎల్ఈడీ లైట్లను ఉపయోగించి గంజాయి మొక్కలను పెంచుతారు. ఏమాత్రం మట్టితో అవసరం లేకుండా ప్రత్యేకంగా తయారు చేసిన కుండీలు, ట్రేల్లో ఇసుక, కంకర లేదా నీటిలో అదనపు పోషకాలతో ఉపయోగించి సాగు చేస్తుంటారు. కొందరు మాత్రం కొబ్బరి పొట్టు నారలు, గులకరాళ్లు కూడా వాడతారు. నేలమీద పండే గంజాయి కంటే ఈ ఓజీ నాణ్యత ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు. ఈ మొక్కలు ఓపెన్–రూట్ వ్యవస్థ ద్వారా పోషకాలు, ఆక్సిజన్‌ను నేరుగా తీసుకోవడమే దీనికి కారణం. వ్యవస్థీకృతంగా సాగుతున్న వ్యాపారం... ఈ డ్రగ్స్ క్రమవిక్రయాల దందా మొత్తం పక్కా వ్యవస్థీకృతంగా సాగుతోందని పోలీసులు చెప్తున్నారు. ఎన్‌క్రిపె్టడ్ యాప్స్ ద్వారా ఇండియా నుంచి తనకు వచ్చిన ఆర్డర్ల విషయాన్ని ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ ఆయా యాప్స్ ద్వారానే హర్షవర్థన్‌కు చేరవేస్తాడు. ఇతడు జబల్పూర్లో ఉన్న హవాలా ఏజెంట్‌కు ఆ కస్టమర్ వివరాలు పంపిస్తాడు. అతగాడు సదరు కస్టమర్ నివసించే ప్రాంతానికి చెందిన మరో హవాలా ఏజెంట్‌కు ఇవి అందిస్తాడు. ఆ వినియోగదారుడిని సంప్రదించే ఈ ఏజెంట్ డబ్బు ముట్టిన తర్వాత జబల్పూర్ ఏజెంట్‌కు బదిలీ చేస్తాడు. అతడి ద్వారా విషయం తెలుసుకునే హర్షవర్థన్ విషయాన్ని ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’కు చెప్తాడు. ఔన్స్ (28.34 గ్రాములు) డ్రగ్‌కు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు క్రిప్టో కరెన్సీ రూపంలో అతడికి పంపిస్తాడు. ఆపై డ్రగ్ హ్యాండ్లర్ నుంచి హర్షవర్థన్‌కు వచి్చ... అక్కడ నుంచి డీటీడీసీ, శ్రీ తిరుపతి, శ్రీ ఆంజనేయులు కొరియర్స్‌లో కస్టమర్‌కు చేరుతుంది. హర్షవర్థన్ కూడా పోలీసుల నిఘాకు చిక్కకుండా ఈ పార్శిల్ బుక్ చేస్తున్నాడు. అక్కడ కస్టమర్ చిరునామా, ఫోన్ నెంబర్ తప్పుగా ఇస్తాడు. దాని ట్రాకింగ్ ఐడీని వినియోగదారుడికి పంపిస్తాడు. దీని ద్వారా ట్రాక్ చేసే కస్టమర్ ఆ పార్శిల్ కొరియర్ ఆఫీసుకు చేరిందని గుర్తించిన వెంటనే అక్కడకు వెళ్లి తీసుకుంటారు. ఈ హవాలా, కొరియర్ నెట్వర్క్ పైనా హెచ్–న్యూ దృష్టి పెట్టింది. ఈ ముఠాలో కీలక పెడ్లర్‌గా ఉన్న హర్షవర్థన్‌కు చెందిన క్రిప్టో వాలెట్లో రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువైన బిట్కాయిన్లు డిపాజిట్ అవుతున్నట్లు గుర్తించామని అధికారులు చెప్తున్నారు.

ఫ్రెండ్‌కి సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వెళ్తూ..
మక్కువ(విజయనగరం): మండలంలోని తూరుమామిడి గ్రామానికి చెందిన నూకమ్మ అలియాస్ ఉమ మంగళవారం తమ ఇంట్లో జరిగిన శుభ కార్యక్రమానికి తనతోపాటు డిగ్రీ చదువుతున్న ఫ్రెండ్స్‌ను ఆహ్వానించింది. స్నేహితులంతా కలిసి మంగళవారం ఆటపాటల్లో మునిగితేలారు. బుధవారం తన ఫ్రెండ్ షర్మిలకు సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై మక్కువ వెళ్తుండగా టాక్టర్ రూపంలో మత్యువు నూకమ్మను కబళించింది. అంతవరకు గ్రామంలో అందరితో కలివిడిగా ఉండి, ఫ్రెండ్‌ను మక్కువలో డ్రాప్ చేసి వస్తానని చెప్పి, తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిందంటూ గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. తూరుమామిడి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థినికురసాన నూకమ్మ అలియాస్ ఉమ(20) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై హెడ్ కానిస్టేబుల్ ఎస్. శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నూకమ్మ తన ఫ్రెండ్ షర్మిలకు సెండాఫ్ ఇచ్చేందుకు గ్రామం నుంచి మక్కువకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, మార్గమధ్యంలోని శాంతేశ్వరం గ్రామం సమీపంలో ఎదురుగా ట్రాక్టర్ మితిమీరిన వేగంతో వచ్చింది. టాక్టర్ను తప్పించే ప్రయత్నంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోవడంతో నూకమ్మ తలపై నుంచి ట్రాక్టర్ టైర్ వెళ్లగా అక్కడికక్కడే మృతిచెందింది. నూకమ్మ బొబ్బిలిలోని ఓ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. తండ్రి జనార్దనరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సాలూరు ఆస్పత్రికి తరలించారు.

ప్రియుడి ఇంటి ముందు ట్రాన్స్‌జెండర్ ధర్నా
ఆదోని రూరల్(కర్నూలు): తనను మోసం చేశాడంటూ ఆదోని మండలం బైచిగేరికి చెందిన యువకుడి ఇంటి ఎదుట ఓ ట్రాన్స్‌జెండర్ ఆందోళనకు దిగింది. బాధితురాలి కథనం మేరకు.. నాలుగేళ్ల క్రితం ఆదోని మండలం బైచిగేరికి చెందిన గణేష్ అనే యువకుడు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ అన్నమయ్య జిల్లా మదనపల్లె గ్రామానికి చెందిన వెంకటరమణ కుమారుడు హాసినిగౌడ్ ఊరఫ్ రామకృష్ణ(24) అనే ట్రాన్స్‌జెండర్‌తో పరిచయం ఏర్పడి, సహజీవనం చేస్తూ వచ్చాడు. గతేడాది గణేష్‌కు పెళ్లి కుదరడంతో ట్రాన్స్‌జెండర్ హాసినిని వదిలేసి సొంత గ్రామానికి రావడంతో 2024 జూన్ 10న బైచిగేరి గ్రామానికి వచ్చి తనకు న్యాయం చేయాలని హాసినిగౌడ్ నిరసన తెలిపింది. ఆదోని తాలూకా పోలీసులు ఆమె నివాసముంటున్న హైదరాబాద్‌లోని సైబరాబాద్ కమిషనరేట్ సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ మేరకు హాసినిగౌడ్ అక్కడ ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే మరలా బుధవారం వచ్చి బైచిగేరిలో గణేష్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. ‘‘నువ్వే నా ప్రాణం, నా సర్వస్వం.. నువ్వు లేనిదే నేను లేనంటూ నా వెంట పడ్డాడు. నేను ఒక ట్రాన్స్‌జెండర్. నాతో నీవు సావాసం చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పాను. అయినా వినకుండా, తననే పెళ్లి చేసుకుంటాని వెంట బడ్డాడు. నాకు పిల్లలు పుట్టరని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. మా ఇంటి నుంచి రూ.5 లక్షలు తీసుకెళ్లి ఇద్దరం పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో నివాసముంటున్నామని హాసినిగౌడ్ వాపోయింది. తన డబ్బులు రూ.5 లక్షలు అయినా ఇప్పించాలని, లేకపోతే గణేష్‌తో కాపురం అయినా చేయించాలని డిమాండ్ చేసింది. సమాచారం అందుకున్న తాలూకా ఎస్ఐ రామాంజనేయులు గ్రామానికి చేరుకుని విచారించారు. హాసినిగౌడ్ గణేష్‌పై ఇదివరకే కేసు హైదరాబాద్‌లో నమోదయ్యిందని, ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి న్యాయం చేస్తామని ఎస్ఐ చెప్పడంతో వారు హాసినిగౌడ్, ఇతర ట్రాన్స్జెండర్లు ధర్నా విరమించారు.

నెల్లూరులో కారు బీభత్సం.. ఆరుగురి దుర్మరణం
నెల్లూరు, సాక్షి: కారు బీభత్సంతో బుధవారం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్లోకి కారు దూసుకెళ్లి ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలు కాగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కొవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతులంతా నారాయణ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్‌గా తెలుస్తోంది. పోతిరెడ్డిపాలెం వద్ద కారు బీభత్సం ఘటనలో మృతులు మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్న నరేష్, అభిషేక్, జీవన్, యగ్నేష్, అభిసాయిలుగా పోలీసులు ప్రకటించారు. గాయపడిన నవనీత్ అనే విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక.. ఈ దుర్ఘటనలో షాప్‌లో ఉన్న రమణయ్య సైతం మృతి చెందాడు. బుచ్చిరెడ్డిపాలెం లో ఓ నిశ్చితార్థ వేడుకకు హాజరై కారులో విద్యార్థులు తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి హోటల్లోకి దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వీడియోలు


కర్రెగుట్టపై జాతీయ జెండాను ఎగురవేసిన బలగాలు


కూటమి ప్రభుత్వంపై దేవినేని అవినాష్ ఫైర్


కార్మిక సోదరులకు వైఎస్ జగన్ మేడే శుభాకాంక్షలు


హిట్ 3 తో బ్లాక్ బస్టర్ కొడతాడా ?


పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భయంతో వణుకుతున్న పాక్


ఇజ్రాయెల్ లో భీకర కార్చిచ్చు


భారీగా తగ్గిన బంగారం ధరలు


ఇండియా Vs పాక్ రంగంలోకి అమెరికా


చెత్త ప్రభుత్వం.. సింహాచలం భక్తులు సంచలన వ్యాఖ్యలు


మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలం