మోడీవి పిల్ల చేష్టలు | modi behave a lokk like childish | Sakshi
Sakshi News home page

మోడీవి పిల్ల చేష్టలు

Apr 30 2014 2:01 AM | Updated on Mar 29 2019 9:24 PM

మోడీవి పిల్ల చేష్టలు - Sakshi

మోడీవి పిల్ల చేష్టలు

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీవన్నీ పిల్ల చేష్టలని, ప్రధాని పదవికి పోటీ పడుతున్న వ్యక్తి ఆ స్థాయికి తగినట్టే మాట్లాడాలని ప్రియాంకాగాంధీ వ్యాఖ్యానించారు.

అమేథీ:  బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీవన్నీ పిల్ల చేష్టలని, ప్రధాని పదవికి పోటీ పడుతున్న వ్యక్తి ఆ స్థాయికి తగినట్టే మాట్లాడాలని ప్రియాంకాగాంధీ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని కమెడియన్ కపిల్ శర్మతో పోల్చిన మోడీపై ఆమె ఎదురుదాడికి దిగారు. మంగళవారం అమేథీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రియాంక మాట్లాడారు. ‘‘మా తండ్రి, మాజీ ప్రధాని కంప్యూటర్లను తీసుకువచ్చినప్పుడు బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. ఇప్పుడు రాహుల్‌ను కమెడియన్‌తో పోలుస్తూ అలాగే విమర్శిస్తున్నారు.

మరి ప్రధాని అభ్యర్థిగా ఉన్న మీరు (మోడీ) ఇలా చిన్న పిల్లాడిలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? హుందాగా ఉండడం నేర్చుకోవాలి..’’ అని పేర్కొన్నారు. బీజేపీవి విధ్వంసకర రాజకీయాలని ప్రియాంక మండిపడ్డారు. బీజేపీ మేనిఫెస్టోలో పెట్టినవాటిలో సగం అంశాలు కాంగ్రెస్ మేనిఫెస్టో నుంచి కాపీ కొట్టినవేనని విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement