కలమే కరవాలం.. సంస్కరణే కలకాలం...

డా. పి.వి. సుబ్బారావు


 శతాధిక గ్రంథకర్త, సం స్కర్త, నవ్యతా ప్రయోక్త కందుకూరి వీరేశలింగం 1848 ఏప్రిల్ 16వ తేదీన పున్నమ్మ, సుబ్బారాయు డు దంపతులకు రాజమం డ్రిలో జన్మించారు. సాహి తీ ప్రీతితో, సంస్కరణ దృ క్పథంతో ఆయన స్పృశిం చని శాఖలేదు, చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. ఆంధ్ర సాహిత్యంలో నవల, నాటకం, ప్రహసనం, జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర, కవుల చరిత్ర, వ్యాసం, శాస్త్రవాజ్ఞయ గ్రంథాల ప్రక్రి యలన్నింటికీ శ్రీకారం చుట్టి, సుసంపన్నం చేశాడు. సాహిత్యాన్ని సంఘ సంస్కరణకు ఉపకరణగా చేసుకున్నాడు. కలాన్ని కరవాలంగా ఝళిపించాడు. అవినీతిపరుల అక్రమాలు, అన్యాయాలు, దుండ గాలు, దౌష్ట్యాలను అరికట్టేందుకు పత్రికాధిపతిగా భగీరథ ప్రయత్నం చేశాడు. స్త్రీ జనోద్ధారకుడిగా 1874లో తొలి బాలికా పాఠశాలను ధవళేశ్వరంలో స్థాపించాడు. ఊరూరా బాలికా పాఠశాలలను స్థాపించి, స్త్రీ విద్యను ప్రోత్సహించాడు. మహిళాభ్యు దయ దృక్పథంతో తొలి వితంతు వివాహాన్ని ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య 1881 డిసెంబర్‌లో జరిపించాడు. దాదాపు 55 వితంతు వివాహాలను చేయించాడు. స్త్రీ జనోద్ధారకుడిగా ఆయన కీర్తి ఆంధ్రదేశమంతటా విస్తరించింది. ఆయన సంస్క రణ, గంధం రాష్ట్ర పరిధిని దాటి జాతీయ స్థాయిలో గుబాళించింది, ఆయన అమేయమైన వ్యక్తిత్వం 19వ శతాబ్ది సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాది వేసింది. ఆయన జయంతిని తెలుగు నాటకరంగ దినోత్సవంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆయన నాటక సాహిత్య కృషిని నాలుగు విభా గాలుగా వర్గీకరించవచ్చు. 1. అనువాద నాటకాలు, 2, పౌరాణిక నాటకాలు, 3. సాంఘిక నాటకాలు, 4. ప్రహసనాలు. అనువాద నాటకాలకు 19వ శతాబ్దంలో అధిక ప్రాధాన్యముండేది. ప్రదర్శన ప్రాధాన్య దృష్టితో కందుకూరి... ‘షేక్‌స్పియర్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్’ అనే అంగ్ల నాటకాన్ని ‘చమత్కార రత్నావళి’ పేరుతో (1880) అనువదించి విద్యార్థుల చేత ప్రదర్శిపజేసి మెప్పు పొందారు. వీరేశలింగం గారు రచించిన పౌరాణిక నాటకాల్లో ‘సత్యహరి శ్చంద్ర’ నాటకం విల క్షణమైనది. అందులో వశిష్ట విశ్వామిత్రుల సం వాదం ఆయన కల్పన. అప్పట్లో ఆ నాటకం ఎంతో ప్రసిద్ధి పొందింది. మహాభారత ఇతివృత్తం ఆధారంగా ‘దక్షిణ గోగ్రహణం’ నాటకాన్ని రచించి పాఠకుల మెప్పు పొందాడు. సామాజిక ప్రయోజ నానికి సాంఘిక నాటకం గొప్ప ఉపకరణమని 19వ శతాబ్దిలోనే గుర్తించిన గొప్ప క్రాంతిదర్శి వీరేశలిం గం. వ్యవహారిక భాషలో జాతిని జాగృతం చేసే సంకల్పంతో సామాజిక ప్రయోజనాత్మకాలైన ‘వ్యవ హార ధర్మబోధిని’, ‘బాల్యవివాహం’, ‘స్త్రీ పునర్వి వాహం’ వంటి సాంఘిక నాటకాలు రచించిన మహ నీయుడు. 20వ శతాబ్దిలో విస్తృతంగా అభివృద్ధి చెందిన సాంఘిక నాటకరంగానికి మార్గదర్శకుడ య్యాడు. ఆంగ్ల సాహిత్యంలో ఫార్స్ ప్రక్రియ ఆధారంగా తెలుగులో ప్రహసన ప్రక్రియకు రూప కల్పన చేశాడు. హాస్యస్ఫోరకమైన వ్యంగ్య అధిక్షే పాత్మక ప్రక్రియ ప్రహసనం. దాదాపు 50 ప్రహసనా లను రచించాడు. అప్పటి సమాజంలో ఏ అధికారి లంచం తీసుకున్నా, అక్రమానికి పాల్పడ్డా ప్రహసన రూపంలో ఆయన అధిక్షేపించేవారు. ఆయన ప్రహసనాలు సమకాలీనుల, తదనం తర సాహితీ విమర్శకుల మెప్పు పొందాయి. అయి తే ప్రహసనాల్లో మృదుహాస్యం మృగ్యమై కటు వ్యంగ్య హాస్యం కదనుతొక్కిన కారణంగా వీరేశలిం గం కొందరి దృష్టిలో విరోధిగా మారాడు. ఎవరేమ న్నా ఆయన రచనల్లో విలక్షణమైనవి, సామాజిక ప్రయోజనాలను సాధించినవి ప్రహసనాలనడం నిస్సందేహం. తెలుగు సాహిత్యంలో ప్రక్రియలన్నింటినీ సుసంపన్నం చేసిన ప్రతిభావంతుడు, హేతువాద దృష్టితో మూఢ విశ్వాసాలను నిరసించిన సంస్కర్త, మహిళాభ్యుదయ కాముకుడైన మహోన్నత వ్యక్తి కందుకూరి జయంతిని తెలుగు నాటకరంగ దినోత్స వంగా ప్రభుత్వం నిర్వహించడం ఆవశ్యకం.     (నేడు కందుకూరి వీరేశలింగం 167వ జయంతి)

 వ్యాసకర్త రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ మొబైల్ : 98491 77594

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top