చెవిరెడ్డికి మోహన్ బాబు ఆశీస్సులు | Mohan babu blessed ysr congress party chandragiri condidate chevireddy bhaskar reddy | Sakshi
Sakshi News home page

చెవిరెడ్డికి మోహన్ బాబు ఆశీస్సులు

May 3 2014 8:51 AM | Updated on Aug 13 2018 4:11 PM

చెవిరెడ్డికి మోహన్ బాబు ఆశీస్సులు - Sakshi

చెవిరెడ్డికి మోహన్ బాబు ఆశీస్సులు

ప్రజలు నీ కష్టాన్ని, నీ నిజాయితీని, అభివృద్ధి చేయాలన్న నీలోని కసిని గుర్తించారు...

చంద్రగిరి : 'ప్రజలు నీ కష్టాన్ని, నీ నిజాయితీని, అభివృద్ధి చేయాలన్న నీలోని కసిని గుర్తించారు. నీ గెలుపును ఎవ్వరూ ఆపలేరు... విజయోస్తు మిత్రమా...' అంటూ ప్రముఖ సినీనటుడు డాక్టర్ మోహన్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆశీర్వదించారు. రంగంపేట ప్రాంతంలోని శ్రీవిద్యానికేతన్ కళాశాలలో ఉన్న మోహన్ బాబును చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ 'పార్టీకోసం, నమ్ముకున్నవారి కోసం నీలాగా కష్టపడిన నిజమైన రాజకీయ నాయకుడిని మరొకరిని చూడలేదు. నీ కష్టాన్ని గుర్తించిన ప్రజలు పార్టీలకు అతీతంగా నీవెంటే ఉన్నారు. నీకు ప్రజాబలంతో పాటు దైవబలం కూడా మెండుగా ఉంది. విజయోస్తు అన్న నా మాటలను పైనున్న తధాస్తు దేవతలు విని తథాస్తు అంటూ దీవించేశారు. విజయం నీదే' అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement