‘మీరు నా కంటే జూనియర్’ | "You are more than my junior ' | Sakshi
Sakshi News home page

‘మీరు నా కంటే జూనియర్’

Mar 18 2016 3:49 AM | Updated on Aug 10 2018 8:16 PM

అసెంబ్లీ లాబీల్లో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల హడావుడే ఎక్కువగా కనిపిస్తోంది.

అసెంబ్లీ లాబీల్లో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల హడావుడే ఎక్కువగా కనిపిస్తోంది. గురువారం కూడా ఇదే దృశ్యం ఆవిష్కృతమైంది. ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రకాశ్‌గౌడ్, మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ, రాజేందర్‌రెడ్డి అంతా కలసి సమావేశాల విరామ సయమంలో మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు లిఫ్టు ఎక్కారు. అక్కడే లిఫ్టు బయట కనిపించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని కూడా తమతో రమ్మని ఎర్రబెల్లి పిలిచారు.

ఎక్కడికి అని కిషన్‌రెడ్డి అడిగితే.. ‘నేను రమ్మం టున్నా... రావాలంతే..’ అని ఎర్రబెల్లి అన్నారు. వెంటనే నవ్వుతూ.. ‘నేను సీనియర్.. మీరు జూనియర్’ అని కిషన్‌రెడ్డి అంటూనే లిఫ్ట్ ఎక్కారు. వీరందరికన్నా ముందుగా కిషన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరినందునే పార్టీలో తాను సీనియర్ అన్న అర్థంలో ఆ మాట అన్నారు. వీరంతా తమ నియోజకవర్గాల్లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టాల్సిన పనుల గురించి కేటీఆర్‌కు వివరించేందుకు వెళ్లినట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement