వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు

Oct 5 2025 5:06 AM | Updated on Oct 5 2025 5:06 AM

వైఎస్

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు

పుట్టపర్తి టౌన్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కమిటీలో పలువురు జిల్లా వాసులకు చోటు దక్కింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా ఎం. శంకరయ్య (రాప్తాడు), ఎస్‌.పి. ప్రశాంత్‌గౌడ్‌ ( హిందూపురం), జి. పురుషోత్తంరెడ్డి (ధర్మవరం), జి. కుళ్లాయప్ప (ధర్మవరం), ఏ. శంకర్‌రెడ్డి (ధర్మవరం), పి.శ్రీనివాసులు (ధర్మవరం)ను నియమించారు. ఇక పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డి. భారతిరెడ్డి (పుట్టపర్తి)ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ సాయాన్ని

సద్వినియోగం చేసుకోండి

ఆటో డ్రైవర్లకు మెగా చెక్కును

అందజేసిన కలెక్టర్‌, ఎమ్మెల్యే

పుట్టపర్తి టౌన్‌: ప్రభుత్వం అందించే సాయాన్ని ఆటోడ్రైవర్లు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ సూచించారు. శనివారం స్థానిక సాయి ఆరామంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ‘ఆటోడ్రైవర్ల సేవలో’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, స్థానిక ఎమ్మెల్యే పల్లె సిఽంధూరారెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వం జిల్లాలోని 5,720 మంది ఆటో డ్రైవర్లకు మంజూరు చేసిన రూ 8,58 కోట్లకు సంబంధించిన మెగా చెక్కను అందజేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ... ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమం ద్వారా అర్హత ఉన్న ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం అందుతుందన్నారు. .ప్రతి ఆటో డ్రైవర్‌ క్రమశిక్షణతో మెలగాలని, అప్పడు కుటుంబాలు బాగుపడతాయన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘనాథరెడ్డి, రవాణా శాఖ అధికారి కరుణసాగర్‌రెడ్డి, ఆర్డీఓ సువర్ణ, నోడల్‌ అధికారి సుధాకర్‌రెడ్డి, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ పూల శివప్రసాద్‌రెడ్డి, పలువురు ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు. అలాగే జిల్లాలోని వివిధ నియోజక వర్గాల్లో జరిగిన ‘ఆటోడ్రైవర్ల సేవలో’ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

తేనెటీగల దాడిలో రెవెన్యూ ఉద్యోగులకు గాయాలు

వజ్రకరూరు: అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రాగులపాడు సమీపంలోని హంద్రీ–నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం (లిఫ్ట్‌) వద్ద శనివారం సాయంత్రం రెవెన్యూ ఉద్యోగులపై తేనెటీగలు దాడి చేశాయి. పలువురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని కొనకొండ్ల గ్రామానికి చెందిన ఎం.రామాంజినేయులు అనే వ్యవసాయ కూలీ నాలుగు రోజుల క్రితం ఛాయాపురం వద్ద ఉన్న హంద్రీ–నీవా ప్రధాన కాలువలో గల్లంతయ్యాడు. ఇప్పటికీ అతని అచూకీ లభించలేదు. దీంతో రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది, వజ్రకరూరు పోలీసులు గాలింపు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం వజ్రకరూరు తహసీల్దార్‌ నరేష్‌కుమార్‌ నేతృత్వంలో ఆర్‌ఐ సతీష్‌కుమార్‌, విఆర్వోలు ఛత్రేనాయక్‌, రంగస్వామి, వీఆర్‌ఏలు విజయ్‌, పెన్నయ్య, సుంకన్నతో పాటు మరికొందరు రెవెన్యూ ఉద్యోగులు ఛాయాపురం నుంచి రాగులపాడు లిఫ్ట్‌ వరకు కాలువ వెంట గాలించారు. రాగులపాడు లిఫ్ట్‌ వద్ద అకస్మాత్తుగా తేనెటీగలు దాడిచేశాయి. వీఆర్వోలు ఛత్రేనాయక్‌, రంగస్వామి, వీఆర్‌ఎలు విజయ్‌, పెన్నయ్య, సుంకన్న తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే వజ్రకరూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు 1
1/3

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు 2
2/3

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు 3
3/3

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement