Top Stories
ప్రధాన వార్తలు

పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా!
వాషింగ్టన్ : జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి అంశంపై పాకిస్తాన్‌కు అమెరికా షాకిచ్చింది. మతిలేని చర్యను వెనకేసుకు రావొద్దని హెచ్చరించింది. పహల్గాం దాడి విషయంలో చేపట్టే దర్యాప్తులో భారత్‌కు సహకరించాలని సూచించింది. పహల్గాం ఉగ్రదాడితో భారత్ - పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బుధవారం.. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పాక్ ప్రధాని హహబాద్ షరీఫ్‌తో ఫోన్లో మాట్లాడారు.ఫోన్ సంభాషణలో రూబియో.. ఉగ్రవాదంపై భారత్ తీసుకునే ప్రతి చర్యలో అమెరికా పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. అదే సమయంలో పహల్గాంలో 26 మంది ప్రాణాలు తీసిన అమానుష చర్యపై భారత్ చేపట్టే దర్యాప్తుకు సహకరించాలని సూచించినట్లు సమాచారం.జైశంకర్‌తో మాట్లాడిన సమయంలో మార్కో రూబియో పహల్గాం దాడి బాధితులకు సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై జరిపే పోరాటంలో భారత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ముందు నుంచి పహల్గాం ఉగ్రదాడి విషయంలో పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఈ విషయంలో ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి, శాంతి భద్రతలను కాపాడుకోవడానికి పాకిస్తాన్‌తో కలిసి పనిచేయాలని భారత్ కృషి చేయాలని కోరారు. అందుకు ప్రతిస్పందనగా ఎక్స్ వేదికగా జైశంకర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో దాడికి పాల్పడ ఉగ్రవాదుల్ని, వాళ్లను పెంచి పోషిస్తున్న వారిని, పహల్గాం ఉగ్రదాడికి ప్రణాళిక వేసిన వారిని న్యాయం ముందు నిలబెట్టాలి’ అని పేర్కొన్నారు. రుబియో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్‌తో జరిపిన సంభాషణల్లో పాకిస్తాన్ పహల్గాం దాడిని ఖండించాలని, దర్యాప్తులో సహకరించాలని కోరారు. ఈ దాడిపై పాకిస్తాన్ బాధ్యత వహించాలని, భారత్‌తో నేరుగా సంభాషణలు పునరుద్ధరించి శాంతి దిశగా కృషి చేయాలని సూచించినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరి తాజా పరిణామలపై భారత్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

పాక్ విమానాలకు భారత గగనతలం మూసివేత.. నెక్ట్స్ జరిగేది ఇదేనా?
ఢిల్లీ: పాకిస్తాన్‌ను మరింత ఇబ్బంది పెట్టేలా భారత్ మరో కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్ గగనం తలంలో పాక్ విమాన ప్రయాణాలపై నిషేధం విధించింది. దీంతో పాకిస్థాన్ నుంచి భారత్ మీద నుంచి కాకుండా ఇతర దేశాల గగనం తలం నుంచి గమ్య స్థానాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, భారత విమానాలకు పాకిస్తాన్ గగనతల మూసివేయడంతో ప్రతి చర్యగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.ఈ ఆంక్షలు మే 24 వరకు కొనసాగనున్నాయి. అయితే ఈ గడువు మున్ముందు పరిస్థితులపై ఆధారపడి ఉండనుంది. భారత గగన తలంపై పాక్ విమానాల నిషేధం విధిస్తూ.. కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ‘భారత్ గగనం తలంపై పాక్ విమానాలు నిషేదం. వాటిల్లో పాక్ రిజిస్టర్డ్ విమానాలు, అలాగే పాక్ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నా, లేదంటే లీజుకు తీసుకున్న విమానాలకు భారత గగనతల ప్రవేశం లేదు. ఇందులో సైనిక విమానాలూ ఉన్నాయి’ అని కేంద్రం విడుదల చేసిన నోట్లో పేర్కొంది. మరోవైపు భారత్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలపై దాయాది దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పాక్‌కు చెందిన విమానాలు భారత్ గగనతలం మీద నుంచి ప్రయాణించకూడదన్న ఆదేశాలు అమల్లో ఉండగా.. ఇప్పుడు అధికారికంగా గగనతలాన్ని మూసివేస్తూ భారత్ ప్రకటన చేయడంపై దాయాది దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ చర్య వల్ల దక్షిణ ఆసియా, ఓషియానియా ప్రాంతాలకు వెళ్లే పాక్ విమానాలు భారత గగన తలం మీద నుంచి పొరుగు దేశాల మీద నుంచి తిరిగి ప్రయాణించాల్సి వస్తుంది. ఆ ఫలితం పాక్ విమానయాన రంగంపై పడనుంది. విమానం ప్రయాణ సమయం పెరగడం, ఫ్లైట్ ఛార్జీలు పెరగడం, విమాన ఇంధన ధరలు పెరగడం, విమానాల్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య తగ్గడం వంటి ప్రతికూల ప్రభావం పడనుంది. వెరసీ పాక్ మరిన్ని ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోంది. ఇప్పటికే ఆర్థికంగా కుదేలైపోయిన పాకిస్తాన్ విమానయాన సంస్థలకు తాజా భారత నిర్ణయంతో అదనపు భారం పడనుంది.

వాళ్లిద్దరు అద్భుతం.. అతడు గొప్ప ఫీల్డర్.. కానీ అక్కడే వెనుకబడ్డాం: ధోని
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రయాణం ముగిసిపోయింది. పంజాబ్ కింగ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఓడిన తర్వాత ధోని సేన అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.పంజాబ్‌తో మ్యాచ్‌లో తమ బ్యాటర్లు మెరుగ్గానే ఆడారని.. అయితే, కనీసం ఇంకో 15 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు.. ‘‘ఈరోజు తొలిసారి మా బ్యాటర్లు స్కోరు బోర్డుపై మెరుగైన సంఖ్యను ఉంచారు. కానీ ఇలాంటి పిచ్‌పై ఇది సరిపోదు.ఆఖరి నాలుగు బంతులు వృథా చేశాంమా వాళ్లు ఇంకాస్త మెరుగ్గా ఆడితే బాగుండేది. అదే విధంగా మేము కీలక సమయాల్లో కీలక క్యాచ్‌లు జారవిడవడం కూడా ప్రభావం చూపింది.ఏదేమైనా ఈరోజు బ్రెవిస్, సామ్ అద్భుతంగా ఆడి విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, మేము దురదృష్టవశాత్తూ ఆలౌట్ అయ్యాము. ఆఖరి నాలుగు బంతులు వృథా చేశాం. అంతకంటే ముందు మా వాళ్లు నలుగురు అవుట్ అయ్యారు.అతడొక పోరాట యోధుడుఇలాంటి కీలక పోరులో ఒక్క బంతి ఆడటం కూడా మ్యాచ్‌ను మలుపు తిప్పుతుంది’’ అని ధోని పేర్కొన్నాడు. ఇక పంజాబ్‌తో మ్యాచ్‌లో అద్భుత అర్థ శతకంతో మెరిసిన సామ్ కరన్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అతడొక పోరాట యోధుడు. తనకు అవకాశం దొరికినప్పుడల్లా కచ్చితంగా రాణిస్తాడు.అయితే, దురదృష్టవశాత్తూ పిచ్ దృష్ట్యా అతడికి ఎక్కువగా ఛాన్సులు ఇవ్వలేకపోయాం. కానీ ఈరోజు మా సొంతమైదానంలో టోర్నీలోనే అత్యుత్తమ వికెట్ మీద ఆడి తానేంటో నిరూపించుకున్నాడు.అతడొక అద్భుతమైన ఫీల్డర్ కూడామేము ఇంకొక్క పదిహేను పరుగులు చేసి ఉంటే బాగుండేది’’ అని ధోని అన్నాడు. అదే విధంగా అద్భుత ఫీల్డింగ్ నైపుణ్యాలు కనబరిచిన డెవాల్డ్ బ్రెవిస్ గురించి మాట్లాడుతూ.. ‘‘మిడిలార్డర్లో తను మొమెంటమ్ తీసుకువచ్చాడు.చిన్న అవకాశం దొరికినా బంతిని బౌండరీకి తరలించాలని చూస్తాడు. అంతేకాదు.. అతడొక అద్భుతమైన ఫీల్డర్ కూడా. జట్టులో సరికొత్త ఉత్సాహం నింపుతున్నాడు. అతడి ఆట పట్ల సంతృప్తిగా ఉన్నాము. భవిష్యత్తులో అతడొక విలువైన ఆస్తిగా మారతాడు’’ అని ధోని ఈ సౌతాఫ్రికా యువ బ్యాటర్‌పై ప్రశంసలు కురిపించాడు.Brilliant Brevis catch: Composure. Presence of mind & Athleticism at its best 🫨Watch 🔽🎥#TATAIPL | #CSKvPBKS— IndianPremierLeague (@IPL) April 30, 2025 సీఎస్కేకే ఇదే తొలిసారికాగా చెపాక్ స్టేడియంలో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది చెన్నై. ఓపెనర్లు షేక్ రషీద్ (11), ఆయుశ్ మాత్రే (7) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన సామ్ కరన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.మొత్తంగా 47 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 88 పరుగులతో ఆకట్టుకున్నాడు. అతడికి తోడుగా డెవాల్డ్ బ్రెవిస్ (32) రాణించాడు. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. ఈ క్రమంలో 19.2 ఓవర్లో 190 పరుగులు చేసి చెన్నై జట్టు ఆలౌట్ అయింది.ఇక ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. చెన్నైని ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకొనేలా చేసింది. అయితే, ఈ మ్యాచ్‌లో బేబీ ఏబీడీ బ్రెవిస్ అద్భుతమైన క్యాచ్‌లతో మెరిశాడు. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (54) ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టాడు.అయితే, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో శశాంక్ సింగ్ (23) ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద అద్భుత రీతిలో అందుకున్న బ్రెవిస్ అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు. బౌండరీ లైన్‌కు తాకే ప్రమాదం ఉండటంతో బంతిని మూడుసార్లు గాల్లోకి లేపి ఆ తర్వాత సురక్షితంగా క్యాచ్ పట్టాడు. కాగా గతేడాది కూడా చెన్నై టాప్-4కు చేరలేదన్న విషయం తెలిసిందే. ఇలా వరుసగా రెండు సీజన్లలో చెన్నై ప్లే ఆఫ్స్ చేరకపోవడం ఇదే తొలిసారి.చదవండి: క్రికెట్ నీకు రెండో ఛాన్స్ ఇచ్చింది.. కానీ.. Hat-trick 👌Powerful start with the bat 🔥Captain's knock 🫡The Battle of Kings goes the @PunjabKingsIPL way again this season ❤Scorecard ▶ https://t.co/eXWTTv7Xhd #TATAIPL | #CSKvPBKS pic.twitter.com/Yk1SOZOzip— IndianPremierLeague (@IPL) April 30, 2025

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 21 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను అధికారులు జారీ చేశారు.కోస్తాంధ్రలో ఒక్కసారిగా మారిన వాతావరణంకోస్తాంధ్రలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. పలు చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా వాతావరణంలో భిన్నమైన మార్పులు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో విపరీతమైన ఎండలు, వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక కొన్ని చోట్ల కురిసిన అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

పిల్లలకు చెప్పాల్సిన 'మాయాబజార్' పాఠాలు..!
పిల్లలకు చెప్పాల్సిన పాఠాలు ‘మీరు ఉద్దండ పండితులేగాని ఉండాల్సిన బుద్ధి మాత్రం లేదయ్యా’ అంటాడు శకుని. ర్యాంకులు వేరు... కామన్సెన్స్ వేరు... ఈ సంగతి పిల్లలకు ఎవరు చెప్పాలి? ‘ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది’ అంటాడు ఇదే శకుని. ఈ చిట్కా చెప్పడానికి పెద్దలకు తీరిక ఎక్కడిది? అస్మదీయులు ఎవరో తస్మదీయులు ఎవరో తెలుసుకోకపోతే పిల్లల అడుగులు పడేదెలా? హాయ్ హాయ్ నాయకా.. హోయ్ హోయ్ నాయకా... నాయకత్వ లక్షణాలు ఎవరికి ఉంటాయి? తెలుగువారికి మాత్రమే ఉన్న వ్యక్తిత్వ వికాస సర్వస్వం ‘మాయాబజార్’ సినిమా. ఈ సెలవుల్లో పెద్దలు పిల్లలతో ఈ సినిమా చూడాలి. వివరించాలి. ‘మాయాబజార్’1957లో విడుదలైన గొప్ప తెలుగు చిత్రం. భారతంలోని పాత్రలకు కొద్దిపాటి కల్పన జత చేసి మలచిన ఈ సినిమా ఎందుకు ఇంతకాలం ఆదరణ పొందుతూ ఉందంటే అది ఎప్పుడూ ఒకేలా ఉండే మానవ స్వభావాలను చిత్రించింది కనుక. నేడు ఎదురుపడే మనుషులు ఎలా ఉంటారో ఈ సినిమాలో పాత్రలు అలా ఉంటాయి. అందుకే వాటితో తమను తాము ఐడెంటిఫై చేసుకున్న ప్రేక్షకులు ఎన్నో సాఠాలు నేర్చుకుంటారు. అర్థం చేసుకుంటారు. పిల్లలకు ఈ సినిమా గొప్ప వినోదంగా ప్రారంభమవుతుంది. ఐదేళ్ల వయసు పిల్లల నుంచి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. చూసేకొద్దీ ఎదిగే కొద్దీ వారికి సినిమా కొత్తగా అర్థమై మరింతగా నచ్చుతుంది. ఈ సినిమాకు ఫ్యాన్స్ అయిపోతారు. అలా తరతరాలుగా ఫ్యాన్స్ అయ్యేలా చేసుకుందీ సినిమా. గతంలో ప్రతి వేసవిలో ఈ సినిమా రీరిలీజ్ అయ్యేది. ఇప్పుడు ఓటిటీల్లో... యూట్యూబ్‌లో కలర్లో ఉంది. పిల్లలతో ఒకటికి రెండుసార్లు చూసి వారికి చెప్పాల్సిన పాఠాలు చాలానే ఉంటాయి. 1. బాల అభిమన్యు తన విలువిద్య గురించి ఇలా అంటాడు: అత్తయ్యా... నువ్వు జడవకుండా నుంచో... నీ ముక్కుకు తగలకుండా నత్తును కొడతాను. పిల్లలకు చెప్పాలి: నత్తు అంటే ముక్కుకు పెట్టుకునే ఆభరణం. విలువిద్య నేర్చుకుని ఎవరైనా సరే పండునో కాయనో కొట్టగలరు... కాని ముక్కుకు తగలకుండా నత్తును కొడతానంటున్నాడంటే విలువిద్య చాలా గొప్పగా నేర్చుకున్నాడన్న మాట. మనం చదివినా, ఆటల్లో ప్రవేశించినా, కళల్లో ఉన్నా ఆ స్థాయి పరిణితి సాధించాలి. అభిమన్యుడిని ఆదర్శంగా తీసుకోవాలి. 2. శ్రీకృష్ణుడు ‘సత్యపీఠం’ తీసుకువస్తాడు. అలాగే ‘ప్రియదర్శిని’ కూడా చూపిస్తాడు. పిల్లలకు చెప్పాలి ‘సత్యపీఠం’ ఆనాటి లై డిటెక్టర్. మన పూర్వికులు శాస్త్రపరంగా గొప్ప ప్రయోగాలు చేశారు. ఊహలు చేశారు. శాస్త్రజ్ఞుల ఊహలో లేని కాలంలో ‘సత్యపీఠం’ ఊహ చేయడం మనవారి గొప్పతనం. అలాగే వీడియో కాల్ చేసుకునేలా ల్యాప్‌టాప్‌లాంటి ‘ప్రియదర్శిని’ని చూపించారు. సైన్స్ దృష్టికోణం నుంచి పురాణాలు చూస్తే చాలా ఇంటెరెస్టింగ్ విషయాలు తెలుస్తాయని చె΄్పాలి. 3. శకుని పాచికలు వేస్తూ అంటాడు: ఈ పాచికలతో ఎవరినైనా సర్వనాశనం చేయగలను. పిల్లలకు చె΄్పాలి: జూదం వ్యసనం. అందులో మోసం ఉంటుంది. నష్టం ఉంటుంది. ఒక్కసారి వ్యసనాల్లో దిగితే తిరిగి రావడం కష్టం. నేటి రోజుల్లో ఆన్లైన్ గేమింగ్ కూడా అలాంటి వ్యసనమే. బెట్టింగ్ యాప్‌లు కూడా వ్యసనమే. ఆల్కహాల్, డ్రగ్స్ కూడా వ్యసనాలే. వ్యసనాల వల్ల పాండవులు రాజ్యాలను కోల్పోయారు. అందువల్ల ఎప్పుడూ వ్యసనాల జోలికిపోకూడదు. 4. శర్మ, శాస్త్రి వచ్చి లక్ష్మణ కుమారుణ్ణి పొగుడుతూ ‘పురోగమించుట వారికి తెలుసు... తిరోగమించుట తమకు తెలుసు’ అంటారు. పిల్లలకు చెప్పాలి: గొప్పలు చెప్పుకోవడం, పొగడ్తలకు పడిపోవడం అల్పుల లక్షణం అని, లక్ష్మణ కుమారుడు అలాంటి వాడని చెప్పాలి. మనకు ఎంత ప్రతిభ ఉన్నా గొప్పలు చెప్పుకోకూడదని నేర్పాలి. లేని ప్రతిభ ఉన్నట్టుగా కల్పించి చెప్పి అభాసుపాలు కాకూడదని చెప్పాలి. మన బలహీనతను వాడుకుంటూ కొందరు చుట్టూ చేరి మోసం చేసి పబ్బం గడుపుతారనీ అలాంటి వారిని గుర్తించి దూరం ఉండాలి చెప్పాలి. 5. రాజ్యం పోయాక సుభద్ర వస్తే బలరాముని ఇంట్లో పరాభవం పిల్లలకు చెప్పాలి: కొందరు మనుషులు అభిమానాన్ని బట్టి గాక స్థితిని బట్టి గౌరవిస్తారని, మనం కష్టంలో ఉంటే వారు అసలు రూపు చూపిస్తారని అలాంటి వారిని చూసి జాలి పడాలి తప్ప బాధ పడకూడదని నేర్పాలి. డబ్బుకు అతీతమైన విద్యాబుద్ధులు, వ్యక్తిత్వం శాశ్వతమని, వాటికే లోకంలో విలువ, గౌరవం అని చె΄్పాలి. 6. ఘటోత్కచుడి ప్రవేశం పిల్లలకు చెప్పాలి: మన దేశంలో అడవుల్లో జీవించేవారు ఉంటారని వారిని గిరిజనులు, ఆదివాసీలు అంటారనీ వారి కట్టు, బొట్టు, భాష, యాస, ఆచారాలు వేరని... మనం నాగరికులం అయినంత మాత్రాన వారిని చిన్నచూపు చూడకూడదని. వారెంతో మంచివారని, అడవులు వారి ఆధారం అని వాటిని నరికి లాక్కుని వారికి హాని కలిగించడం తప్పు అని నేర్పాలి. ‘అస్మదీయులు’ అంటే ఫ్రెండ్స్ అనీ, ఆదివాసీలకు మనం అస్మదీయులుగా ఉండాలని చె΄్పాలి. 7. దుష్ట చతుష్టయం పిల్లలకు చెప్పాలి: దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు... వీరు నలుగురిని దుష్ట చతుష్టయం అంటారని చతుష్టయం అంటే నాలుగు అని చెప్పాలి. చెడు ఆలోచనలు చేసేవారితో స్నేహం చేస్తే మనం కూడా చెడ్డవాళ్లం అవుతామని చెడ్డపనులు చేయడం వల్ల ప్రమాదంలో పడతామని హెచ్చరించాలి. 8. గింబళి, గిల్పం కావాలని డిమాండ్ పిల్లలకు చెప్పాలి: స్నేహితులైనా, బంధువులైనా న్యాయమైన సాయం, కోరిక కోరితే నెరవేర్చాలని, అదే మన మంచితనం సాకుగా తీసుకుని గొంతెమ్మ కోరికలు కోరితే వారికి బుద్ధి చె΄్పాలని నేర్పాలి. ‘కంబళి’, ‘తల్పం’ కాదని ‘గింబళి’, ‘గిల్పం’ కోరిన శర్మ, శాస్త్రులకు చిన్నమయ్య బుద్ధి చెప్పే దృశ్యాలు పిల్లలకు ఎంతగానో నవ్వు తెప్పిస్తాయి. 9. శాకంబరీదేవి ప్రసాదం– వివాహ భోజనంబు పిల్లలకు చెప్పాలి: తెలుగువారి భోజనానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయని ప్రతి ప్రాంతానికీ సమూహాలకు వారివైన ఆహార అలవాట్లు ఉంటాయని, వాటిని గౌరవించాలని మన ఆహారపు అలవాట్లను పాటించాలని నేర్పించాలి. గోంగూరను శాకంబరీ దేవి ప్రసాదం అంటారని తెలుగువారికి గోంగూర ఇష్టమని చెప్పాలి. భక్ష్యాలు, చిత్రాన్నాలు, పానీయాలు, కూరగాయలు అంటే ఏమిటో వాటి తేడాలేమిటో చెప్తే సరదా పడతారు. 10. చినమాయను పెనుమాయ పిల్లలకు చెప్పాలి: ఏ పనైనా నిజాయితీగా చేస్తే ఫలితం ఉంటుందని.. మాయతో కపటంతో శశిరేఖను లక్ష్మణ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాలని కౌరవులు భావిస్తే శ్రీకృష్ణుడు, ఘటోత్కచుడు పెనుమాయతో ఆ పెళ్లిని పెటాకులు చేశారని... తగిన శాస్తి జరిగిందని... చెడ్డవాళ్లు ఎప్పటికీ ఓడిపోతారని, మంచితనంతో ఉంటేనే గెలుస్తామని బోధించాలి.(చదవండి: అందరికీ కావాల్సిన పోషకాలు ఇవే..! వయసుల వారీగా డైట్ ఎలా ఉండాలంటే..?)

దైవ సాక్షిగా.. 'మళ్లీ భక్తులే బలి'
‘మా పిల్లలు.. బంధువులను ప్రభుత్వమే చంపేసింది! చందనోత్సవం పుణ్యమా అంటూ ప్రభుత్వం మమ్మల్ని రోడ్డు పాల్జేసింది. మా కుటుంబాలలో విషాదం నింపింది...!’ ‘దగ్గరుండి బంధువులందరితో తెలుగుదేశంకు ఓటు వేయించాడు. ఆ ప్రభుత్వమే మా కొడుకు.. కోడలిని పొట్టనబెట్టుకుంది. ఇంటి దిక్కును కోల్పోయాం...!’‘చేతికి అందివచ్చిన కుమారుడికి త్వరలోనే పెళ్లి చేయాలనుకున్నా...!’ ‘నాకు పెద్ద దిక్కు అనుకున్న అన్నయ్య నన్ను వదిలి వెళ్లిపోయాడు..!’ కేజీహెచ్ మార్చురీ వద్ద మృతుల బంధువుల ఆక్రోశం ఇదీ!సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ కూటమి సర్కారు పాపాలు భక్తులకు యమపాశాలుగా మారుతున్నాయి! తిరుపతిలో తొక్కిసలాట ఘటన మరువక ముందే.. సింహాచలంలో మరో విషాదం చోటు చేసుకుంది. నాడు వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం వచ్చిన ఆరుగురు భక్తులు తిరుపతిలో మృత్యువాత పడగా.. నేడు వరాహ లక్ష్మీ నృసింహస్వామి నిజరూప దర్శనం కోసం సింహాచలం వచ్చిన వారు నిర్జీవులుగా మారారు. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఏర్పాట్లలో సర్కారు నిర్లక్ష్యం ఏడు నిండు ప్రాణాలను బలి తీసుకుంది! అత్యంత నాసిరకంగా, కాలమ్స్ లేకుండా ఫ్లైయాష్‌తో కట్టిన గోడ గాలివానకు కూలిపోయి భక్తులను సజీవ సమాధి చేసింది. బుధవారం తెల్లవారుజామున ఈ విషాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండగా వీరిలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న యువ దంపతులున్నారు. చనిపోయిన వారిలో అంబాజీపేటకు చెందిన కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు(29), పత్తి దుర్గా స్వామినాయుడు (30), విశాఖ వాసులు ఎడ్ల వెంకటరావు(58), పిల్లా ఉమా మహేశ్వరరావు(30), పిల్లా శైలజ (27), గుజ్జారి మహాలక్ష్మి, పైలా వెంకట రత్నం(45) ఉన్నారు. తమవారి ప్రాణాలు తీసేందుకే నాణ్యత లేని గోడ కట్టారని బాధిత కుటుంబాలు ఆక్రోశిస్తున్నాయి. ఈ విషాదం అందరినీ కలచి వేస్తుండగా విశాఖ ఎంపీ శ్రీభరత్ ఏమాత్రం చలించకుండా చందనోత్సవ దర్శనం చేసుకుని చల్లగా జారుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. తనకేమీ పట్టనట్లుగా ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖ విడిచి పత్తా లేకుండా పోయారు. ప్రచారం ఘనం.. ఏర్పాట్లు శూన్యంఏడాదికోసారి జరిగే సింహాచలం చందనోత్సవం నిర్వహణ ఏర్పాట్లు ఈసారి భక్తులకు చుక్కలు చూపించాయి. కొండపైకి వెళ్లేందుకు బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక దర్శనానికి 5 నుంచి 8 గంటల పాటు క్యూలైన్లలో నరకయాతన అనుభవించారు. చందనోత్సవం వేడుకను తిలకించేందుకు దాదాపు రెండు లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేయగా నిర్వహణ ఏర్పాట్ల కోసం ఐదుగురు మంత్రులతో కమిటీని నియమించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చిన్న చిన్న అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. అప్పన్న నిజరూప దర్శనం వేళ.. ఏర్పాట్లలో డొల్లతనం బయట పడింది. చందనోత్సవం నిర్వహణ ఏర్పాట్ల విషయంలో మంత్రుల కమిటీ నిర్లక్ష్యం భక్తుల ప్రాణాలను బలి తీసుకుంది. ఏటా చందనోత్సవం రోజు వర్షం పడడం సాధారణం అయినప్పటికీ అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఫలితంగా వారం క్రితం నిర్మించిన నాసిరకం గోడ కూలి ఏడుగురి ప్రాణాలను బలి తీసుకుంది. అంత ఎత్తు గోడ కట్టినప్పుడు ఫ్లైయాష్ ఇటుక వాడవచ్చా? నీరు దిగేందుకు వీలుగా గోడకు పైపులు ఎందుకు అమర్చలేదు? ఇంజనీరింగ్ డిజైన్ ఇచ్చిందెవరు? అక్కడ ఉన్న షాపులు తొలగించమని ఎవరు చెప్పారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఘటనాస్థలంలో శిథిలాలను తొలగిస్తూ మృతుల కోసం వెదుకుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వీఐపీల దర్శనం, టికెట్ల అమ్మకాలపైనే దృష్టిపవిత్ర చందనోత్సవం సమయంలో సైతం సింహాచలం దేవాలయానికి ప్రభుత్వం ఈవోను నియమించకపోవడం గమనార్హం. కేవలం ఇన్చార్జి ఈవోతో ఇంత భారీ కార్యక్రమాన్ని ముగించేందుకు సిద్ధమైంది. ఇన్చార్జి ఈవోను డమ్మీగా మార్చి ప్రభుత్వ పెద్దలు ఇష్టారీతిలో వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాసుల జారీ మొదలుకుని.. టికెట్ల అమ్మకాలు, చందనోత్సవం కోసం చేపట్టిన వివిధ కాంట్రాక్టు పనులన్నింటిలోనూ అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకున్నారు. వీఐపీల దర్శనం, టికెట్ల అమ్మకాలపై దృష్టి సారించి సాధారణ భక్తుల భద్రతను గాలికొదిలేసినట్లు స్పష్టమవుతోంది.హడావుడిగా తాత్కాలిక గోడకేశ ఖండనం, గాలి గోపురానికి వెళ్లే భక్తులు నడిచేందుకు ఆలయం పక్కన దారి ఉంది. అక్కడి నుంచి కిందకు వెళ్లేందుకు ఉన్న మెట్ల మార్గం పక్కనే గోడ నిర్మాణం జరుగుతోంది. వాస్తవానికి ఈ గోడకు బదులుగా గతంలో రిటైనింగ్ వాల్ ఉంది. పై నుంచి మట్టి ఊడిపడితే కింద వెళ్లే భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ రిటైనింగ్ వాల్ కాపాడేది. అయితే, ప్రసాద్ స్కీమ్‌లో భాగంగా పాత రిటైనింగ్ వాల్ స్థానంలో కొత్త రిటైనింగ్ వాల్ నిర్మించాల్సి ఉంది. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సమయం పడుతుందని చందనోత్సవం సందర్భంగా హడావుడిగా తాత్కాలిక గోడను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తాత్కాలిక గోడ నిర్మాణ పనులు నాలుగు రోజుల్లో పూర్తి చేశారు. పునాదులు, కాంక్రీట్, స్టీల్, రెయిన్‌ఫోర్స్‌మెంట్ స్ట్రక్చర్ లేకుండా కేవలం ఫ్లైయాష్ బ్రిక్స్‌తో భారీ గోడను నిర్మించేశారు. ఇటుకకు ఇటుకకు మధ్య కనీసం సిమెంటు లేకుండా ఇసుక ఎక్కువ పాలు వేసి అత్యంత నాసిరకంగా నిర్మించారనే విషయం చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. పాత రిటైనింగ్ వాల్ ఉండి ఉంటే ఈ ప్రమాదం తప్పేదని.. కనీసం గోడ నిర్మాణ సమయంలో ప్రభుత్వం నాణ్యతను పరిశీలించినా ఇంత పెను ప్రమాదం జరిగి ఉండేది కాదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ తాత్కాలిక గోడే కదా అనే నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపంతో నాసిరకంగా నిర్మించడంతో చిన్నపాటి వర్షానికే కూలిపోయి భక్తులు ప్రాణాలు కోల్పోయారు.మృతుల ఫైల్ ఫొటోలు ముందస్తు జాగ్రత్తలేవి?లక్షల మంది భక్తులు తరలివచ్చే ఈ వేడుకల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రమాదం జరిగిన తరువాత కూడా సహాయక చర్యలు అందించడంలో తీవ్ర జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించిన రిటైనింగ్ వాల్ వైపు రూ.300 టికెట్ల క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఒక్క సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచలేదు. ప్రమాదం జరిగిందన్న విషయం భక్తుల హాహాకారాలు చేస్తే గానీ అధికారుల దృష్టికి వెళ్లలేదు. భారీగా భక్తులు తరలివచ్చే కార్యక్రమాలకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అంబులెన్సులు, పారా మెడికల్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించలేదు. దుర్ఘటన తెల్లవారుజామున సుమారు 3.05 గంటలకు జరగగా అధికారులు 3.30 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తరువాత ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించారు. అప్పటికే దారుణం జరిగిపోయింది. ఇటుకల కింద ఏడుగురు భక్తులు సమాధి అయిపోయారు.మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకే పెద్దపీట!ఒకవైపు ఆలయ ఇన్చార్జి ఈవోను డమ్మీని చేసి అన్ని నిర్ణయాలను కలెక్టరేట్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇంటి నుంచే ప్రభుత్వం అమలు చేసింది. ఎవరికి ఎన్ని వీఐపీ టికెట్లు ఇవ్వాలనే విషయాన్ని వారే నిర్ణయించారు. టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలకు ఎన్ని కావాలంటే అన్ని పాస్‌లు కేటాయించారు. వారికి మాత్రమే కారు పాస్‌లు మంజూరు చేశారు. బీజేపీ నేతలకు సైతం వీఐపీ, రూ.1,500 టికెట్లు దక్కలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాధారణ భక్తులు రూ.300, రూ.1,000 టికెట్లను కొనుగోలు చేసేందుకు బ్యాంకులు, కౌంటర్ల వద్దకు వెళితే లేవని తిప్పి పంపేశారు. అప్పటికే ఆ టికెట్లను తమ వారి కోసం టీడీపీ నేతలు తీసేసుకున్నారు. సాధారణ భక్తులు దేవస్థానం బస్సుల్లోనే కొండపైకి చేరుకోవాల్సి వచ్చింది. బస్సులు తగినంతగా లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. గంటల పాటు వేచి చూడలేక పలువురు నడక మార్గంలో ఘాట్ రోడ్డు ద్వారా కొండపైకి చేరుకున్నారు. ఘాట్ రోడ్లో నడక దారిలో కిలోమీటరు మేర బారులు తీరి కనిపించారు. ఇన్చార్జి ఈవోనే దిక్కు...!ఏటా చందననోత్సవంతోపాటు గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తుతారు. అప్పన్న నిజరూప దర్శన వేడుకను తిలకించేందుకు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఒడిశా నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఈవోదే ప్రధాన బాధ్యత. అయితే చందనోత్సవం వేళ రెగ్యులర్ ఈవోను ప్రభుత్వం నియమించలేదు. రెగ్యులర్ ఈవోగా ఉన్న వి.త్రినాథరావు 3 నెలలు సెలవులో వెళ్లారు. అప్పటి నుంచి ఇన్చార్జి ఈవోగా కె.సుబ్బారావు కొనసాగుతున్నారు. ఏప్రిల్ 30న చందనోత్సవం ఉందని తెలిసినా రెగ్యులర్ ఈవోను నియమించపోవడం ఇష్టారాజ్యంగా వ్యవహరించేందుకేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మృతుల వివరాలు..పవిత్ర క్షేత్రాల్లో వరుస అపచారాలుపవిత్ర పుణ్యక్షేత్రాల్లో 11 నెలలుగా వరుసగా చోటు చేసుకుంటున్న అపచారాలు, అనూహ్య ఘటనలు భక్తకోటిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతూ వారి భద్రత పట్ల సర్కారు తీవ్ర నిర్లక్ష్యాన్ని బట్ట బయలు చేస్తున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ప్రభుత్వమే ‘కల్తీ’ ప్రచారానికి తెర తీయడం మొదలు.. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలో వైఫల్యం కారణంగా తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరుగురు భక్తులు మరణించడం.. టీటీడీ గోశాలలో గోవుల మృతి ఘటనను కప్పిపుచ్చుతూ సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా బుకాయించడం.. దశాబ్దాలుగా హైందవ ధర్మం, దాతృత్వానికి ప్రతీకగా నిలిచిన కాశీ నాయన ఆశ్రమాన్ని ప్రభుత్వమే నేలమట్టం చేయడం.. శ్రీకూర్మం గుడిలో తాబేళ్లు చనిపోవడం లాంటి ఘటనలన్నీ భక్తుల మనోభావాలను కలచి వేస్తున్నాయి. గతంలోనూ చంద్రబాబు సర్కారు కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో పలు ఆలయాలను నేల కూల్చిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కనీసం ఓ గోడ కూడా కట్టలేక అప్పన్న సాక్షిగా భక్తుల ప్రాణాలను బలి తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతిమృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేలుసాక్షి, న్యూఢిల్లీ: సింహాచలం క్షేత్రం వద్ద చోటుచేసుకున్న దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధాని స్పందిస్తూ ‘విశాఖపట్నంలో గోడ కూలిన ఘటనలో జరిగిన ప్రాణనష్టం చాలా బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం. మృతుల బంధువులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50వేలు అందజేస్తాం’ అని ప్రకటించారు.రాహుల్ విచారంఈ ఘటనపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

HIT3 X Review: ‘హిట్ 3’ ట్విటర్ రివ్యూ
నేచురల్ స్టార్ నాని(Nani) నటించిన 'హిట్: ది థర్డ్ కేస్'(HIT3) సినిమా ఎట్టకేలకు నేడు(మే 1) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ‘హిట్’ ఫ్రాంచైజీలో మూడో చిత్రమిది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇందులో నాని ఎస్పీ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమా పై హైప్ క్రియేట్ అయింది. భారీ లంచనాల మధ్య మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. హిట్ 3 కథేంటి? ఎలా ఉంది? నాని ఖాతాలో మరో హిట్ పడిందా లేదా తదితర అంశాలను ఎక్స్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.ఎక్స్‌లో హిట్ 3(HIT3 Review) సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది.కొంతమంది నెటిజన్స్ సినిమా మొదటి సగం అద్భుతంగా ఉందని, నాని నటన, రొమాంటిక్ ఎపిసోడ్లు ఆకట్టుకున్నాయని ప్రశంసింస్తే..మరికొంతమంది ఈ సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఆకట్టుకోలేదని, గత హిట్ సినిమాలతో పోలిస్తే ఈ భాగం సాధారణంగా ఉందని అభిప్రాయపడ్డారు. సినిమా రెండో సగం కథలో మెరుగైన ఆలోచనలు, ఎగ్జిక్యూషన్ లోపించాయని కొందరు విమర్శించారు. అయినప్పటికీ, నాని పాత్రలో కొత్త జోన్లో కనిపించాడని, అతని నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చాలామంది కొనియాడారు. #Hit3 is a very violent action crime thriller that has moments that work well but at the same time portions that are too run of the mill and narrated on the slower side.The first half is pretty average and predictable till the pre-interval which starts to engage. The second…— Venky Reviews (@venkyreviews) April 30, 2025 హిట్ 3' ఒక వయలెంట్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్.కొన్ని సీన్స్ భాగా వర్కౌట్ అయ్యాయి.అదే సమయంలో కొన్ని రోటీన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఫస్టాఫ్ రొటీన్‌గా, ఊహించదగిన విధంగా ఉంటుంది. ప్రీ-ఇంటర్వెల్ వరకు, అక్కడ నుండి ఆసక్తికరంగా మారుతుంది. రెండవ సగం స్క్విడ్ గేమ్ నుండి ప్రేరణ పొందిన సెటప్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ కథనం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే, ముందుగా చెప్పినట్లు కథనం ఊహించదగిన విధంగా ఉంటుంది, తక్కువ ట్విస్ట్‌లతో మరియు మాస్ మూమెంట్స్‌పై ఎక్కువగా ఆధారపడుతుంది. నిర్మాణ విలువలు మరియు సినిమాటోగ్రఫీ ప్రత్యేకంగా నిలుస్తాయి. సంగీతం ప్రభావవంతంగా లేదు . నాని అద్భుతంగా నటించాడు అంటూ ఓ నెటిజన్ ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇచ్చాడు.#Hit3One time watch for NaNiHighlights __________NaNi’s performance Cinematography Climax Negatives__________Forceful violenceNo twists and turnsUneven screenplayBGM— praneeth nukala (@praneethnukala) May 1, 2025 హిట్ 3 ఒక్కసారి చూడొచ్చు. నాని నటన, సినిమాటోగ్రఫీ, క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయితే.. వయెలెన్స్ బలవంతగా ఇరికించడం, ట్విస్టులు,మలుపులు లేకపోవడం, స్క్రీన్‌ప్లే, బీజీఎం మైనస్ పాయింట్స్ అని మరో నెటిజన్ అభిప్రాయ పడ్డాడు#HIT3 #HIT3Review RAW..BLOODY..🎯🎯🎯🎯Not for family audiences or kids. What an actor @NameisNani . He is growing as multitalented, big box office star. Best of #Nani movie I have ever watched. Totally new experience 👏🏼👏🏼Strictly NO Kids ⛔️⛔️***BLOCKBUSTER***— Karthik (@meet_tk) April 30, 2025#HIT3 rating : ⭐⭐🌟3/5!!@NameisNani show🔥 an Griping action pack thriller, #SrinidhiShetty and #nani chamestry good overall an watchable.#hit3review #HIT3FromMay1st pic.twitter.com/guu9TKRMsS— its cinema (@iitscinema) April 30, 2025 ఇది నాని షో. గ్రిస్పింగ్ యాక్షన్‌ప్యాక్ థ్రిల్లర్. శ్రీనిధి శెట్టి, నాని కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్‌గా హిట్3 థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా అంటూ మరో నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాడు.First half Good Second Half & Pre climax 💥💥💥💥💥💥💥💥💥💥💥. #HIT3 pic.twitter.com/8074TXw1v1— Vishnu Varthan Reddy (@RVVR9999) May 1, 2025#hit3review – Gritty & violent thriller with flashes of brilliance. First half dull, second half picks up with Squid Game vibes. Nani excels, but predictable plot, excess violence & weak music pull it down. Not for families.Rating: 2.75/5#Nani #HIT3TheThirdCase #HIT3 #hit3 pic.twitter.com/98Rk6J9tUs— Tha Cinema (@tha_cinema) May 1, 2025#HIT3Review:Positives• Nani🔥💥💥• The Final Act🥵👿• Concept😮• Sailesh's Screenplay👌• Cameos💥Suspenses🙌Investigation💥Final Verdict: An Engaging Suspense Thriller that serves its Purpose.#HIT3 | #NANI | #HIT3TheThirdCase #castesensuspic.twitter.com/eDn379ICBk— IndianCinemaLover (@Vishwa0911) May 1, 2025

దూసుకొస్తున్న కాస్మోస్ 482
సోవియట్ యూనియన్ ఎప్పుడో అర్ధ శతాబ్దం క్రితం ప్రయోగించిన అంతరిక్ష నౌక ‘కాస్మోస్ 482’ త్వరలో భూమిపై కూలబోతోంది. మే నెల 8-11 తేదీల మధ్య అది భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. శుక్ర గ్రహాన్ని పరిశోధించడానికి 1972 మార్చి 31న సోవియట్ ఈ అంతరిక్ష నౌకను ప్రయోగించింది. వాస్తవానికి ‘కాస్మోస్ 482’ ఓ లాండింగ్ మాడ్యూల్. 495 కిలోల ల్యాండరును శుక్రగ్రహంపై దింపడం ఈ మిషన్ ఉద్దేశం. సాంకేతిక లోపం తలెత్తి ప్రయోగం విఫలమవడంతో ‘కాస్మోస్ 482’ స్పేస్ క్రాఫ్ట్ ముందుకు ప్రయాణించడానికి అవకాశం లేక భూకక్ష్యలోనే ఇరుక్కుపోయింది. గత 53 సంవత్సరాలుగా అది భూమి కక్ష్యలోనే పరిభ్రమిస్తోంది. ఇప్పుడు కూలే సమయం ఆసన్నమవడంతో శాస్త్రవేత్తలు దాని ఆర్బిటల్ ఎత్తును నిరంతరాయంగా గమనిస్తున్నారు. అంతరిక్ష నౌక కచ్చితంగా ఏ తేదీన భూమిపై కూలుతుందో త్వరలో తెలుస్తుంది. మే 8-11 తేదీల్లో ‘కాస్మోస్ 482’ భూమిపై కూలవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నప్పటికీ... ‘సూర్యుడి క్రియాశీలత’ ప్రభావంతో సదరు తేదీలకు కాస్త ముందుగా గానీ, లేదా ఆ తర్వాత గానీ నౌక కూలే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే సూర్యుడి క్రియాశీలత అధికంగా ఉంటే భూమి ఎగువ వాతావరణం త్వరగా వేడెక్కి వ్యాకోచిస్తుంది. ఫలితంగా దిగువ కక్ష్యలో పరిభ్రమించే వస్తువులను భూ వాతావరణం త్వరితగతిన లాక్కుంటుంది. అంటే ‘కాస్మోస్ 482’ అంతరిక్ష నౌక మనం అనుకున్న సమయం కంటే ముందుగానే కూలిపోవచ్చు. 52 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల్లో కూలవచ్చు!భూ వాతావరణంలోకి అనియంత్రిత ప్రవేశం’ కనుక ‘కాస్మోస్ 482’ స్పేస్ క్రాఫ్ట్ భూమిపై ఏ ప్రాంతంలో కూలిపోతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కానీ ప్రస్తుతం నౌక కక్ష్యను పరిశీలిస్తే భూమిపై 52 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 52 డిగ్రీల దక్షిణ అక్షాంశం మధ్య గల సువిశాల ప్రదేశంలో... అంటే ఉత్తరాన బ్రిటన్ మొదలుకొని దక్షిణాన న్యూజిలాండ్ దాకా ఎక్కడైనా అది కూలవచ్చు. భూమిపై జలావరణమే అధికం కనుక నౌక నేలపై కాకుండా సముద్రాల్లో కూలిపోయే అవకాశాలే ఎక్కువ. సముద్ర ప్రదేశాలు కాకుండా భూభాగంపై లేదా జనావాస ప్రాంతాలపై అది కూలిపోయే అవకాశాలు స్వల్పమే అయినప్పటికీ ఓ అంశం శాస్త్రవేత్తలను కొంచెం కలవరపెడుతోంది. ‘కాస్మోస్ 482’కు ఓ విశిష్టత ఉంది. అది ‘వెనెరా’ మిషన్ ల్యాండర్ల తరహా అంతరిక్ష నౌక. శుక్ర గ్రహంపై దిగేటప్పుడు అక్కడి కఠినాతి కఠినమైన అత్యధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర పీడనాన్ని తట్టుకునేలా ‘కాస్మోస్ 482’ను రూపొందించారు. సాధారణంగా ఖగోళ వస్తువులు భూవాతావరణంలోకి ప్రవేశించాక గాలి ఒరిపిడికి మండిపోయి చిన్న శకలాలుగా రాలిపోతాయి. వాటిలోని పెద్ద, బరువైన భాగాలు మాత్రమే భూమిని తాకుతాయి. డిజైన్ ప్రత్యేకత దృష్ట్యా ‘కాస్మోస్ 482’ మాత్రం భూ వాతావరణంలోకి ప్రవేశించినా ధ్వంసం అవదు. సముద్రాల్లో కాకుండా అది భూభాగంపై కూలిపోవడమంటూ సంభవిస్తే... ఏమాత్రం చెక్కు చెదరకుండా 495 కిలోల ‘కాస్మోస్ 482’ ధడేల్మని ‘ఒకే ముక్క’గా నేల రాలుతుంది! అలా చిన్న ఉల్క మాదిరి ప్రభావం చూపుతుంది. శాస్త్రవేత్తలకు ఆందోళన కలిగిస్తున్న అంశం ఇదే. - జమ్ముల శ్రీకాంత్

వెండింగ్ మెషిన్ల ద్వారా బంగారం కొనుగోలు
దేశవ్యాప్తంగా వచ్చే 12–18 నెలల్లో 50 వరకు బంగారం, వెండి వెండింగ్ మెషిన్లను ఏర్పాటు చేయనున్నట్టు యాస్పెక్ట్ బులియన్ అండ్ రిఫైనరీ ప్రకటించింది. ఈ వెండింగ్ మెషిన్ల ద్వారా బంగారం, వెండి కాయిన్లను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. వెండింగ్ మెషిన్ వద్దే అప్పటికప్పుడు ధరలను కస్టమర్లు చూసుకోవచ్చని.. రియల్‌టైమ్ మార్కెట్ ధరలు అక్కడ కనిపిస్తాయని పేర్కొంది. వేగంగా, భద్రంగా కొనుగోలు చేసుకునేందుకు వీలుగా ఈ వెండింగ్ మెషిన్లు ఉంటాయని.. మూడు నిమిషాల్లోనే కొనుగోలును పూర్తి చేసుకోవచ్చని వెల్లడించింది. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డు సహా పలు రకాల పేమెంట్ ఆప్షన్లను వినియోగించుకోవచ్చని తెలిపింది.వెండింగ్ మెషిన్ ఎలా పని చేస్తుందంటే..గోల్డ్ కాయిన్ వెండింగ్ మెషిన్లు సాధారణ వెండింగ్ మెషీన్ల మాదిరిగానే పనిచేస్తాయి. కానీ బంగారం విలువ కారణంగా అదనపు భద్రతను కల్పిస్తారు. అందులో భాగంగా వినియోగదారుల వెరిఫికేషన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.మెషిన్లో ముందుగా వినియోగదారులు తమకు కావాల్సిన బంగారు నాణెం బరువు, రకాన్ని ఎంచుకుంటారు.నగదు, క్రెడిట్/డెబిట్ కార్డు లేదా మొబైల్ బ్యాంకింగ్ (యూపీఐ, క్యూఆర్ కోడ్లు మొదలైనవి) ద్వారా చెల్లింపులు చేయవచ్చు.కొన్ని యంత్రాలకు గుర్తింపు ధ్రువీకరణ అవసరం అవుతుంది. ముఖ్యంగా అధిక మొత్తంలో చేసే లావాదేవీల కోసం ఆధార్ లేదా బయోమెట్రిక్ ఆథెంటికేషన్ వంటి కేవైసీ (నో యువర్ కస్టమర్) పద్ధతులను ఉపయోగిస్తారు.చెల్లింపు అయినట్లు ధ్రువీకరించిన తరువాత మెషిన్లోని స్టోరేజ్ కంపార్ట్మెంట్ నుంచి బంగారు నాణేన్ని రిలీజ్ చేస్తుంది.ఇదీ చదవండి: ఐటీఆర్ ఫారంలను నోటిఫై చేసిన కేంద్రంకొన్ని యంత్రాల ద్వారా బంగారు కడ్డీలు కూడా పొందే వీలుంటుంది. దానికి సంబంధించిన వివరాలను ముందుగానే వినియోగదారులకు తెలియజేస్తుంది.పంపిణీ సమయంలో భద్రతకోసం సీసీటీవీ మానిటరింగ్, ట్యాంపరింగ్ ప్రూఫ్ మెకానిజమ్స్, వెయిట్ సెన్సర్లను అమరుస్తారు.యంత్రాల్లో యాంటీ-థెఫ్ట్ అలారంలు, రియల్-టైమ్ ఇన్వెంటరీ ట్రాకింగ్ విధానం కూడా ఉంటుంది.బంగారం కొనుగోలు రుజువు కోసం ఈ-రశీదులు కూడా పొందవచ్చు.

May Day శ్రమైక జీవనం
కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్య్రాలు, దౌర్జన్యాలు... ఒంటి చేత్తో తోసిరాజని....పనిలో తమను తాము నిరూపించుకున్నారు మహిళా కార్మికులు.కార్మికలోకపు కల్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణగా నవీన శక్తిలా ముందుకు వచ్చారు మహిళా కార్మికులు.శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతిబింబం అయ్యారు.‘ఈ రంగంలో మహిళలు పనిచేయలేరు’ అనుకునే రంగాలలోకి వచ్చి అ΄ోహలను బద్దలు కొట్టారు.‘పురుషులకు ఎక్కడా తీసిపోము’ అని నిరూపించారు. నిరూపిస్తూనే ఉన్నారు. అయితే... ఇది నాణేనికి ఒక కోణం మాత్రమే. మరో కోణంలో చూస్తే మహిళా ఉద్యోగులు, కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.కోల్‌కత్తాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య మన దేశంలో ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించిన చర్చను ముందుకు తెచ్చింది. వివిధ సర్వేల ప్రకారం మూడింట ఒకవంతు మంది మహిళలు పనిప్రాంతంలో ఏదో ఒక రకమైన శారీరక హింసను ఎదుర్కొంటున్నారు.మహిళా సిబ్బందికి వారి పనిప్రాంతంలో ప్రమాదాలు పెరిగాయి. చాలాప్రాంతాల్లో సీసీటీవీ నిఘా లేదు. సరైన నిఘా, రిపోర్టింగ్ యంత్రాంగం లేక΄ోవడంతో అనుచిత ప్రవర్తన, వేధింపులు పెరిగాయి.ప్రాంథమిక భద్రతా చర్యల గురించి చాలా సంస్థలలో మహిళా ఉద్యోగులకు అవగాహన కలిగించడం లేదు.గార్మెంట్ ఫ్యాక్టరీలలో ఎక్కువమంది కార్మికులు మహిళలే. అయితే పురుషులతో ΄ోల్చితే వారికి తక్కువ వేతనం ఇస్తున్నారు. వేతన అసమానతలతో పాటు పనిప్రాంతంలో ప్రమాదాలు, పురుషాధిపత్య వేధింపులు ఎదుర్కొంటున్నారు. పరిశ్రమలలో మహిళాకార్మికులకు మౌలిక సదుపాయాల కొరత ఉంది.‘బిజినెస్ అండ్ హ్యూమన్ రైట్స్’ రిపోర్ట్ మన దేశంలో గార్మెంట్ ఫ్యాక్టరీలలో మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చింది. నిజానికి ‘ఇది కేవలం గార్మెంట్ పరిశ్రమలకు సంబంధించిన రిపోర్ట్ మాత్రమే’ అనుకోనక్కర్లేదు. చిన్నా, పెద్ద తేడాలతో ఎన్నో పరిశ్రమలలో వేరు వేరు రూపాల్లో ఇదే పరిస్థితి ఉంది.కోవిడ్ మహమ్మారి ఉమెన్ హెల్త్ వర్కర్లకు ప్రమాదాలు తెచ్చింది. విధి నిర్వహణలో చనిపోయిన వారు కూడా ఉన్నారు. అయినా వెనక్కి తగ్గలేదు.చదవండి: ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్నిరాశ పడే పరిస్థితులు రావచ్చు, భద్రతాపరమైన సమస్యలు ఉండవచ్చు....ఒకటి, రెండు అని కాదు....సవాలక్ష సమస్యలు ఎదురైనా మహిళా శ్రామిక శక్తి వెనక్కి తగ్గడం లేదు.ఎందుకంటే వారు...చరిత్ర వింటూ వచ్చారు. మరో చరిత్ర నిర్మించాలనుకుంటున్నారు. ఇదీ చదవండి: Red rice పేరుకు తగ్గట్టే వారికి వారం.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో.!
ఇజ్రాయెల్‌లో భీకర కార్చిచ్చు.. జెరూసలెంను కమ్మేసిన పొగ
పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా!
గెలుపు జోష్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు షాక్!
పిల్లలకు చెప్పాల్సిన 'మాయాబజార్' పాఠాలు..!
శరీరానికి కావాల్సిన పోషకాలు ఇవే..! వయసుల వారీగా డైట్ ఎలా ఉండాలంటే..?
శర్వానంద్ కొత్త సినిమా.. 20 ఎకరాల్లో భారీ సెట్
అరెస్ట్ చేసిన బాలుడు ఎక్కడ?
సన్నీ థామస్ కన్నుమూత.. అభినవ్ బింద్రా భావోద్వేగం
థాయ్‌లాండ్‌లో హ్యాండ్లర్!
Hyderabad: నగరంలో 144 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ
ఇజ్రాయెల్‌లో భీకర కార్చిచ్చు.. జెరూసలెంను కమ్మేసిన పొగ
పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా!
గెలుపు జోష్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు షాక్!
పిల్లలకు చెప్పాల్సిన 'మాయాబజార్' పాఠాలు..!
శరీరానికి కావాల్సిన పోషకాలు ఇవే..! వయసుల వారీగా డైట్ ఎలా ఉండాలంటే..?
శర్వానంద్ కొత్త సినిమా.. 20 ఎకరాల్లో భారీ సెట్
అరెస్ట్ చేసిన బాలుడు ఎక్కడ?
సన్నీ థామస్ కన్నుమూత.. అభినవ్ బింద్రా భావోద్వేగం
థాయ్‌లాండ్‌లో హ్యాండ్లర్!
Hyderabad: నగరంలో 144 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ
సినిమా

పెళ్లి రోజు గుర్తు చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ.. బిందు మాధవి నేచురల్ లుక్!
గ్రీన్ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ హోయలు..పెళ్లి రోజును గుర్తు చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ ప్రేరణ..ఐపీఎల్ క్రికెట్ స్టేడియంలో చాహల్ ప్రియురాలు ఆర్జే మహ్వశ్ సందడి..హీరోయిన్ బిందు మాధవి లేటేస్ట్ లుక్.. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by प्रेrana kambam (@prerana.kambam) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah)

OTT: రాధికా ఆప్టే బోల్డ్ మూవీ ‘ది వెడ్డింగ్ గెస్ట్’ రివ్యూ
రాధికా ఆప్టే.. అందం, నటనతో ఆకట్టుకునే నటి. తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో తన ప్రతిభను చాటుతూ, 'ది వెడ్డింగ్ గెస్ట్' సినిమాతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా 2019లో విడుదలైంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. ఫ్రెండ్ కోసం పెళ్లికూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చే హీరోలు తెలుగు తెర మీద చాలా మందినే చూశాం. ఈ సినిమాలో హీరో మాత్రం పెళ్లికూతురిని కిడ్నాప్ చేసేది ఫ్రెండ్ కోసం కాదు డబ్బు కోసం. జై (దేవ్ పటేల్) అనే లండన్ వాసి పాకిస్తాన్ లోని లాహోర్ సమీపంలో ఉన్న యోంగానాబాద్ అనే గ్రామానికి చేరుకుంటాడు. అంతకు ముందే తనను ఎవరూ గుర్తించకుండా, సిమ్ కార్డులు, కార్లు మార్చుకుంటూ అక్కడ దాకా వస్తాడు. ఆ తర్వాత రెండు గన్స్ ను కొనుగోలు చేస్తాడు. ఆ గ్రామానికి వచ్చాక పెళ్లికి రెడీ అవుతున్న సమీరా (రాధికా ఆప్టే) అనే యువతిని కిడ్నాప్ చేస్తాడు. ఆ క్రమంలో అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డ్ని హత్య చేయాల్సి వస్తుంది. ఆమెను దేశం దాటించి తీసుకువెళ్లడానికి ముందు...ఆమె ప్రేమికుడు దీపేశ్ (జిమ్ సర్భ్) తనతో కాంట్రాక్ట్ కుదుర్చుకుని ఈ పనిచేయించాడనే విషయం జై బయటపెడతాడు.ఆ తర్వాత ఇద్దరూ కలిసి మారుపేర్లతో , దొంగ పాస్‌పోర్ట్‌లతో ఇండియాకు వస్తారు. అయితే సెక్యూరిటీ గార్డ్ హత్య కారణంగా ఈ కిడ్నాప్ రెండు దేశాల మీడియాలో వైరల్ అవుతుంది, దాంతో సమీరా ప్రేమికుడు దీపేశ్ భయపడతాడు, సమీరాను తిరిగి పాకిస్తాన్ కు పంపేయమని దేవ్‌ని కోరతాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల పాటు సన్నిహితంగా గడిపిన జై, సమీరా మధ్య అనుబంధం పెరుగుతుంది. ముఖ్యంగా సమీరా అతనిపై మోజుపడుతుంది. వారిద్దరూ శారీరకంగా ఒకటవుతారు. అదే సమయంలో దీపేశ్ దగ్గర ఖరీదైన వజ్రాలు ఉన్నాయని తెలుసుకున్న జై, వాటిని పొందేందుకు ప్రయత్నిస్తాడు. రకరకాల మలుపుల మధ్య సాగే ఈ లవ్–క్రైమ్–రొమాంటిక్ కథ చివరికి ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా ఉంటుంది.జై పాత్రలో మిస్టీరియస్ ప్రొఫెషనల్ కిల్లర్‌గా జై పూర్తి గా మెప్పిస్తాడు. బోల్డ్ సీన్లకు పెట్టింది పేరైన రాధికా ఆప్టే(తెలుగులో లెజెండ్‌లో బాలకృష్ణ సరసన హీరోయిన్) ఈ సినిమా హాలీవుడ్ రూపకర్తల సమర్పణలో రావడంతో...పూర్తి స్థాయి హాలీవుడ్ హీరోయిన్లా రెచ్చిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇంటిమేట్ సీన్లలో ఆమె దాదాపు పూర్తి న్యూడ్‌గా కనిపించడం విశేషం.హాలీవుడ్ చిత్రం చేసినప్పటికీ మన ఇండియన్ హీరోయిన్లు మరెవ్వరూ ఈ స్థాయిలో బోల్డ్ సీన్స్ చేసి ఉండరు... సమీరా పాత్ర భావోద్వేగాలను కూడా బాగా ప్రదర్శించింది. ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ మరో ఆకర్షణ. పాకిస్తాన్, ఇండియా మధ్య ప్రయాణం, మారుమూల ప్రాంతాల చిత్రీకరణ బాగా చూపించారు. సంగీత పరంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్ మూమెంట్లను ఎలివేట్ చేస్తుంది. అక్కడక్కడా సాగదీసినట్టు అనిపించినా.. ఆ ఫీలింగ్ ముదరకముందే ఆసక్తికరమైన మలుపులు పేర్చుకుంటూ రావడం వల్ల ఎక్కడా బోర్ కొట్టదు. ఐఎమ్‌డిబి 6.0 రేటింగ్ ఇచ్చిన ఈ సినిమా ఓ కాలక్షేపం యాక్షన్, థ్రిల్లర్, లవ్, రొమాంటిక్ సీన్లను ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చుతుంది. చూడాలనుకున్నవారు నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.

ముమైత్ బ్రెయిన్లో ఏడు వైర్లు.. షూ లేస్ కట్టుకున్నా ప్రమాదమే!
'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..' పాటతో ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసింది ముమైత్ ఖాన్ (Mumaith Khan).. ఐటం సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ బ్యూటీ తర్వాత సడన్‌గా వెండితెరకు దూరమైంది. బిగ్‌బాస్ షోలో పాల్గొని మళ్లీ మాయమైపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో విలైక్ అనే అకాడమీని స్థాపించింది. దీని ద్వారా మేకప్‌కు సంబంధించిన కోర్సులను నేర్పిస్తోంది. తాజాగా ఆహాలో ప్రసారమవుతున్న కాకమ్మ కథలు గేమ్ షోలో పాల్గొంది. బ్యాంకాక్‌లో స్టంట్ షో..ఈ సందర్భంగా హోస్ట్ తేజస్వి మదివాడ మాట్లాడుతూ.. ముమైత్ ఎంత బాధ అనుభవించిందో నాకు తెలుసు. తన మెదడులో ఏడెనిమిది వైర్లున్నాయి అని పేర్కొంది. అందుకు ముమైత్ మాట్లాడుతూ.. షూ లేస్ కట్టుకోవడం కూడా ప్రమాదకరం అని డాక్టర్ చెప్పారు. అయినా నేను బ్యాంకాక్‌కు స్టంట్ షో చేయడానికి వచ్చాను. అప్పుడే నేను స్వప్నదత్‌కు చెప్పాను.. రేపు ఉదయం నేను లేవకపోతే నా పని అయిపోయినట్లే అని అర్థం చేసుకోమన్నాను. అంత దారుణంగా నా పరిస్థితి ఉండేది. నా హెల్త్ కండీషన్‌ను అర్థం చేసుకోవడానికి రెండేళ్లు పట్టింది అని ముమైత్ చెప్పుకొచ్చింది.ఇంతకీ ఏం జరిగిందంటే?ముమైత్ ఖాన్.. ఓ రోజు తన ఇంట్లోనే కాలు జారి కింద పడింది. ఆ సమయంలో తన తల.. మంచం అంచులకు బలంగా తగిలింది. పైకి ఎటువంటి గాయం కనిపించకపోవడంతో ఆస్పత్రికి వెళ్లలేదు. కానీ తల నొప్పి తీవ్రమవడంతో ఆస్పత్రికి వెళ్లింది. మూడు రోజులుగా ఆమెకు మెదడులో అంతర్గత రక్తస్రావం జరుగుతోందని డాక్టర్లు గుర్తించి ఆపరేషన్ చేశారు. దాదాపు 15 రోజులపాటు ముమైత్ కోమాలో ఉంది. ఆ తర్వాత ఆమె ఆ గాయం నుంచి కోలుకుంది.చదవండి: పిల్లలు పుట్టరని మధుబాలను వదిలేసిన స్టార్ హీరో.. చివరికేమైంది?

విజయ్ దేవరకొండ కింగ్డమ్.. ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్డమ్'. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించింది. ఈ టీజర్‌కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం టీజర్‌కు మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. కింగ్డమ్ ఫస్ట్ సింగిల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. నిమిషం పాటు ఉన్న ప్రోమోను సితార ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. హృదయం లోపల అంటూ సాగే రొమాంటిక్ ఫుల్ సాంగ్‌ను మే 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా వేసవిలో మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
న్యూస్ పాడ్‌కాస్ట్

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన... కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో అంతులేని అవినీతి, అంతా అరాచకమే... చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

ఏపీలో కేంద్ర సంస్థలకైతే కోట్లు.. ఉర్సా సంస్థకైతే ఊరకే!

పాక్ కాల్పుల పోరు.. బదులిచ్చిన భారత బలగాలు.

ఏపీ రాజధానిలో దోపిడీ ఐకానిక్.. 5 టవర్ల నిర్మాణ వ్యయం పెంపు

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు.. తీవ్రస్థాయికి ఉద్రిక్తతలు

పాకిస్తాన్‌కు భారత్ పంచ్. పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్. దౌత్య సంబంధాలకు కత్తెర. సింధూ ఒప్పందం సస్పెన్షన్. ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ

జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి... కాల్పులకు 26 మంది బలి, మరో 20 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ఇద్దరు విదేశీయులు

బాబోయ్ బంగారం. దేశంలో తొలిసారి లక్ష రూపాయల మార్కును దాటేసిన పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం
క్రీడలు

భారత బాక్సర్ల పసిడి పంచ్
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా జూనియర్ బాక్సింగ్ టోర్నమెంట్ అండర్–15 విభాగంలో భారత బాక్సర్లు ఏకంగా 25 పతకాలతో అదరగొట్టారు. ఇందులో 11 స్వర్ణాలు, మూడు రజతాలు, 11 కాంస్యాలు ఉన్నాయి. ఫలితంగా ఈ విభాగంలో భారత్ ఓవరాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. బాలికల విభాగంలో భారత బాక్సర్లు కోమల్ (33 కేజీలు), ఖుషీ (35 కేజీలు), తమన్నా (37 కేజీలు), సువీ (40 కేజీలు), మిల్కీ (43 కేజీలు), ప్రిన్సీ (52 కేజీలు), నవ్య (58 కేజీలు), సునైనా (61 కేజీలు), తృష్ణ (67 కేజీలు), వన్షిక (ప్లస్ 70 కేజీలు)... బాలుర విభాగంలో సంస్కార్ వినోద్ (35 కేజీలు) బంగారు పతకాలు గెల్చుకున్నారు. బాలుర విభాగంలో రుద్రాక్ష్ (46 కేజీలు), అభిజీత్ (61 కేజీలు), లక్షయ్ (64 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలు దక్కించుకున్నారు.

చెన్నై ఖేల్ ఖతం
సొంతగడ్డపై వరుసగా ఐదో మ్యాచ్‌లో పరాజయంతో ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. పేలవ ప్రదర్శనతో ఎనిమిదో ఓటమిని తమ ఖాతాలో వేసుకున్న ఐదుసార్లు చాంపియన్ మరో నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ రేసుకు దూరమైంది. మరోవైపు సమష్టి ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ కీలక విజయాన్ని నమోదు చేసింది. ముందుగా చహల్ ‘హ్యాట్రిక్’...బ్యాటింగ్‌లో శ్రేయస్, ప్రభ్‌సిమ్రన్ కలిసి జట్టును గెలిపించారు. చెన్నై: ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జోరు కొనసాగుతోంది. బుధవారం జరిగిన పోరులో పంజాబ్ 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. స్యామ్ కరన్ (47 బంతుల్లో 88; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, బ్రెవిస్ (26 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. యుజువేంద్ర చహల్ (4/32) ఒకే ఓవర్లో ‘హ్యాట్రిక్’ సహా నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు చేసి గెలిచింది. శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), ప్రభ్‌సిమ్రన్ (36 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు. ఒకే ఓవర్లో 26 పరుగులు... చెన్నైకి ఓపెనర్లు సరైన ఆరంభం ఇవ్వలేకపోయారు. ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్ (11) తనకు లభించిన మరో అరుదైన అవకాశాన్ని వృథా చేసుకోగా, ఆయుశ్ మాత్రే (7) విఫలమయ్యాడు. హర్‌ప్రీత్ ఓవర్లో జడేజా (17) మూడు ఫోర్లు కొట్టినా అదే ఓవర్లో వెనుదిరిగాడు. ఈ దశలో కరన్, బ్రెవిస్ భాగస్వామ్యంలో జట్టు నిలదొక్కుకుంది. కరన్ చెలరేగిపోగా, బ్రెవిస్ కొన్ని ఆకట్టుకునే షాట్లు ఆడాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 50 బంతుల్లో 78 పరుగులు జోడించారు. 15 ఓవర్లలో జట్టు స్కోరు 134/4. సూర్యాంశ్ షెడ్గే వేసిన తర్వాతి ఓవర్లో కరన్ చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో కరన్ వరుసగా 6, 6, 2 (నోబాల్), 2, 4, 4, 1 బాదడంతో మొత్తం 26 పరుగులు రావడం విశేషం. ఈ జోరులో కరన్ సెంచరీ, సీఎస్కే 200 దాటడం ఖాయంగా అనిపించాయి. అయితే చివరకు ఈ రెండూ జరగలేదు. యాన్సెన్ బౌలింగ్‌లో కరన్ అవుట్ కాగా...చహల్ వేసిన 19వ ఓవర్‌తో అంతా మారిపోయింది. 11 బంతుల వ్యవధిలో చెన్నై 6 వికెట్లు కోల్పోయింది. కీలక భాగస్వామ్యాలు... పంజాబ్ ఇన్నింగ్స్ మెరుగ్గా మొదలైంది. ప్రియాన్ష్ ఆర్య (15 బంతుల్లో 23; 5 ఫోర్లు), ప్రభ్‌సిమ్రన్ చక్కటి షాట్లతో 28 బంతుల్లో 44 పరుగులు జోడించారు. తొలి 6 ఓవర్లలో స్కోరు 51 పరుగులకు చేరింది. ప్రభ్‌సిమ్రన్, శ్రేయస్ రెండో వికెట్‌కు 50 బంతుల్లో 72 పరుగులు జత చేశారు. నూర్ ఈ జోడీని విడదీయగా, వధేరా (5) విఫలమయ్యాడు. మరోవైపు కరన్ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో శ్రేయస్ 32 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ప్రభ్‌సిమ్రన్ వెనుదిరిగినా...శశాంక్ (23; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో కలిసి శ్రేయస్ జట్టును గెలుపు దిశగా నడిపించాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రషీద్ (సి) శశాంక్ (బి) అర్ష్ దీప్ 11; ఆయుశ్ (సి) శ్రేయస్ (బి) యాన్సెన్ 7; స్యామ్ కరన్ (సి) ఇన్‌గ్లిస్ (బి) యాన్సెన్ 88; జడేజా (సి) ఇన్‌గ్లిస్ (బి) హర్‌ప్రీత్ 17; బ్రెవిస్ (బి) అజ్మతుల్లా 32; శివమ్ దూబే (సి) శశాంక్ (బి) అర్ష్ దీప్ 6; ధోని (సి) వధేరా (బి) చహల్ 11; హుడా (సి) ఆర్య (బి) చహల్ 2; కంబోజ్ (బి) చహల్ 0; నూర్ (సి) యాన్సెన్ (బి) చహల్ 0; ఖలీల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్) 190. వికెట్ల పతనం: 1–21, 2–22, 3–48, 4–126, 5–172, 6–184, 7–186, 8–186, 9–186, 10–190. బౌలింగ్: అర్ష్ దీప్ 3.2–0–25–2, యాన్సెన్ 4–0– 30–2, అజ్మతుల్లా 4–0–39–1, హర్‌ప్రీత్ 2–0– 21–1, చహల్ 3–0–32–4, సూర్యాంశ్ 3–0– 40–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) ధోని (బి) అహ్మద్ 23; ప్రభ్‌సిమ్రన్ (సి) బ్రెవిస్ (బి) నూర్ 54; శ్రేయస్ (బి) పతిరణ 72; వధేరా (సి) జడేజా (బి) పతిరణ 5; శశాంక్ (సి) బ్రెవిస్ (బి) జడేజా 23; ఇన్‌గ్లిస్ (నాటౌట్) 6; సూర్యాంశ్ (సి) నూర్ (బి) అహ్మద్ 1; యాన్సెన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 194. వికెట్ల పతనం: 1–44, 2–116, 3–136, 4–180, 5–188, 6–190. బౌలింగ్: ఖలీల్ 3.4–0–28–2, కంబోజ్ 2–0–20–0, జడేజా 3–0–32–1, నూర్ 4–0–39–1, స్యామ్ కరన్ 3–0–27–0, పతిరణ 4–0–45–2. చహల్ ‘హ్యాట్రిక్’ యుజువేంద్ర చహల్ తన తొలి 2 ఓవర్లలో 23 పరుగులిచ్చాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసే అవకాశం దక్కింది. వైడ్‌తో ఓవర్ మొదలు పెట్టగా తొలి బంతిని ధోని (11) సిక్సర్‌గా మలిచాడు. అయితే తర్వాతి బంతికే ధోని వెనుదిరగ్గా, మూడో బంతికి హుడా 2 పరుగులు తీశాడు. ఓవర్ చివరి మూడు బంతుల్లో వరుసగా హుడా (2), కంబోజ్ (0), నూర్ (0)లను చహల్ అవుట్ చేశాడు. ‘హ్యాట్రిక్’ పూర్తి కాగానే తనపై ఎన్నో మీమ్‌లకు కారణమైన ట్రేడ్ మార్క్ పొజిషన్లో కూర్చొని అతను సంబరాలు చేసుకున్నాడు. ఐపీఎల్లో చహల్ ‘హ్యాట్రిక్’ తీయడం ఇది రెండోసారి. 2022 సీజన్లో రాజస్తాన్ తరఫున ఆడుతూ కోల్‌కతాపై అతను హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఐపీఎల్లో ఒకటికంటే ఎక్కువసార్లు హ్యాట్రిక్ తీసిన మూడో ఆటగాడిగా అతను నిలిచాడు. గతంలో అమిత్ మిశ్రా 3 సార్లు, యువరాజ్ 2 సార్లు హ్యాట్రిక్ సాధించారు. ఐపీఎల్లో నేడురాజస్తాన్ X ముంబై వేదిక: జైపూర్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి సీఎస్కే ఔట్
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి చెన్నై నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది.సీఎస్కే బ్యాటర్లలో సామ్ కుర్రాన్(88) అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు బ్రెవిస్(32) పరుగులతో రాణించాడు. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో చాహల్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. చాహల్‌తో పాటు అర్ష్‌దీప్, జాన్సెన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్..అనంతరం 191 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలో చేధించింది. పంజాబ్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 72 పరుగులు చేశాడు. అతడితో పాటు ప్రభ్సిమ్రాన్ సింగ్(54) హాఫ్ సెంచరీతో మెరిశాడు. సీఎస్కే బౌలర్లలో పతిరానా రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్,ఖాలీల్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన చాహల్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా

చరిత్ర సృష్టించిన చాహల్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. తన బౌలింగ్ కోటాలో తొలి రెండు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న చాహల్‌ను పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగి 19వ ఓవర్ వేసేందుకు ఎటాక్‌లో తీసుకొచ్చాడు. ఓ ఓవర్లో చాహల్ అద్బుతం చేశాడు. తొలి బంతిని సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని సిక్సర్‌గా మలచగా.. అనంతరం రెండో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన హుడా మూడో బంతికి రెండు పరుగులు తీశాడు. ఇక్కడ నుంచి చాహల్ మ్యాజిక్ మొదలైంది. నాలుగో బంతికి దీపక్ హుడా ఔట్ కాగా.. ఐదో బంతికి కాంబోజ్, ఆరో బంతికి నూర్ ఆహ్మద్ ఔటయ్యాడు. దీంతో చాహల్ ఖాతాలో రెండో ఐపీఎల్ హ్యాట్రిక్ వచ్చి చేరింది. ఓవరాల్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన చాహల్..32 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో చాహల్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.చాహల్ సాధించిన రికార్డులు ఇవే..👉ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ తరపున హ్యాట్రిక్ వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా చాహల్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, అక్షర్ పటేల్, సామ్ కుర్రాన్ ఉన్నారు.👉ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా చాహల్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఏ బౌలర్‌గా కూడా ఈ ఫీట్ సాధించలేకపోయాడు.👉ఐపీఎల్లో అత్యధిక సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసిన బౌలర్‌గా యువరాజ్ సింగ్ రికార్డును చాహల్ సమం చేశాడు. యువీ, చాహల్ రెండు సార్లు హ్యాట్రిక్ సాధించాడు. ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో అమిత్ మిశ్రా(3) తొలి స్ధానంలో ఉన్నాడు.👉అదేవిధంగా ఐపీఎల్లో అత్యధిక సార్లు 4 వికెట్ల హాల్ సాధించిన బౌలర్‌గా చాహల్ నిలిచాడు. చాహల్ ఇప్పటివరకు 9 సార్లు నాలుగుకు పైగా వికెట్లు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు సునీల్ నరైన్(8) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో నరైన్ రికార్డును చాహల్ బ్రేక్ చేశాడు.చదవండి: #Glenn Maxwell: ఐపీఎల్-2025 నుంచి మాక్స్వెల్ ఔట్..
బిజినెస్

హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి బిస్కెట్ ఫ్యాక్టరీ
ప్రముఖ వ్యాపార సమ్మేళనం లోహియా గ్రూప్ హైదరాబాద్ శివారు మేడ్చల్ లో బిస్కెట్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇందుకోసం వచ్చే నాలుగేళ్లలో రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు, 6,000 ఉద్యోగాలు కల్పించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఏడు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కొత్త హైస్పీడ్ ఆటోమేటెడ్ ఫెసిలిటీ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 1,000 టన్నులు కాగా దీన్ని 5,000 టన్నులకు పెంచుకునే వీలుందని సంస్థ వెల్లడించింది. బిస్కెట్ల ఉత్పత్తికి కావాల్సిన పిండి, చక్కెర, బెల్లం, తేనె, పాల ఉత్పత్తులు, ఇతర సహజ పదార్ధాలను స్థానికంగా సేకరించనున్నారు. ఉత్పాదక రంగంలో మహిళల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన 'ఉమెన్ ఫస్ట్ ఎంప్లాయిమెంట్ డ్రైవ్'కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం 40 శాతానికి పైగా సిబ్బంది మహిళలేనని కంపెనీ తెలిపింది.బిస్కెట్ల తయారీ ప్రక్రియ వెనుక అధిక నాణ్యత పదార్థాలు, సంక్లిష్టమైన డిజైన్లు, అధునాతన బయోటెక్నాలజీ ఉన్నాయని లోహియా కన్ఫెక్షనరీ మేనేజింగ్ డైరెక్టర్ మనీషా లోహియా లహోటి తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్ గఢ్ లలో కార్యకలాపాలను ఏర్పాటు చేసిన ఈ సంస్థ త్వరంలో ఎగుమతులను ప్రారంభించాలని యోచిస్తోంది.

ఏటీఎం కొత్త ఛార్జీలు.. రేపటి నుంచే..
ఏటీఎం లావాదేవీలు మరింత భారం కానున్నాయి. ఏటీఎం విత్‌డ్రావల్ కొత్త ఛార్జీలు మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఉచిత పరిమితిని మించి చేసే ఏటీఎం లావాదేవాలపై ఛార్జీల పెంపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది. ఈ రుసుములో ఏటీఎం కొనుగోలు, నిర్వహణ, ఇతర బ్యాంకుల కస్టమర్లకు సేవలను అందించడానికి అయ్యే ఖర్చు కూడా ఉంటుంది.సవరించిన ఏటీఎం ఛార్జీలు ఇవే..మే 1 నుండి అమల్లోకి వస్తున్న కొత్త నిబంధనల ప్రకారం, వినియోగదారులు తమ ఉచిత ఉపసంహరణ పరిమితిని దాటిన తర్వాత ప్రతి లావాదేవీకి రూ.2 అదనంగా రూ .23 చెల్లించాల్సి ఉంటుంది. ఇది గతంలో రూ .21 ఉండేది. దీన్ని 2022 నుంచి అమలు చేస్తున్నారు.ఉచిత లావాదేవీలుఏటీఎం ఛార్జీల పెంపు ఉన్నప్పటికీ ఉచిత లావాదేవీ పరిమితుల్లో ఎలాంటి మార్పులు లేవు. సొంత బ్యాంకు ఏటీఎంలలో నెలకు 5 ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఉచితంగా చేసుకోవచ్చు. ఇక ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయానికి వస్తే.. మెట్రో గరాల్లో అయితే 3 లావాదేవీలు, నాన్ మెట్రో నగరాల్లో 5 లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సిఫారసుల మేరకు ఆర్బీఐ సవరణలో భాగంగా ఏటీఎం ఫీజులను పెంచింది. నిర్వహణ ఖర్చులు పెరుగుతుండటంతో వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు, బ్యాంకులు ఈ పెంపునకు మొగ్గుచూపుతున్నాయి.చిన్న బ్యాంకులపై ప్రభావంలావాదేవీ రుసుముల పెరుగుదల చిన్న బ్యాంకుల కస్టమర్లపై ఎక్కువ ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే వాటికి తక్కువ సంఖ్యలో ఏటీఎంలు ఉన్నాయి. దీంతో ఆయా బ్యాంకుల ఖాతాదారులు నగదు ఉపసంహరణ కోసం పెద్ద బ్యాంకుల ఏటీఎంలపై ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి కస్టమర్లు అధిక ఛార్జీలను భరించాల్సి ఉంటుంది.

దాదాపు లక్ష.. కార్ల విక్రయాల రికార్డ్
ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ మోటార్ ఇండియా 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక వార్షిక విక్రయాలను నమోదు చేసింది. 99,000 యూనిట్లకు పైగా విక్రయించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి ఏడేళ్లలో కంపెనీకి ఇవే అత్యధిక వార్షిక విక్రయాలు. న్యూ నిస్సాన్ మాగ్నైట్ బీ-ఎస్యూవీ బలమైన పనితీరుతో 35 శాతం వృద్ధిని సాధించింది.దేశీయంగా 28,000 యూనిట్లు, ఎగుమతుల్లో 71,000 యూనిట్లతో, నిస్సాన్ తన “ఒక కారు, ఒక ప్రపంచం” విధానంతో 65కు పైగా అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించింది. 2024 అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన న్యూ మాగ్నైట్ 1.5 లక్షల విక్రయాలు, 50,000 ఎగుమతి యూనిట్లను దాటింది. సౌదీ అరేబియాలో తొలి ఎల్‌హెచ్‌డీ మార్కెట్‌గా అడుగుపెట్టింది.నిస్సాన్ 25 ఆర్థిక సంవత్సరంలో 7-సీటర్ బీ-ఎంపీవీ, 26 ఆర్థిక సంవత్సరంలో 5-సీటర్ సీ-ఎస్‌యూవీని ప్రవేశపెట్టనుంది. గ్లోబల్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా చెన్నై జేవీ ప్లాంట్‌లో వాటాను అలయన్స్ భాగస్వామికి అప్పగించినప్పటికీ, భారత్‌లో నిస్సాన్ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. భారత్‌లో వృద్ధి స్థిరంగా ఉందని, భవిష్యత్ ఉత్పత్తుల పైప్‌లైన్ అలాగే ఉంటుందని నిస్సాన్ ఇండియా అధ్యక్షుడు ఫ్రాంక్ టోరెస్ తెలిపారు.

మెటా ఏఐ యాప్ వచ్చేసింది..
కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలను అందుబాటులోకి తీసుకురావడంలో టెక్ దిగ్గజాల మధ్య పోటీ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌ల యాజమాన్య సంస్థ మెటా తన ఏఐ సాధనానికి ఎట్టకేలకు మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. టెక్స్ట్ సంభాషణలు, వాయిస్ చాట్స్, ఇమేజ్ ఎడిటింగ్ వంటి ఫీచర్లను అందించే అధునాతన లామా 4 మోడల్‌తో నడిచే ఈ యాప్ ఆండ్రాయిడ్, యాపిల్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.ప్రత్యేక ఫీచర్మెటా ఏఐ యాప్ ఒక ప్రత్యేకమైన డిస్కవర్ ఫీడ్‌ను పరిచయం చేసింది. అదే ఏఐతో యూజర్ల ఇంటరాక్షన్‌ను ప్రదర్శించే సోషల్ మీడియా-ప్రేరేపిత ఇంటర్ఫేస్. ఇది ఏఐ యాప్ ల్యాండ్ స్కేప్‌లో మొదటిది. సృజనాత్మక కంటెంట్‌ను సృష్టించడం నుండి సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, కమ్యూనిటీ-ఆధారిత అనుభవాన్ని పెంపొందించడం వరకు ఇతరులు మెటా ఏఐని ఎలా ఉపయోగిస్తున్నారో ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు. కేవలం టెక్ట్స్ మాత్రమే కాకుండా ఇమేజ్‌లను సైతం సృజనాత్మకంగా ఇందులో సృష్టించవచ్చు.వాయిస్ చాట్ కోసం ఎదురుచూపులే..ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయినప్పటికీ బాగా ప్రాచుర్యం పొందిన వాయిస్ చాట్ ఫీచర్ మాత్రం భారత్‌లోని యూజర్లకు అందుబాటులో లేదు. ఇది ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ యునైటెడ్ స్టేట్స్లో మాత్రమే అందుబాటులో ఉంది. భారత్‌తోపాటు యూఏఈ, మెక్సికో వంటి ఇతర ఈ మార్కెట్లకు వాయిస్ చాట్ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి తెచ్చేది కంపెనీ వెల్లడించలేదు.భారత్ త్వరలో రే-బాన్ మెటా గ్లాసెస్‌ను పరిచయం చేస్తున్న క్రమంలో మెటా ఈ యాప్‌ను లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. మెటా ఏఐ యాప్‌తో అనుసంధానించే ఈ స్మార్ట్ గ్లాసెస్, నావిగేషన్ నుండి రియల్ టైమ్ అనువాదాల వరకు వినియోగదారుల దైనందిన జీవితంలో ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయాన్ని అందిస్తాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ మార్కెట్లో మెటా ఏఐ యాప్‌ను పోటీ చర్యగా పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఫ్యామిలీ

అక్షయ తృతీయ.. దయచేసి ఇలా చేయండి : గాయని చిన్మయి
అక్షయ తీజ్ లేదా పరశురామ జయంతి అని కూడా పిలిచే అక్షయ తృతీయ (Akshaya tritiya 2025) అనేది వైశాఖ మాసం చివర్లొ శుక్ల పక్ష తదియ నాడు జరుపుకునే వసంత పండుగ. అక్షయ అంటే శ్రేయస్సు, నాశనం లేనిది ఆశ, విజయంతో పాటు ఆనందం పరంగా శాశ్వతత్వం ,తృతీయ అంటే చంద్రుని మూడవ దశ.ఈ రోజు ద్రౌపది, కృష్ణుడు , అక్షయ పాత్రకు సంబంధించిన పురాణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ ప్రముఖ గాయని చిన్మయి (Chinmayi Sripada) ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టింది.అక్షయ తృతీయ అంటే దానం, ధర్మం చేయాల్సిన రోజని గుర్తు చేసింది.ద్రౌపది అక్షయ పాత్ర విశేషం తరువాత అక్షయ తృతీయను ఆచరణలోకి వచ్చిందని పేర్కొంది. ఈ రోజు ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం, పేదలకు ఒక్క రూపాయి అయినా దానం ఇవ్వాలని సూచించింది. మనుషులు, జంతువులు, మొక్కలు, పక్షులకు కాసింత ఆహారాన్ని పెట్టండి. ఈ దానమే ఇక చాలు అనే తృప్తి నిస్తుంది అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada)ద్రౌపది అక్షయ పాత్రకథద్రౌపది, రాజకుమారులైన పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు, సూర్యుడు తన తపస్సు ఫలితంగా పాండవులలో పెద్దవాడైన యుధిష్టురుడికి అక్షయ పత్రం ప్రసాదించాడు. పాండవ అగ్రజుడు ధర్మరాజు ద్రౌపద్యాదిత్యుడినే ఉపాసించి ఆ స్వామి నుంచి 'అక్షయ పాత్ర' వరంగా పొందినట్టు స్కాందపురాణంలోని 'కాశీఖండం' ద్వారా మనకు తెలుస్తోంది. అలాగే పాండవులు వనవాస కాలంలో కృష్ణుడి నుండి అక్షయ పాత్రను పొందారు. ఇది ఒక మాయా పాత్ర, ఇది ఎల్లప్పుడూ వారికి ఆహారాన్ని అందించేది. ఆ అక్షయ పాత్ర ద్రౌపది భోజనం చేసే వరకు ఎల్లప్పుడూ ఆహారం ఉంటుంది , ఆ తరువాత తలక్రిందులుగా ఉంచుతుంది. అంటే అప్పటికి ఆహారం అయిపోతుంది. ఒకసారి కోపానికి, శాపానికి పేరుగాంచిన దుర్వాస ముని తన వేలాది మంది శిష్యులతో కలిసి పాండవుల ఇంటికి భోజనానికి వచ్చాడు. కానీ అప్పటికి ఆహారం అంతా అయిపోయింది . తినడానికి ఏమీ లేదు. బ్రాహ్మణులు వచ్చినప్పుడు పాత్ర ఖాళీగా ఉండటంతో ద్రౌపది శ్రీకృష్ణుడి సహాయం కోసం ప్రార్థించింది.అలా శ్రీకృష్ణుడికి అనుగ్రహంతో బ్రాహ్మణులందరూ స్వయంచాలకంగా పూర్తిగా సంతృప్తి చెందడంతో, దూర్వాసుడి శాపం నుంచి తప్పించుకుంటుంది ద్రౌపది. ద్రౌపదిని కృష్ణుడు దుశ్శాసనుని బారి నుండి కాపాడాడిన రోజే అక్షయ తృతీయ అని పురాణాల ద్వారా తెలుస్తోంది.ఇదీ చదవండి: Akshaya Tritiya 2025 పదేళ్లలో పసిడి పరుగు, కొందామా? వద్దా?అక్షయ తృతీయ రోజును విష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడు ఆవిర్భవించిన రోజుగా కూడా పరిగణిస్తారు. అందుకే ఈ రోజును కొన్నిసార్లు ప్రశురామ జయంతి అని కూడా పిలుస్తారు. మరొక పురాణం ప్రకారం, వేద వ్యాసుడు గణేశుడికి మహాభారతం పారాయణం చేయడం ప్రారంభించిన రోజు ఇదేనని నమ్ముతారు. అక్షయ తృతీయ ప్రాముఖ్యత:అక్షయ తృతీయ రోజున ఏదైనా శుభకార్యం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అక్షయ తృతీయ రోజున దానం చేయడం వల్ల అక్షయమైన పుణ్యం లభిస్తుంది. విష్ణుమూర్తి పాదాలకు అక్షతలతో అర్చించి, ఆ అక్షతలను దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని విశ్వసిస్తారు. అక్షయ తృతీయను స్వయంసిద్ధ ముహూర్తంగా పరిగణిస్తారు. అంటే ఈ రోజున ఎలాంటి ముహూర్తం చూడాల్సిన అవసరం లేదు, ఏ పని మొదలుపెట్టినా మంచి ఫలితాలుంటాయని, . ఈ రోజున దానం, ధర్మం, పుణ్యకార్యాలు చేయడం వల్ల అక్షయమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం.

జపాన్ కళతో శ్రీ వేంకటేశ్వర స్వామి రూపం..!
ఒరిగామిపై 1988లో ఆసక్తి పెంచుకున్న రవి కుమార్ విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించేలా ఈ కళ ఉపకరిస్తుందని గుర్తించారు. ‘ఒరిగామి ద్వారా గణితం – రవికుమార్ తోలేటి’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. కోవిడ్ సమయంలో విద్యార్థుల కోసం డీఐవై మోడల్స్ వీడియోలుగా అందించడంతో పాటు, శాస్త్రవేత్తల స్థాయిలో ప్రాజెక్టులు రూపొందించేందుకు ప్రేరణనిచ్చారు. పలు అవార్డులు.. గతంలో రవి కుమార్‌కు ఎన్సీఈఆర్టీ ఇన్నోవేషన్ అవార్డు (2002), రాష్ట్రపతి పురస్కారంగా ‘నేషనల్ టీచర్స్ అవార్డు’ (2005), కేవీఎస్ నేషనల్ ఇన్నోవేషన్ అవార్డులు (2012, 2019) లభించాయి. అలాగే 2022లో ప్రపంచంలో అతి పెద్ద ఒరిగామి నెమలిని రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. నాలుగేళ్లు పట్టింది.. ఒరిగామి కళతో ఈ చిత్రపటాన్ని రూపొందించడానికి సుమారు నాలుగేళ్ల సమయం పట్టింది. ఉపాధ్యాయుడిగా విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ఒరిగామిని వినియోగిస్తున్నా. ఇది ప్రాచీన జపాన్ కళ కాగా, ప్రస్తుతం పలు రంగాల్లో విస్తరిస్తోంది. ఇది కేవలం కళ కాదు, సృజనాత్మకత, ఆవిష్కరణల సమ్మేళనం. – రవి కుమార్ తోలేటి, ఒరిగామి కళాకారుడు (చదవండి: కొవ్వొత్తులతో పీస్ వాక్..! తీవ్రవాద నిర్మూలన, శాంతి స్థాపనకు..)

కిచెన్ నైఫ్ పదును పోయిందా...!
అప్పుడప్పుడు వంటగది చాకులు పదును లేకుండా కూరగాయలు కోయడానికి విసిగిస్తూ ఉంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు చిన్న చిట్కాలున్నాయి.పదును పెట్టే రాయి.. పదును పెట్టే రాయిని ఒక్కసారి కొనేసుకుంటే అది ఎప్పటికీ పనిచేస్తుంది. కత్తులు, చాకులు ఇలా వేటినైనా ఈజీగా పదును పెట్టచ్చు. మనీ సేవ్ చేయడమే కాదు. సమయం కూడా వృథా కాదు.నైఫ్ షార్ప్‌నర్.. ఎలక్ట్రిక్, మాన్యువల్ కత్తి షార్ప్నర్లు సౌకర్యవంతంగా ఉంటాయి. మరీ ఎక్కువ పదును లేకుండా చూసుకుంటూ పదును పెట్టాలి.చాకుల్ని పొడిగా ఉంచాలి.. తేమ తుప్పు పట్టేలా చేస్తుంది. కూరగాయలు కోయడం అయి΄ోయాకా కత్తుల్ని కాగితం, తువ్వాళ్లలో కట్టి ఆరనీయాలి.చాపింగ్ బోర్ట్.. గాజు, గ్రానైట్ లేదా సిరామిక్ ప్లేట్లలో కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను కట్ చేయడం వల్ల చాకులు ఇట్టే పదును పోతాయి. ఈ పదును ఎక్కువ కాలం ఉండాలంటే చెక్క వస్తువు మీదనే కట్ చేసేలా చూడాలి.కటింగ్ టెక్నిక్.. చాకు మీద ఒత్తిడి తగ్గించి సరైన కటింగ్ మెథడ్స్ పాటిస్తూ కట్ చేయడం వల్ల పదును తగ్గే అవకాశాలు తక్కువగా ఉంటాయి. (చదవండి: 'రోబోటిక్ కేక్'..! శాస్త్రవేత్తలు, పేస్ట్రీ చెఫ్‌ల పాక నైపుణ్యం)

పర్యావరణ హిత: ఈ చిత్రాన్ని మీకు సమర్పిస్తున్న వారు...
కోల్‌కత్తాకు చెందిన అశ్వికాకపూర్ బీబీసి నేచురల్ హిస్టరీ యూనిట్ డైరెక్టర్. పశ్చిమబెంగాల్ అడవుల్లో ‘వణ్య్రప్రాణుల వేట’ పేరుతో ఉత్సవాలు చేస్తారు, ఇందులో పిల్లలు కూడా పాల్గొంటారు. దీనిపై ఆమె ‘క్యాటపల్ట్స్ టు కెమెరాస్’ చిత్రాన్ని తీసింది. ఈ చిత్రం న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ స్ఫూర్తిదాయక చిత్రంగా అవార్డు గెలుచుకుంది.అశ్వికాలాంటి ఎంతోమంది మహిళా దర్శకుల విజయానికి ‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్’ దారి చూపింది.‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్ ద్వారా వణ్య్రప్రాణుల గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకునే అవకాశం వచ్చింది. ఎప్పుడూ వినని అరుదైన జీవులు గురించి కూడా తెలుసుకున్నాను. వైల్డ్‌లైఫ్ ఫిల్మ్‌మేకర్‌గా ఇది నాకు ఎంతో ఉపయోగపడుతుంది’ అంటుంది అశ్వికాకపూర్. ‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్’ సంస్థను సియాటెల్‌కు చెందిన పారిశ్రామికవేత్త, దాత గుర్ప్రీత్ సన్నీసింగ్ స్థాపించారు. వణ్య్రప్రాణులపై విలువైన కథలు వెండితెరపై చెప్పడానికి వీలుగా ఇది మహిళా కథకులకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది.‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్ ఫిల్మ్స్ దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఫిల్మ్‌మేకర్స్‌తో కలిసి పనిచేస్తోంది. ఫండింగ్ నుంచి దర్శకులకు మార్గనిర్దేశం చేయడం వరకు రౌండ్‌గ్లాస్ సస్టెయిన్ ఎన్నో చేస్తుంది’ అంటుంది రౌండ్‌గ్లాస్ సస్టెయిన్ ఫిల్మ్స్’ క్రియేటివ్ డైరెక్టర్, ఫిల్మ్‌మేకర్ సమ్రీన్ ఫారూఖీ. ‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్’ నిర్మాణ సంస్థ తన వెబ్సైట్ ద్వారా సినిమాలను విడుదల చేస్తుంది. సినిమాలను ప్రమోట్ చేయడానికి టీమ్ విస్తృతంగా మార్కెటింగ్ కూడా చేస్తుంది. దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఆన్లైన్ స్క్రీనింగ్‌లు నిర్వహిస్తారు.‘విస్మరించబడిన కథలను వెలుగులోకి తీసుకురావాలనుకుంటుంది. పెద్దగా ఎవరికీ తెలియని ఆవాసాలు, పర్యావరణ వ్యవస్థలు, జాతులకు ప్రాధాన్యత ఇస్తోంది. దీనికి తోడు లోకల్ ఫిల్మ్మేకర్స్పై దృష్టి పెట్టింది. సహజ ప్రపంచం గురించి మాట్లాడడానికి మల్టీమీడియా విధానాన్ని ఉపయోగిస్తోంది. ఫోటో స్టోరీలు, ఇన్ఫోగ్రాఫిక్స్, వ్యాసాలు, కార్లూన్లు ఇందులో ఉంటాయి. కథలను సంచలనం కోసం చెప్పాలనుకోవడం లేదు. స్పష్టంగా చెప్పాలనుకుంటుంది’ అని రౌండ్‌గ్లాస్ సస్టెయిన్ గురించి చెబుతోంది సమ్రీన్.పిల్లల జీవితాలను మార్చిందివైల్డ్ లెఫ్ ఫోటోగ్రఫీ, చిత్రాల ద్వారా వేటకు వెళ్లే పిల్లల మనస్తత్వాలను మార్చాం. ఇప్పుడు వారు అడవి జంతువులను ‘వేట కోసం’ అన్నట్లుగా చూడడం లేదు. సంరక్షించుకోవాల్సిన అందమైన జీవులుగా చూస్తున్నారు. మా చిత్రనిర్మాణ ప్రక్రియ వన్య్రప్రాణులను కాపాడడమే కాదు పిల్లల జీవితాలను కూడా మార్చింది. తమ చుట్టూ ఉన్న సహజ ప్రపంచంతో కనెక్ట్ కావడానికి వారికి ఇది కొత్త మార్గాన్ని చూపించింది.– నేహా దీక్షిత్, ఫిల్మ్మేకర్వారే నిజమై హీరోలుభూగోళ సంక్షోభం గురించి నిరాశపడడం కంటే కార్యాచరణ అనేది ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సంరక్షకులు, శాస్త్రవేత్తలు, రేంజర్ల రూపంలో ఆశ కనిపిస్తుంది. వారు నిజమైన హీరోలు. ఈ హీరోలు మన భూగోళాన్ని సురక్షితంగా ఉంచడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. వారి అంకితభావం మన ఆశావాదానికి బలాన్ని ఇస్తుంది. ఆ ఆశావాదాన్ని దశదిశలా వ్యాప్తి చేయడం ఫిల్మ్‌మేకర్‌గా నా బాధ్యత.– అశ్వికా కపూర్, ఫిల్మ్మేకర్నోరు లేని మూగజీవాలు, విలువైన ప్రకృతి గురించి చెప్పడానికి ఎన్నో కథలు ఉన్నాయి. వాటికి చిత్రరూపం ఇవ్వడానికి, మహిళలలోని సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, వారిని డైరెక్టర్లుగా తీర్చిదిద్దడానికి ‘రౌండ్‌గ్లాస్ సస్టెయిన్’ అనే స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తోంది.(చదవండి: ష్యూరిటీ ఇచ్చేముందే జాగ్రత్త పడాలి..!)
ఫొటోలు


కృతీ శెట్టిని ఇలా చూస్తే అభిమానులు ఫుల్ ఖుషీ (ఫోటోలు)


CSK vs PBKS : చహల్ హ్యాట్రిక్, చెన్నై ఖేల్ ఖతం (ఫోటోలు)


బాబే అన్నింటికీ దోషి.. సింహాచలం బాధిత కుటుంబానికి వైఎస్ జగన పరామర్శ (ఫొటోలు)


అక్షయ తృతీయ: మీకంతా శుభాలే.. నటి (ఫొటోలు)


శ్రేయాంకతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్ (ఫొటోలు)


సింహాచలం దుర్ఘటన.. ఎటు చూసినా ఆర్తనాదాలే


హ్యాపీ బర్త్‌డే హిట్‌మ్యాన్... రోహిత్ శర్మ అరుదైన ఫొటోలు


సింహాచలంలో మాటలకందని విషాదం.. (ఫోటోలు)


ప్రెగ్నెన్సీతో హీరోయిన్.. కానీ భర్తతో కలిసి ఫారెన్ టూర్ (ఫొటోలు)


EPCET కు హాజరైన విద్యార్థులు (ఫోటోలు)
అంతర్జాతీయం

లిబరల్ పార్టీ విజయం
టొరంటో: కెనడా సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి మార్క్ కార్నీ సారథ్యంలోని అధికార లిబరల్ పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది. జస్టిన్ ట్రూడో హయాంలో ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆక్రమణ హెచ్చరికలు, ఆ దేశంతో వాణిజ్య యుద్ధం వంటివి కలిసొచ్చాయి. దీనికి తోడు ఆర్థిక నిపుణుడిగా పేరున్న కార్నీ అమెరికాకు వ్యతిరేకంగా కెనడా ప్రజలను ఏకం చేయడంలో విజయం సాధించారు. అధికార పార్టీ అనుకూల పవనాలను ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ గట్టిగా ఎదుర్కొనలేక రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ట్రంప్ మాదిరిగా కెనడా ఫస్ట్ అంటూ ఆ పార్టీ నేత పియెర్రె తీసుకువచ్చిన నినాదాన్ని జనం నమ్మలేదు. మొన్నమొన్నటిదాకా ప్రజాదరణలో ముందుండి, కెనడా తదుపరి ప్రధాని, ఫైర్‌బ్రాండ్ అంటూ ప్రచారం జరిగిన పియెర్రె స్వయంగా ఒట్టావా నియోజకవర్గంలో ఓటమి చవిచూశారు. పార్లమెంట్‌లోని మొత్తం 343 స్థానాలకు గాను కన్జర్వేటివ్‌ల కంటే లిబరల్స్‌కే అత్యధికంగా దక్కుతాయనే అంచనాలున్నాయి. ఫలితాలు వెలువడే సమయానికి లిబరల్ పార్టీకి చెందిన అభ్యర్థులు 168 సీట్లలో గెలుపు/ఆధిక్యం సాధించారు. మెజారిటీ మార్కు 172కు మరో నాలుగు సీట్ల దూరంలో ఆ పార్టీ నిలిచింది. ఒకవేళ 168 సీట్లకే పరిమితమైన పక్షంలో అధికారంలో కొనసాగాలన్నా, చట్టాలు చేయాలన్నా ఏదో ఒక చిన్న పార్టీని కలుపుకుని వెళ్లాల్సి ఉంటుంది. కెనడా ఆక్రమణ ట్రంప్ తరంకాదు: మార్క్ కార్నీ లిబరల్ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా ప్రధాని మార్క్ కార్నీ విజయోత్సవ ప్రసంగం చేశారు అమెరికా నుంచి ముప్పు ఎదురవుతున్న తరుణంలో కెనడా ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కెనడా–అమెరికాలు పరస్పరం సహకరించుకుంటూ ప్రయోజనం పొందే విధానం రెండో ప్రపంచ యుద్ధం నుంచి అమలవుతోందని గుర్తుచేశారు. అది ఇటీవలే ముగిసిందని అన్నారు. అమెరికా తమను దగా చేసిందని మండిపడ్డారు.అమెరికా తీరుపట్ల దిగ్భ్రాంతికి గురైనప్పటికీ ఆ పాఠాలు ఎప్పటికీ మర్చిపోలేమని వ్యాఖ్యానించారు. కొన్ని నెలలుగా హెచ్చరికలు వస్తున్నాయని, మన భూమి, మన వనరులు, మన నీరు, మన దేశాన్ని ఆక్రమించుకుంటామని కొందరు బెదిరిస్తున్నారని ఆరోపించారు. కెనడాను విచి్ఛన్నం చేసి, సొంతం చేసుకోవాలన్నదే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పన్నాగమని ధ్వజమెత్తారు. అది ఎప్పటికీ సాధ్యం కాదన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికారు. అయితే, ప్రపంచం మారుతోందన్న నిజాన్ని మనం గుర్తించాలని కెనడా పౌరులకు మార్క్ కార్నీ సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం సాధించడంతో ఆయన మరోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. కెనడాతో బంధం బలోపేతం చేసుకుంటాం: మోదీ కెనడా ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మార్క్ కార్నీకి భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అభినందనలు తెలియజేశారు. కెనడాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలన్నదే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. రెండు దేశాల పౌరులకు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధ పాలనలకు ఇరుదేశాలూ కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. సత్తా చాటిన భారత సంతతి అభ్యర్థులుకెనడా ఎన్నికల్లో పలువురు భారత సంతతి అభ్యర్థులు సత్తా చాటారు. లిబరల్, కన్జర్వేటివ్ పార్టీల నుంచి రికార్డు స్థాయిలో 22 మంది అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. ప్రస్తుతం కెనడా పార్లమెంట్ దిగువ సభలో 17 మంది భారత సంతతి ఎంపీలున్నారు. ఈ సంఖ్య 22కు చేరుకుంది. పంజాబ్ నుంచి వలసవెళ్లిన కుటుంబంలో జన్మించిన సుఖ్ దలీవాల్(లిబరల్) ఆరోసారి నెగ్గడం విశేషం. బర్నాబై సెంట్రల్ స్థానం నుంచి పోటీ చేసిన న్యూ డెమొక్రటిక్ పార్టీ(ఎన్డీపీ) నేత జగ్మీత్‌సింత్(46) పరాజయం పాలయ్యారు. 18.1 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. ఇక్కడ లిబరల్ పార్టీ అభ్యర్థి వేడ్ చాంగ్ గెలిచారు. కెనడా జనాభాలో 3 శాతానికిపైగా భారత సంతతి ప్రజలు ఉన్నారు.

చైనా రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం.. 22 మంది మృతి
చైనాలోని లియావోయాంగ్ నగరంలోని ఓ రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. రెండు, మూడు అంతస్తుల భవనాల నుంచి భారీగా మంటలు చెలరేగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మంటలను అర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ నెలలో చైనాలో జరిగిన రెండో అతిపెద్ద అగ్ని ప్రమాదం ఇది.ఏప్రిల్ 9న ఓ నర్సింగ్ హోమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. చెంగ్డే నగరంలోని లాంగ్హువా కౌంటీలో రాత్రి 9 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మొత్తం 20 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. మంటలు చెలరేగిన సమయంలో ఈ హోమ్‌లో మొత్తం 260 మంది వృద్ధులు ఉన్నారు.#BREAKING 🚨First images from the restaurant fire 🔥22 people dead and 3 injured after a #fire broke out at a restaurant near a resettlement housing complex in Liaoyang, #Liaoning Province. The investigation is ongoing. #China #fire pic.twitter.com/WRelu9T8ov— Nazlı Özdemir (@nazliiozdemr) April 29, 2025

భారత్‌లో పాక్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతా నిలిపివేత
ఢిల్లీ: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఎక్స్ ఖాతాను భారత ప్రభుత్వం నిలిపివేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్ పై పాక్ మంత్రి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో ఎక్స్ ఖాతాను కేంద్రం బ్లాక్ చేసింది. భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిషేధించిన సంగతి తెలిసిందే. భారత్‌లో పాక్ జర్నలిస్టుల ఎక్స్ ఖాతాలను కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఐఎస్ఐ, పాకిస్థాన్ ప్రభుత్వంతో కలిసి భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు ఈ చర్యలు చేపట్టింది.భారత సైన్యం కదలికలపై పాక్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడమరోవైపు, భారత సైన్యం కదలికలపై పాక్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. సైన్యం కదలికలపై పాకిస్థాన్ ఐఎస్ఐ ఆరా తీస్తోంది. సరిహద్దులోని మిలిటరీ సిబ్బంది, పౌరులకు.. భారతీయ సైనిక్ స్కూల్ ఉద్యోగులమంటూ ఐఎస్ఐ ఫోన్లు చేస్తోంది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని.. తెలియని వారికి ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని సరిహద్దు ప్రజలకు కేంద్రం సూచిస్తోంది.కాగా, పహల్గాం దాడి తర్వాత పాక్ రక్షణ మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అమెరికా, బ్రిటన్ కోసమే చెత్త పనులు చేశామని.. ఉగ్రవాదాన్ని పోత్సహించడం పొరబాటని అర్థమైందంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమెరికా కోసమే ఉగ్రవాదులను పెంచిపోషించామంటూ ఆయన తప్పును ఒప్పుకున్నారు. ఉగ్రవాదం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ కోరుకునేది ఎన్నటికీ జరగదు.. విక్టరీ స్పీచ్‌లో మార్క్ కార్నీ
టొరంటో: కెనడాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అధికార లిబరల్ పార్టీ(Liberal Party of Canada) విజయం దిశగా దూసుకెళ్తోంది. వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టడం దాదాపు ఖాయం కావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. ఈ క్రమంలో మార్క్ కార్నీ(Mark Carney) మద్ధతుదారుల్ని ఉద్దేశిస్తూ విజయ ప్రసంగం చేస్తూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు.‘‘కెనడా చరిత్రలో కీలకమైన క్షణం ఇది. అమెరికా(America)తో మన పాత ఏకీకరణ సంబంధం ఇప్పుడు ముగిసింది. ఇకపై అమెరికాను స్థిరమైన మిత్రదేశంగా నమ్మలేం. అమెరికా చేసిన ద్రోహం నుండి మనం తేరుకుంటున్నాం. నెలల తరబడి నుంచి నేను ఈ విషయంలో హెచ్చరిస్తూ వస్తున్నా. అమెరికా మన భూమిని, మన వనరులను, మన నీటిని, మన దేశాన్ని కోరుకుంటోంది. మనల్ని విచ్ఛిన్నం చేసి తద్వారా కెనడాను సొంతం చేసుకోవాలని ట్రంప్ ప్రయత్నించారు. కానీ, అది ఎప్పటికీ జరగదు’’ అని కార్నీ అన్నారు.అమెరికాతో సుంకాల యుద్ధం, కెనడా యూఎస్‌లో 51వ రాష్ట్రంగా చేరాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బెదిరింపుల వేళ ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కెనడా పార్లమెంట్లో 343 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటునకు 172 మెజారీటీ అవసరం. ఇప్పటికే కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పొయిలివ్రా ఓటమిని అంగీకరించారు. అయితే లిబరల్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో మిత్రపక్షాలతో కలిసి మార్క్ కార్నీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.ఈ ఏడాది జనవరిలో జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో లిబరల్ పార్టీ సభ్యులు తదుపరి ప్రధానిగా ఆర్థిక వేత్త అయిన మార్క్ కార్నీని ఎన్నుకున్నారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన కార్నీ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.ఇదీ చదవండి: ట్రంప్‌తో కయ్యం.. ఎవరీ మార్క్ కార్నీ?
జాతీయం

జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్మన్‌గా అలోక్ జోషి
ఢిల్లీ: జాతీయ భద్రతా సలహా బోర్డును కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. జాతీయ భద్రతా సలహా బోర్డు ఛైర్మన్‌గా ‘రా’ మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించింది. ఏడుగురు సభ్యులతో జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరించింది. సభ్యులుగా మాజీ ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఆర్మీ అధికారులను నియమించింది. కాగా, ప్రధాని నివాసంలో బుధవారం.. భద్రతా వ్యవహారాల క్యాబినెట్ భేటీ నిర్వహించారు.ఈ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జయశంకర్, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలకు ఇప్పటికే భద్రత బలగాలకు ప్రధాని మోదీ సంపూర్ణ స్వేచ్ఛనిచ్చిన సంగతి తెలిసిందే. సీసీఎస్ అనంతరం సీసీపీఏ, సీసీఈఏ సమావేశాలు నిర్వహించారు. చివర్లో క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. భద్రత వ్యవహారాలను సీసీఎస్ చర్చించింది. రాజకీయ పరిస్థితులను సీసీపీఏ చర్చించింది. ఆర్థిక అంశాలపై సీసీఈఏ పలు నిర్ణయాలు తీసుకుంది.సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై భారత్ మరిన్ని ఆంక్షలు విధించనుంది. ఫార్మా ఎగుమతులను నిలిపివేసే అవకాశం, భారత గగనతలంలోకి పాకిస్తాన్ విమానాల నిషేధం.. అరేబియా సముద్రంలో పోర్టుల కార్యకలాపాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఆంక్షలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టే వ్యూహంలో భారత్ ఉంది. ఇవాళ 3 గంటలకు సీసీఎస్, సీసీపీఏ, సీసీఈఏ, కేంద్ర కేబినెట్ నిర్ణయాలను ప్రెస్మీట్లో వెల్లడించనున్నారు.

అప్పు ఇవ్వొద్దు.. పాక్‌పై భారత్ ఆర్థిక యుద్ధం
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్ .. పాకిస్తాన్‌ను ఆర్ధికంగా మరింత ఇబ్బందే పెట్టే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా దాయాది దేశంపై భారత్ ఆర్థిక యుద్ధం ప్రకటించింది.పాకిస్తాన్‌కు అప్పు ఇవ్వొద్దంటూ భారత్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund - IMF) పై ఒత్తిడి చేస్తోంది. ఆ మేరకు అభ్యంతరం తెలిపింది. గతేడాదిలో ప్రకటించిన పాకిస్తాన్‌కు ఏడు బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ విషయంలో సమీక్షించాలని కోరింది. పాక్‌కు నిధులు ఇస్తే ఉగ్రవాదులకు మళ్ళిస్తోందని ఐఏఎఫ్ మెంబర్స్‌కు భారత్ వివరిస్తోంది.మే 9న పాకిస్తాన్‌కు అప్పు ఇచ్చే అంశంపై ఐఎంఎఫ్ బోర్డు చర్చించనుంది. ఈ తరుణంలో పాక్‌కు ఎట్టి పరిస్థితుల్లో అప్పు ఇవ్వొదని భారత్ వాదిస్తోంది. ఇదే అంశంపై భద్రతామండలి నాన్ పర్మినెంట్ మెంబర్స్‌తో భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ చర్చలు జరుపుతున్నారు. పాకిస్తాన్‌కు ఏడు బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీని సమీక్షించాలని కోరనున్నారుIndia can voice opposition to Pakistan’s $1.3 billion IMF loan, but its 2.63% voting share limits its influence. The IMF typically approves loans by consensus, and a formal vote only needs a simple majority, not an 85% supermajority. To block the loan, India would need to build…— Grok (@grok) April 29, 2025

Kolkata: హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బుర్రాబజార్ ఏరియా ఫల్పట్టి మచ్చువా అనే పండ్ల మార్కెట్ సమీపంలో ఉన్న హోటల్ రుతురాజ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 14 మంది సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద మరణాల్ని కోల్‌కతా సీపీ మనోజ్ కుమార్ వర్మ అధికారికంగా ప్రకటించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి 8:15 గంటలకు జరిగినట్లు సమాచారం. VIDEO | Kolkata hotel fire: Police Commissioner Manoj Verma says, "A fire incident was reported at Ritu Raj Hotel in Mechuapatti area at about 8:15 am on Tuesday evening. At least 15 casualties have been reported so far and several people were rescued from rooms and roof of the… pic.twitter.com/8YkIfq6oSe— Press Trust of India (@PTI_News) April 30, 2025ఈ దుర్ఘటనపై సీపీ మనోజ్ కుమార్ మాట్లాడారు.‘ అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన పద్నాలుగు మృతదేహాలను వెలికితీశాం. గాయపడిన బాధితులను మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాం. మంటలు అదుపులోకి వచ్చాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’ అని అన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాల్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాణాలతో బయటపడిన పలువురు ప్రమాదంపై మాట్లాడారు. ముందుగా హోటల్ కారిడార్లలో దట్టమైన పొగకమ్ముకుంది. ఆ తర్వాత కరెంట్ పోయిందని చెప్పారు. హోటల్లో ఉన్న పలువురు ప్రాణాల్ని రక్షించుకునేందుకు హోటల్ కిటికీలను పగలగొట్టి బయటపడేందుకు ప్రయత్నించారు. మరి కొంతమంది ప్రమాదం నుంచి బయటపడే దారిలేక అలాగే గదుల్లోనే ఉండిపోయారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకు సిబ్బంది వారిని రక్షించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు.

చుట్టుముట్టి చంపేశారు
శ్రీనగర్: తాజాగా మరికొంత మంది ప్రత్యక్ష సాక్షుల కథనాలతో పహల్గాంలోని బైసారన్‌లో ముష్కరుల కిరాతకకాండపై జాతీయ దర్యాప్తు సంస్థకు మరింత స్పష్టత వస్తోంది. అమాయకులను ముష్కరులు చుట్టుముట్టి చంపేశారని తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం.. బైసారన్ గడ్డి మైదానం లోపలికి వెళ్లడానికి, బయటకు రావడానికి ఒక ఎంట్రీ మార్గంతోపాటు ఒక ఎగ్జిట్ దారి ఉంది. ఈ రెండు చోట్లా ఉగ్రవాదులు నిలబడి మైదాన ప్రాంతం నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. సుదూరంగా ఉన్న వాళ్లు కళ్లుగప్పి, ఫెన్సింగ్ దాటి ఎలాగోలా తప్పించుకున్నా మిగతా వాళ్లు మధ్యలోనే చిక్కుకుపోయి ఉగ్రతూటాలకు బలయ్యారని తెలుస్తోంది. ఎగ్జిట్ గేట్ వద్ద ఒక ఉగ్రవాది నిలబడి కాల్పులు మొదలెట్టాడు.దీంతో జనం భయపడి ఎంట్రీ గేట్ వైపు పరుగులు పెట్టారు. అయితే అప్పటికే ఎంట్రీ గేట్ వద్ద ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారు. మరో ఉగ్రవాది చెట్లలో దాక్కున్నట్లు తెలుస్తోంది. కాల్పులు జరుపుతున్న ఈ ముగ్గురు ఉగ్రవాదులకు ఏమైనా జరిగితే రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాడని అర్థమవుతోంది. ఈ ముగ్గురు మాత్రమే పర్యాటకుల ప్రాణాలుతీశారు. వీరిలో ఇద్దరు భారత సైనిక యూనిఫామ్‌లో, ఒకడు కశ్మీరీ స్థానిక దుస్తుల్లో ఉన్నాడు. ఎగ్జిట్ గేట్ వద్ద తుపాకీ మోతతో ఎంట్రీ గేట్ వైపు పరుగెత్తుకొచ్చిన వాళ్లందర్నీ అక్కడి ఇద్దరు ఉగ్రవాదులు నిలువరించి మహిళలు వేరుగా నిలబడాలని ఆదేశించారు.భయపడుతున్నా ఎవ్వరూ వేరు వేరుగా నిలబడలేదు. దీంతో హిందూ, ముస్లింలుగా వేర్వేరుగా నిలబడాలని మరోసారి ఆదేశించారు. దీంతో ఇస్లామ్‌పై విశ్వాసం ఉందని ప్రకటించే ‘కల్మా’ను పఠించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే ఎంట్రీ గేట్ నుంచి వచి్చన యువ నేవీ అధికారి, లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఉగ్రతూటాలకు బలయ్యారని సాక్షులు తెలిపారు. రెండు వారాల ముందే రెక్కీ? ఉగ్రవాదులు సమీప హోటళ్లలో పర్యాటకులతో నిండిపోయాయా లేదా? అనే వివరాలను తెల్సుకున్నారని, ఇందుకోసం రెండు వారాల ముందే రెక్కీ నిర్వహించారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు సమీప హోటళ్లు, రహదారి వెంట అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. జిప్‌లైన్ ఆపరేటర్‌కు ఎన్ఐఏ సమన్లు రిషీ భట్ అనే పర్యాటకుడు జిప్‌లైన్ ఎక్కి బైసారన్ ఏరియల్ వ్యూను తన కెమెరాలో బంధించిన సందర్భంగా జిప్‌లైన్ ఆపరేటర్ వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండటం ఆ వీడియోలో రికార్డయింది. అల్లా హు అక్బర్ అని పదేపదే అతను పలకడం అందులో రికార్డయింది. పర్యాటకుడిని జిప్‌లైన్‌లో ముందుకు తోస్తూ అలా పలకాల్సిన అవసరం ఏమొచి్చందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దాడి విషయం ముందే తెలుసా? అనే కోణంలో వివరణ కోరుతూ ఎన్ఐఏ ఇతనికి సమన్లు జారీచేసింది. రెండ్రోజుల క్రితమే హతమార్చేవారా? ఏప్రిల్ 22వ తేదీన ఈ దాడి జరిగింది. వాస్తవానికి రెండు రోజుల ముందే ఉగ్రవాదులు దాడికి ప్రయతి్నంచారని తెలుస్తోంది. అయితే ఆ ముందు రెండు రోజులు అంటే 20, 21వ తేదీల్లో అక్కడ వర్షం పడటంతో బైసారన్ గడ్డిమైదానం అంతా బురదమయంగా ఉండటంతో పర్యాటకులు హోటళ్లను వదిలి బయటకు రాలేదని, సందడి లేకపోవడంతో ఉగ్రవాదులు తమ ప్రయత్నాన్ని వాయిదావేసుకున్నారని తెలుస్తోంది. 22వ తేదీన చక్కటి ఎండ కాయడంతో జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. ఘటన జరిగిన రోజున బైసారన్, సమీప ప్రాంతాల్లో ఏకంగా 5,000 మంది స్థానిక, స్థానికేతరులు ఉన్నారని ‘పోనీ ఆపరేటర్’రౌఫ్ వానీ చెప్పారు. ఆ విషయం ఉగ్రవాదులు తెల్సుకుని తెగబడ్డారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అక్కడి ఫుడ్‌స్టాళ్ల వెనక వైపు చాలా సేపు ఇద్దరు ఉగ్రవాదులు ఊరకనే కూర్చుని మధ్యాహ్నం 2.30 గంటలకు జనం ఎక్కువైన తర్వాతే ముందువైపుకొచ్చి దాడి చేసినట్లు తెలుస్తోంది. ముందుగా ఇద్దరు ఉగ్రవాదులు నలుగురిని తలపై గురిచూసి చంపేశాకే అక్కడి జిప్‌లైన్ వెనుక నుంచి మరో ఇద్దరు వచ్చారని ఇంకొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
ఎన్ఆర్ఐ

Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
ఆస్టిన్: అమెరికా టెక్సాస్‌లో తెలుగు విద్యార్థిని హిట్ అండ్ రన్ కేసు విషాదాంతంగా ముగిసింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వంగవోలు దీప్తి(Deepthi Vangavolu)కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో గుంటూరులోని ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీప్తి(23) తండ్రి హనుమంత రావు చిరువ్యాపారి. ఆమె కుటుంబం గుంటూరు(Guntur) రాజేంద్రనగర్ రెండో లైనులో నివాసం ఉంటోంది. టెక్సాస్‌లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈలోపు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. క్రౌడ్ ఫండింగ్(Crowd Funding) ద్వారా ఆమె చికిత్స కోసం ప్రయత్నాలు కొనసాగగా.. మంచి స్పందన లభించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చికిత్స పొందుతూ కన్నుమూసింది. శనివారం(ఏప్రిల్ 19) నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో బాధితురాలు స్నిగ్ధ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అవే ఆమె చివరి మాటలు..దీప్తి మృతి వార్త విని ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తున్నారు. చదువులో చాలా చురుకైన విద్యార్థిని అని, అందుకే పొలం అమ్మి మరీ అమెరికాకు పంపించామని చెప్పారు. నెల రోజుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి కావాల్సి ఉందని, ఆ టైంకి మమ్మల్ని అమెరికాకు రావాలని ఆమె కోరిందని, అందుకు ఏర్పాట్లలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన దీప్తి చివరిసారిగా తమతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కాలేజీకి టైం అవుతోందని.. ఆదివారం మాట్లాడతానని చెప్పి హడావిడిగా ఫోన్ పెట్టేసిందని.. అవే తమ బిడ్డ మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని బోరున విలపించారు.

దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్‌తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన స్వర్గం శ్రీనివాస్ లు దుబాయి లో హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయి నుంచి మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల్ని ఆదేశించినట్లు అనిల్ తెలిపారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయి లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ బృందం, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి లు మృతుల కుటుంబాలను పరామర్శించారు.

రాయలసీమ ప్రగతికి డాలస్‌లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్‌లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు.

సింగపూర్‌లో ‘అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం’
'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' 'శ్రీ సాంస్కృతిక కళాసారథి - సింగపూర్' మరియు 'వంశీ ఇంటర్నేషనల్ - ఇండియా' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, ఆదివారం 13వ తేదీ హైదరాబాద్ , శ్రీ త్యాగరాయ గానసభలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటల పాటు నిర్విరామంగా "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" కార్యక్రమం అద్వితీయంగా నిర్వహించబడింది.ఈ మూడు సంస్థలు కలసి విశ్వావసు నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని 80 మంది కవులతో 'అంతర్జాతీయ కవి సమ్మేళనము', 20 నూతన గ్రంధావిష్కరణలు, ఆచార్య శలాక రఘునాథ శర్మ 'రాయప్రోలు వంశీ జాతీయ సాహితీ జీవన సాఫల్య పురస్కార' ప్రదానము డా. బులుసు అపర్ణచే ప్రత్యేక 'మహిళా అష్టావధానము' మొదలైన అంశాలతో ఈ 'అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం' కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించి నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, విశిష్ట అతిథులుగా కవి జొన్నవిత్తుల, కిమ్స్ ఆస్పత్రి వ్యవస్థాపకులు బొల్లినేని కృష్ణయ్య, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానంద రావు, ప్రముఖ రాజకీయవేత్త వామరాజు సత్యమూర్తి తదితరులు హాజరయ్యారు.ఉదయం 9 గంటలకు డా వంశీ రామరాజు అందించిన స్వాగతోపన్యాసంతో ఆరంభమైన ప్రారంభోత్సవ సభలో, కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి సభా నిర్వహణలో, మండలి బుద్ధ ప్రసాద్, కవి జొన్నవిత్తుల, బొల్లినేని కృష్ణయ్య, వామరాజు సత్యమూర్తి, డా. జననీ కృష్ణ తదితరుల ప్రసంగాలు అందరినీ ఆకర్షించాయి.తదనంతరం ఖతార్ నుండి విచ్చేసిన విక్రమ్ సుఖవాసి నిర్వహణలో అతిథుల చేతుల మీదుగా 18 తెలుగు నూతన గ్రంథాలు ఆవిష్కరించబడ్డాయి. వాటిలో కథల కవితల సంకలనాలు, వ్యాస సంపుటాలు, జెవి పబ్లికేషన్స్, మిసిమి మాసపత్రిక వారి ప్రచురణలు, సిద్ధాంత గ్రంథాలు మాత్రమే కాకుండా, ప్రతిష్టాత్మకంగా 2024 నవంబర్‌లో ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచిక" కూడా ఆవిష్కరించబడడం ఈ సభకు మరింత శోభను చేకూర్చింది.మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు కొనసాగిన "అంతర్జాతీయ కవి సమ్మేళనం"లో ఆస్ట్రేలియా, ఖతార్, దక్షిణాఫ్రికా, అమెరికా మొదలైన దేశాలనుండి, ఉభయ తెలుగు రాష్ట్రాలనుండి, ముంబై, అండమాన్ దీవులు మొదలైన ప్రాంతాలనుండి కూడా వచ్చిన సుమారు 80 మంది కవులు కవయిత్రులు పాల్గొని తమ కవితలు వినిపించారు. వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధాదేవి, రేవూరు అనంత పద్మనాభరావు, జి భగీరథ, గుండు వల్లీశ్వర్, ప్రొ. రామా చంద్రమౌళి మహెజబీన్, ప్రొ. త్రివేణి వంగారి, డా కేతవరపు రాజ్యశ్రీ, డా. చిల్లర భవానీ దేవి, డా. శంకరనారాయణ, అంబల్ల జనార్ధన్, డా చాగంటి కృష్ణకుమారి మొదలైన ఎందరో కవులు కవయిత్రులు ఈ కవిసమ్మేళనంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం కొందరు రచయితలు ప్రసంగవ్యాసాలు వినిపించారు. సభా వ్యాఖ్యాతలుగా పేరి, కృష్ణవేణి, రాధిక వ్యవహరించారు.అనంతరం సాయంత్రం ఆచార్య శలాక రఘునాథ శర్మను ఘనంగా సత్కరించి, వారికి మూడు నిర్వాహక సంస్థల తరఫున "రాయప్రోలు వంశీ జాతీయ సాహితీ జీవన సాఫల్య పురస్కారం" అందించారు. దీనికి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అనంతరం శలాక మాట్లాడుతూ తెలుగువారికి సొంతమైన అవధాన ప్రక్రియలో 'సమస్యా పూరణం' అనే అంశంలో ఉండే చమత్కారాలు వివరణలు తెలియజేస్తూ "అవధాన కవిత్వం - సమస్యలు" అనే అంశంపై ప్రత్యేక ప్రసంగాన్ని అందించారు.సాయంత్రం 5:30 గంటల నుండి ద్విశతావధాని డా. బులుసు అపర్ణ చేసిన అష్టావధానం ఈ సదస్సుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాధిక మంగిపూడి సంచాలకత్వంలో అమెరికా, యుగాండా, ఆస్ట్రేలియా, ఖతార్, అండమాన్ దీవులు, ముంబై, విశాఖపట్నం, విజయవాడ నుండి వచ్చిన 8 మంది మహిళలు పృచ్ఛకులుగా పాల్గొనడంతో ఇది "సంపూర్ణ మహిళా అష్టావధానం"గా ప్రశంసలు అందుకుంది.ఈ కార్యక్రమానికి ప్రధాన నిర్వాహకులుగా వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, వంశీ వ్యవస్థాపకులు డా. వంశీ రామరాజు, సింగపూర్ సంస్థ వ్యవస్థాపకులుకవుటూరు రత్నకుమార్ వ్యవహరించగా, వంగూరి ఫౌండేషన్ భారతదేశ ట్రస్టీ శైలజ సుంకరపల్లి ఆధ్వర్యంలో వేదిక ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పంచవ్యాప్తంగా సాహిత్య అభిమానుల మన్ననలు అందుకుంది.
క్రైమ్

ప్రియుడి ఇంటి ముందు ట్రాన్స్‌జెండర్ ధర్నా
ఆదోని రూరల్(కర్నూలు): తనను మోసం చేశాడంటూ ఆదోని మండలం బైచిగేరికి చెందిన యువకుడి ఇంటి ఎదుట ఓ ట్రాన్స్‌జెండర్ ఆందోళనకు దిగింది. బాధితురాలి కథనం మేరకు.. నాలుగేళ్ల క్రితం ఆదోని మండలం బైచిగేరికి చెందిన గణేష్ అనే యువకుడు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ అన్నమయ్య జిల్లా మదనపల్లె గ్రామానికి చెందిన వెంకటరమణ కుమారుడు హాసినిగౌడ్ ఊరఫ్ రామకృష్ణ(24) అనే ట్రాన్స్‌జెండర్‌తో పరిచయం ఏర్పడి, సహజీవనం చేస్తూ వచ్చాడు. గతేడాది గణేష్‌కు పెళ్లి కుదరడంతో ట్రాన్స్‌జెండర్ హాసినిని వదిలేసి సొంత గ్రామానికి రావడంతో 2024 జూన్ 10న బైచిగేరి గ్రామానికి వచ్చి తనకు న్యాయం చేయాలని హాసినిగౌడ్ నిరసన తెలిపింది. ఆదోని తాలూకా పోలీసులు ఆమె నివాసముంటున్న హైదరాబాద్‌లోని సైబరాబాద్ కమిషనరేట్ సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ మేరకు హాసినిగౌడ్ అక్కడ ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే మరలా బుధవారం వచ్చి బైచిగేరిలో గణేష్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. ‘‘నువ్వే నా ప్రాణం, నా సర్వస్వం.. నువ్వు లేనిదే నేను లేనంటూ నా వెంట పడ్డాడు. నేను ఒక ట్రాన్స్‌జెండర్. నాతో నీవు సావాసం చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పాను. అయినా వినకుండా, తననే పెళ్లి చేసుకుంటాని వెంట బడ్డాడు. నాకు పిల్లలు పుట్టరని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. మా ఇంటి నుంచి రూ.5 లక్షలు తీసుకెళ్లి ఇద్దరం పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో నివాసముంటున్నామని హాసినిగౌడ్ వాపోయింది. తన డబ్బులు రూ.5 లక్షలు అయినా ఇప్పించాలని, లేకపోతే గణేష్‌తో కాపురం అయినా చేయించాలని డిమాండ్ చేసింది. సమాచారం అందుకున్న తాలూకా ఎస్ఐ రామాంజనేయులు గ్రామానికి చేరుకుని విచారించారు. హాసినిగౌడ్ గణేష్‌పై ఇదివరకే కేసు హైదరాబాద్‌లో నమోదయ్యిందని, ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి న్యాయం చేస్తామని ఎస్ఐ చెప్పడంతో వారు హాసినిగౌడ్, ఇతర ట్రాన్స్జెండర్లు ధర్నా విరమించారు.

నెల్లూరులో కారు బీభత్సం.. ఆరుగురి దుర్మరణం
నెల్లూరు, సాక్షి: కారు బీభత్సంతో బుధవారం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్లోకి కారు దూసుకెళ్లి ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలు కాగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కొవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతులంతా నారాయణ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్‌గా తెలుస్తోంది. పోతిరెడ్డిపాలెం వద్ద కారు బీభత్సం ఘటనలో మృతులు మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్న నరేష్, అభిషేక్, జీవన్, యగ్నేష్, అభిసాయిలుగా పోలీసులు ప్రకటించారు. గాయపడిన నవనీత్ అనే విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక.. ఈ దుర్ఘటనలో షాప్‌లో ఉన్న రమణయ్య సైతం మృతి చెందాడు. బుచ్చిరెడ్డిపాలెం లో ఓ నిశ్చితార్థ వేడుకకు హాజరై కారులో విద్యార్థులు తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి హోటల్లోకి దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బిడ్డా.. మీరెక్కడమ్మా
మహబూబ్‌నగర్: ఆ ఇద్దరు విద్యార్థునులవీ నిరుపేద కుటుంబాలే.. ఒకరి తండ్రేమో కాళ్ల వాపుతో ఐదేళ్లుగా.. మరొకరి తండ్రి రోడ్డు ప్రమాదంలో కాళ్లు కోల్పోయి మూడేళ్లుగా మంచాలకే పరిమితమయ్యారు. దీంతో తాము కష్టపడినా.. తమ పిల్లలైనా బాగుపడాలని భావించిన ఆ తల్లులు కాయాకష్టం చేసి వారిని చదివించుకుంటున్నారు. ఇంతటి కష్టంలోనూ ఆ నిరుపేద కుటుంబాలపై దేవుడు ఏమాత్రం కనికరం లేకుండా మరో పిడుగు వేశాడు. రోడ్డు ప్రమాద రూపంలో ఇద్దరు విద్యార్థులను కబళించి.. తల్లిదండ్రుల ఆశలను, విద్యార్థుల కలలను ఛిద్రం చేశాడు. తీరని గోస.. మాగనూరు మండలంలోని గురువలింగంపల్లి గ్రామానికి చెందిన గోసాయి మారెప్ప, మాణిక్యమ్మల దంపతులకు కుమారుడు రమేష్ గౌరి, మహేశ్వరి ఉన్నారు. అయితే ఐదేళ్ల క్రితం గోసాయి మారెప్ప కాళ్లవాపు వ్యాధితో మచ్చానికే పరిమితమయ్యాడు. దీంతో కుటుంబ పోషణ కోసం కుమారుడు రమేష్ దినసరి కూలి బాటపట్టగా.. తల్లి మాణిక్యమ్మ స్థానికంగా బిచ్చమెత్తుకుంటూ భర్తను చూసుకుంటుంది. కాగా.. ఇద్దరు కూతుళ్లు కష్టపడి చదివి బీఎస్సీ నర్సింగ్ ప్రభుత్వ సీట్లు సాధించారు. గౌరికి వనపర్తి జిల్లాలో సీటు రాగా, మహేశ్వరి (చివరి అమ్మాయి)కి గద్వాల జిల్లాలో ఉచిత సీటు వచ్చింది. దీంతో మహేశ్వరి గద్వాలలో హాస్టల్లో ఉంటూ బీఎస్సీ నర్సింగ్ తృతీయ సంవత్సరం చదువుతుంది. పేదరికంతో ఇబ్బందులు పడుతున్న తన కుటుంబానికి బాసటగా నిలుద్దామని కలలు కన్న ఆ విద్యార్థిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యుఒడికి చేరడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ‘బిడ్డా.. నీవెక్కడమ్మా’ అంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులతో కంటతడి పెట్టించింది. మృతిచెందిన కూతురును కళ్లతో చూద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు రమేష్ (అన్న)ను తీసుకెళ్లారు. కదిలించిన ప్రమాదం గద్వాల జిల్లాకేంద్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అధికార, రాజకీయ నాయకులను కదిలించింది. ప్రమాదంలో ఇద్దరు నర్సింగ్ విద్యార్థులు మృతిచెందడంతో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, కుల, విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం రాత్రి జిల్లా ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత విద్యార్థినుల కుటుంబాలని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు రోడ్డు ప్రమాదంపై ప్రత్యేకంగా విచారణ చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ పోలీసులను ఆదేశించారు. మృతిచెందిన విద్యార్థుల కుటుంబాల వివరాలు, స్థితిగతులపై ఆరా తీయాలని రెవెన్యూ సిబ్బందికిఉ సూచించారు. మిన్నంటిన రోదనలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్దఎత్తున జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి బోరున విలపించడంతో ఆస్పత్రి ఆవరణలో రోదనలు మిన్నంటాయి. మనీష మృతదేహంపై తల్లిదండ్రులు బోయ రాజు, శ్రీదేవి పడి గుండెలు అవిసేలా రోదించారు. ఎన్నో ఆశలతో నర్సింగ్ కోర్సు పూర్తి చేసి ప్రజలకు సేవ చేస్తానని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని విలపించారు. త్వరలో వేసవి సెలవులు వస్తాయని, ఇంటికొస్తానని చెప్పిన మాటలను తండ్రి గుర్తు చేసుకొని కంటతడి పెట్టడం పలువురిని కదిలించింది.తల్లి కష్టమే ఆధారం.. పాన్‌గల్ మండలం రాయినిపల్లి గ్రామానికి చెందిన శ్రీదేవి, రాజుల దంపతులకు కూతురు మనీష, కుమారుడు మనోజుకుమార్ ఉన్నారు. తండ్రి రాజు మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కాళ్లు విరిగిపోవడంతో ఎలాంటి పనులు చేయలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యా డు. దీంతో కుటుంబ భారమంతా తల్లి శ్రీదేవిపై పడింది. దీంతో ఆమె స్థానికంగా చిన్నపాటి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ.. మనీషశ్రీని నర్సింగ్ చదివిస్తుంది. మరో ఏడాదిలో చదువు పూర్తి చేసుకొని తమ పేద కు టుంబానికి తోడుగా ఉంటుందనుకున్న తరుణంలో కూతురు అకాల మరణం చెందడంతో కుటు ంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్ర మాదం విషయం తెలియడంతో కుటుంబ సభ్యు లు అందరూ గద్వాలకు బయలుదేరి వెళ్లారు.

నా బిడ్డకు న్యాయం చేయండి
ఆదోని అర్బన్(కర్నూలు): డీఎస్పీ, సీఐ కారణంగా తన బిడ్డ జీవితం అన్యాయమైపోయిందని ఓ యువతి తండ్రి ఆవేదన చెందుతున్నాడు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఆదోని పట్టణంలోని వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో నివాసముంటున్న యువతి, కౌతాళం మండలం కామవరానికి చెందిన యువకుడు వీరేష్ ప్రేమించుకున్నారు. గతేడాది డిసెంబర్ 1వ తేదీన పెద్దలకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు కానీ.. యువకుడు తన తల్లిదండ్రుల బలవంతంతో మరో యువతితో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న యువతి తండ్రి గత నెల 19న ఆదోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీఐ శ్రీరామ్ ఆ యువకుడిని పిలిపించి అడగగా, రెండో పెళ్లి చేసుకోవడం లేదని, ఒక నెల గడువు కోరి లలితను తీసుకెళ్తానని చెప్పాడు.ఇంతలోనే ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిసి యువకుడిని నిలదీయడంతో యువతి కుటుంబీకులపై దాడి చేశారు. ఈ మేరకు బాధిత యువతి తండ్రి ఆదోని డీఎస్పీకి ఈనెల 21న ఫిర్యాదు చేశాడు. అయితే ఎలాంటి చర్యలు తీసుకోని కారణంగానే.. కామవరం వీరేష్ ఈనెల 25న రెండో పెళ్లి చేసుకున్నాడని, పోలీసులు డబ్బులు తీసుకుని తమ కేసును తారుమారు చేశారని ఆరోపిస్తున్నాడు. ఈ విషయమై డీఎస్పీ హేమలతను వివరణ కోరగా.. యువకుడితో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశామని, కేసు దర్యాప్తులో ఉందన్నారు.
వీడియోలు


కేవలం చంద్రబాబు నిర్లక్ష్య వైఖరితో అనేక మంది ప్రాణాలు బలి: వైఎస్ జగన్


ఇవాళ YSRCP స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో YS జగన్ సమావేశం


సింహాచలంలో ఊహకందని విషాదం


భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తత


ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన YSRCP నేతలు


CM Revanth: BRS సభకు ఎన్ని బస్సులు అడిగితే అన్ని ఇవ్వమని చెప్పాం


నెల్లూరు జిల్లాలో కారు బీభత్సం, ఆరుగురు మృతి


Simhachalam : సాఫ్ట్వేర్ దంపతుల ప్రాణాలు తీసిన ప్రభుత్వ నిర్లక్ష్యం


Pahalgam Incident: జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ


SSC Results 2025: తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల