అక్రమ కేసులు బనాయించారని మనస్తాపంతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
అక్రమ కేసుల భయంతో ఆటోడ్రైవర్ ఆత్మహత్య
May 25 2017 11:29 AM | Updated on Nov 6 2018 8:08 PM
హైదరాబాద్: అక్రమ కేసులు బనాయించారని మనస్తాపంతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇన్సూరెన్స్ కవరేజీ కోసం అని సంతకాలు చేయించుకొని ఆ తర్వాత అక్రమ కేసులు బనాయించారని మనస్తాపం చెందిన ఆటోడ్రైవర్ పుల్లారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నగరంలోని కుత్బుల్లాపూర్ వాణినగర్‌లో గురువారం వెలుగుచూసింది. తన చావుకు శ్రీనివాస్ నగర్‌లో ఉన్న సురభి మార్కెట్ యజమాని వారి కుంటుంబ సభ్యులే కారణమని సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement