
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అందించడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర కీలకమని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, ఆర్.కె.సింగ్, హర్దీప్‌సింగ్‌లను వివిధ అంశాలపై కలసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఇది కేంద్ర, రాష్ట్రాలు సంయుక్తంగా చేసిన కృషి. కానీ సీఎం కేసీఆర్ తానే 24 గంటల కరెంటు ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక దేశవ్యాప్తంగా 24 గంటల కరెంటు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యుదుత్పత్తి సంస్థలకు, డిస్కమ్‌లకు కేంద్రం సాయం చేసిన సంగతిని మరువరాదు’అని దత్తాత్రేయ పేర్కొన్నారు.