
భక్తిశ్రద్ధలతో దసరా
వికారాబాద్ పట్టణంలో దసరా ఉత్సవాల్లో పాల్గొన్న జనం
విజయదశమి పండుగను గురువారం జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. వేడుకల చివరి రోజు అమ్మవారు నిజరూప దర్శనమిచ్చారు. ఆలయాల్లో దుర్గామాతకు అభిషేకాలు, అర్చనులు నిర్వహించారు. సాయంత్రం జమ్మి చెట్టుకు పూజలు చేశారు. అనంతరం ఒకరినొకరుఆలింగనం చేసుకుని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా అని పలువురు పేర్కొన్నారు. – అనంతగిరి