ఆస్కార్‌లో కొత్త విభాగం.. ఆర్‌ఆర్‌ఆర్‌ విజువల్‌తో అనౌన్స్‌మెంట్‌ | Academy Announce Stunt Design for Oscars, SS Rajamouli Felt Happy | Sakshi
Sakshi News home page

ఆస్కార్‌లో కొత్త విభాగం.. వందేళ్ల నిరీక్షణకు ముగింపు అంటూ రాజమౌళి హర్షం

Published Fri, Apr 11 2025 10:56 AM | Last Updated on Fri, Apr 11 2025 1:23 PM

Academy Announce Stunt Design for Oscars, SS Rajamouli Felt Happy

సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అకాడమీ అవార్డుల వేదిక (Academy Awards) కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్కార్‌ (Oscar)లో కొత్తగా స్టంట్‌ డిజైన్‌ విభాగాన్ని చేర్చుతున్నట్లు ప్రకటించింది. 2028 నుంచి ఈ విభాగంలో ఆస్కార్‌ పురస్కారాలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. 2027లో విడుదలయ్యే సినిమాలు ఈ విభాగంలో పోటీపడవచ్చని తెలిపింది. ఈ మేరకు అకాడమీ గురువారం ఎ‍క్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది.

100వ వేడుకలో..
సినిమాలో స్టంట్స్‌ అనేవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడవి ఆస్కార్‌లోనూ భాగమయ్యాయి. స్టంట్‌ డిజైన్‌ విభాగంలో ఆస్కార్‌ పురస్కారాలు ఇవ్వనున్నాం. 2028లో జరగబోయే 100వ ఆస్కార్‌ వేడుకలో వీటిని ప్రదానం చేయనున్నాం అని ప్రకటించింది. ఈ మేరకు స్టంట్‌ డిజైన్‌ ఆస్కార్‌ అంటూ ఓ పోస్టర్‌ వదిలింది. ఈ పోస్టర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ (RRR Movie)లోని సీన్‌ ఫోటోను ఉపయోగించారు.

పోస్టర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ విజువల్స్‌
ఇది చూసిన రాజమౌళి సంతోషం వ్యక్తం చేశాడు. వందేళ్ల నిరీక్షణకు ముగింపు.. 2027లో రిలీజయ్యే చిత్రాలకు స్టంట్‌ డిజైన్‌ కేటగిరీలో ఆస్కార్‌ ఇస్తారని ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. ఈ నిర్ణయానికి కారకులైన డేవిడ్‌ లెయిచ్‌, క్రిస్‌ ఓ హర, అకాడమీ సీఈవో బిల్‌ క్రామర్‌, అధ్యక్షుడు జానెట్‌ యాంగ్‌, అలాగే స్టంట్‌ నిపుణులకు ప్రత్యేక కృతజ్ఞతలు. స్టంట్‌ డిజైన్‌ ఆస్కార్‌ అంటూ మీరు రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ విజువల్‌ చూసి థ్రిల్లయ్యాను అని ట్వీట్‌ చేశాడు.

 

 

చదవండి: సంపూను రోడ్డు మీదకు వదిలేశాడా? సాయి రాజేశ్‌ ఆన్సరిదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement