వైవిధ్యభరితంగా కడవులిన్‌ వీటిర్కు సెల్లుమ్‌ వాలి | - | Sakshi
Sakshi News home page

వైవిధ్యభరితంగా కడవులిన్‌ వీటిర్కు సెల్లుమ్‌ వాలి

Jun 4 2025 12:49 AM | Updated on Jun 4 2025 12:49 AM

వైవిధ్యభరితంగా కడవులిన్‌ వీటిర్కు సెల్లుమ్‌ వాలి

వైవిధ్యభరితంగా కడవులిన్‌ వీటిర్కు సెల్లుమ్‌ వాలి

ఇళయరాజాతో చిత్ర యూనిట్‌

తమిళసినిమా: నటుడు నాజర్‌ చాలా గ్యాప్‌ తరువాత ప్రధాన పాత్రలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి ధన్‌పాల్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఎక్స్‌పోరియా ఐజన్‌ ప్రొడక్షన్‌న్స్‌, జాన్‌వేర్స్‌, ఎంపవర్‌ లైట్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ను, ట్రైలర్‌ వీడియోను యూనిట్‌ వర్గాలు విడుదల చేశారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ కథే హీరోగా రూపొందుతున్న చిత్రాలకు ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణ ఉంటుందని, అందుకు ఉదాహరణ ఇటీవల విడుదలైన టూరిస్ట్‌ ఫ్యామిలీ, కుటుంబస్తన్‌ , లబ్బర్‌ బంతి వంటి చిత్రలేనన్నారు. ఇలాంటి వైవిధ్యమైన కథాంశంతో రూపొందనున్న చిత్రం కడవులిన్‌ వీటిర్కు సెల్లుమ్‌ వాలి అని చెప్పారు. చాలా కాలం క్రితం నాజర్‌ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన అవతార్‌ం చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారని చెప్పారు. చిత్రంలోని తెండ్రళ్‌ వందు తీండుమ్‌ బోదు ఎన్నో వన్నమో మనసుల అనే పాట ఇప్పటికీ వాడవాడల మారు మోగుతూనే ఉందన్నారు. అలాంటి అనుభూతిని తమ చిత్రం సంగీతం ప్రేక్షకుల కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. ఇది తండ్రి కొడుకులు ఇతివృత్తంతో కూడిన వైవిధ్యభరిత కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement