
రాజకీయ పార్టీలు సహకరించాలి
భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కోరారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలలో ఎన్నికల కోడ్ అమలులో లేదని తెలిపారు. సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారాన్ని, అసత్య ప్రచారాన్ని ప్రసారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీల మీటింగులు, ర్యాలీలకోసం అనుమతులు తీసుకోవాలన్నారు. ఎవరికై నా ఎలక్షన్ పై సందేహాలు ఉన్నా, ఫిర్యాదు చేయాలనుకున్నా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జెడ్పీసీఈఓ వి.వి. అప్పారావు, డీపీఓ యాదగిరి, రాజేశ్వరరావు, లింగయ్య యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఆబిద్, కోట గోపి, స్టాలిన్, వెంకటేశ్వర్లు, జెడ్పీ డిప్యూటీ సీఈ ఓ శిరీష, డీఎల్‌పీఓ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్