
గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ఊరట లభించింది. మాధవ్‌తో పాటు ఆయన అనుచరులకు గుంటూరు కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి 20 వేలుతో కూడిన పూచీకత్తు పాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఇదిలా ఉంటే.. ఐటీడీపీ కార్యకర్త అయిన చేబ్రోలు కిరణ్‌పై దాడికి యత్నించారంటూ నగరంపాలెం పోలీసులు మాధవ్‌ను, ఆయన అనుచరులు ఐదుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. న్యాయమూర్తి రిమాండ్ విధించగా తొలుత రాజమండ్రి జైలుకు తరలించారు. అక్కడి ఆయనకు బెయిల్ లభించలేదు. తాజాగా ఆయన మరో పిటిషన్ వేయగా.. బెయిల్ మంజూరు అయ్యింది.