సూపర్ స్టార్కు సెంటిమెంట్ భయం | Two Bad Sentiments For Brahmotsavam | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్కు సెంటిమెంట్ భయం

Apr 13 2016 4:42 PM | Updated on Sep 3 2017 9:51 PM

సూపర్ స్టార్కు సెంటిమెంట్ భయం

సూపర్ స్టార్కు సెంటిమెంట్ భయం

సినీ రంగంలో సెంటిమెంట్లు చాలా ఎక్కువగా, సక్సెస్ ఇవ్వని కాంబినేషన్లనే కాదు. హిట్ ఇవ్వని డేట్స్ను కూడా మన స్టార్స్ దూరం పెడతారు. అలాంటిది, తన లేటెస్ట్ సినిమా బ్రహ్మోత్సవం విషయంలో మహేష్...

సినీ రంగంలో సెంటిమెంట్లు చాలా ఎక్కువగా, సక్సెస్ ఇవ్వని కాంబినేషన్లనే కాదు, హిట్ ఇవ్వని డేట్స్ను కూడా మన స్టార్స్ దూరం పెడతారు. అలాంటిది, తన లేటెస్ట్ సినిమా బ్రహ్మోత్సవం విషయంలో మహేష్ బాబు రిస్క్ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ను కలవరపెడుతున్న అంశం, ఈ సినిమా రిలీజ్ అవుతున్న నెల. గతంలో మహేష్ హీరోగా తెరకెక్కిన నిజం, నాని సినిమాలు మే నెలలో రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి.
 
అందుకే ఆ తరువాత మహేష్, ఏ సినిమాను మే నెలలో రిలీజ్ చేయలేదు. 12 ఏళ్ల తరువాత మరోసారి మే నెలలో సినిమా రిలీజ్కు సిద్దమవుతున్నాడు ప్రిన్స్. దీనికి తోడు మహేష్ బాబు కెరీర్లో రెండు వరుస విజయాలు సాధించిన రికార్డ్ లేదు. శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించిన మహేష్, సెంటిమెంట్ ను బ్రేక్ చేసి హిట్ కొడతాడా..? లేక మరోసారి అభిమానులను నిరాశపరుస్తాడా..?
 
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవం సినిమాతో భారీ విజయం మీద కన్నేశాడు మహేష్. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాతో మరోసారి శ్రీమంతుడు రికార్డ్లను రిపీట్ చేయాలని భావిస్తున్నాడు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, కాజల్, ప్రణతీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీవీపీ సంస్థ నిర్మిస్తున్న బ్రహ్మోత్సవం సినిమాను మే 13న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement