
మారెమ్మతల్లికి కాసుల పేరు బహూకరణ
సీలేరు: గూడెం కొత్తవీధి మండలం సీలేరు గ్రామ దేవత శ్రీమారెమ్మతల్లి అమ్మవారికి ఒడిశాకు చెందిన భక్తు డు బంగారం, వెండి కాసుల పేరును బ హూకరించారు. ఒడిశా రాష్ట్రం చిత్రకొండ గ్రామానికి చెందిన రేకుల వ్యాపారి మునికోటి శ్రీనివాసు, లోవ శ్రావణి దంపతులు అమ్మవారికి ఎన్నో ఏళ్లుగా భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. ప్రతి ఏటా అమ్మవారి అగ్నిగుండం తొక్కి మొక్కు తీర్చుకుంటారు. ఈ నేపథ్యంలో పండగ అనంతరం వారు మంగళవారం అమ్మవారికి పసుపు, కుంకుమ పూజలు నిర్వహించి రూ.2 లక్షల విలువైన బంగారం, వెండితో తయారు చేసిన కాసుల పేరును సమర్పించారు. దాతలకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.