
ఒకే వేదికపై సోనియా, పవార్!
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ఎట్టకేలకు 15 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై నుంచి సంయుక్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
15 ఏళ్ల తర్వాత సంయుక్తంగా
ఎన్నికల ప్రచారం
భండారా/నాగపూర్: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ఎట్టకేలకు 15 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై నుంచి సంయుక్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శనివారం మహారాష్ట్రలోని భండారాలో యూపీఏ అభ్యర్థుల తరఫున నిర్వహించిన ర్యాలీలో వారిరువురూ పాల్గొని ప్రచారం నిర్వహించారు. సోనియా ఇటలీ జాతీయురాలైన సోనియాకు పార్టీ పగ్గాలివ్వడాన్ని వ్యతిరేకిస్తూ.. 1998లో కాంగ్రెస్‌ను వీడిన పవార్ 1999లో ఎన్‌సీపీని స్థాపించారు.
తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏలో చేరినా.. ఎప్పుడూ ఎన్నికల ప్రచార వేదికపై ఇద్దరు నేతలూ కలిసి ప్రచారం చేయలేదు. భండారా ప్రాంతం నుంచి పోటీచేస్తున్న ఎన్‌సీపీ నేత ప్రపుల్ పటేల్‌కు మద్దతు కోసం ఈ ర్యాలీ నిర్వహించడంతో సోనియాతోపాటు పవార్ కూడా ఒకే వేదికపైకి వచ్చారు. గిరిజనులు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి న ఈ ర్యాలీలో సోనియా మాట్లాడుతూ... యూపీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ రైతుపక్షమే వహించిందన్నారు.