ప్రభుత్వం ఉన్నా.. లేకున్నా ఒకటే: మర్రి | no difference if government forms or not, says sasidhar reddy | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం ఉన్నా.. లేకున్నా ఒకటే: మర్రి

Feb 27 2014 1:48 PM | Updated on Nov 9 2018 5:52 PM

ప్రభుత్వం ఉన్నా.. లేకున్నా ఒకటే: మర్రి - Sakshi

ప్రభుత్వం ఉన్నా.. లేకున్నా ఒకటే: మర్రి

రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. చేయకపోయినా పెద్దగా తేడా ఏమీ ఉండబోదని జాతీయ విపత్తు నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. చేయకపోయినా పెద్దగా తేడా ఏమీ ఉండబోదని జాతీయ విపత్తు నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఎటూ త్వరలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది కాబట్టి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేయడానికి వీలు కుదరదని, అందువల్ల కొత్త ప్రభుత్వం ఉన్నా, లేకపోయానా ఒకటేనని ఆయన చెప్పారు.

ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్తో ఆయన గురువారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా లేదా అన్న డైలమాకు రేపటితో (శుక్రవారం) తెరపడుతుందని శశిధర్ రెడ్డి చెప్పారు. ఇక తెలంగాణ అపాయింటెడ్ డే అనేది ఎన్నికల కంటే ముందే ఉండాలని తాను దిగ్విజయ్ సింగ్ను కోరినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement