ఈ దూకుడుకు... సాటెవ్వరూ..! | MLAs Dookudu | Sakshi
Sakshi News home page

ఈ దూకుడుకు... సాటెవ్వరూ..!

Mar 13 2016 12:04 AM | Updated on Aug 10 2018 8:16 PM

ఈ దూకుడుకు... సాటెవ్వరూ..! - Sakshi

ఈ దూకుడుకు... సాటెవ్వరూ..!

కొత్తగా తమ పార్టీలో చేరిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేల తీరు చూసి మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే విస్తుపోతున్నారట.

కొత్తగా తమ పార్టీలో చేరిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేల తీరు చూసి మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే విస్తుపోతున్నారట. నిన్న, కాక మొన్న పార్టీలో చేరిన వారు అసెంబ్లీలో, బయటా దూకుడుగా వ్యవహరించడాన్ని చూసి ముక్కున వేలేసుకుంటున్నారట. శాసనసభ ప్రాంగణంలో, లాబీల్లో, మంత్రుల ఛాంబర్ల వద్ద ఈ ఎమ్మెల్యేల హడావుడి అంతా ఇంతా కాదట. రెండురోజుల క్రితం అసెంబ్లీలో ఒక మంత్రి ఛాంబర్ ఎదుట కొందరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిలబడి ఉండగా, ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే వీరిని తోసుకుంటూ మంత్రి ఛాంబర్‌లోకి వెళ్లారట.

మంత్రిని కలిసి తాను వెళ్లిన పనిని కానిచ్చిన సదరు నేత బయట ఉన్న ఎమ్మెల్యేలు ఎవరో తెలియని విధంగా వారిని ఏమాత్రం పట్టించుకోకుండా అంతే వేగంగా నెట్టుకుంటూ వెళ్లిపోయారట. తమది అంతా సీఎం, మంత్రుల స్థాయి అన్న విధంగా వ్యవహరించడం, రే పో, మాపో మంత్రి అయిపోయినట్లుగా ఒక నేత కనబరుస్తున్న ఉత్సాహాన్ని చూసి ఇతర ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోతున్నారట. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే, తమ జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలలో ఎవరికైనా మంత్రి పదవి వచ్చిందంటే ఇక తమకు దిక్కెవరు, తమను పట్టించుకునే వారెవరు అంటూ వాపోతున్నారట. ‘ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి’ అని ఊరికే అన్నారా అని అధికారపార్టీ ఎమ్మెల్యేలు లోలోన కుమిలిపోతున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement